Health

పండులో కుల్ఫీ

పండులో కుల్ఫీ

కుల్ఫీ అనగానే ఠక్కున మనకు పుల్లఐస్లాంటిదే గుర్తొస్తుంది. కానీ అచ్చంగా యాపిల్, బత్తాయి, మామిడి, డ్రాగన్ ఫ్రూట్, పైనాపిల్, దానిమ్మ పండ్లలా ఉండే కుల్ఫీలూ ఉన్నాయి తెలుసా. కట్ చేసి చూస్తే తప్ప అది పండో కుల్ఫీనో తెలియనంత సహజంగా ఉండే ఈ ఫ్రూట్ కుల్ఫీలు ఈమధ్య తెగ వైరల్ అయ్యాయి. నిజానికి ఈ ఫ్రూట్ కుల్ఫీల ట్రెండ్ పుట్టింది ఢిల్లీలోని ‘కురెమల్ మోహన్ లాల్ ఐస్క్రీం షాపులో. కుల్ఫీకి మరింత రుచిని తీసుకురావాలనే ఉద్దేశంతో సహజమైన పండ్లకి కుల్ఫీని జోడించి వీటిని తయారుచేస్తున్నారు. ముందుగా పన ముక్క కత్తిరించి లోపలి గుజ్జును మాత్రమే ఉంచి దాంట్లోనే కుల్ఫీ మిశ్రమాన్ని నింపుతారు. ఆ తర్వాత కత్తి న ముక్కను దానిపైనే పెట్టేసి కొన్ని గంటలపాటు ఫ్రిజ్లో ఉంచుతారు. అంతే ! తియ్యని పండ్ల రుచి కమ్మ లీ రుచీ కలిసిపోతూ ఫ్రూట్ కుల్ఫీ రెడీ అయిపోతుంది. మామిడి పండు కుల్ఫీ అయితే అందులో ఆ పండురంగులోనే కనిపించే పసుపు పచ్చ కుల్చీ మిశ్రమాన్నీ, అదే దానిమ్మలో ఎరుపు రంగు ఇలా పండులోని గుజ్జు రంగు ఫ్లేవర్ కుల్ఫీల్నే నింపుతుంటారు. అందుకే ఈ ఫ్రూటుల్పీ బయట నుంచే కాదూ, లోపల కూడా చిన్న చిన్న మార్పులతో ఆ పండు రూపంతోనే కనిపిస్తుంటుంది. స్థానికంగా ఆహార ప్రియుల్ని నోరూరిస్తున్న ఈ కుల్ఫీ సంగతి ఈమధ్య సోషల్ మీడియాలోకి చేరడంతో’ అరె పండ్ల కుల్ఫీ చూడ్డానికైతే ఎంతో బాగుంది. మరి తింటే ఎలా ఉంటుందో అంటూ ఫుడ్అవర్స్ ఇంట్లోనే ఈ కొత్త ఫుడ్ను ట్రై చేసేస్తున్నారు. ఈ సారెప్పుడైనా మీరూ దీన్ని ప్రయత్నించి చూసి ఇంటికొచ్చిన అతిథుల్ని ఆశ్చర్యపరచండి.