DailyDose

బీజేపీ శ్రేణుల ఘర్షణ: ఒకరికి గాయాలు – TNI నేర వార్తలు

బీజేపీ శ్రేణుల ఘర్షణ: ఒకరికి గాయాలు  – TNI  నేర వార్తలు

*బీజేపీకి చెందిన రెండువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు గాయపడిన సంఘటన బుధవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజాసంగ్రామ యాత్రకు స్వాగతం పలుకుతూ బీజేపీ నాయకులు పట్టణంలోని పలు ప్రాంతాల్లో గోడలపై రాయించారు. ఇందులో భూత్పూర్‌ మండలానికి చెందిన ఓ నాయకుడి పేరును ప్రధానంగా ప్రస్తావిస్తు రాశారు.ఎవరి పేర్లు రాయవద్దని ముందుగానే సూచించినప్పటికీ ఎందుకు రాశారని దేవరకద్ర నాయకులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో దేవరకద్ర, భూత్పూర్‌ నాయకుల మధ్య తోపులాట జరిగింది. విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ సమీపంలోని రాయచూర్‌ రోడ్డుపై రెండువర్గాల వారు పిడిగుద్దులకు దిగడంతో గొడవ మరింత పెద్దదైంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని అదుపు చేశారు.

*చిత్తూరు టెన్త్ పేపర్ లీక్ సూత్రధారి అరెస్ట్ గిరిధర్ రెడ్డిని అరెస్ట్ చేసిన చిత్తూరు పోలీసులు టెన్త్ ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేసిన గిరిధర్ రెడ్డి నారాయణ విద్యసంస్థల్లో టీచర్ గా పనిచేస్తున్న గిరిధర్ రెడ్డి గిరిధర్ రెడ్డికి పేపర్లు ఎవరు పంపారన్న కోణంలో దర్యాప్తు

*విజయవాడలో అత్యాచార ఘటన మరువక ముందే గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం తుమ్మపూడిలో యువతిని సామూహికంగా అత్యాచారం చేసి హత్య చేశారు. పోలీసుల కథనం ప్రకారం తుమ్మపూడికి చెందిన వీరంకి తిరుపతమ్మ (35) పొలాలకు నీళ్లు పెట్టే పైపులు అద్దెకిస్తూ బతుకుతోంది. ఆమె భర్త శ్రీనివాసరావు పనుల కోసం తిరుపతి వెళ్లారు. వీరికి ఇద్దరు పిల్లలు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఆమె ఇంట్లో మృతిచెంది పడి ఉండటాన్ని గుర్తించారు. తిరుపతమ్మ మృతదేహంపై గోళ్లతో రక్కిన గాయాలు, కొరికిన గాట్లు ఉన్నట్లు గుర్తించారు. దుస్తులు కూడా లేకపోవడంతో సామూహిక అత్యాచారం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది. మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి నిందితులను పోలీసులు గుర్తించారు. తిరుపతమ్మకు తెలిసినవారే హత్యకు పాల్పడి ఉంటారని గుర్తించారు. సంఘటనాస్థలంలో నిందితులు తాగిపడేసిన మద్యం బాటిళ్లను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి సిపిఎం అత్యాచారానికి పాల్పడి యువతిని హత్య చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం దుగ్గిరాల మండల కమిటీ కార్యదర్శి జెట్టి బాలరాజు, నాయకులు వి.సాంబశివరావు డిమాండు చేశారు. హత్యకు ముందు తిరుపతమ్మపట్ల అత్యంత పాశవికంగా ప్రవర్తించినట్లు ఆమె శరీరంపై ఉన్న గాయాలను బట్టి అర్థమవుతోందని, ఇటువంటి వారిని క్షమించకూడదని వారు డిమాండు చేశారు. నిందితులకు కఠినశిక్ష పడేలా చేయడం ద్వారా మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు…!!

*రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన సంఘటన రాజీవ్ రహదారి ప్రజ్ఞాపూర్ సమీపంలోని రాణి కంపెనీ నీ వద్ద బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గజ్వేల్ పట్టణానికి చెందిన జగ్గయ్యగారి శ్రీధర్ జలజ దంపతులు బుధవారం సాయంత్రం హైదరాబాద్ వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో గజ్వేల్‌కు కారులో తిరిగి వస్తుండగా ప్రమాదవశాత్తు రాణే కంపెనీ సమీపంలో కారు డివైర్‌ను ఢీకొని.. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న మరో కారును బలంగా ఢీకొట్టింది.

*నిజామాబాద్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నిజామాబాద్ పట్టణం చంద్రశేఖర్ నగర్ కాలనీకి చెందిన ఓ మైనర్‌ను ఏఆర్ కానిస్టేబుల్ గర్భవతిని చేశాడు. బాలిక కుటుంబంతో ఉన్న పరిచయాన్ని ఆసరాగా చేసుకొని కొంతకాలంగా చనువుగా ఉంటూ శారీరకంగా వాడుకున్నాడు. నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్ శ్రీకాంత్‌గా గుర్తించారు.

*హైదరాబాద్‌ నగరంలోని కూకట్‌పల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. కూకట్‌పల్లిలోని సాయిబాబానగర్‌లో బైక్‌ను టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

*గాఢనిద్రలో ఉన్న ఇంటర్‌ విద్యార్థి గొంతుకోసిన ఘటన గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన వివరాలిలా ఉన్నాయి. కళాశాలలో ఈనెల 25న సాయంత్రం అల్పాహారం వడ్డించే సమయంలో ఇంటర్‌ మొదటి సంవత్సరం విద్యార్థి సాత్విక్‌ (16) లైన్‌లో ఉన్నాడు. రెండో సంవత్సరం విద్యార్థి సేమియా వడ్డిస్తుండగా సాత్విక్‌ చేతిపై పడటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.అనంతరం వడ్డించిన విద్యార్థి.. ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పగా, అతడు సాత్విక్‌పై చేయిచేసుకున్నాడు. దీంతో టీచర్లు ఇరువర్గాలకు సర్దిచెప్పి పంపించారు. ఆ తర్వాత.. రాత్రి హాస్టల్‌లో నిద్రపోయిన సాత్విక్‌ 1.30 సమయంలో గొంతు వద్ద నొప్పిగా అనిపించి, నిద్రలేవగా గొంతు భాగంలో రక్తం రావడం గమనించి స్నేహితులకు చెప్పాడు. గొంతు వద్ద రక్తస్రావం అవుతుండటంతో వెంటనే గచ్చిబౌలిలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. దాదాపు 18 కుట్లు పడ్డాయి. ప్రాణాపాయం లేదని, విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. తనపై చేయిచేసుకున్న విద్యార్థే దాడిచేసి ఉంటాడని గచ్చిబౌలి పోలీసులకు సాత్విక్‌ ఫిర్యాదు చేశాడు. కాగా, బ్లేడ్‌తో అతనిపై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అనుమానిత విద్యార్థిని పోలీసులు విచారించి సొంత పూచీకత్తుపై పంపించినట్లు తెలిసింది. తమ కొడుకును కేసులో ఇరికిస్తున్నారని అనుమానితుని తల్లిదండ్రులు ఆరోపించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*దొడ్డ పట్టణంలోని దర్జీపేటలో ఉన్న పాండురంగ విఠల దేవాలయంలో మంగళవారం అర్ధరాత్రి ఆటో¬లో వచ్చిన నలుగురు దొంగలు దేవాలయం ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి లోపలకు చొరబడ్డారు. పెద్ద హుండీని అతి కష్టంమీద పెకలించి బయటకు తీసుకువచ్చి ఆటోలో ఎత్తడానికి ప్రయత్నిస్తుండగా దేవాలయం ఎదురుగా ఉన్న ఇంట్లో వారు గట్టిగా కేకలు వేయడంతో హుండీ అక్కడే వదిలి ఆటోతో సహా పరారయ్యారు. చోరీ దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

*హరియాణాలోని ఫతేహాబాద్లో ఓ ప్రేమజంటను చితకబాదారు గ్రామస్థులు. యువకుడితో కలిసి ఉండటం చూసిన బాలిక కుటుంబసభ్యులు.. ఆగ్రహంతో ఇద్దరినీ పిడిగుద్దులు గుద్దారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే దీనిపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఫతేహాబాద్లో జరిగిన మరో ఘటనలో భర్త కుటుంబంపై దాడిచేశారు భార్య కుటుంబసభ్యులు. అంతకుముందే అత్త, కోడలు మధ్య గొడవ జరిగింది. దీంతో ఆ మహిళ తన కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆగ్రహానికి గురైన వారు.. అల్లుడు, అతడి తల్లిని ఇంట్లోకి ప్రవేశించి కొట్టారు. ఈ ఘటన సంబంధించిన దృశ్యాలన్నీ ఇంట్లోని సీసీటీవీలో రికార్డయ్యాయి. దీంతో ఈ వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*గుంటూరులో ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిపిహత్య చేసిన ఘటనపై మృతురాలి భర్త స్పందించారు. తుమ్మపూడికి చెందిన ముగ్గురు వ్యక్తులు తన భార్యపై అత్యాచారం చేసి హత్య చేశారన్నారు. ఫిర్యాదులో పేర్లు చెప్పినప్పటికీ పోలీసులు వద్దన్నారన్నారు. వైసీపీకి చెందిన వారు కావడంతో పోలీసులు కేసును తాత్సారం చేస్తున్నారన్నారు. గౌడ సంఘం నేతతెనాలి వైసీపీ మున్సిపల్ కౌన్సిలర్ నిందితులకు కొమ్ము కాస్తున్నారన్నారు. జగన్ కోసం తాము కూడా ఓట్లు వేశామని మృతురాలి భర్త తెలిపారు.

*శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు పెద్దమొత్తంలో బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి 1614 అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. దాని విలువ సుమారు 86.42 లక్షలు వరకు ఉంటుందని అంచనా. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకొని అధికారులు విచారణ చేపట్టారు.

*రాజంపేట గ్రామ పంచాయతీ వద్ద ఓ వ్యక్తి కుటుంబంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. రాజంపేట గ్రామానికి చెందిన ఇట్టం నవీన్ అనే వ్యక్తి తన తండ్రి పేరున ఉన్న ఇంటి రికార్డులను ఓ అధికార పార్టీ బడా నాయకుని సహాయంతో పంచాయతీ కార్యదర్శి మార్పిడి చేశారని ఆరోపించారు. 1985లో ఇంటి కోసం పట్టా పంపిణీ చేశారని, 2022లో తన ప్రమేయం లేకుండా మార్పిడి చేశారన్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులను అడిగినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే పంచాయతీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని కుటుంబంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు నవీన్ తెలిపాడు. ఇప్పటికైనా అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.

*గుంటూరు: జిల్లాలోని మంగళగిరి మండలం ఆత్మకూరులో కుమారుడితో కలిసి రేషన్ డీలర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. రేషన్ డీలర్ కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని ఓ వ్యక్తి రూ.25 లక్షలు తీసుకొని మోసం చేశాడు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశాడు. ఈ వ్యవహారంపై రెండు రోజుల క్రితం బాధితులు పోలీసులకు ‌ఫిర్యాదు చేశారు. చివరకు మనస్తాపంతో గత రాత్రి తండ్రీకొడుకులు బలవన్మరణానికి యత్నించారు. కుటుంబసభ్యులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*సిద్దిపేట: జిల్లాలోని రాజీవ్ రహదారి రాణే కంపెనీ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. గౌరారం వైపు నుండి ప్రజ్ఞాపుర్ వెళ్తున్న కారు అదుపుతప్పి అవతలి రోడ్డుపై వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే మృతి చెందగా… ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మృతులు గజ్వేల్ పట్టణానికి చెందిన వారుగా గుర్తించారు. అలాగే గాయాల పాలైన వారు గండి మైసమ్మ ప్రాంతానికి చెందిన వారుగా తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*అదనపు కట్నం కోసం మూడు నెలల గర్భిణిని చిత్రహింసలు పెట్టి దారుణంగా కడతేర్చిన ఉదంతమిది. నిజామాబాద్‌ జిల్లా వర్ని మండలం రాజ్పేట్‌తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్సై అనిల్‌రెడ్డి కథనం ప్రకారం.. మల్కాపూర్‌కు చెందిన కల్యాణి(24)కి రాజ్‌పేట్‌తండా వాసి తరుణ్తో రెండేళ్ల క్రితం పెళ్లైంది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. తర్వాత అదనపు కట్నం కోసం భర్త సహా అత్తింటివారి వేధింపులు మొదలయ్యాయి. ఆమెను వదిలించుకోవాలనే దురుద్దేశంతో మానసికంగా, శారీరకంగా బాధపెట్టేవారు. మంగళవారం భర్తతోపాటు మామ ఫకీరా, సమీప బంధువు ప్రవీణ్‌ బాధితురాలికి బలవంతంగా విషం, యాసిడ్‌ తాగించారు. కల్యాణి కేకలు విని పక్కింట్లో ఉంటున్న ఆమె అక్క శోభ కంగారుగా వచ్చేసరికి కింద పడిపోయి నురగలు కక్కుతూ కనిపించారు. స్థానికుల సాయంతో నిజామాబాద్‌ జనరల్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు.

*కోయంబేడు మార్కెట్లో రసాయనాలతో మగ్గిస్తున్న 7.5 టన్నుల మామిడి పండ్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై ఆహార భద్రత శాఖ అధికారి సతీష్ కుమార్‌ మాట్లాడుతూ, కోయంబేడు మార్కెట్లో బుధవారం ఉదయం ఆహార భద్రతా శాఖ, సీఎండీఏ అధికారులు సంయుక్తంగా చేపట్టిన తనఖీల్లో రసాయనాలతో మగ్గిస్తున్న 7.5 టన్నుల మామిడిపండ్లు, 900 కిలోల బట్టర్‌ ఫ్రూట్‌ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వ్యాపారులకు రూ.5 వేల జరిమానా విధించామన్నారు.

*ఇంటర్‌ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడంటూ కాంట్రాక్టు అధ్యాపకుడికి ఆమె బంధువులు దేహశుద్ధి చేశారు. ఆ వీడియో వైరల్‌ కావడంతో ఘటన బుధవారం వెలుగు చూసింది. స్థానికులు తెలిపిన ప్రకారం.. చిత్తూరు జిల్లా కార్వేటినగరం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలో సోమయ్య(42) కాంట్రాక్టు అధ్యాపకుడిగా (ఫిజిక్స్‌) పనిచేస్తున్నారు.
*విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ జనరల్‌ ఆస్పత్రిలో ఓ బాలిక (17) పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే అభియోగంపై డాక్టర్‌ ఎస్‌వీ కపార్డే (57)పై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అగనంపూడికి చెందిన ఓ స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగి కుమార్తెకు కాలిలో నొప్పి రావడంతో నాలుగు రోజుల క్రితం సర్జరీ చేశారు. మళ్లీ కాలిలో నొప్పి రావడంతో మంగళవారం తండ్రితో కలిసి ఆస్పత్రికి వెళ్లింది. సర్జరీ చేసిన వైద్యుడు అందుబాటులో లేకపోవడంతో, ఆ విభాగానికి చెందిన డీజీఎం డాక్టర్‌ ఎస్‌వీ కపార్డేకు చూపించారు.

*తుళ్లూరు మండలంలో గంజాయి విక్రయదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళల నుంచి 1700 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వెంకటపాలెం చెక్ పోస్ట్ వద్ద పోలీసులను చూసి గంజాయి కవర్లతో పారిపోతున్న మహిళలను పట్టుకున్నామని పోలీసులు చెప్పారు. గంజాయి విక్రయదారులు అమరావతికి చెందిన పల్లపు నాగమణి, వేముల అంకమ్మలుగా గుర్తించారు. అరెస్టు చేసిన మహిళలను మంగళగిరి కోర్టులో హాజరుపరిచినట్లు తుళ్లూరు పోలీసులు వెల్లడించారు.

*కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో వివాహిత దారుణ హత్యకు గురైంది. వ్యవసాయం పనులకు వెళ్లిన కారుకుట్ల రూపశ్రీ (పొట్టపై సంకురు ప్రవీణ్ కత్తితో పొడిచి హత్య చేశాడు. తెనాలి మండలం నేలపాడు గ్రామానికి చెందిన సంకురు ప్రవీణ్ చిలుమూరు గ్రామానికి చెందిన కరుకుట్ల రూపశ్రీని హత్య చేసి తర్వాత నిండుతుడు ప్రవీణ్ పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. అక్రమ సంబంధం నేపథ్యంలో హత్య జరిగిందని పోలీసులు చెబుతున్నారు.

*కాళేశ్వరం 22 ప్యాకేజీ నిర్మాణ పనుల్లో తన ఇంటితో పాటు అర ఎకరం భూమి కోల్పోతున్నానన్న తీవ్ర మనోవేదనతో ఓ వృద్ధురాలు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. నిజామాబాద్‌ జిల్లా మోపాల్‌ మండలం అమ్రాబాద్‌లో బుధవారం ఈ ఘటన జరిగింది. మృతురాలు బుజ్జిబాయి (63). జిల్లాలోని మోపాల్‌ మండలం మంచిప్ప సమీపంలో కాళేశ్వరం 22 ప్యాకేజీ పనులు కొనసాగుతున్నాయి. గతంలో ప్రాణహిత- చేవెళ్ల ప్యాకేజీ పనులు చేపట్టినప్పుడు మంచిప్పను 1.5 టీఎంసీల సామర్థ్యంతో కూడి న ప్రాజెక్టుగా డిజైన్‌ చేశారు. దాని ప్రకారమే అధికారులు పనులు మొదలు పెట్టారు. ప్యాకేజీ 21, 22 కింద సాగునీటిని నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల పరిధిలో అందించేందుకు నిర్ణయించారు.

*ఇంటర్నల్‌ మార్కుల నెపంతో విద్యార్థినులను వేధింపులకు గురిచేస్తున్న ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడికి బాధిత బాలికల తల్లిదండ్రులు బుధవారం దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల ఉన్నత పాఠశాలలో బవిరిశెట్టి మహేందర్‌ 2012 నుంచి సాంఘికశాస్త్రం ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. ఇంటర్నల్‌ మార్కులు తానే వేయాలని, అందువల్ల తాను చెప్పినట్లు వినాలని మహేందర్‌ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేసేవాడు. వాటిని భరించలేకపోయిన విద్యార్థినులు విషయాన్ని తమ తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఉపాధ్యాయుని ఇంటికి వెళ్లి దేహశుద్ధి చేశారు. అనంతరం విద్యార్థినులను వెంటబెట్టుకొని దంతాలపల్లి పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విద్యార్థినులతో మొబైల్‌ ఫోన్‌లో మహేందర్‌ చేసిన అసభ్యకర చాటింగ్‌ను పోలీసులకు చూపెట్టారు. అంతేకాక అదనపు తరగతుల పేరుతో మూడు నెలలుగా సదరు ఉపాధ్యాయుడు తమను వేధిస్తున్నాడని పలువురు బాలికలు పోలీసుల ఎదుట కన్నీరుపెట్టుకున్నారు. దీంతో సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులు పోక్సో, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు

*ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఇన్స్పెక్టర్‌ను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అసభ్యకరంగా దూషించారు. మహేందర్ రెడ్డి పై 353, 504,506 IPC కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ పట్ల ఎమ్మల్సీ పట్నం మహేంధర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రాష్ట్ర పోలీస్ అధికారుల సంఘం ఘాటుగా స్పందించింది. సభ్య సమాజం భరించలేని తిట్లతో దూషించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పట్నం మహేంధర్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు వెంట లేకుంటే అడుగు బయటపెట్టగలరా? అని ప్రశ్నించారు. సీఐకి వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

*ప్లీనరీ సందర్భంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్‌ నేతలకు జీహెచ్‌ఎంసీ జరిమానాల రూపంలో షాకిచ్చింది. ఫ్లెక్సీల ఏర్పాటుపై సోషల్‌ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తడంతో జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకుంది. జూబ్లీహిల్స్‌లో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీకి సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌కు జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సెల్‌ రూ.5 వేలు జరిమానా విధించింది. ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కాలేరు వెంకటే్‌షతోపాటు పలువురు కార్పొరేటర్లు, నాయకులకు కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు ఆన్‌లైన్‌లో చలానాలు జారీ చేశారు.

*ఖమ్మంలో దారుణం చోటు చేసుకుంది. భార్యపై భర్త కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరచాడు. ఖమ్మం నగరంలోని రేవతి సెంటర్‌కి చెందిన సాయి ప్రీతిని నిందితుడు సాయి మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపధ్యంలో గత రెండు రోజులుగా సాయి భార్యతో ఘర్షణ పడుతున్నాడు. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి సమీనంలో నడిచివెళ్తున్న ప్రీతిపై సాయి ఆకస్మికంగా కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రీతిని స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు

*రాజంపేట గ్రామ పంచాయతీ వద్ద ఓ వ్యక్తి కుటుంబంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకున్నారు. రాజంపేట గ్రామానికి చెందిన ఇట్టం నవీన్ అనే వ్యక్తి తన తండ్రి పేరున ఉన్న ఇంటి రికార్డులను ఓ అధికార పార్టీ బడా నాయకుని సహాయంతో పంచాయతీ కార్యదర్శి మార్పిడి చేశారని ఆరోపించారు. 1985లో ఇంటి కోసం పట్టా పంపిణీ చేశారని, 2022లో తన ప్రమేయం లేకుండా మార్పిడి చేశారన్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులను అడిగినా తనకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అందుకే పంచాయతీ కార్యాలయం ముందు పెట్రోల్ పోసుకుని కుటుంబంతో ఆత్మహత్యాయత్నం చేసినట్లు నవీన్ తెలిపాడు. ఇప్పటికైనా అధికారులు తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు.

* ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని టింబర్‌ డిపోలో బుధవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్‌ ఇంజిన్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. సాయి బాలాజీ థియేటర్‌ వెనుక ఉన్న కలప పరిశ్రమలో బుధవారం అర్ధరాత్రి 11.30 ప్రాంతంలో మంటలు చెలరేగి.. ఒక్కసారిగా వ్యాపించాయి. శివారు ప్రాంతంకావడంతో ఎవరూ గమనించకపోవడంతోమంటలు టింబర్‌ డిపో మొత్తం అంటుకున్నాయి.

*జమ్మూకశ్మీర్‌ పుల్వామాలోని మిత్రిగామ్‌ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ఉగ్రవాది హతమైనట్లు పోలీసులు గురువారం తెలిపారు. మిత్రిగామ్‌ ప్రాంతంలో బుధవారం పొద్దుపోయాక భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయని, అంతకు ముందు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మార్చి-ఏప్రిల్‌ మధ్య ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులపై దాడులకు పాల్పడిన వరుస ఘటనల్లో పాల్గొన్నారని ఐజీపీ కశ్మీర్‌ విజయ్‌కుమార్‌ పేర్కొన్నారు.