Movies

‘ఆచార్య’లో నుంచి తప్పుకున్న కాజల్ కి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో తెలుసా..?

‘ఆచార్య’లో నుంచి తప్పుకున్న కాజల్ కి రెమ్యునరేషన్ ఎంత ఇచ్చారో తెలుసా..?

ఆచార్య టీమ్ ప్రమోషన్స్‌ను ముమ్మరం చేసింది. ఇక ఈ సినిమాను మ్యాట్నీ ఎంటర్మేన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి రామ్ చరణ్, కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సంయుక్తంగా నిర్మించారు. చిరంజీవి 152వ చిత్రాన్ని కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. అయితే ‘ఆచార్య’లో చిరంజీవికి జోడిగా తొలుత కాజల్ అగర్వాల్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. సుమారు నాలుగైదు రోజులు చిత్రీకరణ కూడా చేశారు. ‘లాహే లాహే…’ లిరికల్ సాంగ్ విడుదల చేసినప్పుడు…

అందులో కాజల్ కనిపించారు కూడా! సినిమా విడుదల దగ్గర పడిన తర్వాత కాజల్ పాత్రను తొలగించినట్లు దర్శకుడు కొరటాల శివ వివరించారు. కాజల్ అగర్వాల్ సినిమాలో కనిపించకపోయినా… ఆమెకు ఫుల్ రెమ్యూనరేషన్ ఇచ్చారట. ఆచార్య కోసం కాజల్ కోటిన్నర తీసుకున్నట్టు ఫిల్మ్ నగర్ గుసగుస. ఇది ఎంత వరకూ నిజం అనేది ఎప్పటికీ బయటకు రావడం కష్టమే. ఎందుకంటే… ఎవరూ ఫలానా సినిమాకు తాము ఎంత తీసుకున్నామనేది ఏ హీరోయిన్ చెప్పారు.

ఫలానా ఆర్టిస్టుకు ఎంత ఇచ్చాం అనేది నిర్మాతలు కూడా చెప్పరు. ”సినిమా అనుకున్నప్పుడు హీరోతో పాటు హీరోయిన్ కూడా ఉండాలని అనుకుంటాం! అలా ఆచార్య లో ఒక మంచి ఫన్నీ క్యారెక్టర్ వచ్చింది. ధర్మస్థలి లో ఉండే మంచి ఫన్నీ క్యారెక్టర్ కు కాజల్ అనుకున్నాం. ఈ సినిమాలో ఆచార్య పాత్రకు లవ్ ఇంట్రెస్ట్ ఉండదు, ఉండకూడదు! డౌట్ ఉన్నప్పటికీ… ఫస్ట్ షెడ్యూల్ లో మూడు నాలుగు రోజులు షూటింగ్ చేశాం. తర్వాత కరోనా ఫస్ట్ వేవ్ రావడంతో చెక్ చేసుకునే అవకాశం వచ్చింది. పెద్ద కథానాయికను ఏదో క్యారెక్టర్ కోసం అన్నట్టు తీసుకోకూడదు.