NRI-NRT

అలరించిన ‘తానా’ కవితా లహరి

అలరించిన ‘తానా’ కవితా లహరి

“ఏప్రిల్ 22న అట్టహాసంగా జూమ్ లో ప్రారంభమైన మూడురోజుల తానా సాహిత్య సంబురాలు..” నాలుగు గంటలకు పైగా ఏకబిగిన సాగిన కవితాలహరి దేశవిదేశాల్లోని అసంఖ్యాక తెలుగు సాహితీ ప్రియుల్ని ఉర్రూతలూపింది. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల తరుణంలో ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వహిస్తున్న అపురూప కార్యక్రమమిది. తానా ప్రస్తుత అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు తొలి పలుకులలో సామాజిక అంశాలపై అవగాహనతో, ప్రజలలో చైతన్యం కలిగించేవిధంగా కవులు కవితా రచనలు చేయాలని చెబుతూ, తానా నిర్వహిస్తున్న కార్యక్రామాలు వివరించారు. తానా పూర్వాధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ ఉత్సాహ ప్రోత్సాహక మాటలతో, కవుల కర్తవ్యాన్ని ఆయన గుర్తుచేస్తూ, కవితాత్మకంగా పూర్వ కవులను ఉటంకిస్తూ, అందమైన, అర్థవంతమైన ప్రసంగంతో అందరిలో స్పుర్తి నింపారు. బంకించంద్ర వందేమాతరం గీతాన్ని, గరిమెళ్ల సత్యనారాయణ మాకొద్దీ తెల్ల దొరతనము గుర్తు చేస్తూ కవులకు కర్తవ్య బోధ చేసారు.
Whats-App-Image-2022-04-25-at-6-27-33-PM
తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డాక్టర్ ప్రసాద్ తోటకూర పరోక్ష పర్యవేక్షణ లో ఈ కార్యక్రమం నిర్విరామంగా జరిగింది. కవన భేరికి తొలి రోజు సభాధ్యక్షులు తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ విశ్వవ్యాప్తంగా 75 మందికి మించి కల, గళాలను జోడిస్తున్న ఈ మూడు రోజుల మహోత్సవాల శుభారంభ ప్రక్రియ ఆసాంతమూ ఎంతో చైతన్యభరితం. మొదటి రోజున ముఖ్యఅతిథి హైదరాబాద్ సన్ షైన్ హాస్పిటల్స్ ఎండీ డాక్టర్ ఏ.వీ. గురవారెడ్డి , వైద్య ప్రముఖులైన ఆయన ప్రసంగంలోని ప్రతి వాక్యం సారస్వత అనురక్తిని చాటిచెప్పింది. భాష ,సాహిత్యం, సంస్కృతి, కళలు, ఇంకా మరెన్నింటినో రంగరించి కమనీయ, రమనీయ సందేశం అందించారు. భావాలు – అనుభవాలను రసరమ్యంగా మిళితం చేసిన ఆ వాగ్దాటి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తన వినమ్రతకు ప్రతీక. పోటీల్లో విజేతలుగా నిలిచి తమదైన ప్రత్యేకతను నిలబెట్టుకున్న కవి మిత్రులందరికీ ఎప్పుడు వైద్య సహాయం అవసరమైనా ముందుండి అందిస్తామని సభాముఖంగా ప్రకటించడం వారి విశాల హృదయానికి తార్కాణం.
Whats-App-Image-2022-04-25-at-6-27-33-PM
విశిష్ట అతిథిగా ఉపన్యసించిన అరుణ తేళ్ళ ఆంధ్రప్రదేశ్ మహిళాభ్యుదయ సమితి అధ్యక్షులుగా, నవ్యాంధ్ర రచయిత్రుల సంఘం గౌరవాధ్యక్షురాలిగా ఉత్కంఠ వాతావరణం సృష్టించారు. క్షేత్రస్థాయి పరిస్థితులను ఉదహరిస్తూ, సామాజిక కోణాలను విశ్లేషిస్తూ ఎందరిలోనో నవ్య ఆలోచనలు రేకెత్తించారు. కర్ణాటకలోని సార్వత్రిక విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతి ఆచార్య ఎం.రామనాధం నాయుడు గారు ప్రత్యేక అతిథిగా ధారాప్రవాహ ధాటి చూపారు. భాషా సంబంధ ప్రస్తావనలు, చారిత్రక అంశాలు,వర్తమాన తీరుతెన్నుల విపులీకరణ తో అందరి మదిలోనూ చెదరని ముద్ర వేశారు.తానా అధికారిక యూట్యూబ్ ఛానల్ తో పాటు ఫేస్ బుక్ ఛానల్లో; యప్ టీవీ ద్వారా అమెరికా, యూరప్ దేశాల్లో ఈ కార్యక్రమమంతా ప్రత్యక్ష ప్రసారమైంది. ఈటీవీ భారత్, మన టీవీ, టీవీ ఆసియా తెలుగు , ఇతర మాధ్యమాల్లోనూ శని ఆదివారాల్లో కూడా ప్రసారాలు ఏర్పాటయ్యాయి. ఒక్కరి కవితను అపార శ్రద్ధాసక్తులతో విని, దీటైన సమీక్ష చేసి, ఎప్పటికప్పుడు సూచనలు సలహాలతో అందరినీ ఆకట్టుకున్నారు చిగురుమళ్ళ. కలాలు విజృంభించాయి, గళాలు విస్తరించాయి. శ్రీయుతులు మురహర రావు ఉమాగంధి, గోపిశెట్టి శ్రీధర్, జడా సుబ్బారావు, జంధ్యాల శరత్ బాబు, యస్.రత్నలక్ష్మి, కె.వీణారెడ్డి, రమాదేవి కులకర్ణి, నీరజా దేవి గుడి , శ్రీధర్ రెడ్డి బిల్లా, జయశ్రీ అన్నమరాజు, ఎంవీఎల్ఎస్ సరస్వతి, సింహాద్రి శ్రీనివాసరావు, ఉమా మహేశ్వరి యాళ్ళ, పత్తెం వసంత, పోచిరాజు వెంకట పద్మజ, అనిల్ కొమ్మినేని, అంజలి, పోచం సుజాత, మోటూరి నారాయణరావు, నల్లబాటి రాఘవేంద్రరావు, ఆకుల రఘురామయ్య, కుప్పలి వెంకట రాజారావు, వాల్మీకి శ్రీనివాసులు, పానుగంటి శ్రీనివాస్ రెడ్డి,కె.యల్.కామేశ్వరరావు, మారం రెడ్డి గోపాల్ రెడ్డి, చంద్రకళ దీకొండ, బందకవి శ్రీనివాస రామారావు… ఎందరెందరో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, హరియాణాలతో పాటు అమెరికా, మస్కట్, మరెన్నో ప్రదేశాల నుంచి కవి వాణి వినిపించారు. కవితాలహరి,గాన ఝరి, పఠన మాధురి మన తెలుగు ఘనతను వేనోళ్ళ చాటాయి. మాత్రమే రూపొందించి, నిర్వహించి, ఆదర్శప్రాయమై నిలుస్తుందని మరోసారి నిరూపించాయి. ఆలోచన, ఆచరణల నిర్వచనాలుగా కార్యక్రమం పేరు ఏదైనా ఉందంటే అది అక్షరాలా ఇదే.
Whats-App-Image-2022-04-25-at-6-26-01-PM