Politics

మహిళల రక్షణలో ప్రభుత్వం విఫలం – TNI రాజకీయ వార్తలు

మహిళల రక్షణలో ప్రభుత్వం విఫలం – TNI రాజకీయ వార్తలు

*రాష్ట్రంలో 800 మందిపై అత్యాచారాలు జరిగినా..ఏ ఒక్కరికీ న్యాయ జరగలేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మహిళలకు రక్షణ కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. మహిళలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 27న ఆందోళన కార్యక్రమాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు.ష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. పార్టీ ముఖ్యనేతలతో వ్యూహకమిటీ సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రభుత్వ వైఫల్యంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు ప్రణాళికలు రచించినట్లు తెలిపారు. మహిళలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో ఈ నెల 27న ఆందోళన కార్యక్రమాలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 800 మందిపై అత్యాచారాలు జరిగినా.. ఒక్కరికీ న్యాయ చేయనందుకే ఆందోళన బాట పడుతున్నట్లు తెలిపారు.ఉద్యోగులు, ఉపాధ్యాయులపై సీఎం జగన్ రెడ్డి ప్రతీకారం దుర్మార్గమని చంద్రబాబు ధ్వజమెత్తారు. న్యాయం కోసం రోడ్డెక్కితే నిర్దాక్షిణ్యంగా అణిచివేస్తున్నారని మండిపడ్డారు. హక్కుల కోసం ఐక్య పోరాటం చేయడానికి సిద్ధపడితే అరెస్టులు చేస్తున్నారని దుయ్యబట్టారు. తమ హక్కుల కోసం ఉపాధ్యాయులు రోడ్డెక్కడం తప్పా ? అని చంద్రాబబు నిలదీశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుంచి జులై 8కి మార్చటాన్ని ఆయన తప్పుబట్టారు. పాఠశాలలు మూసివేయటం వంటి విధానాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని విమర్శించారు.నెల్లూరులో మంత్రి కాకాణి కేసుకు సంబంధించిన సాక్ష్యాలు దొంగిలించడబడటం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిందని చంద్రబాబు ఆక్షేపించారు. నేరస్థులకు కొత్త నేరాలు చేయడానికి వైకాపా ప్రభుత్వం మార్గాలు చూపిస్తోందని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసినప్పటికీ తాగునీటి కష్టాలు ఎదురవడానికి ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణమని ఆయన మండిపడ్డారు. కుటంబంతో కలిసి తిరుమల వెళ్తున్న భక్తుల కారును బలవంతంగా లాక్కోవటమే కాకుండా.. ఇప్పుడు ఆ కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం దారుణమని ఆక్షేపించారు. ఈ విషయంలో బాధిత కుటుంబానికి క్షమాపణ చెప్పాల్సింది పోయి.. నోటీసులతో వేధిస్తారా ? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది: Kishan reddy
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో 3 జిల్లాలను వెనుకబడ్డ జిల్లాలుగా కేంద్రం గుర్తించిందని తెలిపారు. భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆసిఫాబాద్ జిల్లాలను ఆస్పిరేషన్ జిల్లాలుగా గుర్తించామన్నారు. ఈ జిల్లాల్లో విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. ఆస్పిరేషన్ జిల్లాల్లో అభివృద్ధి పనులను కేంద్రం స్వయంగా పరిశీలిస్తోందన్నారు. ప్రపంచంలో కరోనా వారియర్స్‌ను గుర్తించిన ప్రభుత్వం బీజేపీ అని చెప్పుకొచ్చారు. త్వరలో 5-15 ఏళ్ల పిల్లలకు వాక్సిన్ అందిస్తామని వెల్లడించారు. కరోనా మళ్లీ విజృంభిస్తోందని, అందరూ విధిగా మాస్కులు ధరించాలని సూచించారు. కరోనా నాలుగవ దశ ప్రభావం లేకుండా కలిసికట్టుగా పోరాడుదామని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు

*నిరుద్యోగులు ఆనందంగా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పం: మంత్రి ఎర్రబెల్లి
నిరుద్యోగులు కూడా ఆనందంగా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… ఇప్పటికే ప్రభుత్వం వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించిందన్నారు. ప్రైవేటు కంపెనీలు ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వరంగల్ బిడ్డలు ఎలాంటి శ్రమకైనా వెనుకాడరని.. నిజాయితీగా పనిచేస్తారని.. ముక్కుసూటిగా మాట్లాడుతారని అన్నారు. ఎవరికైనా ఒకేసారి గుర్తింపు రాదని.. తమ వృత్తి నైపుణ్యాన్నీ బట్టి జీతాలు పెరుగుతాయని చెప్పారు. అధిక జీతాల కోసం అత్యాశపడి..అవకాశాలను వదులుకోవద్దని సూచించారు. అన్ని జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు

*నిరుద్యోగులు ఆనందంగా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పం: మంత్రి ఎర్రబెల్లి
నిరుద్యోగులు కూడా ఆనందంగా ఉండాలనేదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. సోమవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ… ఇప్పటికే ప్రభుత్వం వేలాది ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రకటించిందన్నారు. ప్రైవేటు కంపెనీలు ఇస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వరంగల్ బిడ్డలు ఎలాంటి శ్రమకైనా వెనుకాడరని.. నిజాయితీగా పనిచేస్తారని.. ముక్కుసూటిగా మాట్లాడుతారని అన్నారు. ఎవరికైనా ఒకేసారి గుర్తింపు రాదని.. తమ వృత్తి నైపుణ్యాన్నీ బట్టి జీతాలు పెరుగుతాయని చెప్పారు. అధిక జీతాల కోసం అత్యాశపడి..అవకాశాలను వదులుకోవద్దని సూచించారు. అన్ని జిల్లాల్లో మెగా జాబ్ మేళాలు నిర్వహిస్తామన్నారు. ప్రస్తుతం రైతులు, అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా ఉన్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్ రాజ్, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పాల్గొన్నారు

*మహిళా చైర్ పర్సన్‌గా ఉండి… మీరు చేస్తుంది ఇదేనా?: Bonda uma
రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ విరుచుకుపడ్డారు. వాసిరెడ్డి పద్మ తీరు హేయంగా ఉందన్నారు. ‘‘మహిళా చైర్ పర్సన్‌గా ఉండి… మీరు చేస్తుంది ఇదేనా’’ అని ప్రశ్నించారు. విజయవాడ అత్యాచార బాధితురాలికి అండగా నిలవడమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత బాధితురాలిని కలవడానికి వచ్చారన్నారు. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులకు స్పందించిందే లేదన్నారు. దీనిపైన తాము న్యాయ పోరాటానికి సిద్ధమని బోండా ఉమ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 30 గంటల పాటు ఒక మానసిక వికలాంగురాలిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఆయన విమర్శించారు. ఈ ఘటనను ప్రభుత్వం రాజకీయాలకు వాడుకొంటోందని ఆరోపించారు. తూ తూ మంత్రంగా మాత్రమే చర్యలు తీసుకున్నారన్నారు. బాధితురాలికి, ఆమె తల్లిదండ్రులకు తాము అండగా నిలిచామని తెలిపారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తే బాధితురాలి శీలాన్ని రూ.10 లక్షలకు వెలకట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలిచినందుకు తమపై కక్ష పూరిత చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు. సోమవారం విజయవాడ అత్యాచార బాధితురాలు, తల్లి దండ్రులతో కలిసి స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు బోండా ఉమ వినతి పత్రం అందజేశారు

*కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుంది: మల్లు రవి
తెలంగాణలో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేస్తుందని కాంగ్రెస్ నేత మల్లు రవి అన్నారు. పీకే విషయంలో సోనియా నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. టీఆర్‌ఎస్‌తో కలిసి పోటీ చేస్తామని బీజేపీ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ రహస్య ఒప్పందంతో పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.

*రాష్ట్రంలో నర్సుల కొరత: మంత్రి హరీశ్
రాష్ట్రంలో నర్సుల కొరత భారీగా ఉంది.. ఇతర ప్రాంతాల నుంచి నర్సులు ఎక్కువగా వస్తున్నారని మంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు.సోమవారం పట్టణంలోని పాత ఎంసీహెచ్ భవనంలో నర్సింగ్ కళాశాల తరగతులను మంత్రి హరీశ్ ప్రారంభించారు. జెడ్పీ చైర్ పర్సన్ రోజాశర్మ, అడిషనల్ కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, జిల్లా వైద్య శాఖ నోడల్ VH అధికారి డా. కాశీనాథ్, కళాశాల ప్రిన్సిపాల్ సునీతా‌రెడ్డి, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఉద్యోగ అవకాశాలు నూటికి నూరు శాతం కలిగిన కోర్సు నర్సింగ్ కోర్సు అని చెప్పారు.
నర్సింగ్ విద్యార్ధులకు డెడికేషన్, అంకితభావం ఉండాలని సూచించారు.రోగులకు నర్సుల ఆత్మీయ పలకరింపు సగం రోగాన్ని మాయం చేస్తుందన్నారు.కరోనా సమయంలో పేషేంట్ల వద్ద కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరూ లేరు.. వారివద్ద ఉన్నది స్టాఫ్ నర్సులు, ఆస్పత్రి సిబ్బంది మాత్రమేనని చెప్పారు. సిద్దిపేట ప్రజలకు ఒక వైపు విద్య, మరోవైపు కేరింగ్ అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. తెలంగాణలో ఒకప్పుడు కేవలం 5 మెడికల్ కాలేజీలుంటే, ఇప్పుడు రాష్ట్రానికి 33 మెడికల్ కాలేజీలు వచ్చాయన్నారు.డాక్టర్లలో స్పెషలైజ్ ఉన్నట్లే స్టాఫ్ నర్సు ల్లోనూ స్పెషలైజ్ ఉంటది.. ఎక్కడికెళ్లినా అదే విభాగంలో పనిచేస్తారని చెప్పారు.బాగా చదువుకోవడమే కాదు, సేవాభావాన్ని అలవర్చుకోవాలి.. పోటీ పడి సేవ చేయాలని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

*ప్రభుత్వ ఆలోచనలేంటో మాకు తెలియదు: బొప్పరాజు
మూడేళ్లలో సీపీఎస్ రద్దుపై ప్రభుత్వం ఎలాంటి చర్చలు జరపలేదని ఏపీ ఉద్యోగుల జేఏసీ చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగ సంఘాలతో చర్చలు ఎవరు జరుపుతారో స్పష్టత లేదన్నారు. అలాగే సీపీఎస్ రద్దు మినహా ప్రత్యామ్నాయం లేదన్నారు. సీపీఎస్ రద్దు అంటే ఆర్ధిక భారమని ప్రభుత్వమనడం సరికాదని చెప్పారు. సీపీఎస్ అంశంలో ప్రభుత్వ ఆలోచనలేంటో తమకు తెలీదన్నారు.

*జగన్‌ ప్రభుత్వం అసమర్థతతో పోలవరాన్ని బలి చేసింది: చంద్రబాబు
జగన్‌ ప్రభుత్వం తన అసమర్థతతో పోలవరాన్ని బలి చేసిందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింటే మూడేళ్లపాటు ప్రభుత్వం ఎందుకు దాచిందని ప్రశ్నించారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుపట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు. డయాఫ్రమ్‌ వాల్‌ ఎలా కూలిందో చెప్పకుండా.. మాపై ఆరోపణలు చేయొద్దన్నారు.సీపీఎస్‌ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందని అన్నారు. హక్కుల కోసం పోరాటలు చేస్తే అరెస్ట్‌ చేస్తారా? అని ప్రశ్నించారు. విద్యా సంవత్సరాన్ని జూన్‌ 12 నుంచి జులై 8కి మార్చడమేంటి?అని నిలదీశారుప్రభుత్వ వైఫల్యాల వల్లే ఏపీలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని చంద్రబాబు అన్నారు.

*మహిళా చైర్ పర్సన్‌గా ఉండి… మీరు చేస్తుంది ఇదేనా?: Bonda uma
రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ విరుచుకుపడ్డారు. వాసిరెడ్డి పద్మ తీరు హేయంగా ఉందన్నారు. ‘‘మహిళా చైర్ పర్సన్‌గా ఉండి… మీరు చేస్తుంది ఇదేనా’’ అని ప్రశ్నించారు. విజయవాడ అత్యాచార బాధితురాలికి అండగా నిలవడమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత బాధితురాలిని కలవడానికి వచ్చారన్నారు. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులకు స్పందించిందే లేదన్నారు. దీనిపైన తాము న్యాయ పోరాటానికి సిద్ధమని బోండా ఉమ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 30 గంటల పాటు ఒక మానసిక వికలాంగురాలిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఆయన విమర్శించారు. ఈ ఘటనను ప్రభుత్వం రాజకీయాలకు వాడుకొంటోందని ఆరోపించారు. తూ తూ మంత్రంగా మాత్రమే చర్యలు తీసుకున్నారన్నారు. బాధితురాలికి, ఆమె తల్లిదండ్రులకు తాము అండగా నిలిచామని తెలిపారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తే బాధితురాలి శీలాన్ని రూ.10 లక్షలకు వెలకట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలిచినందుకు తమపై కక్ష పూరిత చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు. సోమవారం విజయవాడ అత్యాచార బాధితురాలు, తల్లి దండ్రులతో కలిసి స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు బోండా ఉమ వినతి పత్రం అందజేశారు.

*మహిళా చైర్ పర్సన్‌గా ఉండి… మీరు చేస్తుంది ఇదేనా?: Bonda uma
రాష్ట్ర మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మపై టీడీపీ నేత బోండా ఉమ విరుచుకుపడ్డారు. వాసిరెడ్డి పద్మ తీరు హేయంగా ఉందన్నారు. ‘‘మహిళా చైర్ పర్సన్‌గా ఉండి… మీరు చేస్తుంది ఇదేనా’’ అని ప్రశ్నించారు. విజయవాడ అత్యాచార బాధితురాలికి అండగా నిలవడమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు. ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత బాధితురాలిని కలవడానికి వచ్చారన్నారు. వాసిరెడ్డి పద్మ ఇచ్చిన నోటీసులకు స్పందించిందే లేదన్నారు. దీనిపైన తాము న్యాయ పోరాటానికి సిద్ధమని బోండా ఉమ స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 30 గంటల పాటు ఒక మానసిక వికలాంగురాలిని ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని ఆయన విమర్శించారు. ఈ ఘటనను ప్రభుత్వం రాజకీయాలకు వాడుకొంటోందని ఆరోపించారు. తూ తూ మంత్రంగా మాత్రమే చర్యలు తీసుకున్నారన్నారు. బాధితురాలికి, ఆమె తల్లిదండ్రులకు తాము అండగా నిలిచామని తెలిపారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకువస్తే బాధితురాలి శీలాన్ని రూ.10 లక్షలకు వెలకట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని మండిపడ్డారు. బాధితుల పక్షాన నిలిచినందుకు తమపై కక్ష పూరిత చర్యలకు పూనుకుంటున్నారని అన్నారు. సోమవారం విజయవాడ అత్యాచార బాధితురాలు, తల్లి దండ్రులతో కలిసి స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు బోండా ఉమ వినతి పత్రం అందజేశారు.

*సింగరేణి అభివృద్ధికి కలిసి రావాలి: ఈటల రాజేందర్
సంఘాలు ఏవైనా సింగరేణి అభివృద్ధికి కలిసి రావాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సింగరేణి ప్రైవేటీకరణ పేరుతో కేంద్రంపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఓపెన్ కాస్ట్ గనుల్లో 70 శాతం మించి ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పిన కేసిఆర్, ఇప్పుడు 86 శాతం ప్రైవేటీకరణ చేస్తున్న ఘనుడు కేసిఆర్ అని విమర్శించారు. 2018 ఎన్నికల తర్వాత కేసిఆర్ నైజమెందో ప్రజలకు అర్ధమైందన్నారు. ఇలాంటి నాయకున్నా మేము ఎన్నుకున్నది అంటూ సిగ్గు పడుతున్నారని మండిపడ్డారు. తనలాంటి ఉద్యమ బిడ్డ గొంతు పిసకాలని చూసాడు కేసిఆర్ అని ఆవేదన వ్యక్తం చేశారు. 63 వేల నుంచి 43 వేలకు కార్మికుల సంఖ్య పడిపోయింది దీనికి ప్రధా కారణం సీఎం కేసిఆర్ అని స్పష్టం చేశారు. సింగరేణి అభివృద్ధిపై ఒక్కసారి కూడా కేసిఆర్ బొగ్గు శాఖ మంత్రిని కలవలేదన్నారు. ప్రైవేట్ కంట్రాక్టర్లకు సింగరేణిని అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

*సీఎం కేసీఆర్ వైఖరి వల్లే రైతులు నష్టపోతున్నారు: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
తుల్లో భరోసా కల్పించేందుకు రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. తెలంగాణలో రైతులకు పూర్తిస్థాయిలో రుణమాఫీ కాలేదని, సీఎం కేసీఆర్ వైఖరి వల్లే రైతులు నష్టపోతున్నారని ఉత్తమ్ ఆరోపించారు. రైతులకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు.

*ఎవరో వచ్చి జిల్లాల్లో పర్యటించాల్సిన అవసరం లేదు: ఎంపీ కోమటిరెడ్డి
పీకే చేరికపై, పొత్తులపై హైకమాండ్‌దే తుది నిర్ణయమని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‌తో కలిసి పనిచేసే అవకాశం లేదని, రాహుల్‌గాంధీ సభపైనే దృష్టిపెట్టామని ఆయన తెలిపారు. జిల్లాల వారీగా బలమైన నేతలున్నారని, వారే జనసమీకరణ చేస్తారని.. సన్నాహక భేటీలు ఏర్పాటు చేస్తారని చెప్పారు. అంతా మేమే చేస్తామంటే కుదరదని, ఎవరో వచ్చి జిల్లాల్లో పర్యటించాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి స్పష్టం చేశారు.

*ఒక్కటి తప్పుగా ఉన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటా: పల్లా రాజేశ్వర్‌
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు తగ్గాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ అన్నారు. రేవంత్‌రెడ్డి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని, ప్రభుత్వంపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో మెడికల్‌ సీట్లను బ్లాక్‌ చేయడం లేదని, గవర్నర్‌కు రేవంత్‌రెడ్డి లేఖ రాయడం అర్థరహితమని ఎమ్మెల్సీ పల్లా అన్నారు. మెడికల్‌ సీట్ల విషయంలో అక్రమాలకు చెక్‌పెట్టేలా ఫిర్యాదు చేశామని, ఈ వ్యవహారంలో మంత్రులు, తన ప్రమేయం ఉంటే కాలేజీని ప్రభుత్వానికి అప్పగిస్తామని ప్రకటించామని ఎమ్మెల్సీ పల్లా పేర్కొన్నారు. రేవంత్‌రెడ్డి ఏ సంస్థతోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చని,తాను ఇచ్చిన డాక్యుమెంట్స్‌లో ఒక్కటి తప్పుగా ఉన్నా రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ స్పష్టం చేశారు.

*గడీల రాజ్యం పోవాలి….గరీబోళ్ల ప్రభుత్వం రావాలి: బండి సంజయ్
తెలంగాణలో గడీల రాజ్యం పోయి గరీబోళ్ల రాజ్యం రావాలని రాష్ట్ర బిజెపి ప్రెసిడెంట్ బండి సంజయ్ అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా నర్వమండల కేంద్రంలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన మాట్లాడారు.నర్వ మండలంలో మూడు రిజర్వాయర్లున్నయ్. కానీ నీళ్లు మాత్రం రావడం లేదని అన్నారు. గజ్వేల్ లో కేసీఆర్ ఫాంహౌజ్ కు నీళ్లు తెచ్చుకోవడానికి లక్షా 20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి గోదావరి నుండి నీళ్లు తెచ్చుకుండు. ఇక్కడ 3, 4 వందల కోట్లు ఖర్చు చేస్తే ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకురావొచ్చు. కానీ కేసీఆర్ కు ఇక్కడి ప్రజలకు నీళ్లించేందుకు మనసు రాదని అన్నారు.కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ తో మాట్లాడి ఆర్డీఎస్ సమస్యకు పరిష్కారం చూపినం. రాష్ట్రం సహకరిస్తే 6 నెలలో నీళ్లు తీసుకురావొచ్చని అన్నారు. కేంద్రం నిధులిస్తే కేసీఆర్ దారి మళ్లించిండు.

*పల్లెల్లో ప్రగతి కోసం కృషి: ఎర్రబెల్లి
తెలంగాణలోని పల్లెల్లో అన్నివిధాలా ప్రగతి సాధించేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగారెడ్డి జడ్పీ భవనంలోని సమావేశమందిరంలో ఆదివారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇటీవల జాతీయస్థాయి అవార్డు దక్కించుకున్న సిరిసిల్ల జిల్లా పరిషత్‌, 4 మండల పరిషత్‌లకు చెందిన ప్రజాప్రతినిధులు, 11 గ్రామాలకు చెందిన సర్పంచులను మంత్రి సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అవార్డులు దక్కించుకున్న ప్రజాప్రతినిధులు మంత్రి ఎర్రబెల్లితో కలిసి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వారిని అభినందించిన కేటీఆర్‌.. గ్రామీణ వ్యవస్థను పటిష్ఠంగా తీర్చిదిద్దేందుకు మరింత కృషి చేయాలన్నారు.

*ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు: నాగబాబు
వైసీపీ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే జనసేన కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని నాగబాబు తెలిపారు. రాజమండ్రిలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయనను ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన లీగల్ సెల్ సభ్యులు కలిశారు. ఆయా జిల్లాల్లో జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులను నాగబాబుకు వివరించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ జన సైనికులు, మహిళలపై పోలీసులను ఉపయోగించి వైసీపీ నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. సామాజిక బాధ్యతతో ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తుంటే వారిపై దాడులకు తెగబడుతున్నారని, సంబంధం లేని కేసులు పెట్టించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసైనికులకు, వీర మహిళలకు న్యాయపరమైన అంశాల్లో జనసేన పార్టీ లీగల్ సెల్ సభ్యులు చేయూతనివ్వాలని కోరారు. పవన్ కల్యాణ్ భావజాలానికి అనుగుణంగా పని చేస్తున్న జన సైనికులను, వీర మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత పార్టీపై ఉందని నాగబాబు తెలిపారు.

*ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌, మాజీ మంత్రి నాగేశ్వరరావుతో లగడపాటి భేటీ
నందిగామలో రాజకీయ వేడెక్కింది. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ సమావేశమయ్యారు. అనంతరం మాజీమంత్రి వసంత నాగేశ్వరరావు ఇంటికెళ్లిన లగడపాటి వసంత నాగేశ్వరరావుతో 15 నిమిషాలపాటు సమావేశమై పలు అంశాలపై చర్చించారు. లగడపాటి రాజగోపాల్‌ భేటీలపై రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ భేటీల్లో ఎలాంటి రాజకీయ కోణం లేదని రాజగోపాల్‌ చెబుతున్నారు. మర్యాద పూర్వకంగానే నేతలను కలిశానని లగడపాటి తెలిపారు.

*నోటీసులు ఇచ్చే హక్కు మహిళా కమిషన్‌కు లేదు: వర్ల రామయ్య
మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తన పరిధులు దాటి వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుకు, బోండా ఉమాకు నోటీసులు ఇచ్చే హక్కు మహిళా కమిషన్‌కు లేదన్నారు. మహిళా కమిషన్‌కు ఏదైనా అవమానం జరిగితే సంబంధిత పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని, ఆ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తారని… అంతేకానీ ఆమే ఫిర్యాదు చేసి, ఆమే నోటీసులిచ్చి, ఆమే విచారణ జరిపి, ఆమే శిక్ష వేయటం న్యాయసమ్మతం కాదన్నారు.ప్రభుత్వ ఆసుపత్రి వద్ద శాంతిభద్రతలకు విఘాతం కలిగించడానికే వాసిరెడ్డి పద్మ అక్కడికి వచ్చారని వర్ల రామయ్య ఆరోపించారు. బాధితులను పరామర్శించి వెళ్లిపోకుండా, చంద్రబాబు వచ్చేంత వరకు ఉండి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని విమర్శించారు. ఆమె పరామర్శకు రాలేదని, పొలిటికల్ సీన్ క్రియేట్ చేయడాకే వచ్చారని అన్నారు. చంద్రబాబుతో అతిగా ప్రవర్తించి అక్కడున్న మహిళా నాయకురాళ్లను చేయెత్తి కొట్టబోయిన కమిషన్ ఛైర్ పర్సన్‌దే తప్పని, ఆమెపై ఫిర్యాదు చేద్దామంటే పెద్దమనసుతో చంద్రబాబు వద్దన్నారన్నారు. అమాయకత్వం, అవగాహనా రాహిత్యం, చట్టాలపట్ల అవగాహనా లేమితో ఆమె ఇచ్చిన నోటీసులు వెనక్కి తీసుకోవాలని వర్ల రామయ్య సూచించారు. జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించలేకపోతోందని మండిపడ్డారు. నిర్లక్ష్యం వహించిన ఎస్ఐని, సీఐని సస్పెండ్ చేయడంకాదని, ఈ ప్రభుత్వాన్ని ప్రజలు సస్పెండ్ చేయాలని వర్ల రామయ్య పిలుపు ఇచ్చారు.

*రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన జరగడం లేదు: రామకృష్ణ
రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన జరగడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఓ ప్రకటనలో అన్నారు. జగన్ ప్రభుత్వం చట్ట సభలను, కోర్టులను సైతం ఖాతర్ చేయడం లేదన్నారు. ఆర్టీసీ, విద్యుత్ చార్జీలు ఇంత భారీ స్ధాయిలో ఏ ప్రభుత్వం పెంచిన దాఖలాలు లేవని గుర్తు చేశారు. అదానీ ఇచ్చే కమీషన్‎ కోసం లాలూచీపడి విద్యుత్ యూనిట్‎పై 50 పైసలు అదనంగా ఇచ్చి కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. విపక్షాలు, మేధావులు, ప్రజా సంఘాలతో కలిసి సమిష్టిగా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని రామకృష్ణ పేర్కొన్నారు.

*పోలవరం’ ఏపీకి వరం: తులసిరెడ్డిt
‘‘పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌కు ప్రకృతి ప్రసాదించిన వరం. ఇది కాంగ్రెస్‌ పార్టీ మానస పుత్రిక. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ, వైసీపీల అసమర్థత, అవినీతి వల్ల శాపంగా పరిణమించింది’’ అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. పోలవరం ప్రాజెక్టుకు బీజేపీ శనిగ్రహంలా, టీడీపీ, వైసీపీలు రాహకేతువులుగా దాపురించాయన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని తులసిరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.

*త్వరలో 5-12 ఏళ్లలోపు వారికి వ్యాక్సిన్‌ : కిషన్‌ రెడ్డి
త్వరలో 5 నుంచి 12 ఏళ్లలోపు పిల్లలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. వ్యాక్సిన్‌ ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభించినట్లు వెల్లడించారు. దేశంలో కరోనా తగ్గుముఖం పట్టినా.. కొన్ని దేశాల్లో కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలన్నారు. ఆదివారం నల్లగుట్ట చుట్టాలబస్తీలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అడ్డగుట్టలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈసందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. కరోనా నాలుగో వేవ్‌ రాబోతుందనే చర్చ జరుగుతున్న నేపఽథ్యంలో తరుణంలో ప్రజలు అప్రమత్తతతో వ్యవహరించాలని, అర్హులైన వారు టీకా బూస్టర్‌ డోసును తీసుకోవాలని కోరారు.

*చంద్రబాబు, పవన్‌కు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు: మంత్రి అమర్నాథ్‌
చంద్రబాబు, పవన్‌కు రైతుల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని, చంద్రబాబు దత్తపుత్రుడు పవన్‌ అని మంత్రి గుడివాడ అమర్నాథ్‌ విమర్శించారు. చంద్రబాబు హయాంలోనే రైతులు అనేక కష్టాలుపడ్డారని, ఈ విషయాన్ని పవన్ తెలుసుకొని మాట్లాడాలని మంత్రి అమర్నాథ్‌ ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నారని, చంద్రబాబు చేత, చంద్రబాబు కోసం పుట్టిన పార్టీ జనసేన అని అమర్నాథ్‌ మండిపడ్డారు. వైసీపీకి ఎవరితో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదని మంత్రి స్పష్టం చేశారు.

*విద్యావ్యవస్థ అంటేనే జగన్‌కు వ్యతిరేక భావం: జవహర్ము
ఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేసవి సెలవులను కూడ పగ, ప్రతీకారం తీర్చుకునే సాధనంగా వాడుకుంటున్నారని టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పీఆర్సీ సమయంలో ఉపాధ్యాయులు చేసిన ధర్నాకు ప్రతీకారంగానే మే నెలలో బడులు నిర్వహిస్తున్నారని విమర్శించారు. విద్యావ్యవస్థ అంటేనే జగన్‌కు వ్యతిరేక భావం ఉందన్నారు. ఓ ప్రక్క నూతన విద్యా విధానం పేరుతో గందర గోళం సృష్టిస్తున్నారని, ఆంగ్ల మాధ్యమం పేరుతో కొంత కాలం అన్చితి నెలకొందన్నారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌కు మంగళం పాడుతున్నారన్నారు. పీఎఫ్ ఖాతాలో సొమ్ము ప్రభుత్వం ఖాళీ చేసిందని ఆరోపించారు. వారంలో రద్దన్న సీపీయస్ అతి గతి లేదన్నారు. నాడు, నేడుతో కరోనాకు ఉపాధ్యాయులు బలైపోయారన్నారు. అమ్మ ఒడిపై ఆంక్ష ఎందుకో సీఎం జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన ప్రతీకారాన్ని ఉపాధ్యాయులపై చూపడం సరికాదని జవహర్ వ్యాఖ్యానించారు.

*రాహుల్ రాష్ట్ర పర్యటన ఎందుకంటే…: ఉత్తమ్
రైతుల సమస్యలను సీఎం కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. రైతులకు భరోసా కల్పించేందుకే రాహుల్ గాంధీ రాష్ట్రంలో పర్యటించనున్నారని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణలో రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు. రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదన్నారు. సీఎం కేసీఆర్ వైఖరి వల్లే రైతులు నష్టపోతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు సీఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

*రాహుల్‌ సభను విజయవంతం చేయాలి: భట్టి
వరంగల్‌లో రాహుల్‌ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ప్రజలు, రైతులు రాహుల్ సభకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్‌ హయాంలో ఇచ్చిన భూములను ప్రభుత్వం ప్లాటింగ్ చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్‌ అమలు చేసిన సబ్సిడీ పథకాలను కేసీఆర్‌ నిలిపేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు.

*పరిధి దాటుతున్న మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌: వర్ల
మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తన పరిధులు దాటి వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. చంద్రబాబు, బొండ ఉమాకు నోటీసులిచ్చే హక్కు మహిళా కమిషన్‌కు లేదని, చట్టాలు తెలుసుకుని వ్యవహరించాలని హెచ్చరించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించి వెళ్లిపోకుండా, చంద్రబాబు వచ్చేంత వరకు ఉండి, పొలిటికల్‌ సీన్‌ క్రియేట్‌ చేయడానికే ఆమె వచ్చారని ఆరోపించారు. అయినా ఆ సమయంలో కమిషన్‌కు అవమానం జరిగితే పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేయాలే తప్ప, చైర్‌పర్సనే నోటీసులిచ్చి, నేరుగా విచారణ చేసి, శిక్షలు వేయాలని చూడటం న్యాయసమ్మతం కాదని స్పష్టం చేశారు. చంద్రబాబుపై అతిగా ప్రవర్తించిన మహిళా కమిషన్‌పై ఫిర్యాదు చేద్దామన్నామని, అయితే ఆయన పెద్ద మనసుతో వద్దన్నారని చెప్పారు. చట్టాలపై అవగాహన లేకుండా కమిషన్‌ ఇచ్చిన నోటీసులను వెంటనే ఉపసంహరించుకోవాలని వర్ల డిమాండ్‌ చేశారు.