Politics

వైసీపీ ప్రభుత్వంపై బుచ్చయ్యచౌదరి ఫైర్ – TNI రాజకీయ వార్తలు

వైసీపీ ప్రభుత్వంపై బుచ్చయ్యచౌదరి ఫైర్   – TNI రాజకీయ వార్తలు

* ముఖ్యమంత్రి ఇంటికి సమీపంలోనే విజయవాడలో అత్యాచారం జరిగితే నిందితులపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.ప్యాక్షన్ ముఖ్యమంత్రి పాలనలో మహిళలకు రక్షణ లేదన్నారు. వైసీపీ మూడేళ్ల పాలనలో 1500 మంది మహిళల పై అత్యాచారాలు జరిగాయని ఆరోపించారు. దిశ చట్టం వల్ల ఎంతమంది బాదిత మహిళలకు న్యాయం జరిగిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వాసిరెడ్డి పద్మ, రోజా, లక్ష్మీపార్వతిలు ఫెయిడ్ ఆర్టిస్ట్ లని విమర్శించారు. మహిళలను వేధించే వారిపై మహిళలు తిరగబడాలని సూచించారు. నడిరోడ్డుపై చెప్పుతో కొట్టాలని సూచించారు. మహిళలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. మహిళలకు రక్షణ కల్పించలేని ముఖ్యమంత్రిని పదవి నుంచి తప్పించాలన్నారు.

*ద‌ళితుల జీవితాల్లో ద‌ళిత బంధు ఒక న‌వ‌శ‌కం : ఎమ్మెల్యే బాల్క సుమ‌న్
ద‌ళితుల జీవితాల్లో ద‌ళిత బంధు ఒక న‌వ‌శ‌కం అని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ స్ప‌ష్టం చేశారు. టీఆర్ఎస్ ప్లీన‌రీ వేదిక‌గా బాల్క సుమ‌న్ మాట్లాడుతూ.. దేశంలో అత్యంత వెనుబ‌డిన జాతి ద‌ళిత జాతి అని తెలిపారు. క‌శ్మీర్ నుంచి క‌న్యాకుమారి వ‌ర‌కు అన్యాయానికి గురైన జాతి ద‌ళిత జాతి. ఈ ద‌ళిత జాతికి సంబంధించి గుర్రం జాషువా గ‌బ్బిలం కావ్యంలో స్ప‌ష్టంగా రాశారు. భార‌తావ‌ని ద‌ళిత‌జాతికి బాకీ ప‌డింద‌ని చెప్పారు. దాన్ని పూర్తిస్థాయిలో గుర్తించిన మ‌హానుభావుడు కేసీఆర్ మాత్ర‌మే. ద‌ళిత‌జాతికి భార‌తావ‌ని బాకీ ప‌డ్డ‌ద‌ని కేసీఆర్ గుర్తించి ద‌ళిత‌బంధు లాంటి ప‌థ‌కం ద‌ళిత‌జాతి కోసం తీసుకొచ్చారు. కానీ మోదీ ప్ర‌భుత్వం మాత్రం భార‌త‌జాతి అంబానీ, అదానీకి బాకీ ప‌డ్డ‌ద‌ని చెప్పి దేశానికి సంబంధించిన ల‌క్ష‌ల కోట్ల సంప‌ద‌ను వారికి అప్ప‌జెప్పుతున్నారు. ఇందుకు బాధ‌ప‌డుతున్నాను అని సుమ‌న్ పేర్కొన్నారు.

*కొత్త విద్యుత్‌ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయాలి : మంత్రి పెద్దిరెడ్డి
ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ కోతలు ఇతర రాష్ట్రాల కంటే తక్కువగా ఉన్నాయని ఏపీ విద్యుత్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఇవాళ విద్యుత్‌ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఏపీలో నిర్మిస్తున్న కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. కృష్ణపట్నం స్టేజ్ 2 ప్లాంట్ ను, ఎన్టీపిఎస్ స్టేజ్ -5 పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు.ఈ రెండు ప్లాంట్లు వినియోగంలోకి వస్తే ప్రస్తుత సామర్ధ్యానికి అదనంగా 1600 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. కొత్త హైడల్ ప్రాజెక్ట్ ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు ఇచ్చారు. విద్యుత్ కొరతను తీర్చే అంశంలో కొత్త విద్యుత్ ప్రాజెక్టులను వేగవంతం చేయాల్సి ఉందని వివరించారు.

*వాసిరెడ్డి పద్మ, అనిత మధ్య తీవ్ర వాగ్వాదం
రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మహిళా కమిషన్ ఛాంబర్‌లో వాసిరెడ్డి పద్మ, తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనితకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. జగన్ పాలనలో ఊరికో ఉన్మాది పేరిట రూపొందించిన పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అనిత అందజేశారు. 800కు పైగా జరిగిన అఘాయిత్యాల్లో ఎంతమందికి నోటీసులు ఇచ్చారని నిలదీశారు. పుస్తకాన్ని పరిశీలించి తప్పక సమాధానం ఇస్తానని వాసిరెడ్డి పద్మ తెలిపారు. కార్యాలయం వద్ద హైటెన్షన్…అంతకు ముందుకు మహిళా కమిషన్ కార్యాలయం వద్ద హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మహిళా కమిషన్‌ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన మహిళకు న్యాయం చేయాలంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్‌ చేశారు. కాగా అనితతో సహా పలువురు మహిళా ప్రతినిధులను పోలీసులు అడ్డుకున్నారు. మహిళలని కూడా చూడకుండా పురుష పోలీసులు దురుసుగా వ్యవహరించారు. మగ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మహిళలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. లోపలకి అనుమతించేదాకా ఇక్కడ నుంచి వెళ్లేది లేదని అనిత తేల్చి చెప్పారు. మహిళా కమీషన్‌ కార్యాలయంలోకి మహిళలకు అనుమతి లేదా? అని ప్రశ్నించారు. దీంతో మహిళలకు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఎండలో దాదాపు 2 గంటల పాటు కమిషనర్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. మహిళా కమిషన్‌ను కలిసేందుకు వంగలపూడి అనితతో పాటు బాధిత కుటుంబ సభ్యులు కార్యాలయానికి వచ్చారు.

*సింహపురి సిగలో ఇప్పుడు ఆకాశవాణి కూడా చేరింది: వెంకయ్యనాయుడు
తెలుగుగంగ కాలనీలోని ఆకాశవాణి కేంద్రానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేరుకోనున్నారు. ఉపరాష్ట్రపతికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. ఆలిండియా ఎఫ్‌ఎం స్టేషన్ 100 మీటర్ల టవర్‌ని ప్రారంభించి వెంకయ్య నాయుడు జాతికి అంకితం చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేయర్ స్రవంతీ జయవర్దన్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. నగల తయారీకి నెల్లూరు పెట్టింది పేరని.. వెంకటగిరి జరీ చీర గురించి తెలీని వారుండరని పేర్కొన్నారు. సింహపురి సిగలో ఇప్పుడు ఆకాశవాణి కూడా చేరిందన్నారు. రేడియో ప్రసారాల్లో నెల్లూరు యాస, బాస ఉండేలా చూడాలన్నారు. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

*ఎన్టీఆర్, కేసీఆర్ మరవలేని నేతలు: కేటీఆర్
జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై తీర్మానం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చరిత్రలో మరవలేని నేతలు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి చరిత్ర సృష్టించాచారని గుర్తుచేశారు. కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీని సృష్టించారని పేర్కొన్నారు. ఎండిపోయిన శ్రీరాంసాగర్‌కు కేసీఆర్ జీవకళ తీసుకొచ్చారని అన్నారు. మన పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. రైతుబంధు పథకం కేంద్రానికి ప్రేరణ అయ్యిందన్నారు. టీఎస్ ఐపాస్‌లా కేంద్రం సింగిల్ విండో తీసుకొచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జనహితమే ధ్యేయంగా తెలంగాణ దూసుకెళ్తుందన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. మత, కుల పిచ్చిలేని సంక్షేమ దిశలో ముందుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఫల్యాల చరిత్ర బీజేపీదన్నారు. దేశానికి టెలివిజన్ నాయకుడు కాదు.. విజన్ ఉన్న నాయకుడు కావాలన్నారు.

*చంద్రబాబుపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుపై మంత్రి రోజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబే పెద్ద ఉన్మాదని అన్నారు. టీడీపీ నేతలు సీఎం జగన్ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే సహించేది లేదని, చర్యలు తీసుకుంటామని అన్నారు. కొడుకును ఎమ్మెల్యేగా గెలిపించుకోలేని చంద్రబాబు.. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్‌ చీరలు కట్టుకోవాలన్నారు. చీర కావాలో.. చుడిదార్‌ కావాలో టీడీపీ నేతలు తేల్చుకోవాలన్నారు. టీడీపీ మహిళ ద్రోహి పార్టీ అని రోజా తీవ్రస్థాయిలో విమర్శించారు.టీడీపీలో ఉన్న ఉన్మాదులు దేశంలో ఎక్కడా లేరని మంత్రి రోజా అన్నారు. మహిళ కనిపిస్తే వాటేసుకోవాలి, ముద్దుపెట్టుకోవాలని.. చంద్రబాబు వియ్యంకుడు అనలేదా.. అని ఎమ్మెల్యే బాలకృష్ణను ఉద్దేశించి ఆమె అన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అచ్చోసిన ఆంబోతని దుయ్యబట్టారు. మహిళలను బూటుకాలితో తన్నిన చరిత్ర టీడీపీదని అన్నారు. బాధితురాలికి పరామర్శ పేరుతో హడావుడి చేశారని, టీడీపీ ఎందుకు నిరసనలు చేస్తుందో అర్థం కావడం లేదని రోజా వ్యాఖ్యానించారు.

*జగన్ అన్ని ఆలోచించే చేశారు: ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు
సీఎం జగన్ అన్ని ఆలోచించే కొత్త క్యాబినెట్ కూర్పు చేశారని వైసీపీ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. క్యాబినెట్‌లో బీసీలు, ఎస్సీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు. ఒకరిద్దరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన సీఎం ఎన్నికలకు ముందు చెప్పిందే చేశారని అన్నారు. టీడీపీలో చేరతున్నానంటూ గతంలో ప్రచారం చేశారని, ఇప్పుడు ప్రచారం చేస్తున్నారని.. దీనిపై తానేమీ స్పందించనని ఎంపీ శ్రీకృష్ణదేవరాయులు స్పష్టం చేశారు.

*అధికారం పోతుందని సీఎం జగన్ భయపడుతున్నారు: బుద్దా వెంకన్న
రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా టీడీపీ నేత బుద్దా వెంకన్న నేతృత్వంలో ఆందోళన చేపట్టారు. మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ అధికారం పోతుందని సీఎం జగన్ భయపడుతున్నారని అన్నారు. ఎంపీ విజయసాయి రెడ్డి ముఖ్యమంత్రిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారన్నారు. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వకుంటే అప్రూవరుగా మారతానని విజయసాయి రెడ్డి జగన్‌కు స్పష్టం చేశారని, బ్లాక్ మెయిల్ చేయడం వల్లే.. పక్కన పెట్టిన విజయసాయి రెడ్డికి అందరికంటే పెద్ద పదవి ఇచ్చారన్నారు. విజయసాయిని సీఎం జగన్ పక్కన పెట్టారని తాము అనడం లేదని, వైసీపీ నేతలే అంటున్నారన్నారు. విజయసాయిరెడ్డికి ఉన్నట్టుండి కీలక బాధ్యతలు అప్పజెప్పారంటే అందుకు బ్లాక్ మెయిలే కారణమన్నారు

*ఒక్క ఛాన్స్ అంటే.. నమ్మి గెలిపిస్తే.. నట్టేట ముంచాడు: నక్కా ఆనంద్ము
ఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటలకు, చేష్టలకు సంబంధం లేదని టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు అన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన మోసాలను నిరసిస్తూ మాల మహాసేన ధర్మ పోరాట దీక్షలో నక్కా ఆనంద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఒక్క ఛాన్స్ అంటే.. నమ్మి గెలిపిస్తే.. నట్టేట ముంచారని విమర్శించారు. దళిత వర్గాలను పూర్తిగా దెబ్బ కొట్టారన్నారు. రాజ్యాంగ పరంగా వచ్చిన హక్కులను కాలరాశారని విమర్శించారు. దళితుల అభ్యన్నతి కోసం చంద్రబాబు అనేక సంక్షేమ పధకాలను అమలు చేశారని గుర్తుచేశారు. వాటన్నింటినీ పూర్తిగా రద్దు చేసి దళితులను దగా చేశారని ఆయన ఆరోపించారు. విదేశీ విద్యా, ఉపాధి కార్యక్రమాలు నిలిపివేశారని, సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించారన్నారు. జగన్ చేసిన అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. హత్యలు, అత్యాచారాలు, శిరో మండనం వంటి దారుణాలు చూశామన్నారు. జగన్ పాలనతో ప్రజలు విసిగిపోయారని తెలిపారు. ప్రభుత్వం రద్దు చేసిన 27 పధకాలను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. జగన్ మాయ మాటలతో మోసం చేయడం మానుకోవాలన్నారు. దళితుల కోసం ఎవరేం చెశారో చర్చకు సిద్ధమని నక్కా ఆనంద బాబు సవాల్ విసిరారు.

*ఎన్టీఆర్, కేసీఆర్ మరవలేని నేతలు: కేటీఆర్
జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ పాత్రపై తీర్మానం చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. చరిత్రలో మరవలేని నేతలు ఎన్టీఆర్, కేసీఆర్ మాత్రమేనని ఆయన కొనియాడారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించి చరిత్ర సృష్టించాచారని గుర్తుచేశారు. కేసీఆర్ హిస్టరీతో పాటు జాగ్రఫీని సృష్టించారని పేర్కొన్నారు. ఎండిపోయిన శ్రీరాంసాగర్‌కు కేసీఆర్ జీవకళ తీసుకొచ్చారని అన్నారు. మన పథకాలను కేంద్రం కాపీ కొడుతోందన్నారు. రైతుబంధు పథకం కేంద్రానికి ప్రేరణ అయ్యిందన్నారు. టీఎస్ ఐపాస్‌లా కేంద్రం సింగిల్ విండో తీసుకొచ్చిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. జనహితమే ధ్యేయంగా తెలంగాణ దూసుకెళ్తుందన్నారు. దేశంలో 24 గంటల కరెంట్ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. దేశానికి అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అన్నారు. మత, కుల పిచ్చిలేని సంక్షేమ దిశలో ముందుకెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలు నూకలు తినాలని అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వైఫల్యాల చరిత్ర బీజేపీదన్నారు. దేశానికి టెలివిజన్ నాయకుడు కాదు.. విజన్ ఉన్న నాయకుడు కావాలన్నారు.

*ఆ 8 రాష్ట్రాలు పెట్రోలుపై వ్యాట్ తగ్గించాలి : మోదీt
పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సయిజ్ సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తగ్గించిందని, ఆ ప్రయోజనాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు బదిలీ చేయడం లేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. వీటిపై వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)ను కొన్ని రాష్ట్రాలు తగ్గించలేదని, దీనివల్ల ప్రజలకు అన్యాయం జరుగుతోందని చెప్పారు. ఇప్పటికైనా ప్రజలకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.దేశంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితి గురించి ముఖ్యమంత్రులతో బుధవారం జరిగిన సమావేశంలో మోదీ మాట్లాడుతూ, అంతర్జాతీయ పరిస్థితుల వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సవాళ్ళకు సంబంధించిన వేరొక అంశం గురించి మాట్లాడాలని అనుకుంటున్నానని తెలిపారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి పరోక్షంగా ప్రస్తావిస్తూ, యుద్ధం జరుగుతోందని, ఈ పరిస్థితి సరఫరాల వ్యవస్థపై ప్రభావం చూపుతోందని చెప్పారు. ఇటువంటి పరిస్థితుల్లో సవాళ్ళు రోజు రోజుకూ పెరుగుతున్నాయని తెలిపారు. ఈ అంతర్జాతీయ సంక్షోభం అనేక సవాళ్ళను తీసుకొస్తోందన్నారు. ఇటువంటి పరిస్థితిలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్యతత్వం, సమన్వయ స్ఫూర్తి మరింత పెరగడం అత్యవసరమని చెప్పారు. *బీసీల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికే మార్గం బీసీల సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికే ఏకైక మార్గమని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు డేరంగుల ఉదయ్‌ కిరణ్‌ స్పష్టం చేశారు. విజయవాడలో మంగళవారం రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షుడితో పాటు 26 జిల్లాల బీసీ సంఘం అధ్యక్షుల నియామకం జరిగింది. ఉదయ్‌ కిరణ్‌ మాట్లాడుతూ.. విద్య, ఉపాధి, ఆర్థిక, రాజకీయ అంశాలలో జనాభా ప్రాతిపదికన ప్రాధాన్యం కల్పిస్తేనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. బీసీల రాజకీయ అభివృద్ధికి నూతన రాజకీయ పాలసీ అవసరమని సంఘం పేర్కొంది. అనంతరం బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా టి.బాలాజీ ప్రసాద్‌ రెడ్డితో పాటు 26 జిల్లాల అధ్యక్షులను ఉదయ్‌ కిరణ్‌ ప్రకటించారు. అనంతపురం అధ్యక్షులుగా భరత్‌కుమార్‌ లోయ, కర్నూల్‌ కు రంగస్వామి, సత్యసాయికి ఎస్‌.విష్ణు, నంద్యాలకు ఎస్‌.వలి, అన్నమయ్యకు కృష్ణవేణి, వై.ఎస్‌.ఆర్‌.కు డి.వాసు, తిరుపతికి ఇ.పుల్లయ్య, చిత్తూరుకు ఎస్‌.వేలు, ప్రకాశంకు కె.శ్రీనివాసాచారి, బాపట్లకు రాజశేఖర్‌, గుంటూరుకు శ్రీరాం రాజేశ్వరరావు, కృష్ణాజిల్లాకు కె.అప్పారావు, ఏలూరుకు శ్రీనివాసకుమార్‌, పశ్చిమగోదావరికి ఫణీంద్ర కుమార్‌, తూర్పు గోదావరికి లక్ష్మీపతిరావు, కాకినాడకు అడ్డాల వీరభధ్రరావు, కోనసీమకు చందన వెంకటేశ్వరరావు, విశాఖకు కె.జగన్నాథరావు, అనకాపల్లికి కె.శ్రీనివాసరావు, సీతారామరాజు జిల్లాకు గోపి, పార్వతీపురం మన్యంకు డాక్టర్‌ కె.వి.లక్ష్మణ్‌, విజయనగరం జిల్లాకు జి.సూరిబాబు, శ్రీకాకుళం జిల్లాకు రంగబాబులను నియమించారు.

*ఎర్రచందనం స్మగ్లింగ్‌పై ఉక్కుపాదం: మంత్రి పెద్దిరెడ్డి
ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని, రాష్ట్ర సరిహద్దుల్లో చెక్‌పోస్టులతో నిఘా మరింత పటిష్ఠం చేయాలని అటవీ, పర్యావరణశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం అమరావతి సచివాలయంలో అటవీ అధికారులతో సమీక్షించారు. ఎర్రచందనం అక్రమ రవాణాను పూర్తి స్థాయిలో నియంత్రించేందు కు సరిహద్దు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల అటవీ, పోలీస్‌ ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశాలు త్వరలో నిర్వహిస్తామన్నారు. టాస్క్‌ఫోర్స్‌లో సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అనంతరం మంత్రి ఏపీ స్టేట్‌ బయో డైవర్సిటీ బోర్డు అధికారులతో సమీక్ష జరిపారు. మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు బయో డైవర్సిటీ బోర్డు నిబంధనలను పాటించేలా చూడాలని ఆదేశించారు.

*పర్యాటకులకు మెరుగైన వసతులు: మంత్రి రోజా
పర్యాటకులకు రాష్ట్రంలో మెరుగైన వసతులు కల్పిస్తామని మంత్రి రోజా అన్నారు. విజయవాడ కృష్ణానదిలో మంగళవారం ఆమె బోధిసిరి బోటును తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 2004లో దివంగత వైఎస్‌ ప్రారంభించిన బోధిసిరి బోటును తిరిగి తాను పునఃప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. టూరిజానికి సీఎం జగన్‌ పెద్ద పీట వేస్తున్నారన్నారు.

*మైనార్టీలను జగన్‌ ఉద్ధరించిందేమీ లేదు: జలీల్‌ఖాన్‌
సీఎం జగన్‌ ముస్లిం మైనార్టీలను ఉద్ధరించిందేమీ లేదని టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ విమర్శించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీలకు టీడీపీ హయాంలో ఏం జరిగిందో తాను చెబుతానని, వైసీపీ హయాంలో ఏం జరిగిందో చర్చించేందుకు సీఎం జగన్‌గానీ, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుగాని బహిరంగ చర్చకు సిద్ధమా? అని సవాల్‌ విసిరారు. పత్రిపక్ష నేతగా యథేచ ్ఛగా తిరిగిన జగన్‌.. నేడు భారీ బందోబస్తు, ఇనుప ముళ్ల కంచెల మధ్య బతుకుతున్నాడన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో వైఫల్యం చెందినందువల్లే జగన్‌ ధైర్యంగా ప్రజల్లోకి రాలేని దైన్య స్థితిలో ఉన్నాడన్నారు. రెండు మూడు చైర్మన్‌ పదవులు ఇచ్చేసి ముస్లిం మైనార్టీలను ఉద్ధరించినట్టుగా ప్రభుత్వ పెద్దలు వ్యవహరిస్తున్నారన్నారు.

*రాష్ట్రంలో మాఫియారాజ్‌ నడుస్తోంది: లోకేశ్‌
రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో మంగళవారం ఆయన పర్యటించారు. సీఎం కాన్వాయ్‌కే కారు కావాలంటూ ఓ కుటుంబాన్ని నడిరోడ్డు మీద వదలి కారు పట్టుకుపోయారని, ప్రభుత్వ ఆసుపత్రిలో యువతిపై సామూహిక అత్యాచారం జరిగితే పరామర్శకు వెళ్లిన చంద్రబాబుకు నోటీసులు ఇచ్చారని, పిల్లలు ఆడుకుంటూ ఫ్లెక్సీ చింపితే పోలీస్‌స్టేషన్‌లో పెట్టి వేధించారని, రుయా ఆసుపత్రిలో బిడ్డ మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్‌ మాఫియా రూ.20వేలు అడిగిందని, రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్‌రెడ్డి మాఫియారాజ్‌ అరాచకాలే కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు.