DailyDose

ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వర్ధంతి

ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ వర్ధంతి

అర్థరాత్రి రెండుగంటల సమయంలో వర్షంలోతడిసిన వ్యక్తి “అమ్మా సీతమ్మ తల్లి .. ఆకలేస్తుందమ్మా” అని పిలవగానే ఎంతో ఆప్యాయంగా వంటచేసి అన్నం పెట్టి ,దుప్పటి ,వస్త్రాలు ఇవ్వగలిగిన ఔదార్యవతి డొక్కాసీతమ్మ తల్లి వర్ధంతి ఏప్రియల్ 28.

శ్రీ మతి డొక్కా సీతమ్మ గారు తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం తాలుకా , మండపేట గ్రామంలో 1841, అక్టోబరు రెండోవారంలో జన్మించారు. ఈమె తండ్రి అనుపిండి భవానీశంకరం, తల్లి నరసమ్మ గార్లు. సీతమ్మ గారి తండ్రి శంకరం గారిని గ్రామస్తులు ‘బువ్వన్న’ గారనే పేరుతో పిలుస్తుండేవారు. దానికి కారణం ఆయన అడిగిన వారందరికీ ‘బువ్వ'(అన్నం) పెట్టటమే!

అటువంటి తండ్రికి కూతురిగా జన్మించిన సీతమ్మ గారు అన్నార్తుల ఆకలిని తీర్చిన మహా ఇల్లాలు. విద్యావాసనలు లేని లేని సాధారణ గృహిణి ఆమె.బాల్యంలో సీతమ్మ గారికి తల్లితండ్రులు కథలు, పాటలు, పద్యాలు అన్నింటినీ నేర్పారు. ఆ రోజుల్లో స్త్రీలు విద్య నేర్చుకునే అవకాశాలు సరిగా లేకపోవడంతో ప్రాచీన సంప్రదాయాలకు తలవంచి పెద్దబాలశిక్ష వంటి గ్రంధాన్ని కూడా పూర్తిగా అధ్యయనం చెయ్యకుండా నే పెళ్ళికి సిద్ధపడాల్సి వచ్చింది. సీతమ్మ గారి బాల్యంలోనే.