DailyDose

శంషాబాద్‌ విమానాశ్రయంలో కొకైన్‌ పట్టివేత- TNI నేర వార్తలు

శంషాబాద్‌ విమానాశ్రయంలో కొకైన్‌ పట్టివేత- TNI  నేర వార్తలు

* శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా మాదకద్రవ్యాలు పట్టివేతరూ.11.57 కోట్లు విలువైన 1,157 గ్రాముల కొకైన్‌ పట్టివేతటాంజానియా దేశస్థుడి నుంచి మాదకద్రవ్యాలు స్వాధీనంఈ నెల 21న శంషాబాద్‌కు వచ్చిన టాంజానియా దేశస్థుడుకొకైన్‌ను కడుపులోకి మింగినట్లు గుర్తించిన అధికారులు*మంచిర్యాల జిల్లాలోని నస్పూర్‌లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. ప్రేమకు నిరాకరిస్తోందన్న కోపంతో యువతిపై యువకుడు సాయి కిరణ్ కల్లుగీత కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో యువతి మానస మెడకు తీవ్ర గాయమైంది. ఆమెను జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి మధ్య ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. బాధితురాలి కుటుంబ సభ్యులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

*మహారాష్ట్రలోని ఎంపీ, ఎమ్మెల్యే దంపతులైన నవనీత్, రవిరాణా దంపతులకు మంగళవారం కోర్టులో బెయిలు లభించక పోవడంతో ఈ నెల 29వతేదీ వరకు వారు జైలులోనే గడపనున్నారు.మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే వ్యక్తిగత నివాసం వెలుపల హనుమాన్ చాలీసాను పఠిస్తామని బహిరంగంగా ప్రకటించిన నేపథ్యంలో రాణా దంపతులపై ముంబై పోలీసుల కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.దేశద్రోహం ఆరోపణలపై ముంబై పోలీసులు నమోదు చేసిన కేసుకు వ్యతిరేకంగా జైలు శిక్ష అనుభవిస్తున్న స్వతంత్ర ఎంపీ నవనీత్ రాణా,ఆమె భర్త ఎమ్మెల్యే రవి రాణా బెయిల్ పిటిషన్‌పై ముంబై సెషన్స్ కోర్టు మంగళవారం విచారణ ప్రారంభించింది.వారి బెయిల్ పిటిషన్ ను ఏప్రిల్ 29వతేదీన విచారించాలని కోర్టు నిర్ణయించింది. దీంతో వారు 29వతేదీ వరకు జైలులోనే ఉంటారు

*కరాచీ యూనివర్సిటీలో కారుబాంబు పేలింది. నలుగురు చైనీయులు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కరాచీ యూనివర్సిటీ క్యాంపస్‌లోనికన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్ సమీపంలో ఈ ఘటన జరిగింది. పేలుడు జరిగిన సమయంలో వాహనంలో మంది ఉన్నారని సమాచారం. ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. మృతులు కన్ఫ్యూషియస్ ఇన్‌స్టిట్యూట్‌లో చైనా భాష నేర్పించే అధ్యాపకులని తేలింది.

*కృష్ణా జిల్లా బొమ్మెలూరు దగ్గర లారీ బోల్తా పడింది. డివైడర్‌ను ఢీకొని అమెజాన్ కంపెనీకి చెందిన లారీ బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంటైనర్‌లోని సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరం వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.

*గుంటూరు: జిల్లాలోని దాచేపల్లి మండలం తంగెడలో సుబ్బారావు అనే వ్యక్తి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తన కొడుకులు చేసిన అప్పులు తీర్చిన వారి పద్దతి మారడం లేదని ఆవేదనతో ఈ ఘటనకు పాల్పడినట్లు తెలిసింది. కొడుకుల తీరుతో మనస్తాపంతో కృష్ణనదిలో తండ్రి సుబ్బారావు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. సకాలంలో స్పందించి సుబ్బారావును జాలర్లు కాపాడటంతో ప్రాణనష్టం తప్పింది.

*ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో ఇటీవలే ఓ కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు ఇంట్లోనే దారుణహత్యకు గురైన సంఘటన మరువక ముందే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సొంత ఇలాకా గోరఖ్‌పూర్‌లో మరో దారుణం వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి, అతని భార్య, కుమార్తెను దుండగులు పదునైన ఆయుధాలతో గొంతుకోసి ఇంటికి కొద్ది దూరంలోనే అత్యంత పాశవికంగా హత్య చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం, రాయ్‌గంజ్‌లోని బంగ్లా చౌక్‌లోని వారి ఇంటికి 800 మీటర్ల దూరంలో ఈ హత్యలు చేటుచేసుకున్నాయి.

*కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలసర్పమయ్యాడు. నీలిచిత్రాలు చూస్తూ ఐదేళ్ల కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి గ్రామంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. చిలకలూరిపేట రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన నిందితుడికి 2016లో వివాహమైంది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. పాపకు ఐదేళ్లు. రాత్రి సమయంలో కుమార్తె తండ్రి వద్ద, కుమారుడు తల్లివద్ద పడుకుంటారు. వారం రోజులుగా చిన్నారికి తల్లి స్నానం చేయించే సమయంలో తనకు నొప్పిగా ఉంటోందని రాత్రిపూట నాన్నవద్ద పడుకోబెట్టవద్దని ఏడుస్తూ చెప్పింది. దీంతో ఆదివారం రాత్రి భోజనం చేశాక భార్య నిద్రపోతున్నట్లు నటిస్తూ భర్తను గమనించింది. కొద్దిసేపటి తర్వాత భర్త నీలిచిత్రాలు చూస్తూ కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెడ్‌హ్యాడెడ్‌గా పట్టుకున్న భార్య, సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

*పిడుగుపాటుకు వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు మరణించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం సీతాపురం గ్రామంలో పిడుగు పడి టీపీవీడు గ్రామ ఎంపీటీసీ సభ్యురాలు చండ్రు శ్రీదేవి(36) సజీవ దహనమయ్యారు. సీతాపురం గ్రామంలో నివసిస్తున్న శ్రీదేవి సోమవారం ఏజెన్సీలోని గౌరిదేవిపేట గ్రామంలో జరిగిన ఓ శుభకార్యంలో పాల్గొని కుటుంబసభ్యులు, బంఽధువులతో ఆనందంగా గడిపారు. అక్కడి నుంచి ఇంటికి చేరిన కొద్దిసేపటికే గాలి దుమారం వీచింది. వానలేదు, ఉరుములు, మెరుపులు లేవు. గాలిదుమారమే కదా అని ఇంటికి కొద్దిదూరంలో ఉన్న మిర్చి కల్లం వద్దకు ఆమె వెళ్లారు. తిరిగి ఇంట్లోకి వస్తుండగా అకస్మాత్తుగా ఆమెపై పిడుగుపడింది. గుర్తుపట్ట లేనంతగా శరీరమంతా కాలిపోయింది. ఆమెపై పిడుగు పడినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

* అప్పులోళ్ల ఒత్తిడి పెరుగుతుండటంతో ఓ వ్యాపారి కుటుంబంతో సహా ఆత్మహత్యకు యత్నించారు. ఈ ఘటన విజయవాడ బస్టాండ్‌ సమీపంలోని ఓ లాడ్జిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన జె.వెంకటేశ్వరరావు పప్పుల మిల్లు నడుపుతున్నారు. రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటకు కొంత నగదు బకాయి పడ్డారు. ఇది కాకుండా వెంకటేశ్వరరావు నుంచి కొంతమంది అప్పులు తీసుకున్నారు. వాటిని తిరిగివ్వలేదు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వరరావు అప్పులపాలయ్యారు. ఆయన కుమార్తెలు భావన, శ్రావణి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లు. లాక్‌డౌన్‌ నుంచి ఇంటి వద్దే పనిచేస్తున్నారు. పెద్ద కుమార్తె భావనకు బేరియాట్రిక్‌ సర్జరీ నిమిత్తం హైదరాబాద్‌లో రూ.కోటి వరకు ఖర్చు చేసినట్టు సమాచారం. అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో వెంకటేశ్వరరావు ఫిబ్రవరి 28న మచిలీపట్నం నుంచి భార్య రాధారాణి, కుమార్తెలను తీసుకుని వెళ్లిపోయారు.

*కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలసర్పమయ్యాడు. నీలిచిత్రాలు చూస్తూ ఐదేళ్ల కుమార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని బొప్పూడి గ్రామంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. చిలకలూరిపేట రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గ్రామానికి చెందిన నిందితుడికి 2016లో వివాహమైంది. వీరికి ఒక పాప, బాబు ఉన్నారు. పాపకు ఐదేళ్లు. రాత్రి సమయంలో కుమార్తె తండ్రి వద్ద, కుమారుడు తల్లివద్ద పడుకుంటారు. వారం రోజులుగా చిన్నారికి తల్లి స్నానం చేయించే సమయంలో తనకు నొప్పిగా ఉంటోందని రాత్రిపూట నాన్నవద్ద పడుకోబెట్టవద్దని ఏడుస్తూ చెప్పింది. దీంతో ఆదివారం రాత్రి భోజనం చేశాక భార్య నిద్రపోతున్నట్లు నటిస్తూ భర్తను గమనించింది. కొద్దిసేపటి తర్వాత భర్త నీలిచిత్రాలు చూస్తూ కన్నకూతురిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెడ్‌హ్యాడెడ్‌గా పట్టుకున్న భార్య, సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

*కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే కాలసర్పమయ్యాడు. నీలిచిత్రాలు చూస్తూ ఐదేళ్ల కు మార్తెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఏపీలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలంలోని బొప్పూడిలో ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… బొప్పూడికి చెందిన దంపతులకు ఒక పాప, బాబు ఉన్నారు. పాపకు ఐదేళ్లు. రాత్రి సమయంలో కుమార్తె తండ్రి వద్ద, కుమారుడు తల్లివద్ద పడుకుంటూ ఉంటారు. వారం రో జులుగా చిన్నారికి తల్లి స్నానం చేయించే సమయంలో తనకు నొప్పిగా ఉంటోందని రాత్రిపూట నాన్నవద్ద పడుకోబెట్టవద్దని ఏడుస్తూ చెప్పింది. దీంతో ఆలోచనలో పడిన భార్య.. భర్తను అనుమానించింది.

*రాష్ట్రంలో పిడుగులుపడి సోమవారం ఇద్దరు రైతులు మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం సాయనపల్లిలో తోలెం లక్ష్మయ్య(35) తన పొలంలో కల్లంపై పోసిన మొక్కజొన్న తడవకుండా టార్పాలిన్‌ పట్టాలు కప్పాడు. ఇంతలో వర్షం పడటంతో చెట్టు వద్దకు వెళ్తుండగా పిడుగు పడింది. దాంతో లక్ష్మయ్య పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడి మృతి చెం దా డు. నాగర్‌కర్నూల్‌ జిల్లా బల్మూరు మండలం నర్సాయపల్లిలో వర్షం కురవటంతో పొలంలో ఉన్న రామావత్‌ శంకర్‌నాయక్‌ (48) చెట్టుకిందకు వెళ్లి నిలుచున్నాడు. అదే సమయంలో పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు.