NRI-NRT

యూఏఈ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ 11 రకాల ఎంట్రీ వీసాల గురించి తెలుసుకోండి..!

యూఏఈ వెళ్లే ఆలోచనలో ఉన్నారా? అయితే ఈ 11 రకాల ఎంట్రీ వీసాల గురించి తెలుసుకోండి..!

మీరు ఉద్యోగం కోసం లేదా వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి గానీ, అక్కడ ఉన్న మీ కుటుంబ సభ్యులు, స్నేహితులను కలవడానికి గానీ యూఏఈ వెళ్లే ఆలోచనలో ఉంటే.. మీరు త్వరలో ప్రత్యేకంగా ఎంట్రీ వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం యూఏఈ ప్రభుత్వం ఏప్రిల్ 18న ‘ఎంట్రీ అండ్ రెసిడెన్సీ స్కీమ్’లో భాగంగా 11 రకాల ఎంట్రీ వీసాలను ప్రకటించింది. ఈ ఏడాది సెప్టెంబరు నుంచి వీసా పథకం అమలులోకి రానుంది. ఇక ఈ పథకం ద్వారా సందర్శన వీసాలకు సంబంధించి కొన్ని కేటగిరీలకు హోస్ట్ లేదా స్పాన్సర్ అవసరాన్ని తీసివేయడం జరిగింది. అలాగే ఈ కొత్త పథకం సందర్శకుల అవసరాలు, సందర్శన ప్రయోజనం ఆధారంగా సౌకర్యవంతమైన వీసా వ్యవధిని కూడా అందిస్తుంది. యూఏఈ సర్కార్ ప్రకటించిన 11 రకాల ఎంట్రీ వీసాలు, వాటి అర్హతల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

1. టూరిస్ట్ వీసాఈ వీసాకు టూరిజం కంపెనీ స్పాన్సర్ తప్పనిసరి.

2. ఐదేళ్ల మల్టీ ఎంట్రీ టూరిస్ట్ వీసామీరు పైన పేర్కొన్న సాధారణ పర్యాటక వీసా కాకుండా ఐదేళ్ల మల్టీ ఎంట్రీ పర్యాటక వీసా కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ వీసాకు ఎలాంటి స్పాన్సర్ అవసరం లేదు. కంటిన్యూస్‌గా 90 రోజుల వరకు ఆ దేశంలో ఉండడానికి అనుమతిస్తుంది. మొత్తం బస వ్యవధి ఒక ఏడాదిలో 180 రోజులకు మించకుండా ఉంటే, అంతే వ్యవధికి పొడిగించుకునే వీలు కూడా ఉంటుంది. అయితే, ఈ రకమైన వీసా కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి గత ఆరు నెలల కాలంలో తప్పనిసరిగా 4వేల డాలర్ల(రూ.3లక్షలు) బ్యాంక్ బ్యాలెన్స్ కలిగి ఉండడం లేదా విదేశీ కరెన్సీలలో దానికి సమానమైన మొత్తాన్ని కలిగి ఉండాల్సి ఉంటుంది.

3. యూఏఈలోని బంధువులు లేదా స్నేహితులను సందర్శరించడానికి వీసాయూఏఈలో ఉండే బంధువులు లేదా మిత్రులను కలవడానికి సందర్శకులు తప్పనిసరిగా ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలి. దీనికి హోస్ట్ లేదా స్పాన్సర్ అవసరం ఉండదు.

4. ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి వీసాఈ వీసా యూఏఈలో హోస్ట్ లేదా స్పాన్సర్ అవసరం లేకుండానే ఉద్యోగ అవకాశాలను అన్వేషించడానికి యువ ప్రతిభావంతులకు, నైపుణ్యం కలిగిన కార్మికులకు సులభంగా ఎంట్రీకి అవకాశం కల్పిస్తుంది. దరఖాస్తుదారులను మానవ వనరులు మరియు ఎమిరాటైజేషన్ మంత్రిత్వ శాఖ ప్రకారం మొదటి, రెండవ, మూడవ నైపుణ్య స్థాయి వారిగా వర్గీకరించడం జరిగింది. ప్రపంచంలోని అత్యుత్తమ 500 విశ్వవిద్యాలయాల ఫ్రెష్ గ్రాడ్యుయేట్లకు ఈ వీసా మంజూరు చేస్తారు. కాగా, దరఖాస్తుదారు కనీస విద్యార్హత బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనది అయి ఉండాలి.

5. వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి వీసాఈ వీసా యూఏఈలో స్పాన్సర్ లేదా హోస్ట్ అవసరం లేకుండానే పెట్టుబడి మరియు వ్యాపార అవకాశాలను అన్వేషించడానికి వ్యక్తులకు ప్రవేశాన్ని మంజూరు చేస్తుంది.

6. తాత్కాలిక వర్క్ మిషన్కొత్త పథకం ప్రొబేషన్ టెస్టింగ్ లేదా ప్రాజెక్ట్ వంటి తాత్కాలిక వర్క్ అసైన్‌మెంట్‌లో ఉన్న వ్యక్తుల కోసం ఈ నిర్దిష్ట వీసాను ప్రకటించింది. ఈ వీసా యజమానిచే స్పాన్సర్ చేయబడుతుంది. అలాగే సందర్శన ఉద్దేశ్యాన్ని, పని చేయడానికి ఆరోగ్య యోగ్యత రుజువును చూపిస్తూ యజమాని నుండి తాత్కాలిక పని ఒప్పందం లేదా లేఖ అవసరమవుతుంది.

7. వైద్య చికిత్సవైద్య చికిత్స కోసం యూఏఈకి వచ్చే సందర్శకులు సంబంధిత వైద్య సంస్థ ద్వారా స్పాన్సర్షిప్ కలిగి ఉండాలి.

8. అధ్యయనం లేదా శిక్షణఎంట్రీ అండ్ రెసిడెన్స్ స్కీమ్ అనేది శిక్షణ, ఇంటర్న్‌షిప్ ప్రయోజనాల కోసం యూఏఈ వచ్చే సందర్శకులను కూడా కవర్ చేస్తుంది. ఈ ప్రవేశ వీసా విద్యా సంస్థలు, ప్రభుత్వ మరియు ప్రైవేట్ సంస్థలచే స్పాన్సర్ చేయబడుతుంది. వీసా దరఖాస్తుకు అధ్యయనం లేదా శిక్షణ లేదా ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్, దాని వ్యవధి వివరాలను స్పష్టం చేస్తూ సంబంధిత సంస్థ నుండి ఒక లేఖ తీసుకోవాలి.