DailyDose

28న అసెంబ్లీ కమిటీల సమావేశాలు – TNI తాజా వార్తలు

28న అసెంబ్లీ కమిటీల సమావేశాలు  – TNI తాజా వార్తలు

* ఈ నెల 28న శాసనసభ భవనంలోని కమిటీ హాల్‌లో ఉదయం 11 గంటలకు ‘పబ్లిక్‌ అండర్‌ టేకింగ్స్‌ కమిటీ’, ఉదయం 11.30 గంటలకు ‘షెడ్యూల్డ్‌ తెగల సంక్షేమ కమిటీ’సమావేశాలు జరగనున్నాయి. ఈ విషయాన్ని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నర్సింహాచార్యులు తెలిపారు.

*రంజాన్‌ మాసం సందర్భంగా ఈ నెల 29న సాయంత్రం 6.10 గంటలకు ఎల్బీ స్టేడి యంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ముస్లింలకు ఇఫ్తార్‌ విందు ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు, ప్రజలు పాల్గొనే ఇఫ్తార్‌ విందును రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించనుందని సీఎం తెలిపారు.‘తెలంగాణ రాష్ట్రం మత సామరస్యానికి, గంగా జమున తహజీబ్‌కు వేదికగా నిలిచింది. సర్వ మతాల సంప్రదాయాలు.. ఆచార వ్యవహారాలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గౌరవిస్తోంది. ముస్లిం మైనారిటీల అభివృద్ధి, సంక్షేమం కోసం పలు పథకాలను అమలుపరుస్తోంది. లౌకికవాదాన్ని కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది’ అని ఒక ప్రకటనలో తెలిపారు.

*రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌, సహకార సంఘాల రిజిస్ర్టార్‌గా 2006 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌. సత్యనారాయణ నియమితులయ్యారు. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఆయనను సహకార శాఖ కమిషనర్‌ అండ్‌ రిజిస్ర్టార్‌గా నియమిస్తూ సీఎస్‌ సమీర్‌ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ పోస్టులో అదనపు బాధ్యతలు చూస్తున్న అహ్మద్‌ బాబు రిలీవ్‌ కానున్నారు.

* రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ఈ-గవర్నెన్స్‌ అవార్డు లభించింది. మద్యం అమ్మకాల్లో సేల్‌ మేనేజ్‌మెంట్‌, మానిటరింగ్‌ సిస్టమ్‌పై సీఎ్‌సఐ- ఎస్‌ఐజీ అనే సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. శనివారం అలహాబాద్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి ప్రకాశ్‌ చేతుల మీదుగా కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి అవార్డును అందుకున్నారు.

*ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అనుప‌మ్ ఖేర్ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనుపమ్ ఖేర్ ప్ర‌ధానికి ఓ బ‌హుమ‌తి ఇచ్చారు. త‌న త‌ల్లి ఇచ్చిన రుద్రాక్ష మాల‌ను ప్ర‌ధానికి అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా అనుప‌మ్ ఖేర్ ఓ ట్వీట్ చేశారు.

*సంగం బ్యారేజీ పనులను వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. బ్యారేజ్ పనుల వివరాలను మంత్రి కాకాని అధికారులను అడిగి తెలుసుకున్నారు. జూన్ నాటికి బ్యారేజ్ పనులు పూర్తి చేసి జూలైలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

*హైకోర్టు ఆదేశాలు, కోర్టు ధిక్కార కేసులతో రాష్ట్ర ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ఎట్టకేలకు రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు మళ్లీ ప్రారంభమయ్యాయి. రాయపూడిలో తుదిదశలో ఉన్న భవన నిర్మాణ పనులు చేపట్టాలని కాంట్రాక్టు సంస్థను సీఆర్‌డీఏ కోరినట్టు తెలిసింది. శనివారం ఎన్‌సీసీ సిబ్బంది పనులు మొదలుపెట్టారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల క్వార్టర్స్‌లో ఒక్కోదానిలో 6 చొప్పున అపార్ట్‌మెంట్లు నిర్మిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు టైల్స్‌, మార్బుల్స్‌ పనులు చేస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరుగుతున్న పనుల ను అమరావతి రైతులు, దళిత, ముస్లింమైనార్టీ నేతలు పరిశీలించారు. లారీల్లో నుంచి మెటీరియల్‌ను దించుతున్న కార్మికులకు గులాబీ పూలు ఇచ్చి స్వాగతం పలికారు. రాజధాని నిర్మాణ పనులు మొదలు పెట్టడం సంతోషకరమని, ఇలాగే సీడ్‌యాక్సెస్‌ రోడ్డు, పర్మినెంట్‌ టవర్స్‌ నిర్మాణ పనులు ప్రారంభించాలని ఆకాంక్షించారు. వాస్తవానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 70-80 శాతం వరకు ఈ భవనాల పనులు జరిగాయి. వైసీపీ అధికారంలోకి రాగానే రాజధాని పనులను ఆపేసింది. తర్వాత 3 రాజధానుల పేరుతో పూర్తిగా అటకెక్కించింది. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన రాజధాని నిర్మాణ పనులే కాకుండా, ప్రస్తుత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన కరక ట్ట రోడ్డు విస్తరణ పనులు కూడా చేపట్టలేదు. రాజధాని అమరావతిపై రైతుల కేసులకు సంబంధించి ఇటీవల హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు ధిక్కరణ కేసులతో వైసీపీ సర్కారు దిగిరాక తప్పలేదు. దీంతో త్వరగా పూర్తయ్యే భవనాలను ఎంచుకుని పనులు మొదలు పెట్టింది. కాగా, ప్రభుత్వానికి రాజధాని అమరావతి అభివృద్ధి పనులు చేసే ఉద్దేశం లేదని, దీనిని కోర్టు ధిక్కారం కింద పరిగణించి చర ్యలు తీసుకోవాలని రైతులు శుక్రవారం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. యర్రబాలెంకు చెందిన రైతు దోనే సాంబశివరావు, ఐనవోలుకు చెందిన తాటి శ్రీనివాసరావు ఈ వ్యాజ్యాన్ని వేశారు.

*రాష్ట్ర సహకార శాఖ కమిషనర్‌, సహకార సంఘాల రిజిస్ర్టార్‌గా 2006 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి ఎస్‌. సత్యనారాయణ నియమితులయ్యారు. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న ఆయనను సహకార శాఖ కమిషనర్‌ అండ్‌ రిజిస్ర్టార్‌గా నియమిస్తూ సీఎస్‌ సమీర్‌ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఈ పోస్టులో అదనపు బాధ్యతలు చూస్తున్న అహ్మద్‌ బాబు రిలీవ్‌ కానున్నారు.
*రాష్ట్రంలోని పట్టణాల్లో భవన నిర్మాణాలకు సంబంధించి సెట్‌బ్యాక్స్‌ అండ్‌ ఓపెన్‌స్పే్‌స విషయంలో ప్రజాభిప్రాయం మేరకు స్థానిక భవనాల లైసెన్సింగ్‌ అథారిటీ చట్టాలకు లోబడి ఉండాలని అగ్నిమాపకశాఖ భావిస్తోంది. ఆ మేరకు విపత్తుల నిర్వహణశాఖ ఓ గెజిటెడ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్థానిక భవన లైసెన్సింగ్‌ అథారిటీ నిబంధనల ప్రకారం నివాస భవనాలు గ్రౌండ్‌ ఫ్లోర్‌ ప్లస్‌ ఐదు అంతస్తులు 18 మీటర్ల ఎత్తు లోపు, వాణిజ్య భవనాలకు గ్రౌండ్‌ ఫ్లోర్‌ ప్లస్‌ నాలుగు అంతస్తులు కలిపి 15 మీటర్లు లోబడి ఉండాలి. ఈ నిబంధనల ప్రకారం భవనాలు నిర్మించుకుంటే ఫైర్‌ సేఫ్టీకి ఎలాంటి ఇబ్బందులుండవని, వాటికి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ జారీచేయవచ్చని పేర్కొన్నారు. జాతీయ భవన కార్పొరేషన్‌(ఎన్‌బీసీ) నిబంధనలు పాటిస్తే వైజాగ్‌ లాంటి నగరాల్లో అనేక ఆసుపత్రులు, హోటళ్లు మూసేయాల్సి వుంటుందన్నారు.

*మంత్రి పదవి నాకు వెంట్రుక ముక్కతో సమానం. గుడివాడకు శాశ్వత శాసనసభ్యుడిగా పిలిపించుకోవడమే నాకు ఇష్టం’ అని మాజీమంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారు. కృష్ణా జిల్లా గుడివాడ రూరల్‌ మండలం దొండపాడులో శనివారం ఆయన, బాపట్ల ఎంపీ నందిగం సురేశ్‌తో కలిసి బాబూ జగ్జీవన్‌రామ్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాని మాట్లాడుతూ ‘రాష్ట్ర మంత్రివర్గంలో 70 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల ప్రతినిధులే ఉన్నారు. చరిత్రలో ఇంతకుముందెన్నడూ ఇంతమందికి మంత్రి పదవులు ఇవ్వలేదు. రాష్ట్రం శ్రీలంక అవుతుందని దుష్ప్రచారం చేస్తున్న వారి మాటలు నమ్మవద్దు. జగన్‌ వంటి వ్యక్తులను పోగొట్టుకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది. నన్నెవరూ మాజీమంత్రి అని పిలవొద్దు. ఎమ్మెల్యేగా ఉంటూ సీఎం జగన్‌ వెంట నడవడమే నాకు ముఖ్యం’ అని చెప్పారు. బాబూజగ్జీవన్‌ రామ్‌ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రజాప్రతినిధిగా సేవలు అందిస్తానని అన్నారు. చంద్రబాబుకు వయసు అయిపోయి ఎప్పుడేమి మాట్లాడుతున్నాడో తెలియడం లేదని ఎంపీ సురేశ్‌ విమర్శించారు. దత్త్తపుత్రుడు పవన్‌కల్యాణ్‌ తెల్లముఖం వేసుకుని రాష్ట్రంలో తిరుగుతున్నాడని ఎద్దేవా చేశారు.

*రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు ఈ-గవర్నెన్స్‌ అవార్డు లభించింది. మద్యం అమ్మకాల్లో సేల్‌ మేనేజ్‌మెంట్‌, మానిటరింగ్‌ సిస్టమ్‌పై సీఎ్‌సఐ- ఎస్‌ఐజీ అనే సంస్థ ఈ అవార్డును ప్రకటించింది. శనివారం అలహాబాద్‌లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తి ప్రకాశ్‌ చేతుల మీదుగా కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డి అవార్డును అందుకున్నారు.

*ఆంధ్రవిశ్వవిద్యాలయం సిబ్బంది శనివారం వైసీపీ సేవలో తరించారు. పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్‌ మేళాలో పదుల సంఖ్యలో ఉద్యోగులు సేవలు అందించారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. వైసీపీ నేతలు శని, ఆదివారాల్లో జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు ప్రకటించారు. ఇందుకు ఏయూని వేదికగా ఎంపిక చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీకి అధికారులు శనివారం సెలవు ప్రకటించేశారు. వర్సిటీలోని పలు విభాగాలకు చెందిన 13 బ్లాకుల్లో వందలాది గదులను జాబ్‌ మేళాకు కేటాయించారు. సదరు డిపార్టుమెంట్‌కు చెందిన ఇద్దరు, మగ్గురు సిబ్బందిని సేవల నిమిత్తం పురమాయించారు. వర్సిటీకి చెందిన వందల మంది విద్యార్థులను వలంటీర్లుగా నియమించారు. ఈ జాబ్‌ మేళా వర్సిటీ ఉన్నతాధికారి కనుసన్నల్లో జరగడంతో ఇష్టం లేకపోయినా సిబ్బంది సేవలు అందించాల్సి వచ్చింది. జాబ్‌ మేళా జరుగుతున్న తీరును వర్సిటీ అధికారులు, డీన్‌లు పర్యవేక్షించడంతో పాటు సిబ్బంది, విద్యార్థులకు సూచనలు, సలహాలను ఇస్తూ కనిపించారు. కాగా, వైసీపీ జాబ్‌మేళాలో వర్సిటీ సిబ్బందితోపాటు పలు ప్రభుత్వ శాఖలు సిబ్బంది కూడా సేవలు అందించారు. ఒక్క విశాఖ జిల్లా నుంచే కాకుండా శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల నుంచి కూడా కొన్ని శాఖలకు చెందిన సిబ్బంది వచ్చారు. డీఆర్‌డీఏ పరిధిలోని సీడాప్‌ విభాగానికి చెందిన సుమారు 100 మంది ఉద్యోగులు, జీవీఎంసీ, రెవెన్యూ శాఖలకు చెందిన సిబ్బంది కూడా ఈ జాబ్‌ మేళాలో సేవలు అందించారు.

*ఎస్సీ కులధ్రువీకరణ పత్రం పొందే విషయంలో 1998లో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి జారీచేసిన మెమో అడ్డంకిగా ఉందని, ఆ మెమోను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ప్రకాశం జిల్లా అద్దంకి మండలం శంకవరప్పాడుకు చెందిన కాకుమాను రమేశ్‌బాబు, కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన స్వరూప్‌ వేదానంద్‌ ఈ పిల్‌ వేశారు. ఎస్సీ కుల ధ్రువీకరణపత్రం జారీ విషయంలో 1975లో కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలు, 1980, 1997లో ప్రభుత్వం ఇచ్చిన జీవోలకు విరుద్ధంగా ఉన్న ఈ మెమోను రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. సరైన కారణాలు లేకుండా ఎస్సీ కుల ధ్రువపత్రాల కోసం చేసుకున్న దరఖాస్తులను తిరస్కరించకుండా అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అభ్యర్ధించారు. షెడ్యూల్‌ కులాలకు కుల ధ్రువీకరణ జారీచేసే విషయంలో 1998లో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జారీచేసిన మెమో ప్రకారం.. వ్యక్తులు పేర్లు, వారి ఆచార వ్యవహారాలు, పండగల నిర్వహణ, జీవన శైలి తదితర వివరాల ఆధారంగా కొందరు అధికారులు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వడం లేదు. ప్రభుత్వం 1980లో ఇచ్చిన జీవో ప్రకారం పాఠశాల రికార్డుల్లో ఒకసారి షెడ్యూల్‌ కులాల వారుగా నమోదై ఉంటే ఎలాంటి విచారణ లేకుండా సర్టిఫికెట్‌ జారీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా ఉన్న మెమోను రద్దు చేయాలని వారు కోరారు.

*విజయవాడలో జరిగిన ఘటన బాధాకరమని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషా శ్రీచరణ్‌ అన్నారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. మతిస్థిమితంలేని యువతిపై దుండగులు అఘాయిత్యానికి పాల్పడడం హేమమైన చర్య అని అన్నారు. ఆ ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని చెప్పారు. ఈ ఘటనపై సీఎం జగన్‌, మంత్రులు వెంటనే స్పందించామని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించామని తెలిపారు. సకాలంలో స్పందించని ఎస్‌ఐ, సీఐని సస్పెండ్‌ చేశామని పేర్కొన్నారు. బాధిత కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం అందిస్తామని తెలిపారు. రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ పట్ల ఆసుపత్రిలో టీడీపీ నాయకులు వ్యవహరించిన తీరు అభ్యంతరకరమని ఉషా శ్రీచరణ్‌ తప్పుబట్టారు.

* రాష్ట్రంలో వడదెబ్బతో శనివారం ముగ్గురు మృతి చెందారు. ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండలం కుంటాలలో ఉపాధి కూలీ చిటీ లస్మన్న(50), భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లిలో మరో ఉపాధి కూలీ కందుల సారయ్య, కామారెడ్డి జిల్లా భిక్కనూర్‌ మండలం తిప్పాపూర్‌లో చిన్నారి హారిక(4) మృతి చెందినవారిలో ఉన్నారు.

* రుణగ్రహీతల ఆత్మహత్యలకు కారణమవుతున్న 137 నకిలీ రుణయా్‌పల వివరాలతో కూడిన జాబితాను శనివారం విడుదల చేశారు. నకిలీ రుణయా్‌పల ఆగడాలపై క్షేత్రస్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలని సీపీలు, ఎస్పీలకు డీజీపీ కార్యాల యం నుంచి ఆదేశాలు అందడంతో సోషల్‌ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. 137 నకిలీ యాప్‌లపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్బీఐ) నిఘా ఉందని పోలీసులు తెలిపారు.

*కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులకు సంబంధించి మంత్రి కేటీఆర్‌ చేసిన సవాల్‌పై చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు బీజేపీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ప్రకటించారు. చర్చకు ఎక్కడైనా తాను రెడీ అని అన్నారు. శనివారం ఆయన ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ కేంద్ర నిధులపై తప్పుడు వివరాలు వెల్లడించారన్నారు. గడిచిన ఏడేళ్లలో కేంద్రం వివిధ పథకాల కింద రాష్ట్రానికి రూ.3.20 లక్షల కోట్లు అందించిందని చెప్పారు. కాగా.. సిద్దిపేట జిల్లా అధికారులు ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని రఘునందన్‌రావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. బీఆర్కే భవన్‌లో ఆయన సీఎ్‌సను కలిశారు. దుబ్బాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న తనను అగౌరవపరుస్తున్నారని, ఉద్దేశపూర్వకంగానే ఇలా జరుగుతోందని ఆరోపించారు.

*తిరువూరులో మైనర్ బాలికను లైంగికంగా వేధించిన వాలంటీరు భర్త.. మరుగుదొడ్డిలో స్నానం చేస్తుండగా వీడియోలు తీసి వేధింపులు తిరువూరు పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు. తనను వేధించిన వ్యక్తికి శిక్ష పడాల్సిందేనంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు. వాలంటీరు భర్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

*రాజస్థాన్‌లోని 300 సంవత్సరాల చరిత్రగల శివాలయాన్ని కూల్చివేయడంపై ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఘాటుగా స్పందించారు. అన్ని మతాలకు స్వేచ్ఛ ఉండాలనే అంశాన్ని తమ పార్టీ విశ్వసిస్తుందన్నారు. శివాలయం కూల్చివేతపై ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఒవైసీ విలేకర్లతో మాట్లాడుతూ, రాజస్థాన్‌లోని ఆళ్వార్‌లో ఉన్న 300 సంవత్సరాల చరిత్రగల శివాలయాన్ని కూల్చేశారని, ఈ విషయంలో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ చేతులు దులిపేసుకుందని చెప్పారు. ఇది రాజ్‌గఢ్ మునిసిపాలిటీ పరిధిలో ఉందని, ఈ మునిసిపాలిటీ పాలక వర్గం బీజేపీదేనని చెప్తోందని తెలిపారు. ఈ శివాలయం కూల్చివేతను తాను ఖండిస్తున్నానని చెప్పారు. మునిసిపల్ బోర్డు బీజేపీ నేతృత్వంలో ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందన్నారు. శివాలయాన్ని కూల్చేయాలన్న మునిసిపల్ బోర్డు నిర్ణయాన్ని కాంగ్రెస్ నేతృత్వంలోని రాజస్థాన్ ప్రభుత్వం ఆమోదించిందన్నారు. ఈ కూల్చివేతపై ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ క్షమాపణలు చెప్పాలన్నారు.

*వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్ కల్యాణ్ అని మంత్రి కాకాణి విమర్శించారు. సినిమాల్లో నటించడం, కోట్లు సంపాదించడం తప్ప పవన్‌కు మరేం తెలియదని ఎద్దేవా చేశారు. వ్యవసాయం గురించి పవన్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచే సత్తా కూడా పవన్‌కు లేదన్నారు.