Devotional

రంజాన్ మాసంలో ఈ ప‌ది ర‌కాల వంట‌కాలను టేస్ట్ చేశారా!!

రంజాన్ మాసంలో ఈ ప‌ది ర‌కాల వంట‌కాలను టేస్ట్ చేశారా!!

ముస్లింలు అతి ప‌విత్రంగా భావించే రంజాన్ మాసం ప్రారంభ‌మైంది. ఈ నెల రోజుల్లో ముస్లింలు అల్లా ప‌ట్ల పూర్తి భ‌క్తిని చాట‌డంతో పాటు అల్లా ద‌య కోరుకుంటారు. ఇందుకోసం సూర్యోద‌యం నుంచి సూర్యాస్త‌మ‌యం వ‌ర‌కు ఉప‌వాస దీక్ష కొన‌సాగిస్తుంటారు. సూర్యోద‌యానికి ముందు సుహార్‌.. సూర్యాస్త‌మ‌యం త‌ర్వాత ఇఫ్తార్ విందు కానిస్తారు. ఇఫ్తార్ స‌మ‌యంలో స్నాక్స్‌, అపెటైజ‌ర్స్‌, బేవ‌రేజెస్‌, డిస‌ర్ట్స్ అన్నీ పూర్తి వైవిధ్యంగా, అద్భుత‌మైన రుచుల‌తో ఉంటాయి. మ‌రి ఈ రంజాన్ ఇఫ్తార్ విందులో ఎక్కువ‌గా క‌నిపించే ఈ 10 రంజాన్ ఫుడ్స్ గురించి క‌లిన‌రీ స్పెష‌లిస్ట్ పల్టి హ‌రినాథ్ వివ‌రించారు.సాధార‌ణంగా రంజాన్ వేళ ఖ‌ర్జూరం, డ్రై ఫ్రూట్స్‌, సీజ‌న‌ల్ ఫ్రూట్స్‌, నిమ్మ‌ర‌సంతో ఉపవాస దీక్ష‌ను ముగిస్తారు. ఆ త‌ర్వాత తీసుకునే ఆహారంలో ఈ ప‌ది రుచులు ఎక్కువ‌గా క‌నిపిస్తాయి.

*హలీం
ఇఫ్తార్‌ విందులో తప్పనిసరిగా దర్శనమిచ్చే ఫుడ్‌ వెరైటీ ఇది. మటన్‌ను పప్పుదినుసులు, గోధుమలు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్‌లో నెమ్మదిగా ఉడికించి హ‌లీం తయారుచేస్తారు. అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది.

*కెబాబ్స్‌
కెబాబ్స్‌ను తినడాన్ని ఇష్టపడని వారు ఎవ‌రుంటారు. చికెన్ లేదా మ‌ట‌న్ ముక్క‌ల‌కు పెరుగు, మ‌సాలాల‌తో క‌లిపి నాన‌బెడ‌తారు. అనంత‌రం వాటిని బార్బిక్యూ చేయ‌డం ద్వారా వీటిని త‌యారు చేస్తారు.

*చికెన్‌ షావార్మా
అత్యంత ప్రాచుర్యం పొందిన మధ్య ప్రాశ్చ్య వంట‌కం ఇది. స‌న్న‌గా కోసిన చికెన్ లేదా మ‌ట‌న్ ముక్క‌ల‌ను బ్రెడ్ లోప‌ల కూర‌గాయ‌లు, సాస్ క‌లిపి తీసుకుంటారు.

*కీమా సమోసా
ఇఫ్తార్‌ వేడుకలు ఇది లేకుండా పూర్తి కాదు. గోధుమ పిండి, మటన్‌తో తయారుచేసే ఈ సమోసాలు భారతీయ రుచుల సంగమంగా నిలుస్తాయి.

*మటన్‌ రెసాలా
మటన్ రెసాలా అనేది అథెంటిక్‌ బెంగాలీ డిష్‌. బోన్ మ‌ట‌న్ పీసుల‌ను పెరుగులో నాన‌బెట్టి, గ‌స‌గ‌సాలు, ఇత‌ర‌త్రా మ‌సాలాలు క‌లిపి దీన్ని త‌యారు చేస్తారు. ప‌రాటా లేదా నాన్‌తో క‌లిపి తింటే ఇది అద్భుతంగా ఉంటుంది.

*దమ్‌ బిర్యానీ
దేశవ్యాప్తంగా దీనిని విభిన్న రకాలుగా చేస్తారు. దక్షిణ భారతదేశంలోనే దీనిని విభిన్న రకాలుగా చేయడం కనిపిస్తుంది. ప్రధానంగా బియ్యం, మటన్‌ లేదా చికెన్‌, మసాలాలను నెయ్యితో చేస్తారు. కొన్నిసార్లు కూరగాయలు, సోయా ముక్కలు, సీఫుడ్‌తో కూడా ఈ బిర్యానీ చేయడం కనిపిస్తుంది.

*ఫలాఫెల్‌
బటానీ గింజలు లేదంటే ఫవా బీన్స్‌ లేదా రెండింటినీ కలిపి తయారుచేసిన బాల్‌ లేదా పట్టీ ఫలాఫెల్‌. వీటిని సాధారణంగా హమ్మస్‌తో పాటుగా తహినీ సాస్‌తో కలిపి ఇఫ్తార్‌ సమయంలో సర్వ్‌ చేస్తారు. అంతర్జాతీయంగా ఎక్కువ మంది ఇష్టపడే వంటకాల్లో ఫలాఫెల్‌ ఒకటి.

*షీర్‌ ఖుర్మా
రంజాన్‌ సమయంలో విరివిగా కనిపించే మొఘలాయ్‌ తియ్యందనం షీర్‌ ఖుర్మా. షీర్‌ అంటే పాలు, ఖుర్మా అంటే ఖర్జూరం. ఈ షీర్‌ఖుర్మా ఆకృతి మాత్రమే కాదు, రుచి కూడా వినూత్నంగా ఉంటుంది. ఈ రంజాన్‌ మాసంలో కనిపించే మొదటి డిస‌ర్ట్‌ ఇది.

*అఫ్లాటూన్‌
రంజాన్‌ వేళ వడ్డించే ప్రత్యేక తియ్యందనం అఫ్లాటూన్‌. స్వచ్ఛమైన నెయ్యి, నట్స్‌తో తయారుచేస్తారు. రంజాన్‌ వేళ భోజనం ముగించేందుకు అత్యుత్తమ డిష్‌ ఇది.

*రూ అఫ్జా
రంజాన్‌ మాసంలో సాధారణంగా తయారుచేసే షర్బత్‌ ఇది. దీనిలో వనమూలికలు, పండ్లు, కూరగాయలు, పూలు, వేర్లు కూడా భాగంగా ఉంటాయి. ప్రత్యేకమైన రుచులు, కూలింగ్‌ ఎఫెక్ట్‌ దీనిని మిలిగిన పానీయాలకు భిన్నంగా నిలుపుతుంది. ఈ రూ అఫ్జా సిరప్‌ను కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, సేమియాలలో కూడా కలిపి తీసుకోవచ్చు.

*గోల్డ్‌ డ్రాప్‌ సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌ మితేష్‌ లోహియా మాట్లాడుతూ ‘‘రంజాన్‌ మాసంలో గొప్పతనమేమిటంటే, దాని పవిత్రతతో అది కుటుంబం మొత్తాన్నీ ఒకే చోట చేర్చుతుంది. ఇది నిజంగా జష్న్‌–ఏ–రంజాన్‌. ఇది అందరినీ ఏకం చేయడంతో పాటుగా పవిత్ర మాసాన్ని మరింత అర్ధవంతంగా, దైవికంగా మలుస్తుంది’’ అని అన్నారు.