Movies

తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు ఆ హోటల్లో నాతో బెడ్ షేర్ చేసుకున్నాడు

Auto Draft

శ్రీరెడ్డి గా పరిచయం ఉన్న ఆమె అసలు పేరు విమల మల్లిడి. ఆమె కృష్ణా జిల్లా విజయవాడ లోని కంకిపాడుకు చెందిన ఓ సాంప్రదాయ కుటుంబంలో పుష్పవతి, వెంకటరెడ్డి దంపతులకు జన్మించింది. ఆమెకు తాను అనుకున్నదే జరగాలని భావించే స్వభావం చిన్నప్పటి నుండే ఉన్నది. ఆమె మొదట్లో బ్యూటీ పార్లర్ నిర్వహించేది. అయితే వివాదాస్పద నటి శ్రీ రెడ్డి తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు అలాగే నటుడైన ఉదయనిధి స్టాలిన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

గతంలో ఇదు కదిర్వేలన్ కాదల్ షూట్ చేస్తున్నప్పుడు పార్క్ హయత్ హోటల్లో తనతో బెడ్ కూడా షేర్ చేసుకున్నాడు అని చెప్పింది. ఇక ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ రెడ్డి ద్వారా ఈమె ఉదయనిధిని కలిశానని తెలిపింది. రాత్రంతా హోటల్లోనే గడిపామని తన పని అయ్యాక సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి.. ఇంత వరకు ఏ సినిమాలో కూడా అవకాశం ఇవ్వలేదని శ్రీరెడ్డి ఆరోపించింది. ఉదయనిది స్టాలిన్ ఎన్నికలలో గెలిచినప్పుడు కూడా తాను హ్యాపీగా ఫీలయ్యానని వెల్లడించింది. ఒక మామూలు హీరోగా ఉన్న ఉదయనిది స్టాలిన్ మంత్రి అయ్యాక తన ఆనందానికి అవధులు లేవు అంటూ కూడా తెలిపింది శ్రీరెడ్డి.

శ్రీ రెడ్డి దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు అభిరామ్ తో అత్యంత సన్నిహితంగా ఉన్న ఫోటోలను విడుదల చేసింది. ఇవి సినీ పరిశ్రమలో కలకలం రేపాయి. ఆమె పదికిపైన ఉన్న ఫోటోలను బహిర్గతం చేసింది. అంతే కాకుండా టాలీవుడ్ క‌మ‌ర్షియ‌ల్ రైట‌ర్ కోన వెంక‌ట్ త‌న‌ను బంజారాహిల్స్ శ్మ‌శానం వెనుక ఉన్న గెస్ట్‌హౌస్‌కు పిలిచి లైంగిక దాడి చేశాడ‌ని శ్రీరెడ్డి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది.టాలీవుడ్ కు చెందిన ప్రముఖ మాటల రచయితకు సంబంధించిన వాట్సప్ చాటింగ్ హిస్టరీని కూడా బయటపెట్టింది. సంచలన చిత్రాల దర్శకుడి వాట్సప్ చాటింగ్ హిస్టరీని కూడా శ్రీ రెడ్డి బహిర్గతం చేసింది.