Movies

బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న సినీనటుడు రామ్ చరణ్

బెజవాడ  దుర్గమ్మను దర్శించుకున్న సినీనటుడు రామ్ చరణ్

మెగాస్టార్‌ చిరంజీవి, ఆయన తనయుడు మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ నటించిన తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మరో రెండు రోజుల్లో (ఏప్రిల్‌ 29న) రిలీజ్‌ కానుంది. ఈ క్రమంలో రామ్‌ చరణ్‌, కొరటాల శివ కృష్ణా జిల్లాలోని విజయవాడలో ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ విషయం తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున ర్యాలీలు చేపట్టారు. అనంతరం రామ్‌చరణ్‌ను చూసేందుకు దుర్గమ్మ ఆలయం లోపలికి దూసుకొచ్చారు.దుర్గగుడి అంతరాలయంలో జై చరణ్‌ అంటూ నినాదాలిచ్చారు. మొబైల్‌ ఫోన్లతో వీడియోలు తీశారు. ఈ క్రమంలో ఆలయంలోని కానుకల హుండీలపై నిలబడ్డారు. పోలీసులు, ఆలయ అధికారుల సమన్వయ లోపం కారణంతో అక్కడ గందరగోళం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో క్యూలైన్లలో నిల్చున్న భక్తులు చాలాసేపు ఇబ్బందులు పడ్డారు. దుర్గ గుడి దర్శనం అనంతరం చరణ్‌, శివ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.