Health

బిల్వ ఫలం … పోషకాలు పుష్కలం !

బిల్వ ఫలం … పోషకాలు పుష్కలం !

బిల్వపత్రాలతో పూజిస్తే పరమశివుడు కరుణిస్తాడనేది భక్తుల నమ్మకం . అయితే మారేడు పండ్లలోని ఔషధగుణాల గురించి మాత్రం అందరికీ తెలియదు . ఎన్నో పోషకాలతో నిండిన ఈ పండ్లలో బీటాకెరోటిన్ , సి – విటమిన్ , రిబోఫ్లేవిన్లు పుష్కలం . అందుకే వీటిని ఆయుర్వేద , సిద్ధ వైద్యాల్లోనూ ; కొన్నిచోట్ల గృహ వైద్యంలోనూ వేల సంవత్సరాల నుంచీ వాడుతున్నారు . ఈ పండ్లతో చేసిన షర్బత్ వేసవిలో ఇన్స్టంట్ కూలర్లా పనిచేస్తుందన్న కారణంతో బెంగాల్ , రేడు ఒడిశావాసులు దీన్ని తప్పక తాగుతారట . కాయలు పండుగా మారాక వెలగపండులా తొక్క గట్టిగా అయిపోతుంది . అప్పుడే దీన్ని పగులగొట్టి గుజ్జుతో జ్యూస్లు చేస్తుంటారు . ఈ పండ్లగుజ్జులో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది . కాబట్టి దీని షర్బత్ రక్తప్రసరణకి మేలు చేస్తుంది . డయేరియా , కలరా , మధుమేహం , స్కర్వీ , చెవినొప్పి , చర్మసమ స్యలు , శిరోజాల సంరక్షణకీ కొలెస్ట్రాల్ నియంత్రణకీ … ఇలా ఎన్నింటినో ఇది తగ్గిస్తుంది . ముఖ్యంగా పాలిచ్చే తల్లులకు ఈ పండ్లు ఎంతో మేలు.