Business

అమెరికా మార్కెట్‌ నుంచి సన్‌ ఫార్మా ఉత్పత్తుల రీకాల్‌ – TNI వాణిజ్య వార్తలు

అమెరికా మార్కెట్‌ నుంచి సన్‌ ఫార్మా ఉత్పత్తుల రీకాల్‌   – TNI వాణిజ్య వార్తలు

* పలు కారణాలతో అమెరికా మార్కెట్‌ నుంచి సన్‌ ఫార్మా, అరబిందో ఫార్మా, జూబిలెంట్‌ సంస్థలు వివిధ ఉత్పత్తులను రీకాల్‌ చేస్తున్నట్లు అమెరికా ఆహార, ఔషధ రంగ నియంత్రణ సంస్థ యూఎస్‌ఎఫ్‌డీఏ ఒక నివేదికలో పేర్కొంది. విటమిన్‌ బీ12 లోపం చికిత్సలో ఉపయోగించే సైనాకోబాలమిన్‌ ఇంజెక్షన్‌కు సంబంధించి 4.33 లక్షల వయాల్స్‌ను అరబిందో ఫార్మా రీకాల్‌ చేస్తోంది. ఏప్రిల్‌ 5న ఈ ప్రక్రియ ప్రారంభించింది. మరోవైపు, కళ్లలో సహజసిద్ధంగా నీటి ఉత్పత్తిని చేసేందుకు తోడ్పడే ’సెక్వా’ ఔషధాన్ని సన్‌ ఫార్మా వెనక్కి రప్పిస్తోంది. ఏప్రిల్‌ 1న ఈ ప్రక్రియ ప్రారంభించింది. అటు జూబిలెంట్‌ క్యాడిస్టా ఫార్మా .. మిథైల్‌ప్రెడ్నిసొలోన్‌ ట్యాబ్లెట్లకు సంబంధించి 19,222 బాటిల్స్‌ను రీకాల్‌ చేస్తోంది.
*సాంకేతిక కారణాల వల్ల 2 నెలలుగా నిలిచిపోయిన ఎయిరిండియా ఉదయం విమాన సర్వీస్‌ను మే 3వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ విమాన సర్వీస్‌కు సంబంధించి టికెట్ల బుకింగ్‌ను కూడా ఆ సంస్థ ప్రారంభించింది. ఈ విమానం ప్రతి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఢిల్లీ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి 8.35 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 9.15 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు ఢిల్లీ చేరుతుంది. జూన్‌ నుంచి ఈ సర్వీస్‌ను వారానికి 7 రోజుల పాటు నడపనున్నారు.ప్రయాణికుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉండే న్యూఢిల్లీ–విజయవాడ మధ్య గతంలో రోజుకు 3 విమాన సర్వీస్‌లు నడిచేవి. కోవిడ్‌ ప్రభావం వల్ల సాయంత్రం విమాన సర్వీస్‌ను పూర్తిగా రద్దు చేశారు. 2 నెలలు క్రితం ఉదయం సర్వీస్‌ నిలిచిపోగా, ప్రస్తుతం రాత్రి సర్వీస్‌ మాత్రమే నడుస్తోంది. దీనివల్ల టికెట్ల రేట్లు గణనీయంగా పెరగడంతో పాటు ఇక్కడి నుంచి ఢిల్లీ మీదుగా విదేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎయిరిండియా సంస్థ ఉదయం సర్వీస్‌ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది
*భారత్‌ రత్నాలు, ఆభరణాల ఎగుమతులు మార్చితో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2021–22) భారీగా 56 శాతం పురోగమించాయి. విలువలో ఈ పరిమాణం 39 బిలియన్‌ డాలర్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 25.40 బిలియన్‌ డాలర్లు.
*దేశంలో వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ ప్రారంభమైంది. భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), యాక్సిస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌తో ఇందుకు నాంది పలికాయి. అదనపు నిధుల సమీకరణ వ్యయం ఆధారంగా వడ్డీ రేటు నిర్ణయించే ఎంసీఎల్‌ఆర్‌ రుణాల వడ్డీ రేట్లను బ్యాంకులు స్వల్పంగా 0.05 నుంచి 0.10 శాతం మేర పెంచాయి. దీంతో ఏడాది కాలపరిమితి ఉండే ఎస్‌బీఐ ఎంసీఎల్‌ఆర్‌ రుణాలపై వడ్డీ రేటు 7 శాతం నుంచి 7.10 శాతానికి చేరింది. ఈ నెల 15 నుంచే ఈ పెంపు అమల్లోకి వచ్చినట్టు ఎస్‌బీఐ తెలిపింది.
*మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ హార్టికల్చర్‌లో యంత్రీకరణను పెంచడానికి ‘కోడ్‌’ పేరుతో ట్రాక్టర్‌ తరహా కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హార్టికల్చర్‌ రంగంలో వివిధ రకాల పనులకు ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్‌ చేశామని స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ సీఈఓ హరీష్‌ చవాన్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఉత్పత్తిలో హార్టికల్చర్‌ ఉత్పత్తి 30 శాతం ఉంటే సాగు చేసే భూమిలో 17 శాతమే హార్టికల్చర్‌ ఉత్పత్తులను పండిస్తున్నారు.
*నిఫ్టీ గత వారం బేరి్‌షగా ప్రారంభమై కీలక స్థాయి 17000 కన్నా దిగజారినా స్వల్ప రికవరీ సాధించి ఆ స్థాయిల్లో నిలదొక్కుకోలేక చివరికి నష్టాలతోనే ముగిసింది. 17000 వద్ద బౌన్స్‌బ్యాక్‌ అయి నా బలంగా నిలవలేకపోవడం వల్ల సానుకూల సంకేతం ఏదీ ఇవ్వలేకపోయింది. గత వారం అమెరికన్‌ మార్కెట్‌ భారీ నష్టాల్లో ముగియడం వల్ల దాని ప్రభావం ఈ వారం మార్కెట్‌పై ఉండవచ్చు.
*దేశీయ స్టాక్‌ మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో సంస్థల (ఎఫ్‌పీఐ) అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. ఈ నెలలో ఇప్పటివరకు ఎఫ్‌పీఐలు రూ.12,300 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి. అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడ్‌ రిజర్వ్‌ దూకుడుగా వడ్డీ రేట్లు పెంచబోతోందన్న భయాలు ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీనికి తోడు ఆగని రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం, చమురు సెగ, ద్రవ్యోల్బణ భయా లు, ఆకర్షణీయంగా లేని కంపెనీల మార్చి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఆశించి రీతిలో లేకపోవడమూ ఎఫ్‌పీఐలను నిరాశ పరుస్తోంది.
*సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంక చేస్తోన్న యత్నలకు మద్దతు ఇస్తామని ఐఐఎంఎఫ్ పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించే యత్నాల నేపథ్యంలో… అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్య నిధి ఈ హామీనిచ్చింది. అంతేకాకుండా… ఆ దేశ ఆర్థిక మంత్రి అలీ సబ్రీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ప్రారంభ చర్చలు ‘ఫలవంతమయ్యాయి’ అని పేర్కొంది. అప్పట్లో… అంటే 1948 లో బ్రిటన్ నుండి స్వాతంత్ర్యం పొందినప్పటి నుండి కూడా శ్రీలంక ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. విదేశీ కరెన్సీ లేకపోవడం కూడా ఈ సంక్షోభం ఏర్పడడానికి కొంతవరకు కారణమని చెబుతున్నారు.

*ఆర్‌బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్… ‘యాంటీ మైనారిటీ’ చిత్రం భారతీయ ఉత్పత్తుల మార్కెట్‌ను దెబ్బతీస్తుందని, ఫలితంగా విదేశీ ప్రభుత్వాలు భారత్‌ను నమ్మదగని భాగస్వామిగా భావిస్తున్నాయని పేర్కొన్నారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘మన పౌరులను గౌరవప్రదంగా చూసే ప్రజాస్వామ్యంగా మనం కనిపిస్తే… మనం మరింత సానుభూతితో ఉంటాము(వినియోగదారులు అంటున్నారు). ‘నేను సరైన పని చేయడానికి ప్రయత్నిస్తున్న ఈ దేశం నుండి ఈ వస్తువులను కొనుగోలు చేస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు.
*మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్‌తో దాతృత్వ చర్చలను టెస్లా కార్ల కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ తిరస్కరించాడు. ఇందుకు సంబంధించి… ఎలాన్ మస్క్, బిల్‌గేట్స్ మధ్య జరిగిన చాట్ సోషల్ మీడియాలో బయటపడింది. గేట్స్ మస్క్‌తో దాతృత్వ అవకాశాల విషయమై చర్చించాలనుకుంటున్నట్లు చెప్పగా, ఆయన అభ్యర్థనను మస్క్ తిరస్కరించాడు. ఇదిలా ఉండగా… ఇందుకు సంబంధించిన చాట్‌లను తాను లీక్ చేయలేదని, టెస్లాకు వ్యతిరేకంగా గేట్స్ హాఫ్-బిలియన్ షార్ట్ పొజిషన్‌ను కలిగి ఉన్నారనేది అత్యంత రహస్యమేమీ కాదని మస్క్ ట్వీట్ చేశాడు.
*సాంకేతిక కారణాల వల్ల 2 నెలలుగా నిలిచిపోయిన ఎయిరిండియా ఉదయం విమాన సర్వీస్‌ను మే 3వ తేదీ నుంచి పునరుద్ధరించనున్నారు. ఈ విమాన సర్వీస్‌కు సంబంధించి టికెట్ల బుకింగ్‌ను కూడా ఆ సంస్థ ప్రారంభించింది. ఈ విమానం ప్రతి మంగళ, బుధ, గురు, శుక్రవారాల్లో ఢిల్లీ నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి 8.35 గంటలకు గన్నవరం చేరుకుంటుంది. తిరిగి 9.15 గంటలకు ఇక్కడి నుంచి బయలుదేరి 11.30 గంటలకు ఢిల్లీ చేరుతుంది. జూన్‌ నుంచి ఈ సర్వీస్‌ను వారానికి 7 రోజుల పాటు నడపనున్నారు.ప్రయాణికుల రద్దీ అత్యంత ఎక్కువగా ఉండే న్యూఢిల్లీ–విజయవాడ మధ్య గతంలో రోజుకు 3 విమాన సర్వీస్‌లు నడిచేవి. కోవిడ్‌ ప్రభావం వల్ల సాయంత్రం విమాన సర్వీస్‌ను పూర్తిగా రద్దు చేశారు. 2 నెలలు క్రితం ఉదయం సర్వీస్‌ నిలిచిపోగా, ప్రస్తుతం రాత్రి సర్వీస్‌ మాత్రమే నడుస్తోంది. దీనివల్ల టికెట్ల రేట్లు గణనీయంగా పెరగడంతో పాటు ఇక్కడి నుంచి ఢిల్లీ మీదుగా విదేశాలకు రాకపోకలు సాగించే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయమై మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి పౌర విమానయాన శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎయిరిండియా సంస్థ ఉదయం సర్వీస్‌ను పునరుద్ధరిస్తూ నిర్ణయం తీసుకుంది
*ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోల్‌కత్తా నైట్ రైడర్స్‌పై 8 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుగు బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్దేశించిన 156 పరుగుల లక్ష్యాన్ని కోల్‌కత్తా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ చేధించలేపోయారు. లక్ష్య చేధనకు దిగిన కోల్‌కతా బ్యాట్స్‌మెన్లలో సామ్ బిల్లింగ్స్(4), సునీల్ నరైన్(5), శ్రేయస్ అయ్యర్(12), నితీష్ రానా(2), రింకు సింగ్(35), వెంకటేష్ అయ్యర్(17), ఆండ్ర్యూ రస్సెల్(48), శివమ్ మావీ(2), ఉమేష్ యాదవ్(15 నాటౌట్), టిమ్ సౌతీ(1, నాటౌట్) పరుగులు చేశారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మొహమ్మద్ షమీ 2, యస్ దయాల్ 2, అల్జారీ జోసెఫ్ 1, లాకీ ఫెర్గూసన్ 1, రషీద్ ఖాన్ 2 చొప్పున వికెట్లు తీశారు.