Health

సబ్జాగింజలతో …చల్లచల్లగా .. !

Auto Draft

వేసవిలో సబ్జాలు చేసే మేలు తెలిసిందే . సబ్జాగింజలూ తులసి గింజలూ చూడ్డానికీ ఒకేలా ఉంటాయి కానీ రెండూ ఒకటికావు . రుద్రజడ అనే మొక్క నుంచి వచ్చేవే సబ్జాగింజలు . ఈ మొక్కనే కమ్మగగ్గరకు అనీ , వంద రోగాల్ని తగ్గిస్తుందనీ చెబుతారు . ఈ గింజల్ని నానబెడితే , అవి నీటిని పీల్చుకుని మృదువుగా మారి , పట్టుకుంటే జారిపోతుంటాయి . జిగురుతో కూడిన రుచికోసం ఐస్లూ ఐస్క్రీమ్ లూ డెజర్ట్లూ ఫలూదాల్లో వాడుతుంటారు . సబ్జాగింజల్ని నానబెట్టుకుని లేదా పండ్లరసాలేమయినా కలుపుకుని తాగినా మంచిదే . యాంటీఆక్సిడెంట్లూ ఎంజైమ్లూ గింజల్లోంచి బయటకు వచ్చి ఆరోగ్యానికి మేలుచేస్తాయి . సబ్జా గింజల్లో ఆల్ఫాలినోలిక్ , ఒమేగా – 3 ఫ్యాటీ ఆమ్లాలు కొవ్వుని కరిగించి జీవక్రియని పెంచుతాయి . వీటిని ఏదైనా జ్యూస్ లేదా షర్బత్లో కలుపుకుని తాగడంవల్ల ఆకలి తగ్గి తద్వారా బరువు తగ్గడానికి దోహదపడతాయి . ఈ గింజల్లో ప్రొటీన్లూ పీచూ ఇతరత్రా పోషకాలు పుష్కలం . ఇవన్నీ కలిసి జీవక్రియకీ ; నాడీవ్యవవస్థ , జీర్ణవ్యవస్థల పనితీరుకీ ; కొలెస్ట్రాల్న తగ్గించేందుకూ తోడ్పడతాయి . డిప్రెషన్ , ఆందోళనల్ని తగ్గించేందుకూ శిశువు పెరుగుదలకీ కంటిచూపు మెరుగవ డానికి సాయపడతాయి .