DailyDose

నేపాల్‌లో ఘోరం.. నలుగురు భారతీయులు మృతి- TNI నేర వార్తలు

నేపాల్‌లో ఘోరం.. నలుగురు భారతీయులు మృతి- TNI  నేర వార్తలు

* నేపాల్‌లో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. ఐదుగురు ప్రయాణిస్తున్న కారును బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ సహా నలుగురు భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బిమల్‌చంద్ర అగర్వాల్(40) , సాధన అగర్వాల్(35), సంధ్య అగర్వాల్(40), రాకేశ్ అగర్వాల్ కొద్ది రోజుల క్రితం నేపాల్ టూర్ వెళ్లారు. ఈ క్రమంలో ఆదివారం నేపాల్‌లోని పొఖారాను సందర్శించారు. అనంతరం ఖాట్మాండుకు తిరిగి పయనం అయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారును థాక్రే‌కు చేరుకోగానే బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు భారతీయులు సహా నేపాల్‌కు చెందిన కారు డ్రైవర్ దిల్ బహదూర్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండతా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు

*అల్లూరి సీతారామారాజు జిల్లాలో పలు మండలాల్లో భారీగా వర్షం కురుస్తోంది. హుకుంపేట, జి.మాడుగుల, పాడేరు, చింతపల్లి, కొయ్యూరు, రంపచోడవరం, మారేడుమిల్లి, చింతూరు మండలాల్లో పడుతోంది. ఈ క్రమంలోనే.. అల్లూరి జిల్లాలో పిడుగుపడి ఇద్దరు మరణించారు. ఎటపాక మండలంలో తోటపల్లి ఎంపీటీసీ శ్రీదేవి(36) పిడుగుపాటుకు ప్రాణాలు కోల్పోగా… జీకే వీధి మండలం సూరవరంలో సాగేని సత్యనారాయణ(19) అనే యువకుడు మృతి చెందాడు.

*శంషాబాద్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో భారీగా హెరాయిన్ ప‌ట్టుబ‌డింది. ఈస్ట్ ఆఫ్రికాలోని మాల‌వి దేశానికి చెందిన ప్ర‌యాణికురాలి వ‌ద్ద హెరాయిన్‌ను గుర్తించిన డీఆర్ఐ అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.ఖ‌త‌ర్ నుంచి వ‌చ్చిన విమానంలో నైరోబి – దోహా మీదుగా ఆమె హైద‌రాబాద్‌కు చేరుకుంది. బిజినెస్ వీసా ద్వారా ప్ర‌యాణించిన ఆమె.. 2 పాలిథిన్ క‌వ‌ర్ల‌లో 3.129 కిలోల హెరాయిన్‌ను తీసుకొచ్చింది. ప‌ట్టుబ‌డిన హెరాయిన్ విలువ రూ. 21.9 కోట్లు ఉంటుంద‌ని అధికారులు నిర్ధారించారు. కేసు న‌మోదు చేసిన శంషాబాద్ పోలీసులు.. నిందితురాలిని రిమాండ్‌కు త‌ర‌లించారు.

*అనకాపల్లి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. యువతిపై కక్షకట్టిన మేనమామ మరో వ్యక్తికి సుపారీ ఇచ్చి ఆమెను అంతమొందించేందుకు ప్రయత్నించాడు. వివరాలు.. వి.మాడుగుల గ్రామం జగ్గన్న చావిడి వద్ద ఓ యువతిపై అదే గ్రామానికి చెందిన నగేష్‌ అనే వ్యక్తి బ్లేడ్‌తో దాడి చేశాడు. ఆంజనేయ స్వామి గుడికి వెళ్లిన సిద్ధ స్వాతి(19) అనే యువతిపై నిందితుడు బ్లేడుతో గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న స్వాతిని స్థానికులు వైద్యం కోసం మాడుగుల ఆసుపత్రికి తరలించారు.

*విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలో పునఃనిర్మించిన రామతీర్థం కోదండరామాలయాన్ని మంత్రి కొట్టు సత్యనారాయణ, దేవాదాయశాఖ కమిషనర్‌ హరిజవహర్‌లాల్ ప్రారంభించారు. రుత్వికులు నీలాచలం కొండపై స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 2020 డిసెంబర్‌లో సీతారామ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో రూ.3కోట్ల వ్యయంతో ప్రభుత్వం ఆలయాన్ని పునఃనిర్మించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు గైర్హాజరయ్యారు.

*స్పా సెంటర్‌కు వచ్చే పురుషులకు మహిళలతో మసాజ్‌ చేయిస్తుండగా పోలీసులు దాడి చేసి నిర్వాహకుడితోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. వనస్థలిపురం పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి శాతవాహననగర్‌లో ఉంటున్న అరుకొండ రవీందర్‌(40) పనామా వద్ద గ్లో యూనిసెక్స్‌ సెలూన్‌ అండ్‌ స్పాను నిర్వహిస్తున్నాడు. పురుషులకు మహిళలతో మసాజ్‌ చేయిస్తున్నట్లు సమాచారం అందడంతో శనివారం రాత్రి పోలీసులు ఆ సెంటర్‌పై దాడి చేశారు. సాయి కల్యాణ్‌, సుధాకర్‌ అనే ఇద్దరికి మహిళలతో మసాజ్‌ చేయిస్తున్నారు. ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. వారి నుంచి రూ.1500, చరవాణులు, బైకులను స్వాధీనం చేసుకున్నారు. సెంటర్‌ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు

*పంజాబ్లోని అట్టారీ సరిహద్దు గుండా భారత్లోకి తరలిస్తున్న సుమారు 100 కేజీల హెరాయిన్ను పట్టుకున్నారు కస్టమ్స్ విభాగం అధికారులు. అఫ్గానిస్థాన్ నుంచి ములేథి మూలికల్లో దాచి తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ సుమారు రూ.700 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. దిల్లీకి చెందిన ఓ వ్యక్తి అఫ్గానిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ములేథి మూలికల్లో దాచి హెరాయిన్ తరలిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది కస్టమ్స్ విభాగం. అట్టారీలోని చెక్పోస్ట్ వద్ద ఎక్స్-రే స్కానింగ్ చేస్తుండగా దీనిని గుర్తించినట్లు వెల్లడించింది. ఎక్స్-రే చిత్రాల్లో కొన్ని అనుమానిత గుర్తులు కనిపించినట్లు అధికారులు తెలిపారు.

*పంజాబ్లోని అట్టారీ సరిహద్దు గుండా భారత్లోకి తరలిస్తున్న సుమారు 100 కేజీల హెరాయిన్ను పట్టుకున్నారు కస్టమ్స్ విభాగం అధికారులు. అఫ్గానిస్థాన్ నుంచి ములేథి మూలికల్లో దాచి తరలిస్తుండగా పట్టుకున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ సుమారు రూ.700 కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. దిల్లీకి చెందిన ఓ వ్యక్తి అఫ్గానిస్థాన్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ములేథి మూలికల్లో దాచి హెరాయిన్ తరలిస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది కస్టమ్స్ విభాగం. అట్టారీలోని చెక్పోస్ట్ వద్ద ఎక్స్-రే స్కానింగ్ చేస్తుండగా దీనిని గుర్తించినట్లు వెల్లడించింది. ఎక్స్-రే చిత్రాల్లో కొన్ని అనుమానిత గుర్తులు కనిపించినట్లు అధికారులు తెలిపారు.

*తనకు న్యాయం చేయాలని, తనపై దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఒక మహిళ టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎదుట పెట్రోలు పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తాటిచెట్లపాలెం ప్రాంతానికి చెందిన ప్రశాంతి అనే మహిళ, అల్లిపురం చెరువుగట్టు ప్రాంతంలో నివసిస్తున్న శ్రీను, అతని భార్య, మరో ఇద్దరు జ్యోతి, రాణి, మాధవి తనపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది.అయితే తాను శనివారం టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, తనకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో స్టేషన్‌ ముందు తనతో తెచ్చుకున్న పెట్రోలు శరీరంపై పోసుకుంది. దీంతో అక్కడే విధుల్లో ఉన్న మహారాణిపేట పోలీసులు అడ్డుకుని, టూ టౌన్‌ పోలీసులకు అప్పగించడంతో వారు ఆమెకు సపర్యలు చేసి కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందజేశారు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కె.వెంకటరావు తెలిపారు

*తిరుపతి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి శివారులోని పూతలపట్టు – నాయుడుపేట రహదారిపై ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా.. మరో తొమ్మిది మంది గాయపడ్డారు. వెంటనే వారిని ఆసుప్రతికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. చంద్రగిరికి చెందిన 12 మంది నాయుడుపేట సమీపంలోని కనువూరమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరిగి ఆటోలో బయలుదేరారు.

*అల్లూరి సీతారామరాజు జిల్లాలో నక్సలైట్లు ఓ ప్రైవేట్‌ బస్సును దహనం చేశారు. జిల్లాలోని చింతూరు మండలం కొత్తూరు వద్ద ఒడిశా నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సును ఆపిన నక్సల్స్‌ ప్రయాణికులను కిందకు దింపి నిప్పుపెట్టారు.ఇవాళ దండకారణ్యం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నక్సల్స్‌ ఈ చర్యకు పాల్పడినట్లు వెల్లడించారు. కాగా ప్రయాణికులు మరో వాహనంలో గమ్యస్థానాలకు చేరుకున్నారు.

*భారత్‌లోకి మాదక ద్రవ్యాలను తరలించేందుకు పాక్‌ కుట్రలు పన్నుతున్నది. పక్కాగా అందించిన సమాచారం మేరకు అరేబియా సముద్రం మార్గంలో తరలించేందుకు యత్నిస్తుండగా.. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ కుట్రను భగ్నం చేసింది. ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌, గుజరాత్‌ ఏటీఎస్‌ సంయుక్త ఆపరేషన్‌ నిర్వహించి పాక్‌ బోటులో నుంచి భారీగా హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నాయి. ఈ సందర్భంగా తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని జకావూకు తరలించారు. బోట్‌లో 55 హెరాయిన్‌ ప్యాకెట్లలో 56 కిలోల వరకు హెరాయిన్‌ను స్వాధీనం చేసుకోగా.. బహిరంగ మార్కెట్‌లో దాని విలువ రూ.280కోట్ల వరకు ఉంటుందని అంచనా.

*అప్పుల వేధింపులకు మరో కుటుంబం ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంది. మచిలిపట్నంకు చెందిన వెంకటేశ్వరరావు గత కొన్ని నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పులు ఇచ్చిన వారి నుంచి వేధింపులు ఎక్కువ కావడంతో ఎవరికీ చెప్పకుండా భార్య, పిల్లలతో కలసి విజయవాడకు వచ్చి గత 17 రోజులుగా లాడ్జిలో ఉంటున్నాడు.అప్పులు తీర్చే మార్గం దొరకకపోవడంతో భార్య రాధారాణి, ఇద్దకు కూతుర్లు భావన, శ్రావణితో కలిసి పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. లాడ్జి నుంచి అరుపులు రావడంతో సిబ్బంది గమనించి ఆ కుటుంబాన్ని హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యుల పర్యవేక్షణలో బాధితులకు చికిత్స అందిస్తున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.

*నకరికల్లు మండలం చల్లగుండ్ల ప్రభుత్వ మద్యం షాపులో చోరీ జరిగింది. రాత్రి లాకరులో ఉన్న  లక్షల రూపాయల నగదును దుండగులు అపహరించారు. నకరికల్లు పోలీసులకు సూపర్‌వైజర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*యువకుడి ఆత్మహత్య కేసులో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం ఎస్సై ఉదయ్‌కిరణ్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు.

* ఆమె మానసిక దివ్యాంగురాలు.. కళ్లు సరిగా కనిపించవు.. దీనిని ఆసరాగా చేసుకుని ఓ వ్యక్తి 5 నెలలు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే తల్లిదండ్రులను చంపేస్తానని యువతిని బెదిరించాడు. హనుమకొండ జిల్లాలో ఈ దారు ణం చోటుచేసుకుంది. కమలాపూర్‌ మండలంలోని ఓ గ్రామానికి చెం దిన బండి కనకరాజం(48) గేదెలను మేపుతూ, కూలి పనిచేస్తూ జీవ నం సాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మానసిక దివ్యాంగురాలు (18) సైతం గేదెలను మేతకు తీసుకెళ్తుండగా ఓ రోజు ఆమెపై కనకరాజం అత్యాచారానికి ఒడిగట్టాడు. ఐదు నెలలుగా దారుణాన్ని కొనసాగిస్తున్నాడు. గత వారం ఆమె ఆరోగ్యం బాగోలేకపోవడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం ఏమైందని అడగడంతో జరిగిన విషయం చెప్పింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేయడంతో కనకరాజంపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

*చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. జాతీయ రహదారిపై మావోయిస్టులు బస్సును తగలబెట్టారు. ఈ ఘటన చింతూరు మండలం కొత్తూరు దగ్గర చోటు చేసుకుంది. మావోల దుశ్చర్యతో నేషల్ హైవే 30పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

*అర్ధరాత్రి శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-మినీ వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నాయుడుపేట నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

*యువకుడి ఆత్మహత్య కేసులో జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం ఎస్సై ఉదయ్‌కిరణ్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు అదనపు డీజీపీ వై.నాగిరెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గణపురం మండల కేంద్రానికి చెందిన శ్రావణ్‌ ఫైనాన్స్‌పై ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. ఫైనాన్స్‌ మొత్తం చెల్లించాక ఎన్‌వోసీ కోసం తన బంధువు ప్రశాంత్‌ (24)తో కలిసి ఈనెల 11న షోరూం వద్దకు వెళ్లాడు. కిస్తీలు కట్టడంలో ఆలస్యం చేశావంటూ షోరూం యజమాని మోత్కురి శ్రీనివాస్‌ ఎన్‌వోసీ ఇవ్వడానికి నిరాకరించడంతో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో శ్రావణ్‌, ప్రశాంత్‌లపై శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఆ ఇద్దరినీ పోలీస్‌స్టేషన్‌కు రప్పించి చితకబాదారు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్‌ మరుసటి రోజు ఆత్మహత్యాయత్నం చేయగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 23న మృతిచెందాడు. తన కుమారుడి ఆత్మహత్యకు కారకులైన ఎస్సై ఉదయ్‌కిరణ్‌, షోరూం యజమాని శ్రీనివా్‌సపై చర్య తీసుకోవాలని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం అదనపు డీజీపీ వై.నాగిరెడ్డి.. ఉదయ్‌కిరణ్‌పై సస్పెన్షన్‌ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే శ్రీనివా్‌సపైనా కేసు నమోదు చేశారు.

*చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. జాతీయ రహదారిపై మావోయిస్టులు బస్సును తగలబెట్టారు. ఈ ఘటన చింతూరు మండలం కొత్తూరు దగ్గర చోటు చేసుకుంది. మావోల దుశ్చర్యతో నేషల్ హైవే 30పై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మావోయిస్టుల ఘాతుకానికి పాల్పడటంతో పోలీసులు అలర్ట్ అయ్యారు.

*అర్ధరాత్రి శ్రీకాళహస్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ-మినీ వ్యాన్‌ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..మరో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నాయుడుపేట నుంచి తిరుపతి వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

* అనంతపురం జిల్లాలో ఇంటర్‌ విద్యార్థి జనార్దన్‌ గౌడ్‌ (16) అనుమానాస్పద స్థితిలో చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందాడు. శనివారం జరిగిన ఈ ఘటన ఒకరోజు ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం రూరల్‌ మండలం శెట్టూరు మండలం లింగదేర్లపల్లికి చెందిన జనార్దన్‌గౌడ్‌ ఇదే మండలంలోని ఆలమూరు రోడ్డులో ఉన్న సత్యసాయి జూనియర్‌ కళాశాలలో చదువుతుండేవాడు. శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బయటకు వెళ్లిన కాసేపటికే చెట్టుకు ఉరి వేసుకుని కనిపించాడు. మృతుడి శరీరంపై పలుచోట్ల గాయాలున్నాయి. ఇది హత్యా, ఆత్మహత్యా అన్నది తేలాల్సి ఉంది. ఫీజు పెండింగ్‌ ఉండటంతో కళాశాల యాజమాన్యం హాల్‌ టికెట్‌ ఇవ్వకపోవడం వల్లే.. మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. విద్యార్థి బయటకు వెళ్లిన విషయాన్ని మధ్యాహ్నం 2 గంటలకే అతడి బంధువులకు ఫోన్‌ చేసి, తెలిపామని కళాశాల యాజమాన్యం చెబుతోంది. రాత్రి 9 గంటలకు తమకు ఫోన్‌ చేసి, చెప్పారని బాలుడి తండ్రి తిప్పేస్వామి పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తమ కుమారుడిని భయభ్రాంతులకు గురిచేశారని, కాలేజీ యాజమాన్యం తప్పిదం వల్లే చనిపోయాడని అందులో పేర్కొన్నారు. కళాశాల యాజమాన్యం మాత్రం విద్యార్థి అనారోగ్యం వల్లే మరణించాడంటున్నారు. మృతిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

*జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న ఉదయ్‌కిరణ్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. ఈ మేరకు అడిషనల్‌ డీజీపీ వై.నాగిరెడ్డి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. గణపురం మండల కేంద్రానికి చెందిన నిప్పాని శ్రావణ్‌ ఫైనాన్స్‌పై ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. ఫైనాన్స్‌ మొత్తం చెల్లించాక ఎన్‌వోసీ కోసం తన బంధువు పెండ్యాల ప్రశాంత్‌ (24)తో కలిసి ఈనెల 11న షోరూం వద్దకు వెళ్లాడు. కిస్తీలు కట్టడంలో ఆలస్యం చేశావంటూ షోరూం యజమాని మోత్కురి శ్రీనివాస్‌ ఎన్‌వోసీ ఇవ్వడానికి నిరాకరించాడు. ఈ క్రమంలో ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో శ్రావణ్‌, ప్రశాంత్‌పై శ్రీనివాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన ఎస్సై ఇద్దరిని పోలీస్‌స్టేషన్‌కు రప్పించి చితకబాదాడు. దీంతో మనస్తాపం చెందిన ప్రశాంత్‌ మరుసటి రోజు ములుగు జిల్లా శివారు బండారుపల్లిలో బంధువుల ఇంట్లో గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు.

*ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై వెళ్తున్న ఓ బస్సును అడ్డుకున్న మావోయిస్టులు ప్రయాణికులను దించి తగులబెట్టారు. ఈ ఘటన చింతూరు మండలం కొత్తూరు దగ్గర చోటుచేసుకుంది. రాత్రివేళ ఒడిశా నుంచి హైదరాబాద్‌కు వస్తున్న బస్సును ఆపి ప్రయాణికులను కిందికి దింపారు. అనంతరం మావోయిస్టులు దానికి నిప్పుపెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మావోయిస్టులు దండకారణ్యం బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. దీంతోపాటు కరపత్రాలను సైతం వదిలి వెళ్లారు.

*రేణిగుంట రోడ్డులో ఆటోనగర్ వద్ద కరెంటు స్తంభాన్ని ఆటో ఢీకొట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఆటోలోని ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను రుయా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు.