Movies

హీరోయిన్‌గా ఆమని మేనకోడలు.. పోస్టర్‌ విడుదల

హీరోయిన్‌గా ఆమని మేనకోడలు.. పోస్టర్‌ విడుదల

సినీ ఇండస్ట్రీలో వారసత్వంగా హీరో, హీరోయిన్లు కావడం సర్వసాధరణమే. కొంచెం టాలెంట్‌ ఉండి, వారసత్వం తోడేతే చిత్ర పరిశ్రమలో త్వరగా నిలుదొక్కుకోవచ్చు. ఇదే తరహాలో మరో బ్యూటీ వెండితెరకు పరిచయం కానుంది. హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఆమని. శుభలగ్నం, మావి చిగురు, మిస్టర్‌ పెళ్లాం వంటి తదితర సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన ఆమె ప్రస్తుతం తల్లి పాత్రల్లో మెప్పిస్తోంది. ఆమని నట వారసురాలిగా ఆమె మేనకోడలు హృతిక వెండితెరపై అలరించడానికి సిద్ధమైంది. బాల నటిగా 3 సినిమాల్లో నటించిన హృతిక హీరోయిన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.