Devotional

పంచ రంగనాధ క్షేత్రాలు ఇవే! – TNI ఆధ్యాత్మికం

పంచ రంగనాధ క్షేత్రాలు ఇవే!  – TNI ఆధ్యాత్మికం

1. జలం ఏ పాత్రలోకి పోస్తే, ఆ రూపాన్ని పొందుతుంది. భగవంతుడు కూడా అంతే! భక్తులు ఏ రూపంలో ఆయనను కొలుచు కోవాలనుకుంటే…. ఆ రూపంలోకి ఇమిడిపోతాడు. అలా ఆదిశేషుని మీద శయనించే విష్ణుమూర్తిని, రంగనాథస్వామిగా కొల్చుకోవడం కద్దు. దక్షిణాదిన ఈ రంగనాథ స్వామి ఆలయాలు చాలానే కనిపిస్తాయి. వాటిలో పంచరంగ క్షేత్రాల గురించి చెప్పుకోవాల్సిందే. కావేరీ తీరాన వెలసిన ఈ పంచరంగ క్షేత్రాలు తమిళ, కన్నడ ప్రజలకు చాలా ప్రత్యేకం. ఆ పంచరంగ క్షేత్రాల వివరాలు ఇవిగో…
*శ్రీ రంగపట్నం:–
ఈ పేరు వినగానే మనకు టిప్పు సుల్తాన్‌ కథలే గుర్తుకువస్తాయి. టిప్పు రాజ్యానికి రాజధానిగా సాగిన ఈ పట్నానికి ఆ పేరే అందులోని రంగనాథుని ఆలయం మీదుగా వచ్చింది. ఇక్కడి శ్రీదేవి, భూదేవి సహిత రంగనాథుని ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉంది. పశ్చిమ గాంగేయుల కాలంలో నిర్మించిన ఈ ఆలయానికి టిప్పు సుల్తాన్‌ సహా కర్ణాటక ప్రాంతాన్ని ఏలిన రాజులంతా ఈ స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించినవారే!
*తిరుప్పేర్ నగర్:
తమిళనాడులోని తిరుచిరాపల్లికి సమీపంలో ఉందీ గ్రామం. ఇందులోని స్వామి పేరు అప్పకుడతాన్‌ పెరుమాళ్‌ ~ ఇక్కడ ఉభమన్యు అనే రాజుకు విష్ణుమూర్తి ఒక ముసలివాని రూపంలో దర్శనమిచ్చాడట! ఆయనకు ఎంత ఆహారాన్ని అందించినా ఆకలి తీరలేదట! చివరికు పరాశర మహర్షి సూచనతో భక్తితో అప్పాలను అందించినప్పుడే తృప్తి లభించిందట! అప్పటి నుంచి ఈ స్వామికి అప్పకుడతాన్ స్వామి అని పేరు వచ్చింది. పంచరంగ క్షేత్రాలలోనే కాకుండా వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటిగా కూడా ఈ ఆలయాన్ని ఎంచుతారు.
*కుంబకోణం:
ఒకప్పుడు హేమ రుషి అనే ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి తన కుమార్తెగా జన్మించాలని తపస్సును ఆచరించాడట! దాంతో లక్ష్మీదేవి ఒక తటాకంలోని కలువ నుంచి ఉద్భవించింది. అలా అవతరించిన లక్ష్మీదేవిని కోమలవల్లి అన్న పేరుతో కొలుచుకున్నారు. లక్ష్మీదేవి చెంత ఆ విష్ణుమూర్తి కూడా ఉండాల్సిందే కదా! ఆయన కూడా భువికి అవతరించాడు. ఇలా అవతరించిన స్వామిని అరవముదన్ లేదా సారంగపాణి అని పిల్చుకుంటారు.
*మయిలాడుతురై:
చంద్రుని తపస్సుకు మెచ్చి ఆ విష్ణుమూర్తి అవతరించిన చోటు ఇది. పరాకల్‌ అనే ఆళ్వారుని భక్తికి మెచ్చి స్వామివారు ఇక్కడే స్థిరపడిపోయారట! అలా చూసుకున్నా ఈ ఆలయానికి వెయ్యేళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు తోస్తుంది. ఇక్కడి స్వామి పేరు పరిమళ పెరుమాళ్‌ — వైష్ణవుల 108 దివ్యదేశాలలో ఒకటైన ఈ ఆలయానికి మరో విశిష్టత కూడా ఉంది. ఈ స్వామివారి అనుగ్రహంతోనే నాదస్వరం ఒక సంగీత వాయిద్యంగా రూపుదిద్దుకుందని చెబుతారు.
*శ్రీ రంగం:
పంచరంగ క్షేత్రాలలో శ్రీరంగాన్ని ఆద్యరంగం (చివరి క్షేత్రం)గా పిలుస్తారు. కానీ అన్నింటిలోకీ ప్రముఖమైనది ఈ ఆలయమే! విష్ణుమూర్తి చేతిలో ఉన్న శంఖు రూపంలా తోచే ఒక చిన్న ద్వీపం మీద ఈ ఆలయం నిర్మితమైంది. ఇక్కడి మూలవిరాట్టుని సాక్షాత్తు విభీషణుడు ప్రతిష్టించినట్లు చెబుతారు. విష్ణుభక్తిలో శ్రీరంగానికి ఉన్న ప్రత్యేకత ఎంత చెప్పుకున్నా తక్కువే! గోదాదేవి విష్ణుమూర్తిని వివాహం చేసుకున్నది ఇక్కడే! ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని నిర్మించడానికే 300 ఏళ్లకు పైగా సమయం పట్టిందని చెబుతారు. ప్రపంచంలోనే అతి ఎత్తైన గోపురంగా ప్రసిద్ధకెక్కిన ఈ ఆలయాన్ని దర్శించకుంటే సర్వశుభాలూ కలుగుతాయని నమ్మకం. ఇవీ పంచరంగ క్షేత్రాల విశేషాలు కొన్ని జాబితాలలో ఇందులోని కుంబకోణం బదులు వటనగరంలోని రంగనాథ పెరుమాళ్‌ ఆలయాన్ని పేర్కొంటూ ఉంటారు.

2. తిరుమల నగల విభాగంలో హిందూయేతర కాంట్రాక్టరు!
తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన నగల విభాగంలో హిందూయేతర కాంట్రాక్టరు ఉన్నారని, వారికి టీటీడీ అధికారులే రిజిస్టర్డ్‌ కాంట్రాక్టరుగా సర్టిఫికెట్‌ జారీ చేశారని రిజిస్టర్డ్‌ కాంట్రాక్టర్‌ ఆర్‌. వేణుగోపాల్‌ ఈవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే.. ‘‘రిజిష్టర్డ్‌ కాంట్రాక్టరుగా నమోదైన వారికి శ్రీవారి ఆలయంతో సహా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలన్నింటిలో ప్రవేశానికి, శ్రీవారికి వినియోగించే పంచలోహ వస్తువులన్నింటినీ శుభ్రపరిచేందుకు అవకాశం ఉంటుంది. ఈ బాధ్యతలను నగల విభాగంలో రిజిస్టర్‌ అయిన కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. అయితే, ఈ విభాగంలో నమోదు చేసుకున్న రిజిస్టర్డ్‌ కాంట్రాక్టర్లలో ఒకరి వద్ద హిందూయేతర వ్యక్తి వర్కర్‌గా పని చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత విజిలెన్స్‌ సిబ్బంది ఆయనను ఆలయంలోకి అనుమతించ లేదు. అయితే, ఇటీవల అదే వ్యక్తికి అధికారులు రిజిస్టర్డ్‌ కాంట్రాక్టరుగా సర్టిఫికెట్‌ జారీ చేశారు. దీనికోసం ఆయన మతం మారి హిందూమతం స్వీకరించినట్టు స్వీయ నోటరీ సమర్పించినట్టు తెలిసింది. దీనిలో తన పేరు మార్చుకున్నట్టు పేర్కొన్నారు. ఇలా చేసినా.. ఆయన కుటుంబ జీవితం మాత్రం తన మతానికి అనుగుణంగా సాగిస్తున్నారు. దీనిపై ఈ నెల ప్రారంభంలో ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో 11వ తేదీన ఈవోకు, జేఈవోకు, నగల విభాగం ఉన్నతాధికారికి కూడా ఫిర్యాదు చేశాను. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలి’’ అని ఆర్‌. వేణుగోపాల్‌ కోరారు.శ్రీవారి పంచలోహ వస్తువులను శుభ్రపరిచే విధులను హిందూయేతరులైన కాంట్రాక్టర్లకు ఎలా అప్పగిస్తారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఆలయంలో ఏ విధుల్లోనైనా హిందూయేతరులను నియమించరాదని చట్టమే ఉందన్నారు. అయినా అధికారులు పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం దారుణమని, తక్షణం సంబంధిత హిందూయేతరుడైన రిజిస్టర్డ్‌ కాంట్రాక్టరును తొలగించాలని డిమాండ్‌ చేశారు.

3. తిరుమలలో వెంకన్న డాలర్ల కొరత
భక్తులు ఎక్కువగా కొనే 2, 5 గ్రాములు లేవు
అక్షయ తృతీయ సమీపిస్తున్నా పట్టించుకోని టీటీడీ
అక్షయతృతీయ రోజు బంగారాన్ని కొనడం శుభకరంగా అందరూ భావిస్తారు. అందులోనూ తిరుమల వేంకటేశ్వర స్వామి, అమ్మవార్ల ప్రతిమలుండే బంగారు డాలర్లంటే భక్తులు అమితాసక్తి చూపుతారు. అయితే తిరుమలలో ప్రస్తుతం శ్రీవారి బంగారు డాలర్లకు కొరత ఏర్పడింది. అధిక డిమాండ్‌ ఉండే 2, 5 గ్రాముల డాలర్ల విక్రయాలు నిలిచిపోయాయి. డాలర్లకోసం కౌంటర్‌ వద్దకు వెళ్లిన భక్తులకు నో స్టాక్‌ అంటూ సిబ్బంది వెనక్కి పంపేస్తున్నారు. 10 గ్రాముల డాలర్లు కొనుగోలు చేయాలంటే దాదాపు రూ.50 వేలకు పైమాటే. రూ.25 వేల లోపుండే 5 గ్రాములు, రూ.12 వేలు లోపుండే 2 గ్రాముల డాలర్లు కొనేందుకే సామాన్య భక్తులు మొగ్గు చూపుతారు. మూడు రకాలు అందుబాటులో ఉంటే అక్షయ తృతీయ వేళ రోజుకు దాదాపు రూ.35 నుంచి రూ.50 లక్షల వ్యాపారం జరుగుతుంటుంది. ప్రస్తుతం కౌంటర్‌లో 10 గ్రాముల డాలర్లు మాత్రమే ఉన్నాయి. సాధారణంగా కౌంటర్‌ నిర్వహించే బ్యాంక్‌కు టీటీడీ డాలర్లను అందజేస్తే వాటిని కౌంటర్‌ సిబ్బంది విక్రయిస్తుంటారు. అయితే టీటీడీ ఈ డాలర్లను అందజేయడంలో నిర్లక్ష్యం చూపడంతో కౌంటర్‌లో నోస్టాక్‌ బోర్డును పెట్టేస్తున్నారు. దీంతో అక్షయతృతీయ వేళ భక్తులకు నిరాశ తప్పేటట్లు లేదు!.

4. తిరుమల నగల విభాగంలో హిందూయేతర కాంట్రాక్టరు!
తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన నగల విభాగంలో హిందూయేతర కాంట్రాక్టరు ఉన్నారని, వారికి టీటీడీ అధికారులే రిజిస్టర్డ్‌ కాంట్రాక్టరుగా సర్టిఫికెట్‌ జారీ చేశారని రిజిస్టర్డ్‌ కాంట్రాక్టర్‌ ఆర్‌. వేణుగోపాల్‌ ఈవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. ఫిర్యాదులో ఏం పేర్కొన్నారంటే.. ‘‘రిజిష్టర్డ్‌ కాంట్రాక్టరుగా నమోదైన వారికి శ్రీవారి ఆలయంతో సహా దేశవ్యాప్తంగా ఉన్న టీటీడీ ఆలయాలన్నింటిలో ప్రవేశానికి, శ్రీవారికి వినియోగించే పంచలోహ వస్తువులన్నింటినీ శుభ్రపరిచేందుకు అవకాశం ఉంటుంది. ఈ బాధ్యతలను నగల విభాగంలో రిజిస్టర్‌ అయిన కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. అయితే, ఈ విభాగంలో నమోదు చేసుకున్న రిజిస్టర్డ్‌ కాంట్రాక్టర్లలో ఒకరి వద్ద హిందూయేతర వ్యక్తి వర్కర్‌గా పని చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత విజిలెన్స్‌ సిబ్బంది ఆయనను ఆలయంలోకి అనుమతించ లేదు. అయితే, ఇటీవల అదే వ్యక్తికి అధికారులు రిజిస్టర్డ్‌ కాంట్రాక్టరుగా సర్టిఫికెట్‌ జారీ చేశారు. దీనికోసం ఆయన మతం మారి హిందూమతం స్వీకరించినట్టు స్వీయ నోటరీ సమర్పించినట్టు తెలిసింది. దీనిలో తన పేరు మార్చుకున్నట్టు పేర్కొన్నారు. ఇలా చేసినా.. ఆయన కుటుంబ జీవితం మాత్రం తన మతానికి అనుగుణంగా సాగిస్తున్నారు. దీనిపై ఈ నెల ప్రారంభంలో ఫిర్యాదు చేసినా చర్యలు లేకపోవడంతో 11వ తేదీన ఈవోకు, జేఈవోకు, నగల విభాగం ఉన్నతాధికారికి కూడా ఫిర్యాదు చేశాను. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకోవాలి’’ అని ఆర్‌. వేణుగోపాల్‌ కోరారు.శ్రీవారి పంచలోహ వస్తువులను శుభ్రపరిచే విధులను హిందూయేతరులైన కాంట్రాక్టర్లకు ఎలా అప్పగిస్తారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. ఆలయంలో ఏ విధుల్లోనైనా హిందూయేతరులను నియమించరాదని చట్టమే ఉందన్నారు. అయినా అధికారులు పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం దారుణమని, తక్షణం సంబంధిత హిందూయేతరుడైన రిజిస్టర్డ్‌ కాంట్రాక్టరును తొలగించాలని డిమాండ్‌ చేశారు.

5. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం నీలాచలం బోడికొండపై సోమవారం కోదండ రాముడు కొలువుదీరాడు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం వేదమంత్రోచ్ఛారణల మధ్య పండితుల ఈ క్రతువును వైభవంగా జరిపించారు. రామతీర్థం క్షేత్రం యావత్తూ జైశ్రీరామ్‌ నామస్మరణతో పులకించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పంతో ఈ ఆలయం మళ్లీ పూర్వవైభవం సంతరించుకుంది. రూ.3 కోట్ల నిధులతో పూర్తయిన కోదండ రామస్వామి వారి నూతన రాతి దేవాలయంలో గడిచిన మూడ్రోజులూ తిరుపతి, ద్వారకా తిరుమల నుంచి వచ్చిన వేద పండితులు నిర్విరామంగా ప్రత్యేక పూజలు చేశారు.ఆలయ ప్రారంభోత్సవం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలను పూర్తిచేశారు. వేకువజామున యాగశాలలో విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కుంభారాధన, దాతాది సామాన్య హోమం, పూర్ణాహుతి, యంత్ర, బింబ స్థాపనలు తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కోదండ రామస్వామి సన్నిధిలో ప్రత్యేక పూజల అనంతరం మంత్రులు శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం దిగువనున్న ప్రధాన ఆలయంలో సీతారామస్వామిని దర్శించుకున్నారు.కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు పెనుమత్స సూర్యనారాయణరాజు, ఇ.రఘురాజు, ఎమ్మెల్యేలు బడ్డుకొండ అప్పలనాయుడు, శంబంగి చిన వెంకట అప్పలనాయుడు, బొత్స అప్పలనర్సయ్య, దేవదాయ శాఖ రాష్ట్ర కమిషనర్‌ హరిజవహర్‌లాల్, కలెక్టర్‌ సూర్యకుమారి, ప్రత్యేకాధికారి భ్రమరాంబ ఎంపీపీ అంబళ్ల సుధారాణి, ట్రస్ట్‌ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

6. యాదగిరిగుట్టపై శ్రీపర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వరస్వామి ఆలయ ఉద్ఘాటన, మహాకుంభాభిషేకం సోమవారం వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆయన సతీమణి శోభ ఈ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. శ్రీలక్ష్మీనర్సింహస్వామి ప్రధానాలయ ఉద్ఘాటన గత నెల 28న సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా జరిగిన విషయం తెలిసిందే. యాదాద్రి పునర్నిర్మాణంలో భాగంగా కొండపై ఉన్న రామలింగేశ్వరుడి ఆలయాన్ని కూడా కొత్తగా నిర్మించారు.ఇటీవలే ఈ ఆలయ నిర్మాణం పూర్తికావడంతో ప్రారంభోత్సవ కార్యక్రమాలు ప్రారంభించారు. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో మహాకుంభాభిషేకం, ఉద్ఘాటన, స్పటిక లింగ ప్రతిష్టాపన చేపట్టారు. సీఎం కేసీఆర్, సతీమణి శోభ దంపతులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని లింగానికి అభిషేకం చేశారు. అనంతరం పూజారులు అష్టబంధనం, ప్రాణ ప్రతిష్ట, ప్రతిష్టాంగ హోమము, అఘోర మంత్ర హోమము, దిక్దేవతా క్షేత్రపాల బలిహరణము, కలశ ప్రతిష్ట, పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిం చారు. పూర్ణాహుతిలో పాల్గొన్న తర్వాత సీఎం కేసీఆర్‌ దంపతులకు యాగ మండపంలో మాధవా నంద సరస్వతి స్వామి ఆశీర్వచనం అందజేశారు. అనంతరం రామలింగేశ్వరస్వామి ఆలయాన్ని తీర్చి దిద్దిన స్తపతి బాలసుబ్రహ్మణ్యంను శాలువాతో సన్మానించి, బంగారు కంకణాన్ని చేతికి తొడిగారు.

7. తిరుమలలో ఇతర చానళ్ల ప్రసారాల బాధ్యులపై టీటీడీ చర్యలు
తిరుమలలోని ఎస్వీబీసీకి చెందిన ఐదు ఎల్‌ఈడీ స్క్రీన్‌లలో ఈ నెల 22వ తేదీ సాయంత్రం 5.12 నుంచి 6.12 గంటల వరకు 3 ఇతర చానళ్ల కార్యక్రమాలు ప్రసారమైన ఘటనకు బాధ్యుడైన గ్రేడ్‌–1 అసిస్టెంట్‌ టెక్నీషియన్‌ పి.రవికుమార్‌ను సస్పెండ్‌ చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. రేడియో అండ్‌ బ్రాడ్‌ కాస్టింగ్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఎ.వి.వి.కృష్ణప్రసాద్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసింది.తిరుమలలో ఎస్వీబీసీకి చెందిన ఎల్‌ఈడీ స్క్రీన్‌లలో ఇతర చానళ్ల కార్యక్రమాలు ప్రసారమైన ఘటనపై టీటీడీ ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి వెనువెంటనే స్పందించారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని సీవీఎస్వో నరసింహకిషోర్‌ను ఆదేశించారు. ఈ మేరకు సంబంధిత విజిలెన్స్‌ అధికారులు విచారణ జరిపారు. ఘటన జరిగిన సమయంలో అసిస్టెంట్‌ టెక్నీషియన్‌ పి.రవికుమార్‌ కర్నూలుకు చెందిన తన స్నేహితుడు గోపికృష్ణతో కలిసి బ్రాడ్‌ కాస్టింగ్‌ టీవీ సెక్షన్‌ కంట్రోల్‌ రూంలోకి ప్రవేశించినట్లు గుర్తించారు.కొంత సమయం తరువాత రవికుమార్‌తో పాటు అక్కడి ఉద్యోగులు అందరూ బయటకి రాగా, సాయంత్రం 5.28 గంటల వరకు గోపికృష్ణ మాత్రమే కంట్రోల్‌ రూంలో ఉన్నట్లు గుర్తించారు. ఆ సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు విచారణలో నిర్థారణ అయింది. ఈ మేరకు పి.రవికుమార్‌ను సస్పెండ్‌ చేయగా, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ఎ.వి.వి.కృష్ణ ప్రసాద్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేశారు.

8. భద్రాద్రి రామయ్యను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు వచ్చిన మంత్రి దంపతులకు ఈవో శివాజీ ఘన స్వాగతం పలికారు. ప్రధాన ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాముల ఎదుట అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రితో పాటు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు స్వామివారిని దర్శించుకున్నారు