DailyDose

వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం.. ఉద్రిక్తత – TNI తాజా వార్తలు

వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం.. ఉద్రిక్తత   – TNI తాజా వార్తలు

*మహిళా కమిషన్ ఛాంబర్‌లో వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘జగన్ పాలనలో ఊరికో ఉన్మాది’ పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అందించారు. చంద్రబాబు , బొండా ఉమలకు నోటీసులు ఇచ్చే అధికారం కమిషన్కు లేదన్నారు. మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. తెలుగు మహిళల ముట్టడితో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది.మహిళా కమిషన్ ఛాంబర్‌లో వాసిరెడ్డి పద్మ, వంగలపూడి అనిత మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ‘జగన్ పాలనలో ఊరికో ఉన్మాది’ పుస్తకాన్ని వాసిరెడ్డి పద్మకు అందించారు. 800కు పైగా జరిగిన అఘాయిత్యాల్లో ఎందరికి నోటీసులు ఇచ్చారని ప్రశ్నించారు. పుస్తకాన్ని పరిశీలించి సమాధానం ఇస్తానని కమిషన్ ఛైర్‌పర్సన్‌ పద్మ తెలిపారు.వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మహిళా కమిషన్ కార్యాలయాన్ని తెలుగు మహిళలు ముట్టడించి, నిరసనలు తెలిపారు. తెలుగు మహిళల ముట్టడితో మహిళా కమిషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. మహిళలపై జరిగిన దాడుల్లో ఎంతమందిపై చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. నోటీసులు ఇచ్చే అధికారం మహిళా కమిషన్‌కు లేదని తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో విజయవాడ అత్యాాచార బాధితురాలి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.”కమిషన్‌కు విజ్ఞాపన పత్రం ఇచ్చేందుకు 30 మంది వచ్చాం. కమిషన్‌కు ఫిర్యాదు చేసే హక్కు మాకుంది. ఆస్పత్రిలో అత్యాచారం కేసులో తీసుకున్న చర్యలు ఏమిటి? -వంగలపూడి అనిత, తెెెలుగు మహిళ అధ్యక్షురాలు
బొండా ఉమ: మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిని వదిలేసి బాధితులకు అండగా నిలుస్తున్న తెలుగుదేశం నాయకులకు నోటీసులు ఇచ్చే అధికారం మహళా కమిషన్‌కు లేదని బొండా ఉమ అన్నారు. తెలుగు మహిళ నాయకులతో కలిసి విజయవాడ ఆసుపత్రి అత్యాచార బాధితురాలి తల్లిదండ్రులకు 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. మహిళా కమిషన్‌ ఛైర్మన్‌ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్ష నేతలకు నోటీసులివ్వడంలో ఉన్న శ్రద్ధ, బాధితులను ఆదుకోవడం, నిందితులను శిక్షించడంలో పెడితే బాగుంటుందని హితవు పలికారు.

* దేశంలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో కేంద్రం అప్రమత్తమైంది. అందులో భాగంగానే కోవిడ్‌పై తాజా పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యులపై ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యలమంత్రులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘కొద్ది రోజులుగా దేశంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఇతర దేశాలతో పోలిస్తే దేశంలో కోవిడ్‌ సంక్షోభాన్ని పూర్తి స్థాయిలో ఎదుర్కొన్నప్పటికీ కేసులు పెరుగుతుండటం ఆందోళనకర అంశం. మనమంతా అప్రమత్తంగా ఉండాలి. కోవిడ్‌ సవాలును అధిగమించాలి. ఈ విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య సమన్వయం చాలా ముఖ్యం..దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. మన దేశ వయోజన జనాభాలో 96% మంది మొదటి డోస్ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తైంది.’’ అని అన్నారు. కాగా, తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు.

* రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఇవాళ్టి (ఏప్రిల్‌ 27, బుధవారం) నుంచి మే 9 వరకు జరగనున్న ఈ పరీక్షలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసింది. మొత్తం 6,22,537 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరిలో 3,20,063 మంది బాలురు కాగా 3,02,474 మంది బాలికలు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం 3,776 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది.పదో తరగతి పరీక్షలు నిర్దేశిత తేదీల్లో రోజూ ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు జరుగుతాయి. విద్యార్థులు ఉదయం 8.30 గంటలకల్లా పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలి. పరీక్ష కేంద్రాల్లోకి 9.30 గంటల వరకు అనుమతిస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలకు అనుమతించబోమని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి తెలిపారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 26 జిల్లాలు ఉన్నందున పూర్వపు 13 జిల్లాల విద్యాధికారులే కొత్త జిల్లాలకూ నోడల్‌ అధికారులుగా వ్యవహరించనున్నారు.

*టీటీడీపై శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి ఫైర్ అయ్యారు. భక్తులకు సౌకర్యాల కల్పనలో టీటీడీ విఫలమైందని పరిపూర్ణానంద స్వామి మండిపడ్డారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నా టీటీడీ ఇప్పటివరకు పందిళ్ళు వేయకపోవడం బాధాకరమన్నారు. వసంతోత్సవంసహస్ర కళశాభిషేకంను టీటీడీ రద్దు చేసిందన్నారు. స్వామివారికీ నిర్వహించే సేవలను రద్దు చేసే హక్కు టీటీడీకి లేదని స్పష్టం చేశారు. ఇలానే చేసుకుంటూపోతే రాబోయే రోజుల్లో శ్రీవారి దర్శనాన్ని కూడా రద్దు చేస్తారని పేర్కొన్నారు.

*వైద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.కొవిడ్ కట్టడి చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. రుయా ఆస్పత్రి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. అలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా పెట్టాలని జగన్ తెలిపారు. ఒకట్రెండు ఘటనలతో మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

*నెల్లూరు: జిల్లాలోని ఆత్మకూరు రెయిన్ బో స్కూల్ వద్ద పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గదుల్లో ఫ్యాన్‌లు, తాగు నీరు లేక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. స్కూల్‌లో ప్రైవేటు వ్యక్తులు ఇష్టానుసారంగా తిరుగుతున్నారని తల్లిదండ్రులు వెల్లడించారు.

* రాష్ట్రంలో మహిళలపై హత్య, అత్యాచారాలకు నిరసనగా తణుకులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఆడబిడ్డలకు రక్షణ కావాలనిజగన్ పోవాలంటూ అంటూ నినాదాలు చేశారు. దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అంటూ నినాదాలు చేశారు. నరేంద్ర సెంటర్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ విగ్రహం వద్ద మహిళలు నిరసన వ్యక్తం చేశారు.

*అత్యాచార బాధితురాలి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఆర్ధిక సాయం చేసింది. టీడీపీ తరపున ఆ పార్టీ నేత బోండా ఉమ, వంగలపూడి అనిత రూ.5 లక్షలు అందజేశారు. ఈ సందర్బంగా బోండా ఉమ మీడియాతో మాట్లాడుతూ బాధిత కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని స్పష్టం చేశారు. తాము బాధిత కుటుంబానికి అండగా ఉంటే నోటీసులిచ్చారని మండిపడ్డారు. మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. అసలు మహిళా కమిషన్‌ అధికారాలు, హక్కులు వాసిరెడ్డి పద్మకు తెలుసా? అని ప్రశ్నించారు. అనర్హత కలిగిన వ్యక్తి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్నారని, ఆమె రాజకీయ వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వాసిరెడ్డి పద్మను పదవి నుంచి తప్పించాలని బోండా ఉమా డిమాండ్ చేశారు.

*విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గం జనసేన కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముస్లిం సమస్యలపై వన్ టౌన్ నెహ్రూ సెంటర్‌లో ధర్నాకు జనసేన నేత పోతిన మహేష్ పిలుపునిచ్చారు. కాగా పోతిన మహేష్‌ను పోలీసులు అడ్డుకున్నారు. సీఎం గో బ్యాక్ అంటూ జనసేన సైనికులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ముస్లిం సమస్యలపై ధర్నా నిర్వహిస్తుంటే పోలీసులు అడ్డుకుంటున్నారన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక ముస్లింల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. ముస్లింల అభివృద్ధి కుంటుపడిందన్నారు. ముస్లింలకు ఏమి లబ్ది చేకూర్చారంటూ జగన్‌ను జనసేన నేత సూటిగా ప్రశ్నించారు. ముస్లింల అభివృద్ధికి పాటుపడని ముఖ్యమంత్రి జగన్‌కు విజయవాడలో ఇఫ్తార్ విందు ఇచ్చే హక్కు లేదన్నారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు రీ సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి బినామీల చేతుల్లో ఉన్న వక్ఫ్‌బోర్డ్ ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. వక్ఫ్ బోర్డ్ ఆస్తులు రక్షించాలని పోతిన మహేష్ డిమాండ్ చేశారు.

*ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్‌సీ ఇచ్చినప్పటి నుంచి షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. తాజాగా మరో షాక్‌ తగిలింది. గత సంవత్సరం డీఏ బిల్లులు అప్‌లోడ్‌ చేయకుండా ప్రభుత్వం సీఎఫ్‌ఎంఎస్‌లో లాగిన్‌ క్లోజ్‌ చేసింది. ఇప్పటికే డీఏ బిల్లులను ప్రభుత్వం వెనక్కి పంపించేసింది. డీడీఓల నుంచి మరల సబ్‌ ట్రెజరీలకు డీఏ బిల్లులు వచ్చాయి. డీఏ బిల్లులను అప్‌లోడ్ చేసే ప్రభుత్వం లాగిన్‌ను మూసివేసింది. వేతనాలు, పెన్షన్లు మినహా మరే బిల్లు అప్‌లోడ్‌కు సీఎఫ్‌ఎంఎస్‌ అవకాశం ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3 వేల కోట్ల రూపాయల డీఏ బిల్లులు ఆగిపోయాయి.*సమాచార హక్కు చట్టం అర్జీలకు నిర్దేశిత సమయంలో సమాచారం ఇవ్వాలని దేవదాయ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ అధికారులను ఆదేశించారు. ఆర్టీఐలో పేరుకుపోయిన అర్జీలపై మంగళవారం ఆయన సమీక్షించారు. కమిషనరేట్‌లో ప్రస్తుతం 60కి పైగా అర్జీలు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. కాగా, ఆర్టీఐ విభాగం చూసే అధికారికి దాంతోపాటు ఇతర బాధ్యతలు అప్పగించడం వల్లే సమాచారం ఇవ్వడంలో జాప్యం జరుగుతోందని సహోద్యోగులే ఆరోపిస్తున్నా కమిషనర్‌ పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే, ఒకే అధికారికి లెక్కకు మించిన బాధ్యతలు అప్పగిస్తున్న వ్యవహారాలపై దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ దృష్టిపెట్టినట్లు తెలిసింది.

*బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్మన్‌గా కె.అప్పారావును నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం గజిట్‌ విడుదల చేసింది. సభ్యులుగా జె.రాజేంద్రప్రసాద్‌, జి. సీతారాం, ఆదిలక్ష్మి, త్రిపర్ణను నియమించింది. వీరి పదవీ కాలం మూడేళ్లు.

*టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా శిష్ట్లా లోహిత్‌ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన లోహిత్‌ కొంత కాలం కిందట పార్టీలో చేరారు. కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన లోహిత్‌ అప్పటి నుంచి పార్టీలో క్రియాశీలంగా ఉంటున్నారు. ఇటీవల చంద్రబాబు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన రోజు రూ.10 లక్షలు పార్టీ నిధికి విరాళం ప్రకటించిన లోహిత్‌ పార్టీ వర్గాల నుంచి అభినందనలు అందుకున్నారు. లోహిత్‌ తండ్రి రమేశ్‌ గతంలో ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేశారు. లోహిత్‌ కుటుంబం గత 30 ఏళ్లుగా రియల్‌ ఎస్టేట్‌, నిర్మాణ రంగంలో ఉంది. లోహిత్‌ ప్రస్తుతం ఆతిథ్య రంగం నుంచి రియల్‌ ఎస్టేట్‌ వరకు 4 కంపెనీలకు ఎండీగా ఉన్నారు. కాగా, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కావలి గ్రీష్మ నియమితులయ్యారు. ఆమె మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి కుమార్తె. శ్రీకాకుళం జిల్లాకు చెందిన గ్రీష్మ కొంతకాలంగా జిల్లాలో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

* వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం యాత్ర 68వ రోజుకు చేరుకుంది. నేడు పినపాక నియోజకవర్గం బూర్గంపాడు మండలం సంజీవరెడ్డి పాలెం క్యాంప్ నుంచి ఉదయం 10 గంటలకు పాదయాత్ర మొదలుపెట్టనుంది. బూర్గంపాడు మండలంలోని మోరంపల్లి బంజర గ్రామంలో ఉదయం 11 గంటలకు రైతు గోస ధర్నాలో షర్మిల పాల్గొననుంది. అనంతరం జింకలగూడెం, ఆజంపురం, పినపాక పట్టినగర్ మీదుగా షర్మిల పాదయాత్ర కొనసాగనుంది. సాయంత్రం 5 గంటలకు పాల్వంచలో ప్రజలతో మాట-ముచ్చట కార్యక్రమంలో షర్మిల పాల్గొననుంది.

*సదరం సర్టిఫికెట్‌ కోసం ఇబ్బందులు పడుతున్న నగరంలోని బంజారాహిల్స్‌కు చెందిన దివ్యాంగుడు జిల్లా మాధవరావు విషయంలో హైదరాబాద్‌ కలెక్టరేట్‌ అధికారులు మంగళవారం స్పందించారు. వారం లోపల సర్టిఫికెట్‌ ఇస్తామన్నారు. 2020 మార్చిలో నమోదైన స్లాట్‌ బుకింగ్‌ ప్రకారం పరీక్షలు చేయకపోగా,దివ్యాంగుడైన అతనిని ఆఫీసులు చుట్టూ తిప్పుకుంటూ కొందరు అధికారులు అమానుషంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే.

*తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎ్‌సఆర్టీసీ) నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో ప్రయాణ చార్జీలను 25% పెంచుతున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రకటించారు. పండుగలు, జాతరలు, ఉత్సవాలు, వారాంతపు సెలవు రోజుల్లో ఆయా ప్రాంతాలకు నడిపే ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సెమీ లగ్జరీ, వోల్వో, అంతర్రాష్ట్ర బస్సుల్లో ఇకపై 25 శాతం అదనంగా చార్జీలు వసూలు చేయనున్నట్లు పేర్కొన్నారు

*తెలంగాణ సహకార అపెక్స్‌ బ్యాంకు జాతీయ స్థాయిలో తృతీయ బహుమతిని గెలుచుకొంది. రూ.16,276 కోట్ల టర్నోవర్‌తో, సుమారు రూ.100 కోట్ల లాభాలతో నడుస్తున్న టెస్కాబ్‌ పంట రుణాలు, డిపాజిట్లు, బంగారు రుణాలు, షేర్‌ క్యాపిటల్‌, బిజినెస్‌ టర్నోవర్‌, పెట్టుబడులు, నికర లాభాలు తదితర అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను జాతీయ అవార్డు వరించింది. 2019-20 సంవ్సరానికి గాను ప్రకటించిన ఈ అవార్డులను ఛత్తీ్‌సగఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్‌ భగల్‌ నుంచి టెస్కాబ్‌ ఛైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, మేనేజింగ్‌ డైరెక్టర్‌ నేతి మురళీధర్‌లు అందుకున్నారు.

* ఇప్పటికే పన్నెండు స్టెంట్లు ఉన్న 55 ఏళ్ల వ్యక్తికి కేర్‌ ఆస్పత్రి వైద్యులు అరుదైన బీటింగ్‌ హార్ట్‌ సర్జరీ నిర్వహించారు. గుండెకు బైపాస్‌ చేయకుండా.. కేవలం ఛాతీ ప్రాంతంలో కోత పెట్టి హృదయ స్పందనలు జరుగుతుండగానే శస్త్ర చికిత్స చేశారు. 2002 నుంచి సీబీవీ సుబ్బారాయుడు ఛాతీ నొప్పితో బాధ పడుతున్నాడు. పలువురు డాక్టర్లకు చూపించగా రోగికి కరోనరీ ధమనులలో బ్లాక్స్‌ ఉన్నట్లు నిర్ధారించి, స్టెంట్లు వేశారు.

*‘రాష్ట్రంలో కేసీఆర్‌ పాలన అం తానికి ఇక 365 రోజులే గడువు ఉంది. కాంగ్రెస్‌ కార్యకర్తలపై అధికారులు చే స్తున్న దౌర్జన్యాలను డైరీలో రాస్తున్నాం. అధికారులూ రోజులు లెక్కపెట్టుకోండి. మళ్లీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరికీ మిత్తీతో కలిపి చెల్లిస్తాం’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. వచ్చే నెల 6న వరంగల్‌లో జరిగే రాహుల్‌ గాంఽధీ రైతు సంఘర్షణ సభను విజయవంతం చేసే క్రమంలో.. మంగళవారం ఆయన ఖమ్మంలో పర్యటించారు. పీసీసీ అధ్యక్షుడి హోదాలో తొ లిసారి ఖమ్మం వచ్చిన ఆయనకు కార్యకర్తలు, నాయకులు ఘనస్వాగతం పలికారు. భారీ ర్యాలీగా ఖమ్మం తోడ్కొని వచ్చారు. అనంతరం ఖమ్మంలో నిర్వహించిన సన్నాహక సమావేశం, మీడియా సమావేశాల్లో రేవంత్‌ మాట్లాడారు.