Business

భారతీయులు ఎక్కువగా కొంటున్న లగ్జరీ కార్లివే! – TNI వాణిజ్య వార్తలు

భారతీయులు ఎక్కువగా కొంటున్న లగ్జరీ కార్లివే! – TNI వాణిజ్య వార్తలు

* మనదేశంలో లగ్జరీ కార్లకు డిమాండ్‌ భారీగా పెరిగింది. ‎మెర్సిడెస్ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ వంటి లగ్జరీ కార్ల ప్రీమియం మోడళ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని, ఫలితంగా డెలివరీ సమయం ఎక్కువగా తీసుకుంటున్నట్లు ఓ ఆటోమొబైల్‌ కంపెనీ ప్రతినిధులు తెలిపారు.గతేడాది నుంచి కొన్ని నెలల వ్యవధిలోనే సి అండ్‌ డి సెగ్మెంట్లో రూ .70-75 లక్షలకు పైగా ఉన్న కార్లకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. ఆ విభాగంలో వాల్యూమ్-సెగ్మెంట్ కార్ల విభాగంలో వృద్ధి సాధించినట్లు” ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ పిటిఐకి చెప్పారు.”ముఖ్యంగా ఈసెగ్మెంట్‌ కార్లను (వ్యాపార వేత్తలు, స్పోర్ట్స్‌ పర్సన్‌లు, సినీ రంగానికి చెందిన ప్రముఖులు) కొనుగోలు చేస్తున్నారని, తద్వారా వీటి డిమాండ్‌ రోజురోజుకీ పెరిగిపోతుందన్నారు. ఆడి ఎలక్ట్రిక్ కారు ఇ-ట్రాన్ కార్‌ సేల్స్‌ను ఉదాహరించిన ధిల్లాన్..”మేం కోటిరూపాయలకు పై కేటగిరీలో ఉన్న కార్లను అమ్ముతున్నాం. ఆ కార్లు భారత్‌కు రాకముందే అమ్ముడుపోతున్నట్లు చెప్పారు. మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్,సిఈఓ మార్టిన్ ష్వెంక్ మాట్లాడుతూ..” జీఎల్ఎస్, జీఎల్ఇ (ఎస్‌యూవీ)ను భారతీయులు కొనుగోలు చేసేందుకు కొన్ని నెలల పాటు వేచి చూస్తున్నారు. కానీ ఇక్కడ లగ్జీర కార్లను కొనుగోలు కోసం వినియోగదారులు ఆసక్తిని చూపిస్తున్నట్లు చెప్పారు. 2022మొదటి త్రైమాసికంలో కంపెనీ తన పోర్ట్‌ఫోలియోలో 4,000 యూనిట్లకు పైగా ఆర్డర్‌లను పొందింది.

*ప్రైవేటు బీమా కంపెనీల నుంచి పోటీ ఉన్నా భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మార్కెట్లో దూసుకుపోతోంది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిమిషానికి 41 పాలసీల చొప్పున మొత్తం 2,17,18,695 పాలసీలను విక్రయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 2,09,75,439 పాలసీలతో పోలిస్తే ఇది 3.54 శాతం ఎక్కువ. కాగా 2021 -22లో ఎల్‌ఐసీ స్థూల ప్రీమియం ఆదాయం 12.66 శాతం పెరిగి రూ.1,43,938.59 కోట్లకు చేరింది.

* మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ హార్టికల్చర్‌లో యంత్రీకరణను పెంచడానికి ‘కోడ్‌’ పేరుతో ట్రాక్టర్‌ తరహా కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హార్టికల్చర్‌ రంగంలో వివిధ రకాల పనులకు ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్‌ చేశామని స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ సీఈఓ హరీష్‌ చవాన్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఉత్పత్తిలో హార్టికల్చర్‌ ఉత్పత్తి 30 శాతం ఉంటే సాగు చేసే భూమిలో 17 శాతమే హార్టికల్చర్‌ ఉత్పత్తులను పండిస్తున్నారు. దేశం మొత్తంలో ఉత్పత్తి అవుతున్న కాయలు, పళ్లలో 12 శాతం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతోంది.

*ప్రణీత్‌ గ్రూప్‌.. హైదరాబాద్‌లో మరో కొత్త గేటెడ్‌ కమ్యూనిటీ రెసిడెన్షియల్‌ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. దుండిగల్‌ సమీపంలోని గాగిల్లాపూర్‌ వద్ద 70 ఎకరాల విస్తీర్ణంలో ప్రణీత్‌ ప్రణవ్‌ గ్రోవ్‌ పార్క్‌ పేరుతో ఈ ప్రాజెక్ట్‌ ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రణీత్‌ గ్రూప్‌ ఎండీ నరేందర్‌ కుమార్‌ కామరాజు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 840 విల్లాలను నిర్మిస్తున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే రెండున్న రేళ్లలో ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందని నరేందర్‌ చెప్పారు.

*వచ్చే మూడు నుంచి ఐదేళ్లలో దేశంలోనే అతిపెద్ద ఐకేర్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నెట్‌వర్క్‌గా అవతరించేందుకు హైదరాబాద్‌కు చెందిన మ్యాక్సివిజన్‌ అడుగులు వేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణాల్లో 9 నగరాల్లో 22 సూపర్‌ స్పెషాలిటీ కంటి ఆసుపత్రులు కలిగిన మ్యాక్సివిజన్‌ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, గుజరాత్‌, మహారాష్ట్ర రాష్ట్రాలకు జాయింట్‌ వెంచర్లు, సొంతంగా ఆసుపత్రుల ఏర్పాటు ద్వారా విస్తరించనుంది. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్‌లోనే 9 ఆసుపత్రులు ఉన్నాయని మ్యాక్సివిజన్‌ గ్రూప్‌ చైర్మన్‌ జీఎ్‌సకే వేలు తెలిపారు. 2022 సెప్టెంబరు చివరినాటికి హైదరాబాద్‌లో కొత్తగా రెండు ఆసుపత్రులను ఏర్పాటు చేయనున్నాం. రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, నెల్లూరుల్లో ఆసుపత్రులను ప్రారంభించనున్నామని మ్యాక్సివిజన్‌ హాస్పిటల్స్‌ వ్యవస్థాపకుడు కాసు ప్రసాద్‌ రెడ్డి తెలిపారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఆసుపత్రుల సంఖ్యను 55కు పెంచుకోనున్నట్లు వేలు చెప్పారు.

*ఫ్యూచర్‌ గ్రూప్‌తో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందంపై ముందుకెళ్లలేమని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎల్‌) ప్రకటించింది. ఫ్యూచర్‌ రిటైల్‌ సహా గ్రూప్‌నకు చెందిన పలు లిస్టెడ్‌ కంపెనీల సెక్యూర్డ్‌ రుణదాతలు ఈ డీల్‌ను వ్యతిరేకించిన నేపథ్యంలో రిలయన్స్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ఆర్‌ఐఎల్‌ అనుబంధ సంస్థ రిలయన్స్‌ రిటైల్‌తో డీల్‌కు అనుమతి కోరుతూ నిర్వహించిన ఓటింగ్‌ ప్రక్రియలో సెక్యూర్డ్‌ రుణదాతల నుంచి అవసరమైన 75 శాతం అనుకూల ఓటింగ్‌ను సాధించలేకపోయామని ఫ్యూచ ర్‌ రిటైల్‌ శుక్రవారం వెల్లడించింది. ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్‌, టోకు, లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ ఆస్తులను రూ.24,713 కోట్లకు కొనుగోలు చేసేందుకు 2020 ఆగస్టులో రిలయన్స్‌ రిటైల్‌ ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే.

*ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌పై 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుగు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కత్తా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ చేధించలేపోయారు. లక్ష్య చేధనకు దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో సామ్ బిల్లింగ్స్(4), సునీల్ నరైన్(5), శ్రేయస్ అయ్యర్(12), నితీష్ రానా(2), రింకు సింగ్(35), వెంకటేష్ అయ్యర్(17), ఆండ్ర్యూ రస్సెల్(48), శివమ్ మావీ(2), ఉమేష్ యాదవ్(15 నాటౌట్), టిమ్ సౌతీ(1, నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మొహమ్మద్ షమీ 2, యస్ దయాల్ 2, అల్జారీ జోసెఫ్ 1, లాకీ ఫెర్గూసన్ 1, రషీద్ ఖాన్ 2 చొప్పున వికెట్లు తీశారు.

*పామాయిల్ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయంతో భారతదేశంలోనూ పామాయిల్ ధరలకు రెక్కలు రానున్నాయి.ప్రపంచంలోనే అతిపెద్ద పామాయిల్ ఉత్పత్తిదారు అయిన ఇండోనేషియాలో ధరల పెరుగుదలను సొమ్ము చేసుకునేందుకు ఉత్పత్తిదారులు ఎగుమతుల వైపు మొగ్గుచూపుతుండటంతో ఆ దేశంలో వంటనూనెల కొరత ఏర్పడింది.దీంతో ఇండోనేషియాలో పామాయిల కొరతను పరిష్కరించడానికి ఇండోనేషియా పామాయిల్ ఎగుమతులను నిషేధించింది.వంట నూనెవంట నూనెలకు సంబంధించిన ముడి పదార్థాలను ఎగుమతి చేయడాన్ని ప్రభుత్వం నిషేధించిందిఅని ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఒక ప్రకటనలో తెలిపారు.ఇండోనేషియాలో వంటనూనెలు సరసమైన ధరలకు సమృద్ధిగా ఉండేలా చేసేందుకు తాను పామాయిల్ ఎగుమతులపై నిషేధం విధించామని అధ్యక్షుడు చెప్పారు.