Politics

రాష్ట్ర‌ప‌తి కాదు.. ప్ర‌ధానే అవుతా.. – TNI రాజకీయ వార్తలు

రాష్ట్ర‌ప‌తి కాదు.. ప్ర‌ధానే అవుతా..  – TNI రాజకీయ వార్తలు

*స‌మాజ్‌వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాద‌వ్‌కు బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి కౌంట‌ర్ ఇచ్చారు. త‌న‌కు తిరిగి యూపీ సీఎం అవ్వాల‌ని ఉంద‌ని, దాని త‌ర్వాత దేశ ప్ర‌ధాని కావాల‌న్న‌దే త‌న‌కు ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అంతేకానీ రాష్ట్ర‌ప‌తి కావాల‌న్న కాంక్ష త‌న‌కు ఏమాత్ర‌మూ లేద‌ని తేల్చి చెప్పారు. యూపీ ఎన్నిక‌ల్లో బీఎస్పీ ఓట్ల‌ను మాయావ‌తి బీజేపీకి ఇచ్చేసింద‌ని, ఇప్పుడు ఆమె రాష్ట్ర‌ప‌తి అవుతుందేమో అంటూ అఖిలేశ్ దెప్పి పొడిచారు. ఈ నేప‌థ్యంలోనే మాయావ‌తి పై వ్యాఖ్య‌లు చేశారు.స‌మాజ్‌వాదీ పార్టీ త‌మ‌పై రోజూ ఏదో పుకార్లు పుట్టిస్తూనే వుంటుందోంటూ మాయావ‌తి విరుచుకుప‌డ్డారు. అయితే.. ద‌ళితులు, అణ‌గారిన వ‌ర్గాలు, ముస్లింలు తిరిగి బీఎస్పీకి ప్రాణం పోస్తే, సీఎం, ప్ర‌ధాని అవ‌డం బాగా సుల‌భ‌మ‌వుతుంద‌ని మాయావ‌తి పేర్కొన్నారు. మ‌ళ్లీ యూపీ సీఎం అవ్వాల‌నే అనుకుంటున్నాను. దేశ ప్ర‌ధాని కావాల‌ని కూడా క‌ల‌లు కంటున్నాను. రాష్ట్ర‌ప‌తి కావాల‌న్న కాంక్ష లేనే లేదు. నేను సుఖ‌వంత‌మైన జీవితాన్ని కోరుకోవ‌డం లేదు. అంబేద్క‌ర్‌, కాన్షీరాం న‌డిచిన బాట‌లోనే న‌డ‌వాల‌ని అనుకుంటున్నాను. వారికి ఈ విష‌యం అర్థం కావాలి. అని మాయావ‌తి పేర్కొన్నారు

*ప్రభుత్వంలో సమస్యలు తీరుతాయన్న ఆశ లేదు : దేవతోటిP
ఎమ్మెల్యే సుధాకర్ దగ్గరికి గ్రామ సమస్యలు చెప్పడానికి వచ్చిన రాఘవయ్యను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను ప్రజల్లో తిరిగమoటున్న జగన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో సమస్యలు తీరుతాయన్న ఆశ లేదన్నారు. కనీసం చెప్పుకునే అవకాశం కూడా లేకపోవడం ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. దాష్టీకం అయిన ఈ దరిద్రపు పాలన గురించి ప్రజలు, దళిత మేధావులు ఆలోచించాలని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని దేవతోటి కోరారు

*బీజేపీ అంటే భయపడుతున్నారు: కిషన్‌రెడ్డి
ఆర్ఎస్ నేతలు, కేసీఆర్ కుటుంబం బీజేపీ అంటే భయపడుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ కుటుంబీకుల మాటలు, తీర్మానాలు అబూత కల్పనలే అని విమర్శించారు. దేశాన్ని ఉద్ధరించేది టీఆర్ఎస్‌, కేసీఆర్ కుటుంబమే అని మాట్లాడుతున్నారని, తెలంగాణలో 8 ఏళ్లుగా టీఆర్ఎస్‌ ఏం ఉద్ధరించిందో చెప్పాలి? అని ఆయన ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్, గుణాత్మక మార్పు అని కేసీఆర్ మాట్లాడారని చెప్పారు. గుణాత్మకమైన పరిపాలన అంటే..కుటుంబ పాలనా? అని ప్రశ్నించారు. పుల్వామా సర్జికల్ స్ట్రైక్‌కి ఆధారాలు కోరిన వ్యక్తి దేశ సమగ్రత గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.

*వైసీపీ ప్రభుత్వం ఒక్క ఛాన్స్‌ కే పరిమితమవ్వడం ఖాయం: Kanna
వైసీపీ ప్రభుత్వం ఒక్క ఛాన్స్‌ కే పరిమితమవ్వడం ఖాయమని బీజేపీ కేంద్ర కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… గత మూడు సంవత్సరాలుగా రాష్ట్రంలో అరాచక పాలనా నడుస్తోందని విమర్శించారు. విద్యుత్, ఇసుక, ఆర్టీసీ బస్సు చార్జీలు, నిత్యావసర ధరలు విచ్చలవిడిగా పెంచారన్నారు. గడిచిన మూడు సంవత్సరాలలో 7సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని తెలిపారు. చెత్తపన్ను, ఆస్తి పన్ను నిత్యావసర ధరలు పెంపుకు అడ్డు అదుపు లేకుండా పోయిందని మండిపడ్డారు. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ అన్ని రంగాలను నాశనం చేశారన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రం సర్వ నాశనం అవుతుంది తప్ప మరొకటి లేదని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.

*ఆడబిడ్డలను రక్షించుకోలేని అసమర్ధత ఏపీ సీఎం: అనిత
టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగల వంగలపూడి అనిత వైసీపీ మంత్రుల వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏపీ మంత్రి రోజా నిన్న చంద్రబాబు, లోకేశ్‌ చీరెలు కట్టుకోవాలని చేసినా వ్యాఖ్యలకు అనిత కౌంటర్‌ ఇచ్చారు. ఏపీలో కనీసం మహిళకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. లేని దిశ చట్టాన్ని తీసుకువచ్చి మహిళలను అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 8వందల మందికి పైగా మహిళలపై అఘాయిత్యాలు జరిగితే కనీసం నోరెత్తని సీఎంకు ఏం చీర పంపిస్తావని రోజాను ప్రశ్నించారు. జగన్‌ రోడ్డు వెంట వెళ్తుంటే ఇరువైపులా ఉండే దుకాణాలను మూసివేయిస్తున్నారని, రోడ్లపైకి ఎవరినీ రానీయడం లేదని ఆమె ఆరోపించారు. రెండువేల మంది పోలీసుల పహారాలో జగన్‌ బయటకు వస్తున్నారని అతడికి ఎలాంటి చీర పంపించాలని విమర్శించారు

*ఏపీ సీఎం అప్పుల అప్పారావుగా మారారు: Sailajanth
ఏపీ సీఎం జగన్ అప్పుల అప్పారావుగా మారారని పిసిసి చీఫ్ శైలజనాథ్ వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ…రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని అన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ ఢిల్లీలో మంత్రిని బయటపెట్టి లోపల చీవాట్లు పెట్టించుకున్నారని తెలిపారు. ఏపీ మర్యాదను సీఎం మంట గలుపుతున్నారని మండిపడ్డారు. ప్రజలను ఆడుకునే వాళ్లుగా మారుస్తున్నారన్నారు. లక్ష 10 వేల కోట్లు పంచామంటున్నారని… 70 వేల కోట్లకు ప్రభుత్వం లెక్క చూపడం లేదని తెలిపారు. మంత్రి బుగ్గనకు రోషం ఉంటే రాజీనామా చేయాలని… మంత్రిని బయటకు పంపారంటేనే పరువుపోయిందని ఆగ్రహించారు. మంత్రులు భజనరాయుళ్లుగా మారిపోయారన్నారు. ఎక్కడ అత్యాచారం జరిగినా ప్రభుత్వం ధర నిర్ణయిస్తుందని తెలిపారు. ఎల్జీ పాలీమార్స్‌లో ప్రమాద బాధితులకు కోటి ఇస్తారని… అత్యాచార బాదితులకు రూ.5 లక్షలు ఇస్తారా అని శైలజానాథ్ ప్రశ్నించారు

*వాసిరెడ్డి పద్మకి 10 ప్రశ్నలు సంధించిన బోండా ఉమ
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మకు టీడీపీ పోలిట్ బ్యూరో మెంబర్ బోండా ఉమా 10 ప్రశ్నలు సంధించారు. ‘‘1. మహిళ కమిషన్ చైర్మన్‌గా ఉంటూ 3 రోజుల వరకూ ఎందుకు పరామర్శించడానికి రాలేదు? 2. నువ్వు పరామర్శించాటానికి వచ్చావా పబ్లిసిటీ కోసం వచ్చావా? 3. నువ్వు ఇచ్చిన నోటీసులు తాడేపల్లి స్క్రిప్ట్ అవునా.. కాదా? 4. నువ్వు పబ్లిసిటీ కోసం వచ్చింది నిజమే కదా? 5.10 మంది పట్టని రూమ్‌లో 100 మంది ఉన్నారని అనటం అబద్ధం కదా? 6. మానసిక వికలాంగురాలైన మహిళపై అత్యాచారం జరిగితే వైసీపీ ప్రభుత్వం స్పందించే తీరు ఇదేనా? 7. నీకు వైసీపీ ప్రయోజినాలు తప్పితే మహిళల సమస్యలు పట్టవా? 8.చంద్రబాబు గారు పరామర్శకు రాక పోతే మీరు బాధితులను పట్టించుకొనేవారా? 9. మేము 10 తప్పులు చేశమన్నావ్.. ఎక్కడో నిరూపించు 10. ఇంకా 90 తప్పుడు కేసులు పెట్టుకో భయపడం’’ అని బోండా ఉమ పేర్కొన్నారు.

*పులివెందుల నియోజకవర్గ ప్రజలు జగన్‌ను ఎందుకు ఓడించకూడదు?: తులసీరెడ్డి
వచ్చే ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గ ప్రజలు జగన్‌ను ఎందుకు ఓడించకూడదని ఏపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసీ రెడ్డి ప్రశ్నించారు. గురువారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చిన్నాన్న వివేకానంద రెడ్డి హత్య కావించబడి మూడేళ్లు అయిందని, ఆ కేసు ఇంతవరకు అతీగతీ లేదని విమర్శించారు. ముఖ్యమంత్రి చెల్లెలు డాక్టర్ సునీత రెడ్డి రక్షణ కావాలంటూ కడప ఎస్పీకి లేఖ రాశారన్నారు. ఈ మూడేళ్ల కాలంలో పెద్ద కుడాల నాగమ్మ, పులివెందుల శివరానీ , వీరమ్మ, కోమన్నూతల మునెప్ప ఇలా ఎందరో హత్య కావించబడ్డారన్నారు. నియోజకవర్గంలో ప్రజలకే కాదు దేవుళ్లకు కూడా రక్షణ లేదని, శాంతి భద్రతల వైఫల్యం ఒక్కటీ చాలదా జగన్‌ను ఓడించడానికి అని అన్నారు

*భట్టి పాదయాత్రపై కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టి పాదయాత్రపై ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపైనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం కోమటిరెడ్డి మాట్లాడుతూ… కష్టమైనా నష్టమైనా పాదయాత్రను కొనసాగించాలని భట్టిని కోరారు. దివంగత నేత రాజశేఖర్‌రెడ్డిని స్పూర్తిగా తీసుకోవాలని భట్టికి సూచన చేశారు. రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు భట్టి విక్రమార్కకు అనుమతి ఇవ్వాలని సోనియా, రాహుల్‌కు లేఖ రాయనున్నట్లు తెలిపారు. 2004లో సీఎల్పీ నేతగా రాజశేఖరరెడ్డి పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎంపీ గుర్తుచేశారు. భట్టి విక్రమార్క పాదయాత్ర చేస్తే కావాల్సిన సహకారం సీనియర్లం అందిస్తామన్నారు. ‘‘నేను అంటే గోవిందా అని.. కాంగ్రెస్‌లో నేను అనే పదానికి చోటు లేదు.. మనం అని మాత్రమే అనాలి’’ చెప్పుకొచ్చారు. రాహుల్ సభకు ఒక వ్యక్తి మాత్రమే లక్షల మందిని ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు.ఉమ్మడి కృషితో వరంగల్‌లో రాహుల్ సభను విజయవంతం చేస్తామని తెలిపారు. బలమైన నల్లగొండలో కాదు.. బలహీనంగా ఉన్న నిజామాబాద్, ఆదిలాబాద్ లాంటి జిల్లాలో సన్నాహక సమావేశాలు పెట్టాలని హితవుపలికారు. నితిన్ గడ్కరీ పర్యటన కారణంగా.. రేపు నల్లగొండ కాంగ్రెస్ సన్నాహక సమావేశానికి హాజరుకావటం‌ లేదని తెలిపారు. 3 వేల‌ కోట్లతో మూసీని శుభ్రం చేయలేని అసమర్థ సీఎం‌ కేసీఆర్ అని విమర్శించారు. విజయవాడ – హైదరాబాద్ జాతీయ రహదారి అభివృద్ధిలో తన కృషి ఉందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు

*చందూకు కీలక బాధ్యతలు అప్పగించింన చంద్రబాబు
తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విజయవాడకు చెందిన దేవినేని చంద్రశేఖర్‌ (చందు) నియమితులయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశాల మేరకు చందుకు రాష్ట్ర పదవి కట్టబెట్టినట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. 2012లో చంద్రబాబు ’మీ కోసం’ పాదయాత్రలో దేవినేని చందు టీడీపీలో చేరారు. అప్పటి నుంచి క్రియాశీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఆయన సేవలను గుర్తించిన పార్టీ అధిష్టానం తొలుత విజయవాడ అర్బన్‌ తెలుగు యువత అధ్యక్షుడిగా, ఆ తర్వాత ఉమ్మడి కృష్ణాజిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించారు. పార్టీకి ఆయన చేస్తున్న సేవలను గుర్తించి తాజాగా తెలుగు యువత రాష్ట్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించింది.

*ప్రభుత్వంలో సమస్యలు తీరుతాయన్న ఆశ లేదు : దేవతోటిP
ఎమ్మెల్యే సుధాకర్ దగ్గరికి గ్రామ సమస్యలు చెప్పడానికి వచ్చిన రాఘవయ్యను పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి చితకబాదడం దుర్మార్గమైన చర్య అని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి దేవతోటి నాగరాజు పేర్కొన్నారు. ఎమ్మెల్యేలను ప్రజల్లో తిరిగమoటున్న జగన్ రెడ్డి దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంలో సమస్యలు తీరుతాయన్న ఆశ లేదన్నారు. కనీసం చెప్పుకునే అవకాశం కూడా లేకపోవడం ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. దాష్టీకం అయిన ఈ దరిద్రపు పాలన గురించి ప్రజలు, దళిత మేధావులు ఆలోచించాలని.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని దేవతోటి కోరారు

*ఆ ఆడియో నాది కాదు… కోర్టులో తేల్చుకుంటా: Mahendar
తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిని దూషించిన కేసులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి వివరణ ఇచ్చారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… ఆ ఆడియో తనది కాదని… ఈ విషయంలో కోర్టులో తేల్చుకుంటానని స్పష్టం చేశారు. ఎన్ని కేసులు పెట్టినా సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇదంతా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి చేయిస్తున్నారని ఆరోపించారు. తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తన ముందు రౌడీ షీటర్లు వచ్చి ఇబ్బంది పెట్టే పరిస్థితి వచ్చిందని, అక్కడికి ఇద్దరు రౌడీ షీటర్లు వచ్చారని తెలిపారు. ఈ విషయంలో రూరల్, టౌన్ సీఐతో మాట్లాడినట్లు చెప్పారు. పోలీసులు అంటే తనకు గౌరవం ఉందన్నారు. అధికారులు అంతా తాండూరు రావాలని కోరుకుంటారని అన్నారు. పోలీసులతో చాలా బాగుంటానని పట్నం మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. అసలేం జరిగిందంటే….తాండూరు టౌన్‌ సీఐ రాజేందర్‌రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఆడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఏప్రిల్‌ 23న (శనివారం) వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డుగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అనుచరులతో కూర్చున్నా.. సీఐ రాజేందర్‌రెడ్డి వారించలేదనే ఆగ్రహంతోనే ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఈ ఫోన్‌కాల్‌ చేసినట్లు తెలుస్తోంది. ఈ కాల్‌లో ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, సీఐ రాజేందర్‌రెడ్డి మధ్య సంభాషణ ఇలా సాగింది.. ‘‘రౌడీ షీటర్లు వస్తే ఎట్లా ఊకున్నవ్‌. మరి నీవేం పీకుతున్నవ్‌’’ అని ఎమ్మెల్సీ అనగా.. ‘‘సార్‌ మంచిగా మాట్లాడండి’’ అని సీఐ అన్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన ఎమ్మెల్సీ పచ్చి బూతులు తిడుతున్నట్లు ఆడియో సంబాషణ ఉంది. దీనిపై సీఐ రాజేందర్‌రెడ్డిని వివరణ కోరగా.. ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి తనను దూషించడంపై పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. కాగా… ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలంటూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వర్గీయులు బుధవారం రాత్రి తాండూరు పోలీస్‌స్టేషన్‌ ఎదుట ధర్నా చేశారు

*కాంగ్రెస్ లేకుండా కేంద్రంలో అధికార మార్పిడి అసాధ్యం : ఏకే ఆంటోనీ
కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన పాత్రను పోషించకుండా కేంద్రంలో అధికార మార్పిడి సాధ్యం కాదని ఆ పార్టీ సీనియర్ నేత ఏకే ఆంటోనీ చెప్పారు. నెహ్రూ-గాంధీ కుటుంబం అత్యంత పలుకుబడి, అధికారంగల కేంద్రమని తెలిపారు. ఆ కుటుంబం కాంగ్రెస్‌కు మార్గదర్శనం చేసే శక్తి అని పేర్కొన్నారు. ఆ కుటుంబీకులు లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్లో 99 శాతం మందికి ఆ పార్టీ ఆమోదయోగ్యం కాదన్నారు.కాంగ్రెస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఆంటోనీ బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన పాత్రను పోషించకుండా కేంద్రంలో అధికార మార్పిడి సాధ్యం కాదన్నారు. కాంగ్రెస్ లేకుండా ఢిల్లీలో అధికార మార్పిడి గురించి ఊహించలేరన్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబం ఓ పవర్‌హౌస్ వంటిదని, పార్టీకి మార్గదర్శనం చేసే చోదక శక్తి అని తెలిపారు. నెహ్రూ-గాంధీ కుటుంబీకులు లేకపోతే దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల్లో 99 శాతం మందికి పార్టీ ఆమోదయోగ్యం కాదన్నారు. కాంగ్రెస్‌ను తక్కువగా అంచనా వేయవద్దని కోరారు. ఆ పార్టీ మళ్ళీ పుంజుకుంటుందన్నారు. 2024లో జరిగే సాధారణ ఎన్నికల్లో తమ పార్టీ పుంజుకుంటుందని చెప్పారు. పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయడానికి రోడ్‌మ్యాప్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఇటీవలి మత ఘర్షణల గురించి ప్రస్తావిస్తూ, దేశంలో నేటి పరిస్థితులు చాలా బాధాకరంగా ఉన్నాయన్నారు. అన్ని మతాలు, కులాలు, జాతులు, వేర్వేరు భాషలకు చెందినవారు అభివృద్ధి చెందగలిగే దేశం భారత్ ఒక్కటేనన్నారు

*పర్యాటకానికి అంబాసిడర్‌గా పనిచేస్తా: మంత్రి రోజా.
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు దేశ, విదేశాల్లో మంచి ప్రాచుర్యం కల్పించేందుకు తానే ప్రత్యేక అంబాసిడర్‌గా పని చేస్తానని మంత్రి ఆర్‌.కె.రోజా అన్నారు. బుధవారం సచివాలయంలో అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. పర్యాటక ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించడమే కాకుండా అక్కడ సమస్యల పరిష్కారానికి, ఆయా ప్రాంతాల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానన్నారు. అందుకు తగ్గట్టుగా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి వాటి అమలుకు పూర్తిస్థాయిలో సహకరించాలని అధికారులను కోరారు. సాంస్కృతిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ్‌, క్రీడాశాఖ ముఖ్య కార్యదర్శి వాణి మోహన్‌, ఇతర అధికారులు పాల్గొన్నారు.

*జగన్ రివర్స్‌ పాలనలో బాధితులపైనే అక్రమ కేసులు: లోకేష్జ
గన్ రివర్స్‌ పాలనలో బాధితులపైనే అక్రమ కేసులు పెడుతున్నారని టీడీపీ జాతీయ కార్యదర్శి NARA LOKESH ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడలో మట్టి మాఫియాను అడ్డుకున్న REVENUE INSPECTOR అరవింద్‌పై కేసులు పెట్టడంపై ఆయన స్పందించారు. గుడివాడలో మట్టి అక్రమ రవాణాను అడ్డుకున్నారనే అక్కసుతో ఆర్ఐపై లంచం DEMAND చేశారని అక్రమ కేసు పెట్టారని లోకేష్‌ మండిపడ్డారు. అధికారుల మనోధైర్యాన్ని దెబ్బతియడమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు. అధికారులను బెదిరించడానికి అక్రమ కేసుల విషయంలో మరోసారి కోర్టులో ప్రభుత్వం మొట్టికాయలు తినడం ఖాయమని హెచ్చరించారరు. వైసీపీ అక్రమాలకు ఎదురొడ్డి పోరాడుతున్న ఉద్యోగులకు TDP ఎప్పుడూ అండగా ఉంటుందని నారా లోకేష్‌ తెలిపారు.

*పాలన చేస్తున్నాడా? వడ్డీ వ్యాపారం చేస్తున్నాడా?: నాదెండ్ల
సీబీఐ దత్తపుత్రుడు పాలన చేస్తున్నాడా? వడ్డీ వ్యాపారం చేస్తున్నాడా? అని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. రైతుల నుంచి నీటి తీరువాకు వడ్డీ విధించి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. నీటి తీరువా వసూలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం అప్రజాస్వామికమన్నారు. గిట్టుబాటు ధరలు రాక… పండిన పంట చేతికొస్తుందో లేదో అర్థం కాని పరిస్థితి నెలకొందన్నారు.

*ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా పెట్టాలి: జగన్వై
ద్యారోగ్య శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ కట్టడి చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. రుయా ఆస్పత్రి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించారు. అలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆస్పత్రుల్లో ఫిర్యాదు నంబర్లు అందరికీ కనిపించేలా పెట్టాలని జగన్ తెలిపారు. ఒకట్రెండు ఘటనలతో మొత్తం వ్యవస్థకే చెడ్డపేరు వస్తుందన్నారు. పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.

*మోదీతో కేసీఆర్‌కు పోలికా?: అరుణ
‘‘ప్రధాని మోదీకి, సీఎం కేసీఆర్‌కు పోలిక ఎక్కడిది? అభివృద్ధిలో దేశాన్ని మొదటి స్థానంలో నిలిపేందుకు మోదీ అహర్నిశలు పనిచేస్తారు. మోదీ రోజుకు 18 గంటలు ప నిచేస్తే.. కేసీఆర్‌ 18 గంటల పాటు పడుకుంటడు’’ అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్డీయే ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుందని, నెల జీతాలే సరిగా ఇవ్వలేని పరిస్థితిలో కేసీఆర్‌ ఉన్నారన్నారు.

*పీకే సేవలపై బీజేపీ, కాంగ్రెస్‌లకు మాట్లాడే హక్కు లేదు: హరీశ్‌
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సేవలు బీజేపీ, కాంగ్రెస్‌ వినియోగించుకుంటే ఆయన గొప్పోడు, టీఆర్‌ఎ్‌సకు పనిచేస్తే చెడ్డోడా అని మంత్రి హారీశ్‌రావు ప్రశ్నించారు. హైటెక్స్‌లో పార్టీ ప్లీనరీకి వెళ్లే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్‌ కిషోర్‌ సహకారంపై కాంగ్రెస్‌, బీజేపీలకు మాట్లాడే హక్కు లేదన్నారు. అటువంటివారున్నప్పటికీ ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. 21 ఏళ్ల టీఆర్‌ఎస్‌ ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించిందన్నారు. బక్కపలచని వ్యక్తి రాష్ర్టాన్ని సాధిస్తాడా అన్న అవహేళనలు, అవమానాలు తట్టుకుని పార్టీ నిలబడినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పుడు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని చెప్పారు.

*పీకే సేవలపై బీజేపీ, కాంగ్రెస్‌లకు మాట్లాడే హక్కు లేదు: హరీశ్‌
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ సేవలు బీజేపీ, కాంగ్రెస్‌ వినియోగించుకుంటే ఆయన గొప్పోడు, టీఆర్‌ఎ్‌సకు పనిచేస్తే చెడ్డోడా అని మంత్రి హారీశ్‌రావు ప్రశ్నించారు. హైటెక్స్‌లో పార్టీ ప్లీనరీకి వెళ్లే సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్‌ కిషోర్‌ సహకారంపై కాంగ్రెస్‌, బీజేపీలకు మాట్లాడే హక్కు లేదన్నారు. అటువంటివారున్నప్పటికీ ప్రభుత్వ పనితీరు ఆధారంగానే ప్రజలు ఆదరిస్తారని చెప్పారు. 21 ఏళ్ల టీఆర్‌ఎస్‌ ఎన్నో అద్భుతాలను ఆవిష్కరించిందన్నారు. బక్కపలచని వ్యక్తి రాష్ర్టాన్ని సాధిస్తాడా అన్న అవహేళనలు, అవమానాలు తట్టుకుని పార్టీ నిలబడినట్లు పేర్కొన్నారు. తెలంగాణ ఇప్పుడు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తోందని చెప్పారు.

*వైఫల్యాల చరిత్ర బీజేపీది: కేటీఆర్
దేశానికి టెలివిజన్ నాయకుడు కాదని, విజన్ ఉన్న నాయకుడు కావాలని ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రస్తుత సమయంలో దేశానికి కేసీఆర్ లాంటి నాయకుడు కావాలని అన్నారు. బుధవారం టీఆర్ఎస్ వ్యవస్ధాపక దినోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడారు దేశాన్ని పాలిస్తున్న బిజెపికి వైఫల్యాల చరిత్ర అని అన్నారు. రైతులను ఫణంగా పెట్టి మోదీ రైతు చట్టాలను తెచ్చారని చెప్పారు.మోదీ రైతు విరోధి అని రైతులే అంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని మోదీ ఇచ్చిన హామీ ఏమైందని కేటీఆర్ ప్రశ్నించారు.2022 కల్లా బుల్లెట్ రైలు తెస్తామని.. ఉన్న ఆస్తులు అమ్మేస్తున్నారు.డబుల్ ఇంజిన్ అంటే ఏంటో అనుకున్నాం కానీ దేశ ప్రజల కష్టాలను డబులు చేస్తారనుకోలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

*మైనార్టీల సంక్షేమానికి ప్రత్యేక కృషి: సునీతా లక్ష్మారెడ్డి
మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకొని ముస్లిం సోదరసోధరీమనుల కోసం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు షాహిన్ అఫ్రోజ్ తన స్వగృహము నందు నిర్వహించిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ ముస్లిం సోధరసోధరిమనులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఇఫ్తార్‌ విందు మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమమే లక్ష్యంగా పథకాలు రూపొందించి అమలు చేస్తుందని, మైనార్టీలకు గుర్తింపు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సునితా లక్ష్మారెడ్డి కోరారు. అనాధ పిల్లలు, పేద వర్గాల ప్రజలకు బట్టలు, రేషన్ పంపిణీ చేశారు. మహిళలకు ఏ సమస్య వచ్చిన తెలంగాణ మహిళా కమిషన్ మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళ కమిషన్ సెక్రెటరీ కృష్ణకుమారి, కౌన్సిలర్స్ కవిత, మంజుష, మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.