Food

కోకమ్ .. జీర్ణ శక్తి కోసం .. !

కోకమ్ .. జీర్ణ శక్తి కోసం .. !

తీపీపులుపు కలగలిసిన రుచిలో ఎర్రని పండ్లతో ఉండే ఈ చెట్లు కొంకణ్ తీరంలోనే ఎక్కువగా పెరుగుతాయి . ఆయుర్వేదంలో ఈ చెట్టునే వృక్షామ్లు అంటారు . యాంటీ ఆక్సిడెంట్ల శాతం ఎక్కువగా ఉండే ఈ పండ్లు అద్భుతమైన ఔషధాలు . అందుకే స్థానికులు జీర్ణశక్తి కోసం ఈ పండ్లను ఎండబెట్టి చింతపండులా వాడుతూ రసం , పప్పూ చేస్తుంటారు . ఇందులోని హైడ్రాక్సీ సిట్రిక్ ఆమ్లం జీవక్రియని పెంచడంతోపాటు పిండిపదార్థాలు కొవ్వుగా మారే శాతాన్ని తగ్గిస్తుంది . జ్వరాలకూ అలర్జీలకీ కూడా ఇది మందులా పనిచేస్తుంది . వేసవిలో కోకమ్తో చేసే షర్బత్ వడదెబ్బ తగలకుండా చేస్తుంది . పొక్కులూ మొటిమలమీద ఈ పండ్ల రసాన్ని నేరుగా రాసినా ఫలితం ఉంటుంది . ఒక్క వేసవి అనే కాదు , ఈ షర్బత్ లేదా జ్యూన్ని అన్ని కాలాల్లోనూ పరగడుపునే తాగితే మంచిదట . దీనివల్ల పొట్ట నిండినట్లుగా అయి , ఆకలి వేయదు . హృద్రోగ సమస్యలతోనూ క్యాన్సర్లతోనూ . పోరాడే గుణాలు ఉన్న ఈ పండ్ల షర్బత్ – అజీర్తినీ ఆందోళననీ డిప్రెషన్నీ కూడా తగ్గిస్తుంది . ఇందులోని గార్సినాల్ అనే ఎంజైమ్ అల్సర్లకు మంచి మందు . అందుకే సీజన్లో వచ్చే ఈ పండ్లతో షర్బల్నీ సిరపీ ల్నీ తయారుచేసి నిల్వచేస్తారు .