Politics

జగన్ పాలనలో.. పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం – TNI రాజకీయ వార్తలు

జగన్ పాలనలో.. పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం   – TNI రాజకీయ వార్తలు

*ముఖ్యమంత్రి జగన్ పాలనపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఘూటు విమర్శలు చేశారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. వైకాపా నేతలు దోచుకోవడానికి అధికారాన్ని వినియోగించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వైకాపా నేతలు.. అధికారం అడ్డంపెట్టుకొని దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇవాళ అన్నమయ్య జిల్లా మదనపల్లి వెళ్లిని సోము.. ఆ పార్టీ రాజంపేట అధ్యక్షుడు ఏవీ సుబ్బారెడ్డి నివాసంలో మీడియాతో మాట్లాడారు. భాజపాను బూత్స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు బలోపేతం చేయడానికి ప్రతి గ్రామంలో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. సమావేశంలో భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రాజు, రమేశ్ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.’రాయలసీమలో తాగు, సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. వైకాపా ప్రభుత్వం మాత్రం కేవలం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపైనే దృష్టిసారించడం దురదృష్టకరం. జలశక్తి మిషన్ ద్వారా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడానికి కేంద్ర రూ.7 వేల కోట్లు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద 50 శాతం నిధులు ఇచ్చేందుకు కూడా ముందుకురాలేదు. త్వరలోనే రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను పర్యవేక్షిస్తాం’ అని సోము వీర్రాజు అన్నారు.

*పోలవరం ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంకెలేస్తే పోలవరం పూర్తికాదనే సంగతి మంత్రి రాంబాబు గ్రహించాలని.. తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. జగన్‌ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయని విమర్శించారు.జగన్‌ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయని.. తెదేపా సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. జగన్ తప్పుడు విధానాలు, అనాలోచిత నిర్ణయాల వల్లే పోలవరంలో ప్రస్తుత పరిస్థితికి కారణమని స్పష్టం చేశారు. ఇంతటి అసమర్థమైన, అవినీతిపరుడైన సీఎం దేశంలో ఎక్కడా లేరని ధ్వజమెత్తారు.పోలవరం ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయి: గోరంట్ల బుచ్చయ్య చౌదరిప్రాజెక్టులపై మంత్రులకు ఏమాత్రం అవగాహన లేదని.. రంకెలేస్తే పోలవరం పూర్తికాదనే విషయాన్ని అంబటి రాంబాబు గ్రహించాలని హితవు పలికారు. వాస్తవాలు బయటపడకుండా పోలవరం వద్ద 144సెక్షన్ అమలు చేస్తున్నారని.. చేతకానితనంతో రాయలసీమను ఎండగడతున్నారని ఆక్షేపించారు.

*రైతులకు ఉచిత కరెంట్ అని చెప్పి 7 గంటలు మాత్రమే ఇస్తున్నారు: షర్మిల
కేసీఆర్ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం అశ్వాపురం మండలం, గొల్లగూడెం గ్రామంలో రైతు గోస దీక్షలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ పినపాక నియోజక వర్గంలో అడుగడుగునా పోడు సమస్య ఎదురవుతుందన్నారు. ఎకరాకు రూ. 5 వేలు రైతు బందు ఇచ్చి 25 వేల పథకాలు నిలిపివేశారని ఆరోపించారు. పంట నష్ట పరిహారం కూడా తెలంగాణలో దిక్కు లేదన్నారు. పంట నష్ట పోయినప్పుడు పరిహారం ఇవ్వకుండా రూ. 5 వేలు ఇస్తే సరిపోతుందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంట భీమా ఎందుకు లేదని నిలదీశారు. రైతులకు ఉచిత కరెంట్ అని చెప్పి 7 గంటలు మాత్రమే ఇస్తున్నారని విమర్శించారు.7 గంటలు కరెంట్ ఇస్తే పంట ఎండిపోతుందని మనస్తాపం చెందిన మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని షర్మల అన్నారు. పంట ఎండిపోతుంటే తెచ్చిన అప్పులు ఏం చేయాలో దిక్కు తోచక ఆత్మహత్య చేసుకుందన్నారు. ఆ మహిళా రైతు ఆత్మహత్యకు సీఎం కేసీఆరే కారణమని ఆరోపించారు. గత 6 నెల్లలో రాష్ట్రంలో వెయ్యి మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ముఖ్యమంత్రి నాలుకకు నరం లేదని, ఒక సారి ఓ మాట.. మరో సారి మరో మాట మాట్లాడతారని.. దీంతో రైతులు ఆగం అవుతున్నారన్నారు. రైతులు కూడా సీఎం కాళ్ళ దగ్గర బాంచెన్ అని పడి ఉండాలా..? అని షర్మిల ప్రశ్నించారు

*చంద్రబాబు, పవన్‌కు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: మంత్రి అమర్నాథ్‌
చంద్రబాబు, పవన్‌కు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ అని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే రైతులు అనేక కష్టాలుపడ్డారని, ఈ విషయాన్ని పవన్ తెలుసుకొని మాట్లాడాలని మంత్రి అమర్నాథ్‌ ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నారని, చంద్రబాబు చేత, చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన అని అమర్నాథ్‌ మండిపడ్డారు. వైసీపీకి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు
*నోటీసులు ఇచ్చే హక్కు మహిళా కమిషన్‌కు లేదు: వర్ల రామయ్య
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పరిధులు దాటి వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు, బోండా ఉమాకు నోటీసులు ఇచ్చే హక్కు మహిళా కమిషన్‌కు లేదన్నారు. మహిళా కమిషన్‌కు ఏదైనా అవమానం జరిగితే సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, ఆ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తారని… అంతేకానీ ఆమే ఫిర్యాదు చేసి, ఆమే నోటీసులిచ్చి, ఆమే విచారణ జరిపి, ఆమే శిక్ష వేయటం న్యాయసమ్మతం కాదన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికే వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చారని వర్ల రామయ్య ఆరోపించారు. బాధితులను పరామర్శించి వెళ్లిపోకుండా, చంద్రబాబు వచ్చేంత వరకు ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని విమర్శించారు. ఆమె పరామర్శకు రాలేదని, పొలిటికల్ సీన్ క్రియేట్ చేయడాకే వచ్చారని అన్నారు. చంద్రబాబుతో అతిగా ప్రవర్తించి అక్కడున్న మహిళా నాయకురాళ్లను చేయెత్తి కొట్టబోయిన కమిషన్ ఛైర్ పర్సన్‌దే తప్పని, ఆమెపై ఫిర్యాదు చేద్దామంటే పెద్దమనసుతో చంద్రబాబు వద్దన్నారన్నారు. అమాయకత్వం, అవగాహనా రాహిత్యం, చట్టాలపట్ల అవగాహనా లేమితో ఆమె ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని వర్ల రామయ్య సూచించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించలేకపోతోందని మండిపడ్డారు. నిర్లక్ష్యం వహించిన ఎస్ఐని, సీఐని సస్పెండ్ చేయడంకాదని, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సస్పెండ్ చేయాలని వర్ల రామయ్య పిలుపు ఇచ్చారు

*ఒక్కటి తప్పుగా ఉన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటా: పల్లా రాజేశ్వర్‌
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ అన్నారు. రేవంత్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, ప్రభుత్వంపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో మెడికల్‌ సీట్లను బ్లాక్‌ చేయడం లేదని, గవర్నర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ రాయడం అర్థరహితమని ఎమ్మెల్సీ పల్లా అన్నారు. మెడికల్‌ సీట్ల విషయంలో అక్రమాలకు చెక్‌పెట్టేలా ఫిర్యాదు చేశామని, ఈ వ్యవహారంలో మంత్రులు, తన ప్రమేయం ఉంటే కాలేజీని ప్రభుత్వానికి అప్పగిస్తామని ప్రకటించామని ఎమ్మెల్సీ పల్లా పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఏ సంస్థతోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చని,తాను ఇచ్చిన డాక్యుమెంట్స్‌లో ఒక్కటి తప్పుగా ఉన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ స్పష్టం చేశారు

*రాజకీయాలకు అతీతంగా ఓయూలో రాహుల్‌ పర్యటన: ఎమ్మెల్యే జగ్గారెడ్డి
తెలంగాణ ఉద్యమం ఉద్యోగాల కోసం జరిగిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. విభజనలో ప్రధాన పాత్ర పోషించిన చరిత్ర ఓయూ విద్యార్థులదని జగ్గారెడ్డి తెలిపారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీ విద్యార్థుల త్యాగం మరవలేనిదన్నారు. రాహుల్‌గాంధీని ఉస్మానియా వర్సిటీకి తీసుకొస్తామని చెప్పారు. విద్యార్థుల సమస్యలను రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్తామని, రాజకీయాలకు అతీతంగా ఓయూలో రాహుల్‌ పర్యటన ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు

*బీజేపీ అంటే జేబు దొంగల పార్టీ: జీవన్‌రెడ్డి
బీజేపీ అంటే జేబు దొంగల పార్టీ అని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. ఎంపీ అర్వింద్‌ బ్లేడ్ బాబ్జిగా మారారని ఆయ ఎద్దేవా చేశారు. తంబాకు సంజయ్, గంజాయి అర్వింద్‌ ఏం మాట్లాడతారో తెలియదని విమర్శించారు. కిషన్‌రెడ్డి ఓ టూరిస్ట్‌ మినిస్టర్ అన్నారు

*నోటీసులు ఇచ్చే హక్కు మహిళా కమిషన్‌కు లేదు: వర్ల రామయ్య
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పరిధులు దాటి వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు, బోండా ఉమాకు నోటీసులు ఇచ్చే హక్కు మహిళా కమిషన్‌కు లేదన్నారు. మహిళా కమిషన్‌కు ఏదైనా అవమానం జరిగితే సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, ఆ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తారని… అంతేకానీ ఆమే ఫిర్యాదు చేసి, ఆమే నోటీసులిచ్చి, ఆమే విచారణ జరిపి, ఆమే శిక్ష వేయటం న్యాయసమ్మతం కాదన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికే వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చారని వర్ల రామయ్య ఆరోపించారు. బాధితులను పరామర్శించి వెళ్లిపోకుండా, చంద్రబాబు వచ్చేంత వరకు ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని విమర్శించారు. ఆమె పరామర్శకు రాలేదని, పొలిటికల్ సీన్ క్రియేట్ చేయడాకే వచ్చారని అన్నారు. చంద్రబాబుతో అతిగా ప్రవర్తించి అక్కడున్న మహిళా నాయకురాళ్లను చేయెత్తి కొట్టబోయిన కమిషన్ ఛైర్ పర్సన్‌దే తప్పని, ఆమెపై ఫిర్యాదు చేద్దామంటే పెద్దమనసుతో చంద్రబాబు వద్దన్నారన్నారు. అమాయకత్వం, అవగాహనా రాహిత్యం, చట్టాలపట్ల అవగాహనా లేమితో ఆమె ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని వర్ల రామయ్య సూచించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించలేకపోతోందని మండిపడ్డారు. నిర్లక్ష్యం వహించిన ఎస్ఐని, సీఐని సస్పెండ్ చేయడంకాదని, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సస్పెండ్ చేయాలని వర్ల రామయ్య పిలుపు ఇచ్చారు.

*ఎవరో వచ్చి జిల్లాల్లో పర్యటించాల్సిన అవసరం లేదు: ఎంపీ కోమటిరెడ్డి
పీకే చేరికపై, పొత్తులపై హైకమాండ్‌దే తుది నిర్ణయమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌తో కలిసి పనిచేసే అవకాశం లేదని, రాహుల్‌గాంధీ సభపైనే దృష్టిపెట్టామని ఆయన తెలిపారు. జిల్లాల వారీగా బలమైన నేతలున్నారని, వారే జనసమీకరణ చేస్తారని.. సన్నాహక భేటీలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. అంతా మేమే చేస్తామంటే కుదరదని, ఎవరో వచ్చి జిల్లాల్లో పర్యటించాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

*బుల్డోజర్ కూల్చివేతలతో శాంతి భద్రతల విచ్ఛిన్నం: చిదంబరం
జహంగీర్‌పూర్‌లో ఆక్రమణల కూల్చివేత, దీనికి ముందు మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ ఘటనలపై కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీినియర్ నేత పి.చిదంబరం తీవ్ర ఆక్షేపణ తెలిపారు. బుల్డోజర్లతో కూల్చివేతలను బీజేపీ నేతలు సమర్ధించడం చట్టాన్ని కాలరాయడమేనని అన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయనడానికి ఈ ఘటనలు నిదర్శనమని చిదంబరం పీటీఐ వార్తా సంస్థకు ఆదివారంనాడు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
జహంగీర్‌పురి కూల్చివేతల ప్రదేశాన్ని విపక్ష నేతలైన బ్రిందా కారత్, అసదుద్దీన్ ఒవైసీ సందర్శించిన ఒక రోజు తర్వాతే కాంగ్రెస్ ప్రతినిధి బృందం అక్కడకు వెళ్లిందన్న విమర్శలపై చిదంబరం మాట్లాడుతూ, ఎవరు ఎప్పడు వెళ్లారనేది తనకు తెలియదని అన్నారు. కూల్చివేతలు జరిగిన స్వల్ప వ్యవధిలోనే కాంగ్రెస్ ప్రతినిధి బృందం అక్కడకు వెళ్లిందని, అనూహ్యరీతిలో జాప్యం జరిగి ఉంటే దానికి తాను విచారం వ్యక్తం చేస్తున్నానని అన్నారు.”నా ఆందోళన అంతా చట్టబద్ధ విధానాలను నిర్ద్వంద్వంగా ఉల్లంఘిస్తున్నారన్న విషయంపైనే. మతాన్ని ఇందులోకి ఎందుకు తీసుకువస్తారు? రాజ్యాంగ నిర్మాణానికి సెక్యులరిజం పునాది. సెక్యూలరిజం విలువలకు కాంగ్రెస్ కట్టుబడి ఉంది. కేవలం లౌకికవాదానికి కట్టుబడి ఉన్నంత మాత్రాన సరిపోదు. సెక్యులరిజం భాషలోనే స్పందించాలి. లౌకికవాద ఉల్లంఘన జరిగినప్పుడు నిరసన గళం వినిపించాలి. సెక్యులరిజానికి దూరంగా జరిగేందుకు నేను ఎంతమాత్రం ఇష్టపడను. సూటిమార్గం నుంచి పక్కకు మళ్లడం వల్ల సాధించేది ఏమీ ఉండదు” అని చిందబరం అన్నారు.

*వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్: మంత్రి కాకాణి
వ్యవసాయం అంటే తెలియని వ్యక్తి పవన్ కల్యాణ్ అని మంత్రి కాకాణి విమర్శించారు. సినిమాల్లో నటించడం, కోట్లు సంపాదించడం తప్ప పవన్‌కు మరేం తెలియదని ఎద్దేవా చేశారు. వ్యవసాయం గురించి పవన్‌ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచే సత్తా కూడా పవన్‌కు లేదన్నారు.

*జగన్ పాలనలో మృగాళ్ళకు కఠిన శిక్షలు లేవు: కాశి నవీన్ కుమార్
జగన్ రెడ్డి పాలనలో మృగాళ్ళకు కఠిన శిక్షలు లేవని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చట్టబద్దత లేని దిశ చట్టం వలన మహిళలకు ఒరిగిందేమి లేదన్నారు. జగన్మోహన్ రెడ్డికి చెక్కభజన చేసే మహిళకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇస్తే బాధితులకు న్యాయం ఎలా జరుగుతుందన్నారు. బాధితురాలిని పరామర్శించడానికి తాడేపల్లి ప్యాలస్ నుంచి బయటకు రాని జగన్‌ను.. గద్దె నెక్కించిన మహిళలే ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తారని కాశి నవీన్ కుమార్ అన్నారు

*ప్రధాన మంత్రుల సంగ్రహాలయం దేశానికి గర్వకారణం : మోదీ
దేశ రాజధాని నగరంలో ఏర్పాటైన ప్రధాన మంత్రుల సంగ్రహాలయం దేశానికి గర్వకారణమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దీనిని దేశ ప్రజల కోసం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రధాన మంత్రులు చేసిన కృషిని గుర్తు చేసుకోవడం గర్వించదగిన విషయమని చెప్పారు. వారిని ఈ సంగ్రహాలయం దేశ యువతకు అనుసంధానం చేస్తోందన్నారు.
దేశ ప్రజలను ఉద్దేశించి నిర్వహిస్తున్న రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’లో ఆదివారం మోదీ మాట్లాడుతూ, ప్రధాన మంత్రుల మ్యూజియం దేశానికి గర్వకారణమని చెప్పారు. మన దేశ ప్రధాన మంత్రులు మన దేశం కోసం చేసిన కృషిని యువత తెలుసుకోగలుగుతారని, ఫలితంగా యువత ఆ ప్రధాన మంత్రులతో అనుసంధానమవుతారని అన్నారు.ఈ మ్యూజియంను మోదీ ఏప్రిల్ 14న ప్రారంభించారు. మొదటి టిక్కెట్‌ను ఆయన కొని, ఈ సంగ్రహాలయాన్ని సందర్శించారు. భారత దేశానికి ప్రధాన మంత్రిగా పని చేసిన ప్రతి ఒక్కరికీ ఇది ఘనమైన నివాళి అవుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ప్రధాని మోదీ మార్గదర్శనంలో దీనిని తీర్చిదిద్దినట్లు తెలిపింది. స్వాతంత్ర్యానంతరం మన దేశానికి సేవలందించిన ప్రతి ప్రధాన మంత్రి కృషిని ఈ సంగ్రహాలయంలో ఉంచినట్లు పేర్కొంది. వారి భావజాలాలు, సిద్ధాంతాలు, పదవీ కాలాలతో సంబంధం లేకుండా అందరి కృషిని వివరించినట్లు తెలిపింది.

*విద్యావ్యవస్థ అంటేనే జగన్‌కు వ్యతిరేక భావం: జవహర్
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసవి సెలవులను కూడ పగ, ప్రతీకారం తీర్చుకునే సాధనంగా వాడుకుంటున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ సమయంలో ఉపాధ్యాయులు చేసిన ధర్నాకు ప్రతీకారంగానే మే నెలలో బడులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. విద్యావ్యవస్థ అంటేనే జగన్‌కు వ్యతిరేక భావం ఉందన్నారు. ఓ ప్రక్క నూతన విద్యా విధానం పేరుతో గందర గోళం సృష్టిస్తున్నారని, ఆంగ్ల మాధ్యమం పేరుతో కొంత కాలం అన్చితి నెలకొందన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు మంగళం పాడుతున్నారన్నారు. పీఎఫ్ ఖాతాలో సొమ్ము ప్రభుత్వం ఖాళీ చేసిందని ఆరోపించారు. వారంలో రద్దన్న సీపీయస్ అతి గతి లేదన్నారు. నాడు, నేడుతో కరోనాకు ఉపాధ్యాయులు బలైపోయారన్నారు. అమ్మ ఒడిపై ఆంక్ష ఎందుకో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన ప్రతీకారాన్ని ఉపాధ్యాయులపై చూపడం సరికాదని జవహర్ వ్యాఖ్యానించారు.

*పరామర్శకు వెళితే నోటీస్‌ ఇస్తారా: అనిత
విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో అత్యాచారానికి గురైన మానసిక దివ్యాంగురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మాజీ సీఎం చంద్రబాబుకు మహిళా కమిషన్‌ నోటీస్‌ ఇవ్వడంపై టీడీపీ నేత వంగలపూడి అనిత మండిపడ్డారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మకు దమ్ముంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఇవ్వడంలో విఫలమైన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి నోటీస్‌ ఇవ్వాలని సవాల్‌ చేశారు. విపక్ష నేత పరామర్శకు వెళుతున్నారని తెలుసుకుని ఆస్పత్రికి వెళ్లిన వాసిరెడ్డి పద్మ బాధితురాలికి భరోసా ఇచ్చి రాకుండా…రాజకీయం చేయడానికి అక్కడే ఉన్నారని అనిత విమర్శించారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా కాకుండా వైసీపీ కార్యకర్తగా పద్మ వ్యవహరించారని అనిత ఆరోపించారు. ఆస్పత్రిలో చంద్రబాబుతో వాగ్వాదానికి దిగాల్సిందిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్‌ ఇచ్చారన్నారు. తిరిగి తన విధులకు అడ్డుతగిలారంటూ చంద్రబాబుకు నోటీస్‌ ఇస్తారా అంటూ అనిత మండిపడ్డారు

*విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటన దురదృష్టకరం: రోజా
విజయవాడ ప్రభుత్వాస్పత్రి ఘటన దురదృష్టకరమని మంత్రి రోజా అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దిశా చట్టాన్ని ఆమోదించి ఉంటే.. గ్యాంగ్‌రేప్‌ నిందితులను వెంటనే ఉరేసే అవకాశం ఉండేదని తెలిపారు. ఇలాంటి ఘటనలపై రాజకీయాలు చేయడం సరికాదని రోజా సూచించారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో మతిస్థిమితం లేని యువతి అత్యాచారానికి పాల్పడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై అత్యాచారం కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. విధుల్లో అలసత్వం వహించారంటూ సీఐ హనీష్, సెక్టార్ ఎస్ఐ శ్రీనివాసరావును సీపీ సస్పెండ్ చేశారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటనలో ముందుగా ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులు అలసత్వం వహించారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి.

*మంత్రి పదవి నాకు వెంట్రుక ముక్కతో సమానం:
మాజీమంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవి నాకు వెంట్రుక ముక్కతో సమానమని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడ ఎమ్మెల్యేగా ఉండడమే తనకు ఇష్టమని చెప్పారు. ఎమ్మెల్యే పదవి పోతేనే బాధపడతానని తెలిపారు. ఏపీ శ్రీలంకలా మారుతుందని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం జగన్‌ లాంటి వ్యక్తులను పోగొట్టుకుంటే ఏపీ సర్వనాశనం అవుతుందని హెచ్చరించారు. మాజీ సీఎం వైఎస్‌ఆర్‌ను కోల్పోవడంతోనే ఏపీని రెండు ముక్కలై నాశనమయ్యిందని కొడాలి నాని గుర్తుచేశారు.

*వైసీపీ అంటే నాకు ఏమాత్రం ద్వేషం లేదు
వైసీపీ అంటే తనకు ఏమాత్రం ద్వేషం లేదని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చెప్పారు. అప్పుల పాలై ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాల దీన స్థితిపై పవన్‌ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను కలుసుకుని ఆర్థిక సాయం అదించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ సమావేశంలో పవన్ మాట్లాడుతూ వైసీపీ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నిలదీస్తామని హెచ్చరించారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపీ రెండో స్థానంలో ఉందని తెలిపారు. కౌలు రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వానికి ప్రజల కష్టాలు కనిపించడం లేదన్నారు. తనను దత్తపుత్రుడని ఇంకోసారి అంటే.. సీబీఐ దత్తపుత్రుడు అని తానూ అనాల్సి వస్తుందన్నారు. చంచల్‌గూడ జైల్లో షటిల్‌ ఆడుకున్న వాళ్లా..తనకు నీతులు చెప్పేది అని పవన్‌కల్యాణ్ హెచ్చరించారు.

*నా కాలేజీని ప్రభుత్వానికి రాసిస్తా: మంత్రి పువ్వాడ
పీజీ మెడికల్‌ సీట్ల ఆరోపణలపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. తనపై గవర్నర్‌కు రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేయడాన్ని ఆయన ఖండించారు. బ్లాక్‌ దందా నిరూపిస్తే తన కాలేజీని ప్రభుత్వానికి రాసిస్తానని ఆయన సవాల్ విసిరారు. రేవంత్‌ తన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని, లేదంటే రేవంత్‌రెడ్డి ముక్కునేలకు రాసి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే చర్యలు తీసుకుంటామని రేవంత్‌ను మంత్రి హెచ్చరించారు.

*రైతు సంఘర్షణ సభను ప్రజలు విజయవంతం చేయాలి
రైతు సంఘర్షణ సభను ప్రజలు విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మే 6, 7 తేదీల్లో రాహుల్ కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు. డిజిటల్ మెంబర్‌షిప్‌లో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. వరంగల్‌లో బహిరంగ సభలు పెట్టి టీఆర్ఎస్‌ బలంగానే ఉందంటూ.. ప్రతిసారి నిరూపించుకునే పరిస్థితి సీఎం కేసీఆర్‌దని ఎద్దేవాచేశారు. రైతులు తీవ్రమైన కష్టాల్లో ఉన్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు.

*యూపీలో ఉమ్మడి పౌర స్మృతి అమలు: కేశవ్‌
దేశంలో అందరికీ ఒకే చట్టం తక్షణావసరం అని ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య అన్నారు. ఈ నేపథ్యంలో యూపీలో ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ) అమలు చేస్తామనిఈ దిశగా తమ ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ఆయన తెలిపారు. శనివారం ఇక్కడ మీడియాతో ఆయన మాట్లాడారు. సబ్‌కా సాథ్‌సబ్‌కా వికాస్‌ కోసం యూసీసీ కీలకమనిఅందరూ యూసీసీని స్వాగతించాలని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లోనూ యూసీసీని అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.

*సరిహద్దు దాటి దాడులు చేస్తాం: రాజ్‌నాథ్‌
దేశాన్ని బయటివైపు నుంచి లక్ష్యంగా చేసుకునే ఉగ్రవాదుల ఏరివేతకు సరిహద్దు దాటేందుకూ భారత్‌ సందేహించదని రక్ష ణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. భారత్‌పాకిస్థాన్‌ మధ్య లో జరిగిన యుద్ధంలో పాల్గొన్న మాజీ సైనికులను అసోంలో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌ ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు పంపించారు. ఉగ్రవాదాన్ని ఉక్కుపిడికిలితో అణిచివేస్తామన్నారు.