DailyDose

మంత్రి పదవి నాకు వెంట్రుకతో సమానం – TNI తాజా వార్తలు

మంత్రి పదవి నాకు వెంట్రుకతో సమానం  – TNI తాజా వార్తలు

* మాజీ మంత్రి కన్నా.. గుడివాడ ఎమ్మెల్యే అని పిలిపించుకోవడమే తనకు ఇష్టమని కొడాలి నాని స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడులో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ నూతన విగ్రహాన్ని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో కలిసి శనివారం ఆయన ఆవిష్కరించారు.తనను మాజీ మంత్రి అని అందరూ సంభోదించడం ఇష్టం లేదని,.. గుడివాడ ఎమ్మెల్యే అని పిలిపించుకోవడానికే ఇష్టపడతానని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. మంత్రి పదవి తనకు వెంట్రుకతో సమానమని, ఎమ్మెల్యే పదవి లేకుంటేనే ఎక్కువ బాధపడతానన్నారు.కృష్ణా జిల్లా గుడివాడ మండలం దొండపాడులో ఏర్పాటు చేసిన బాబూ జగ్జీవన్‌రామ్‌ నూతన విగ్రహాన్ని బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌తో కలిసి శనివారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కొడాలి నాని మాట్లాడుతూ… ‘పదవి ఉన్నా.. లేకున్నా జగన్‌ వెంటే ఉంటాను. పవన్‌కల్యాణ్‌ చంద్రబాబు దత్తపుత్రుడు. ఆయనతో పాటు లోకేశ్‌ రాష్ట్రం శ్రీలంక అవుతుందని విషప్రచారం చేస్తున్నారు. జగన్‌ లేకుంటే రాష్ట్రం సర్వనాశనం అవుతుంది…’ అని పేర్కొన్నారు. ఎంపీ సురేష్‌ మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతే లక్ష్యంగా అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రూపొందిస్తే, బాబూ జగ్జీవన్‌రామ్‌ దాని ఫలాలను అట్టడుగువర్గాలకు అందించిన వ్యక్తి అని కొనియాడారు.

*తిరుప‌తి రుయా ఘ‌ట‌న‌పై ఆస్పత్రి సూప‌రింటెండెంట్ వివ‌ర‌ణ కోరినట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. మృత‌దేహాలపై వ్యాపారం చేసేవారిని క‌ఠినంగా శిక్షిస్తామన్న ఆమె.., మృతుడి కుటుంబస‌భ్యుల‌ను ఎవరు బెదిరించారనే దానిపై విచారణ చేపడతామన్నారు. బెదిరించింది.. ప్రైవేట్‌ వ్యక్తులా, ఆస్పత్రి సిబ్బందా అనేదానిపై విచారణ చేస్తామన్నారు. బాధ్యులను వ‌దిలిపెట్టబోమని.., క‌ఠిన చ‌ర్యలు తీసుకుంటామని అన్నారు. మ‌హాప్రస్థానం వాహనాలు 24 గంట‌లూ ప‌నిచేసే విధానం చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ప్రీపెయిడ్ ట్యాక్సీ తెచ్చే అంశం పరిశీలన చేస్తామన్నారు. అన్ని ఆస్పత్రుల వద్ద ప్రైవేట్‌ అంబులెన్సుల‌ను నియంత్రిస్తామని మంత్రి రజని స్పష్టం చేశారు.

*సూర్యాపేటల్లో మోడీ సర్కార్‌పై మంత్రి జగదీష్ రెడ్డి నిప్పులు చెరిగారు. విద్యుత్ అంశంలో కేంద్రం తెలంగాణా గొంతు నొక్కుతుందని, బీజేపీ సర్కార్ కుట్రలు పరాకాష్టకు చేరాయన్నారు. వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే మోదీ ఎత్తుగడలని వ్యాఖ్యానించారు. విద్యుత్ కొనుగోళ్లలో కేంద్రానికి, యన్.ఎల్.డి.సి & యస్ఎల్ డిసిల ప్రమేయం ఉండదన్నారు. ఉత్పత్తి దారులకు డిస్కం లేదా ట్రాన్స్కో, జెన్కోల మధ్య కుదిరే ఒప్పందం మాత్రమే అని తెలిపారు. సంబంధం లేకున్నా కేంద్రం తల దూరుస్తుందని, ముమ్మాటికి ఇది కేంద్రం దాదాగిరినే అని మండిపడ్డారు. బీజేపీ పాలకుల దాదాగిరి వీధి రౌడీలను తలపిస్తుందని, కేంద్రం దిగజారుడుతనానికి ఇది నిదర్శనమన్నారు. మోదీ సొంత రాష్ట్రంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో విద్యుత్ సరఫరా చెయ్యలేకనే ఈ కుట్రలని మంత్రి అన్నారు

*ఈ నెల 27న హెచ్ఐసీసీలో నిర్వ‌హించే టీఆర్ఎస్ ప్లీన‌రీ సంద‌ర్భంగా సైబ‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప‌లు ఆంక్ష‌లు విధించారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు చేపడుతున్నారు. హెచ్‌ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్‌, సైబర్‌ టవర్స్‌-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్‌ టూ కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు వారి సమయ వేళలను మార్చుకోవాలని అధికారులు సూచించారు. ఉద‌యం 9 నుంచి 11 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 4 నుంచి 7 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ర‌ద్దీ ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని, ఈ స‌మయాల్లో ప్ర‌త్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాల‌ని పోలీసులు సూచించారు.

*కాంగ్రెస్ వర్గపోరు మరోసారి భగ్గుమంది. రేపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నల్లగొండ సమావేశంపై సందిగ్దత కొనసాగుతోంది. రేవంత్ రెడ్డి సన్నాహక సమావేశంపై సీనియర్లు ఇంట్రెస్ట్ చూపడంలేదు. షెడ్యూల్, సభావేదిక ఇంకా ఖరారు కాలేదు. రేవంత్ సన్నాహక సమావేశాన్ని ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గం వ్యతిరేకిస్తోంది. జిల్లాలో రేవంత్ సమావేశాన్ని జానారెడ్డి, దామోదర్ రెడ్డి వర్గీయులు ఆహ్వానిస్తున్నారు. నేడు యాదాద్రి జిల్లాలో రేవంత్ రెడ్డి వర్గీయులు సమావేశమవుతున్నారు. రేపు రేవంత్ సమావేశాన్ని నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ రెడ్డి వర్గీయులు చెబుతున్నారు. వరంగల్‌లో జరిగే రాహుల్ గాంధీ సభను విజయవంతం చేసేందుకు జిల్లాల వారీగా సన్నాహక సమావేశాలను రేవంత్ నిర్వహిస్తున్నారు

*స‌న‌త్ న‌గ‌ర్‌ ప‌రిధిలోని ఎర్ర‌గ‌డ్డ ఛాతీ ఆస్ప‌త్రిలో మ‌ల్టీ సూప‌ర్ స్పెషాలిటీ ఆస్ప‌త్రి నిర్మాణానికి ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు భూమి పూజ చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు హ‌రీశ్‌రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, స‌బితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్‌, సుధీర్ రెడ్డి, కాలేరు వెంక‌టేశ్‌, రాజ్య‌స‌భ స‌భ్యులు కే కేశ‌వ‌రావు, జీహెచ్ఎంసీ మేయ‌ర్ గ‌ద్వాల్ విజ‌య‌ల‌క్ష్మితో పాటు ప‌లువురు ప్ర‌జాప్ర‌తినిధులు పాల్గొన్నారు. 17 ఎక‌రాల్లో జీ ప్ల‌స్ 14 అంత‌స్తుల్లో వెయ్యి ప‌డ‌క‌ల ఆస్ప‌త్రిని నిర్మించ‌నున్నారు. ఈ మ‌ల్టీ సూప‌ర్‌ స్పె‌షా‌లిటీ హాస్పి‌ట‌ల్‌కు రూ.882 కోట్లు కేటాయించారు.ఈ ఆస్ప‌త్రుల్లో స్పెషాలిటీ, సూప‌ర్ స్పెషాలిటీ వైద్య సేవ‌లు అందుతాయి. వైద్య విద్య కోసం పీజీ స్పెషాలిటీ, సూప‌ర్ స్పెషాలిటీ సీట్లు, న‌ర్సింగ్, పారా మెడిక‌ల్ కాలేజీలు కూడా అందుబాటులోకి రానున్నాయి

*హైదరాబాద్ నగరంలోని హైటెక్‌ సిటీలో బీజేపీ ఆందోళనకు దిగింది. నిబంధనలకు విరుద్ధంగా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, కటౌట్ల ఏర్పాటుపై బీజేపీ నేతలు నిరసన చేపట్టారు. జీహెచ్ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించాలని బీజేపీ నేతలు ఆందోళన చేపట్టారు

*గుంటూరు జిల్లాలోని పాత గుంటూరు బాలాజీనగర్‌లో స్థానికులు నిరసనకు దిగారు. వైసీపీకి ఓట్లు వేయలేదని కారణంతో నివాసాల మధ్య పెద్ద మొత్తంలో చెత్తను నిల్వ ఉంచారు. చెత్త కుప్పల నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ మున్సిపల్ సిబ్బంది పట్టించుకోని పరిస్థితి. చెత్త కుప్పలకు ఆనుకోని పాఠశాల ఉండటంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మున్సిపల్ సిబ్బంది తీరుకు నిరసనగా స్థానికులు రోడ్డును బ్లాక్ చేశారు. మున్సిపల్ సిబ్బంది తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే చెత్త కుప్పలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నారు.

*ఖైరతాబాద్ జల మండలి కార్యాలయం వద్ద బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. నగరంలో తాగు నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జలమండలి కార్యాలయాన్ని ముట్టడించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రా రెడ్డి, సిటీ ప్రెసిడెంట్, కార్పొరేటర్లు ధర్నాకు దిగారు. ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నాయి. నగరంలో నీటి సమస్య, డ్రైనేజి పనుల నిర్లక్ష్యం, నీటి కాలుష్యంపై పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది.

*పార్టీలకతీతంగా ముఖ్యమంత్రి స్టాలిన్‌ జిల్లాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నారని బీజేపీ సభ్యుడు నయినార్‌ నాగేంద్రన్‌ కొనియాడారు. సోమవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుడు మాట్లాడుతూ, తిరునెల్వేలి జిల్లాలో అనేక అభివృద్ధి పథకాలను ముఖ్యమంత్రి ప్రకటించడం చాలా మంచి విషయమన్నారు. పార్టీలకు అతీతంగా జిల్లాల అభివృద్ధికి పథకాలు ప్రకటిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా తిరునెల్వేలి జిల్లాకు అనేక పథకాలను ప్రకటించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో జిల్లాలోని అప్పర్‌ ఆలయానికి రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి పీకే శేఖర్‌ బాబు రూ.30 కోట్ల అభివృద్ధి పనులు ప్రకటించారు. అలాగే, రహదారులశాఖ మంత్రి కూడా పలు రహదారుల నిర్మాణానికి ఆదేశాలు జారీచేశారన్నారు. అలాగే, ఆదిచ్చనల్లూరు పరిశోధనా కేంద్రాన్ని రూ.18 కోట్లతో ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా సభలో ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు బీజేపీ ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌ తెలిపారు.

*ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణాలపై మాజీ మంత్రి దేవినేని ఉమ స్పందించారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నిర్మాణంలో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల నివేదికలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ హయాంలో 62 ప్రాజెక్టులపై రూ.64వేల కోట్లు ఖర్చు పెట్టి 23 ప్రాజెక్టులు పూర్తిచేశాం, 4 ప్రాజెక్టులు తుదిదశకు చేరుకున్నాయన్నారు. పోలవరం నిర్మాణంపై సీఎం, మంత్రులు పొంతన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*చింతామణి నాటకం నిషేధించడంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం చింతామణి నాటకం నిషేధించడాన్ని ఆర్టిస్ట్ అగురు త్రినాథ్ హైకోర్టులో సవాల్ చేశారు. అత్యవసర విచారణ జరపాలని లాయర్ జడ శ్రవణ్‌కుమార్ కోరారు. కేసు తీవ్రత దృష్ట్యా జూన్ 24న విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

*రుయా ఆస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. అంబులెన్స్ యూనియన్ల రాక్షతత్వం కారణంగా ఓ తండ్రి తన కుమారుడి మృతదేహాన్ని స్కూటర్‌పై తీసుకువెళ్లడం చూసినవారికి కంటతడిపెట్టించింది. ఆస్పత్రి దగ్గర ఉన్న అంబులెన్స్‌కు వారు ఎంత రేటు చెబితే అంత చెల్లించాల్సిందే. దీంతో బిడ్డ మృతదేహాన్ని తండ్రి స్కూటర్‌పై సొంతూరికి తీసుకువెళ్లాడు. రుయా ఆస్పత్రి దగ్గర ప్రభుత్వ డ్రైవర్లు, మహాప్రస్థానం వాహనాల డ్రైవర్లు ప్రైవేటు అంబులెన్స్ యాజమానులతో కుమ్మక్కయ్యారు. దీంతో ఆస్పత్రి నుంచి మృతదేహాల తరలింపు చాలా ఖరీదు వ్యవహారంగా మారింది.

*పదో తరగతి పరీక్షల్లో అవకతవకలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆర్జేడీ ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటు పాఠశాలలో చదివే విద్యార్థులకు హాల్ టికెట్‌లకి ఫీజులకు ముడిపెట్టొద్దన్నారు. విద్యార్థులకు హాల్ టికెట్ ఇవ్వలేదని తమ దృష్టికి వస్తే ఆ ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు ఉంటాయని ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.

*నకాపల్లి జిల్లా వి మాడుగులలో సిద్ధ స్వాతిపై హత్యాయత్నం కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. తనపై హత్యాయత్నానికి పాల్పడినవారిలో ఆటో డ్రైవర్ కొండబాబు, మేనమామ నగేష్ హస్తం ఉన్నట్లు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. పోలీసులు చేపట్టిన దర్యాప్తులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హత్యాయత్నం సమయంలో నగేష్, కొండబాబు విధుల్లో ఉన్నట్లు సీసీ ఫుటేజ్‌ ద్వారా తెలిసింది. స్వాతి మెడికల్ రిపోర్ట్ నివేదిక వచ్చిన తర్వాత విచారణ చేపడతామని.. అసలు ఆమెది హత్యా యత్నమా? లేక ఆత్మహత్య యత్నమా? అనే కోణంలో విచారణ చేపడుతున్నామని డీఎస్పీ సురేష్ పేర్కొన్నారు.

*ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను వ్యతిరేకించాలని ఒత్తిడి తెస్తున్న యూరోపియన్ దేశాలకు భారత్ గట్టి జవాబు చెప్పింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి పాశ్చాత్య దేశాలు వెనుకకు వెళ్ళడం వల్ల ఎదురవుతున్న ఫలితాలనుఆసియాలో పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్న ఒప్పందాలునియమాల అమలుకు ఎదురవుతున్న సవాళ్ళపట్ల ఆ దేశాలు మౌనంగా ఉండటాన్ని ఎత్తి చూపించింది.

*యాదాద్రి భువనగిరి జిల్లాలో తవ్వకాలు జరిపితే బౌద్ధస్థూపం లభించే అవకాశం ఉందని పురాతత్వశాఖ ఉన్నతాధికారి మునిరత్నంరెడ్డి తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని చాడ గ్రామంలోక్రీస్తు శకంవ శతాబ్దం శాతవాహనుల కాలంనాటి రాతి అవశేషాలుబయటపడ్డాయి. సంస్కృతబ్రాహ్మీ లిపితో ప్రభావితమైన ప్రాకృత భాషలో జాయేన స.. సచలోకసహిత సుచోయఅని రాసిన రాతి ఫలకం లభ్యమైనట్లు ఢిల్లీలోని పురాతత్వ శాఖ అధికారులు సోమవారం తెలిపారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు చెప్పారు. అందరి లోకహితం కోసంఅని ఈ ఫలకంపై రాసి ఉందని తెలిపారు. గ్రామస్థులు దేనికోసమో తవ్వకాలు జరుపుతుండగాఈ ఫలకం లభ్యమైందని చెప్పారు. ఇలాంటి ఫలకాలు దొరికాయంటేఅవి ఒక స్థూపానికి సంబంధించినవై ఉంటాయన్న అభిప్రాయాన్ని మునిరత్నంరెడ్డి వ్యక్తం చేశారు.కాగాచాడ గ్రామంలో బౌద్ధానికి సంబంధించిన ఆనవాళ్లు లభించటంతోలో దీనిని బౌద్ధ పరిరక్షణ కేంద్రంగా పురావస్తుశాఖ గుర్తించింది. ఇక్కడ తవ్వకాల్లో లభించిన విగ్రహాలను నల్లగొండలోని పానగల్‌ మ్యూజియంకుఅక్కడ నుంచి సాగర్‌ సమీపంలోని బుద్ధవనంకు తరలించారు. పూనే విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చ్‌ స్కాలర్‌ హేమంత్‌దాల్విరాష్ట్ర పురావస్తు శాఖ రీసెర్చ్‌ స్కాలర్‌ రుషికేష్‌ ఇటీవల చాడలో పరిశోధన చేసి రాతి శాసనాన్ని గుర్తించారని దక్షిణ భారత శిల్పవిభాగం మాజీ డైరెక్టర్‌ కూడా అయిన మునిరత్నంరెడ్డి తెలిపారు.

*రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కిశోర్‌ మిశ్రాను, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కలిశారు. సోమవారం ప్రభుత్వ అతిథి గృహంలో వారిరువురి భేటీ జరిగింది. హైకోర్టు పరిపాలన ఉన్నతాధికారులు, రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖలకు చెందిన ప్రధాన అధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో… ఈ నెల 30న ఢిల్లీలో జరగనున్న సీఎంలు, చీఫ్‌ జస్టి్‌సల సమావేశపు అజెండాపై చర్చించారు. న్యూఢిల్లీ విజ్ఞాన్‌ భవన్‌లో జరగనున్న ఈ సమావేశం ప్రాధాన్యత రీత్యా ఈ భేటీ జరిగింది. 2016 ఏప్రిల్‌ 4న నాటి ముఖ్యమంత్రులు, హైకోర్టు సీజేల సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలులో ప్రగతి, పేరుకుపోయిన కేసుల పరిష్కారం, న్యాయ సహాయంపై మార్గదర్శక ప్రణాళిక, కోర్టుల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, న్యాయవ్యవస్థలో ఖాళీల భర్తీ, ఈ కోర్టులు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. రాష్ట్రం నుంచి నివేదించాల్సిన పలు అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.

*రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌కు కేంద్ర గృహనిర్మాణ శాఖ పరిధిలోని హడ్కో నుంచి అవార్డు లభించింది. రాష్ర్టాల్లోని హౌసింగ్‌ పురోగతిపై ఏటా ఇచ్చే అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది ఏపీకి ప్రతిభా అవార్డును ప్రకటించింది. అన్ని విభాగాల్లోఏపీ ప్రతిభ చూపించిందని ప్రశంసించింది. సోమవారం ఢిల్లీలో గృహనిర్మాణ మంత్రిత్వశాఖ మంత్రి హరిదీ్‌పసింగ్‌ పూరి చేతుల మీదుగా ఏపీ హౌసింగ్‌ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్‌ ఈ అవార్డును అందుకున్నారు. ఒకేసారి భారీఎత్తున పక్కా ఇళ్లను గ్రౌండింగ్‌ చేయడంనిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయడం లాంటి అంశాల్లో రాష్ర్టానికి ఈ అవార్డు లభించిందని అజయ్‌జైన్‌ తెలిపారు. అవార్డు రావడం పట్ల హౌసింగ్‌ మంత్రి జోగి రమేష్‌ హర్షం వ్యక్తంచేశారు.

*ఉపాధ్యాయులు ఏమైనా జగన్‌రెడ్డి లోటస్‌ పాండ్‌లో వాటా అడుగుతున్నారా? ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు చేయాలని అడుగుతున్నారు. దానికి వారిపై ఇంత ఉక్కు పాదం మోపాల్సిన అవసరం ఉందా..! రాష్ట్రంలో విధించిన ఆంక్షలు కశ్మీర్‌ సరిహద్దుల్లో కూడా లేవు’’ అని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. సోమవారం ఆయన ఒక ప్రకటన చేశారు. ‘‘ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం ప్రజల హక్కు. సీపీఎస్‌ రద్దు చేయాలని ఉపాధ్యాయులు చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని అరెస్టులతో అడ్డుకోవాలని చూడటం దుర్మార్గం. దారి పొడవునా ముళ్ళ కంచెలు బిగించడం, ఒకో ఉపాధ్యాయుడికి ముగ్గురు పోలీసులను కాపలా పెట్టడం దారుణం’’ అని యనమల మండిపడ్డారు

*అధికారంలో ఉంటే ప్రజలకు సేవచేయాలి. ప్రతిపక్షంలో ఉంటే ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడాలి. కానీ ఈ దౌర్భాగ్యుడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడు. టీడీపీ నీకు మల్లే గాలి పార్టీకాదు. పేదవాడి చెమట నుంచి, కార్మికుడి కష్టం నుంచి పుట్టింది. ప్రజలు 2019లో ఒక దుర్మార్గుడికి అధికారం కట్టబెట్టారు. అతను ప్రజల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తున్నాడు’’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

*రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌కు కేంద్ర గృహనిర్మాణ శాఖ పరిధిలోని హడ్కో నుంచి అవార్డు లభించింది. రాష్ర్టాల్లోని హౌసింగ్‌ పురోగతిపై ఏటా ఇచ్చే అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది ఏపీకి ప్రతిభా అవార్డును ప్రకటించింది. అన్ని విభాగాల్లో ఏపీ ప్రతిభ చూపించిందని ప్రశంసించింది. సోమవారం ఢిల్లీలో గృహనిర్మాణ మంత్రిత్వశాఖ మంత్రి హరిదీ్‌పసింగ్‌ పూరి చేతుల మీదుగా ఏపీ హౌసింగ్‌ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్‌ ఈ అవార్డును అందుకున్నారు. ఒకేసారి భారీఎత్తున పక్కా ఇళ్లను గ్రౌండింగ్‌ చేయడం, నిర్మాణ పనులు వేగంగా పూర్తిచేయడం లాంటి అంశాల్లో రాష్ర్టానికి ఈ అవార్డు లభించిందని అజయ్‌జైన్‌ తెలిపారు. అవార్డు రావడం పట్ల హౌసింగ్‌ మంత్రి జోగి రమేష్‌ హర్షం వ్యక్తంచేశారు.

*ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డితో నాల్కో సీఎండీ శ్రీధర్‌ పాత్ర, విథాని సీఎండీ సంజయ్‌ కుమార్‌ ఝా భేటీ అయ్యారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎంతో సంయుక్తంగా సమావేశమయ్యారు. ఉత్కర్ష అల్యూమినియం థాతు నిగమ్‌ లిమిటెడ్‌ (యూడీఏఎన్‌ఎల్‌) ఆధ్వర్యంలో నెల్లూరు కొడవలూరు మండలం బొడ్డువారి పాలెంలో హైఎండ్‌ అల్యూమినియం అల్లాయ్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. రూ.5000 కోట్ల పెట్టుబడితో ఏటా 60,000 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంలో ప్లాంటను ఏర్పాటు చేస్తున్నట్లుగా వారు వివరించారు. సమావేశంలో ఎంపీ వల్లభనేని బాలశౌరి, ఏపీఐఐసీ వీసీ అండ్‌ చైర్మన్‌ జేవీఎస్‌ సుబ్రహ్మణ్యం, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ సృజన తదితరులు పాల్గొన్నారు.

*సీపీఎస్‌ బదులుగా జీపీఎస్‌ పేరిట కొత్త పెన్షన్‌ విధానం తీసుకురావాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన తమకు సమ్మతం కాదని జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తేల్చిచెప్పాయి. సీపీఎ్‌సను రద్దు చేసి.. ఓపీఎ్‌సను అమలు చేయాల్సిందేనని స్పష్టం చేశాయి. సోమవారం అమరావతి సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశంలో ఈ సంఘాల నేతలు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గతంలో టక్కర్‌ కమిటీ 50 శాతం ఫిట్‌మెంట్‌తో పెన్షన్‌ స్కీం ఇస్తానని చెప్పినా.. పాత పెన్షన్‌ విధానాన్నే కోరుకున్నామని ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు తెలిపారు. ‘‘సీపీఎ్‌సకు, జీపీఎ్‌సకు మధ్య తేడా ఏమిటనేది ప్రభుత్వం చెప్పలేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఎరియర్స్‌పై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. పీఆర్సీ జీవోలన్నీ ఇవ్వాలని మంత్రుల సమావేశంలో కోరాం’’ అని ఆయన తెలిపారు.

*మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌పై జనసేన పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు సోమవారం పెందుర్తి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ను అమర్‌నాథ్‌ అసభ్య పదజాలంతో దూషిస్తూ, వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో జనసేన ప్రతినిధులు జనార్దన శ్రీకాంత్‌, ఉరిటి లక్కీ గోవింద్‌, జుత్తాడ శ్రీను తదితరులు ఉన్నారు.

* వైసీపీ మూడేళ్ల పాలనలో రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిందని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి విమర్శించారు. సోమవారం అన్నమయ్య జిల్లా కలకడలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మహిళలతో పాటు వివిధ వ్యవస్థలకూ రక్షణ కరువైంది. కేంద్ర హోం శాఖ పార్లమెంట్‌కు సమర్పించిన నివేదిక మేరకు వైసీపీ పాలనలో ఏపీలో నేరాల సంఖ్య రెట్టింపు అవడం దారుణం. ప్రభుత్వం కక్ష రాజకీయాలను మానుకుని రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడేందుకు ప్రాధాన్యమివ్వాలి’’ అని తులసిరెడ్డి అన్నారు.

* హైదరాబాద్‌లో ఉన్న ఆన్‌లైన్‌ గేమింగ్‌ కంపెనీకి కుచ్చుటోపీ పెట్టాడో ఉద్యోగి. సాంకేతిక లోపాలను ఆసరాగా చేసుకొని రూ.61 లక్షలు కొల్లగొట్టాడు. సైబర్‌ మోసాన్ని ఆలస్యంగా గుర్తించిన యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మాదాపూర్‌లో ఆన్‌లైన్‌ ఫ్యాంటసీ గేమింగ్‌ కంపెనీ ఉంది. ఆ గేమ్‌ ఆడాలనుకున్న వినియోగదారులు బ్యాంకు ఖాతాలను అటాచ్‌ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వినియోగదారులకు యూసర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇస్తారు. దాంతో వారు గేమ్‌లోకి లాగిన్‌ అవ్వొచ్చు. అక్కడ రకరకాల ఫ్యాంటసీ గేమ్స్‌ ఉంటాయి. విజేతకు ప్రైజ్‌ మనీ ఎంత అనేది అక్కడ చూపిస్తుంది. గేమ్‌ ఆడే ముందు నిర్ణయించిన మేరకు డబ్బులు డిపాజిట్‌ చేయాలి. గేమ్‌ పూర్తయ్యేంత వరకు ఆ డబ్బులు సేఫ్‌గా ఉంటాయి. గేమ్‌ ఓడిపోతే డిపాజిట్‌ చేసిన డబ్బులు వినియోగదారుడి ఖాతాలోంచి డెబిట్‌ అవుతాయి. గెలిస్తే ప్రైజ్‌ మనీని విజేత క్లైమ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

*హైదరాబాద్‌ నగరంలో హోర్డింగ్‌లు, అక్రమ ఫ్లెక్సీల ఏర్పాటును నిషేధిస్తూ ఏప్రిల్‌ 20, 2020న పురపాలక శాఖ ఉత్తర్వులు (జీఓ-68) జారీ చేసింది. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో నయా నిబంధనలు అమలులోకి వచ్చాయి. అయితే, టీఆర్‌ఎస్‌ ప్లీనరీ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ శ్రేణులు నిబంధనలకు తిలోదకాలిస్తూ ప్రధాన, అంతర్గత రహదారి అన్న తేడా లేకుండా కటౌట్లు, తోరణాలతో పాటు, నిషేధం ఉన్న హోర్డింగ్‌లకూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి.

*బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు బుధవారం నుంచి ప్రారంభం కానుంది. ఉచిత శిక్షణకు అభ్యర్థుల్ని ఏప్రిల్‌ 16న నిర్వహించిన ఆన్‌లైన్‌ అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేశారు. మొదటి విడతగా 11 బీసీ స్టడీ సర్కిళ్లల్లో ఆఫ్‌లైన్‌ తరగతులు ప్రారంభిస్తున్నారు. ఒక్కో సర్కిల్‌లో వెయ్యి మంది అభ్యర్థులకు శిక్షణ అందిస్తారు. దీనికి సంబంధించిన మౌలిక సదుపాయాలు, ఫ్యాకల్టీ నియామక ప్రక్రియను పూర్తి చేశారు. ఆన్‌లైన్‌, హైబ్రిడ్‌ శిక్షణ తరగతులను మరో 15 రోజుల తర్వాత ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు.