Business

ఉద్యోగుల షాక్‌.. ఇన్ఫోసిస్‌కు కేంద్రం నోటీసులు! – TNI వాణిజ్య వార్తలు

ఉద్యోగుల షాక్‌.. ఇన్ఫోసిస్‌కు కేంద్రం నోటీసులు!  – TNI వాణిజ్య వార్తలు

*ముఖ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ కార్మిక చట్టాలను ఉల్లంఘించిందని ఆరోపిస్తూ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఐటీ ఎంప్లాయీ సెనేట్ (ఎన్‌ఐటీఈఎస్‌) కేంద్రానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫిర్యాదుకు సంబంధించి ఇన్ఫోసిస్‌కు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నోటీసులు అందజేసింది. ఆ నోటీసుల మేరకు ఇన్ఫోసిస్‌ కేంద్రం కార్మిక మంత్రిత్వశాఖ జరిపే చర్చల్లో పాల్గొంది. ఆ చర్చలు కొనసాగుతున్నాయి. ఈ చర్చల్లో ఏ నిర్ణయం వెలువడుతుందో తెలుసుకునేందుకు ఐటీ ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇన్ఫోసిస్ గ్రూప్ హెచ్‌ఆర్‌ విభాగం హెడ్ క్రిష్ శంకర్‌కు పంపిన నోటీసు ప్రకారం..“గురువారం ఐటీ ఉద్యోగుల సమస్యపై కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ చీఫ్ లేబర్ కమిషనర్ ముందు ఉమ్మడి చర్చ జరపాలని నిర్ణయించాం.” కార్మిక మంత్రిత్వ శాఖ సమక్షంలో జరిగే ఈ చర్చల్లో ఇన్ఫోసిస్ అధికారులతో పాటు, ఎన్‌ఐటీఈఎస్‌ ప్రతినిధులను కూడా హాజరు కావాలని పిలుపునిచ్చారు.
*ప్రపంచ దేశాల్లో నెలకొన్న ప్రతికూలతలు దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపలేదు. దీంతో గురువారం ఉదయం దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బుధవారం రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ వేడి, ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపు అంచనాలు, చైనాలో పెరిగిపోతున్న తదితర ప్రతికూల అంశాలు సెంటిమెంటును దెబ్బతీశాయి. దీంతో తొలి నుంచీ ఇన్వెస్టర్లు, ట్రేడర్లు అమ్మకాలకే ప్రాధాన్యమివ్వడంతో బుధవారం సాయంత్రం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్‌ 537 పాయింట్లు పతనమై 56,819 వద్ద నిలవగా.. నిఫ్టీ 162 పాయింట్లు క్షీణించి 17,038 వద్ద ముగిసింది. అయితే ఆ ప్రభావం గురువారం సైతం మార్కెట్‌లపై ప్రభావం చూపిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ అనూహ్యంగా గురువారం అంతర్జాతీయ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. అమెరికాలో క్యూ1 ఫలితాల విడుదల నేపథ్యంలో ముదుపర్లు పెట్టుబుడులు పెట్టేందుకు మొగ్గుచూపుతున్నాయి. ఆ ప్రభావంతో పాటు భారత్‌ ఎకానమీ వృద్ధిరేటు ఆశాజనకంగా ఉండడంతో దేశీయ మార్కెట్లు సైతం లాభాల్లో కొనసాగుతున్నాయి. ఇక గురువారం ఉదయం 9.17 నిమిషాలకు నిఫ్టీ 256 పాయింట్లు లాభపడి 57082 వద్ద, నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 17122 వద్ద ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.
*బంగారం ధర రోజురోజుకు దిగివస్తోంది. క్రితం రోజుతో పోల్చితే రూ.490 తగ్గింది. వెండి ధర రూ.910 పడిపోయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలతో పాటు అంతర్జాతీయ మార్కెట్లో క్రిప్టో కరెన్సీ విలువలు ఎలా ఉన్నాయో చూద్దాం..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.490మేర తగ్గింది. కిలో వెండి రూ.910కిపైగా దిగొచ్చింది. ప్రస్తుతం కిలో వెండి రూ.65,934 గా ఉంది. 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.52,890గా ఉంది.
*ప్రైవేటు బీమా కంపెనీల నుంచి పోటీ ఉన్నా భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మార్కెట్లో దూసుకుపోతోంది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిమిషానికి 41 పాలసీల చొప్పున మొత్తం 2,17,18,695 పాలసీలను విక్రయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 2,09,75,439 పాలసీలతో పోలిస్తే ఇది 3.54 శాతం ఎక్కువ. కాగా 2021 -22లో ఎల్‌ఐసీ స్థూల ప్రీమియం ఆదాయం 12.66 శాతం పెరిగి రూ.1,43,938.59 కోట్లకు చేరింది.
*మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ హార్టికల్చర్‌లో యంత్రీకరణను పెంచడానికి ‘కోడ్‌’ పేరుతో ట్రాక్టర్‌ తరహా కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హార్టికల్చర్‌ రంగంలో వివిధ రకాల పనులకు ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్‌ చేశామని స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ సీఈఓ హరీష్‌ చవాన్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఉత్పత్తిలో హార్టికల్చర్‌ ఉత్పత్తి 30 శాతం ఉంటే సాగు చేసే భూమిలో 17 శాతమే హార్టికల్చర్‌ ఉత్పత్తులను పండిస్తున్నారు. దేశం మొత్తంలో ఉత్పత్తి అవుతున్న కాయలు, పళ్లలో 12 శాతం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణాల్లో హార్టికల్చర్‌ యంత్రీకరణపై స్వరాజ్‌ దృష్టి కేంద్రీకరిస్తోందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో హార్టికల్చర్‌ కోసమే అభివృద్ధి చేసిన మరో రెండు, మూడు ఉత్పత్తులను మార్కెట్లోకి స్వరాజ్‌ విడుదల చేయనుందని చవాన్‌ చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో కంపెనీకి మొత్తం 80 మంది డీలర్లు ఉండగా.. ముందుగా 10 మంది డీలర్ల వద్ద కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 500 కోడ్‌లు బుక్‌ అయ్యాయని చెప్పారు. దీని ధర రూ.2-2.5 లక్షలు ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కోడ్‌ను విడుదల చేశారు.
*జమ్ము కశ్మీర్‌లో 370వ అధికరణం రద్దయిన తర్వాత అక్కడ మొట్టమొదట ప్రాజెక్టు కోసం భూమిని సేకరించిన కంపెనీల్లో ఒకటిగా అపోలో హాస్పిటల్‌ నిలిచింది. జమ్ము జిల్లాలో 250 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌నకు జమ్ము పాలనా యంత్రాంగం ఇప్పటికే జమ్ములోని మిరాన్‌ సాహిబ్‌ మెడి సిటీలో 12.5 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 46 ఎకరాల స్థలంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ మెడిసిటీ ఏర్పాటవుతున్నట్టు వారు చెప్పారు. అపోలో హాస్పిటల్‌తో పాటు జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌ కూడా రూ.150 కోట్లతో ఒక స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు ముందుకు వచ్చిందని, ఆ సంస్థకు ఇప్పటికే 8.75 ఎకరాల స్థలం కేటాయించామని వారు తెలిపారు
* ఎస్‌ఏఎస్‌ ఇన్‌ఫ్రాతో కలిసి బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్‌ హైదరాబాద్‌లో మూడు గ్రేడ్‌-ఏ ఆఫీస్‌ స్పేస్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు ఎంబసీ గ్రూప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆదిత్య విర్వాణీ తెలిపారు. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ నుంచి దాదాపు మూడేళ్ల క్రితం ఎంబసీ గ్రూప్‌ నిష్క్రమించింది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు రికార్డు స్థాయిలో నియామకాలు చేపట్టడం, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బీమా (బీఎ్‌సఎ్‌ఫఐ) రంగం హైదరాబాద్‌లో విస్తరిస్తుండడంతో కార్యాలయ స్థలానికి గిరాకీ పెరగగలదని ఎంబసీ గ్రూప్‌ భావిస్తోంది. మొదటి ప్రాజెక్టు ఎంబసీ ఎస్‌ఏఎస్‌ 1 టవర్‌ నిర్మాణంలో ఉంది.ఎంబసీ డైమండ్‌ టవర్‌లో 30 లక్షల చ.అ కార్యాలయ స్థలాన్ని అభివృద్ధి చేస్తారు. మూడో ప్రాజెక్ట్‌ క్రౌన్‌లో కూడా 30 లక్షల చ.అ ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి రానుంది.
*మన దేశంలో ఫైజర్‌ కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. కానీ ఆ కంపెనీ అభివృద్ధిచేసిన యాంటీ వైరల్‌ కొవిడ్‌ ఔషధం ‘పాక్సలోవిడ్‌’ మనకు అందనుంది. దీన్ని మార్కెట్లోకి విడుదల చేసేందుకు భారత ఔషధ కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. పాక్సలోవిడ్‌ ఔషధంలో విడివిడిగా నిర్మట్రెల్‌విర్‌, రిటొనవిర్‌ అనే మాత్రలు ఉంటాయి. వీటిని తయారు చేసి దాదాపు 95 అల్ప ఆదాయ దేశాల్లో విక్రయించడానికి 35 ఫార్మా కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ జాబితాలో మన దేశానికి చెందిన టోరెంట్‌ ఫార్మా, క్యాడిలా, హెటెరో, ఎంక్యూర్‌, ఆప్టిమస్‌ సహా మొత్తం 19 కంపెనీలు ఉన్నాయి. కొవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో పాక్సలోవిడ్‌ మెరుగైన ఫలితాలు ఇవ్వగలదని పలువురు వైద్య నిపుణులు భావిస్తున్నారు.
* సీవేస్‌ షిప్పింగ్‌ అనుబంధ కంపెనీ సీవేస్‌ సప్లయ్‌ చెయిన్‌కు (ఎస్‌ఎ్‌ససీపీఎల్‌) ఎక్స్‌పోర్ట్‌ ఎక్సలెన్స్‌ అవార్డు లభించింది. మద్రాస్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రాసెసింగ్‌ జోన్‌ (ఎంఈపీజెడ్‌) నుంచి అత్యధిక ఉద్యోగ అవకాశాలను కల్పించినందుకు ఈ అవార్డు లభించిందని సీవేస్‌ షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ డైరెక్టర్‌ పీ వివేక్‌ ఆనంద్‌ తెలిపారు.
*సుమారు రూ. 21 వేల కోట్ల విలువైన భారత అతిపెద్ద ఐపీఓ(ఎల్‌ఐసీ) త్వరలో మార్కెట్‌లోకి రానున్న విషయం తెలిసిందే. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ) వచ్చే ఏడాదిలో ఫాలో-ఆన్ ఆఫర్‌తో రాబోతోందని ఇన్వెస్ట్‌మెంట్ విభాగం తెలిపింది. పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్(డీపీఏఎం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఈ వివరాలను పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో ఎల్‌ఐసీ కోసం మరే ఇతర ఎఫ్‌పీఓనూ తీసుకురావడం లేదని తెలిపారు.
*హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నడిబొడ్డున మూడు ప్రపంచ స్థాయి వాణిజ్య స్థలాలను అభివృద్ధి చేసే క్రమంలో… ఎస్‌ఏఎస్ ఇన్‌ఫ్రాతో ఎంబసీ గ్రూప్ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. వాణిజ్య రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటైన ఎంబసీ గ్రూప్… హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో… 14 మిలియన్ చదరపుటడుగుల విస్తీర్ణంలో మూడు గ్రేడ్-ఏ ప్రాంతాల అభివృద్ధికిగాను ఎస్‌ఏఎస్ ఇన్‌ఫ్రాతో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. రికార్డ్ హైరింగ్, గ్లోబల్ ఐటీ, ఐటీఇఎస్, బీఎఫ్‌ఎస్‌ఐ సంస్థలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ-ఎనేబుల్డ్ సర్వీసెస్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ సెక్టార్లలో భారీ విస్తరణ ప్రణాళికలున్నాయి. మొత్తం 5.2 మిలియన్ చదరపుటడుగులతో కూడిన 36 అంతస్తుల ఎంబసీ ఎస్‌ఏఎస్ టవర్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న విషయం తెలిసిందే.
* టెస్లా కంపెనీ భారత్‌లో తయారీ యూనిట్‌ పెడితే తప్పకుండా స్వాగతిస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. చైనాలో తయారు చేసే టెస్లా కార్ల దిగుమతిని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ స్వాగతించేది లేదని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. భారత్‌ ముందు తమ ఈవీ కార్ల దిగుమతులను అనుమతిస్తే, ఉత్పత్తి యూనిట్‌ ఏర్పాటు విషయం తర్వాత పరిశీలిస్తామని టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ గతంలో ప్రకటించారు. ఇందుకోసం 110 శాతం వరకు ఉన్న దిగుమతి సుంకా న్ని 40 శాతానికి తగ్గించాలని కోరారు. దీంతో భారత్‌లో టెస్లా కార్ల ప్రవేశం సందిగ్ధంలో పడింది.
* అమెరికాకు చెందిన టెక్నాలజీ కంపెనీ ఇంటర్‌కాంటినెంటల్‌ ఎక్స్ఛేంజీ (ఐసీఈ) హైదరాబాద్‌లో కార్యకలాపాలను విస్తరిస్తోంది. డేటా, టెక్నాలజీ, మార్కెట్‌ మౌలిక సదుపాయాలను అందిస్తున్న ఐసీఈ 2019లో హైదరాబాద్‌లో 500 మంది నిపుణులు, ఉద్యోగులతో గ్లోబల్‌ క్యాపబుల్‌ సెంటర్‌ (జీసీసీ)ను ప్రారంభించింది. ప్రస్తుతం హైదరాబాద్‌ కేంద్రంలో 900 మంది పని చేస్తున్నారని ఐసీఈ ఇండియా అధిపతి సచ్‌పతి తెలిపారు. భారత్‌లో కార్యకలాపాల విస్తరణలో భాగంగా 2022 చివరి నాటికి హైదరాబాద్‌ కేంద్రంలో మరో 300 మందిని నియమించుకోనున్నట్లు చెప్పారు.
* దేశీయ ఐటీ దిగ్గజం విప్రో విదేశాల్లో మరో ఐటీ సేవల కంపెనీని కొనుగోలు చేసింది. అమెరికా కేంద్రంగా పనిచేసే రైజింగ్‌ ఇంటర్మీడియెట్‌ హోల్డింగ్స్‌ను 54 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4,135 కోట్లు) కొనుగోలు చేసింది. సిస్టమ్స్‌, అప్లికేషన్స్‌, ప్రొడక్ట్స్‌ (ఎస్‌ఏపీ) రంగంలో రైజింగ్‌కు మంచి పట్టుంది. పూర్తి నగదు చెల్లింపు పద్దతిలో రైజింగ్‌ను కొనుగోలు చేసినట్లు విప్రో తెలిపింది.
* ఇన్వెస్టర్లు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఎల్ఐసీ ఐపీవో వివరాలు రానే వచ్చాయి. ఐపీవో ప్రైస్ బ్యాండ్ రూ.902- 949గా కంపెనీ బోర్డ్ నిర్ణయించింది. పాలసీ హోల్డర్లకు రూ.60 తక్కువకే షేర్లు ఇవ్వాలని బోర్డ్ ప్రతిపాదన చేసింది. ఇక రిటైల్ ఇన్వెస్టర్లు, ఉద్యోగులు రూ.45 తగ్గుదలతో షేర్లు కొనుగోలు చేయవచ్చు. ఇందుకు బోర్డ్ నిర్ణయించింది. దేశంలోనే అతిపెద్ద ఐపీవోగా నిలుస్తుందని భావిస్తున్న ఎల్ఐసీ ఐపీవో మే 4న ప్రారంభమై మే 9న ముగియనుంది. ఇక యాంకర్ ఇన్వెస్టర్లకు రెండు రోజులు ముందుగా మే 2న ఐపీవో ఓపెన్ కానుంది. మంగళవారం సమావేశమైన ఎల్‌ఐసీ బోర్డ్ ఐపీవో ఇష్యూ సైజును 5 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. కాగా ఎల్‌ఐసీలోని కేంద్రప్రభుత్వ వాటా మొత్తంలో 3.5 శాతాన్ని రూ.21 వేల కోట్ల వ్యాల్యూయేషన్‌కు విక్రయించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.
*పామాయిల్ సరఫరాకు సంబంధించి భారత్, ఇండోనేషియా త్వరలో చర్చలు జరపనున్నాయి. కాగా… ఈ పరిణామం భారతీయ ఆహార చమురు ధరలకు సానుకూలంగా మారిందన్న వ్యాఖ్యానాలు ఈ సంద్భంగా వినవస్తున్నాయి. సాల్వెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బీవీ మెహతా మాట్లాడుతూ… ‘ఇండోనేషియా ఆర్‌బీడీ పామోలిన్‌ను మాత్రమే పరిమితం చేస్తామని, ముడి/శుద్ధి చేసిన పామాయిల్ ఎగుమతులను ఉచితంగా అనుమతిస్తాం’ అని ప్రకటించడంతో ఉపశమనం కలిగినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.