Movies

పవన్‌ కోసం వస్తోందా?

పవన్‌ కోసం వస్తోందా?

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. క్రిష్‌ దర్శకుడు. ఏ.ఎం.రత్నం నిర్మాత. నిధి అగర్వాల్‌ కథానాయికగా నటిస్తోంది. నుపూర్‌ సనన్‌ అనే మరో బాలీవుడ్‌ భామకీ ఈ చిత్రంలో అవకాశం దక్కింది. ఇప్పుడు మూడో కథానాయిక కూడా ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. తనే.. నోరా ఫతేహీ. ఈ చిత్రంలో తనకో ప్రత్యేకమైన పాత్ర దక్కిందని, కొన్ని సన్నివేశాలతో పాటు ఓ పాటలోనూ నోరా కనిపించనుందని సమాచారం. ‘వీరమల్లు’ కోసం హైదరాబాద్‌లో కొన్ని భారీ సెట్లు తీర్చిదిద్దారు. ఇటీవల ఆ సెట్లోనే కీలకమైన సన్నివేశాలు తెరకెక్కించారు. ఇప్పుడు చిత్రీకరణకు బ్రేక్‌ వచ్చింది. త్వరలోనే కొత్త షెడ్యూల్‌ మొదలు కానుంది. మొగల్‌ సామ్రాజ్య నేపథ్యంలో సాగే కథ ఇది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.