DailyDose

ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్‌ – TNI తాజా వార్తలు

ఢిల్లీ పర్యటనకు బయల్దేరిన సీఎం జగన్‌ – TNI తాజా వార్తలు

* ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటకు బయలుదేరారు. రెండు రోజులపాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. శనివారం జరిగే కోర్టు- మౌలిక సదుపాయాలపై ముఖ్యమంత్రులు, చీఫ్‌ జస్టిస్‌ల సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొననున్నారు.

*మంత్రి బొత్సకు అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్మంత్రి బొత్స సత్యనారాయణకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్‌లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘’వైఎస్ మృతి వెనుక జగన్ హస్తముంది. వైఎస్ విజయలక్ష్మి జగన్ తీరు దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్టు ఉందంటూ నీ అంత డిగ్నిఫైడ్‌గా మాట్లాడటం మా లోకేష్‌కు రాదు బొత్స సత్తిబాబు. సొమ్ములు పోనాయ్ ఏటి సేత్తాం అని చిల్లరగా మాట్లాడి మంత్రిగా ఫెయిల్ అయిన నీ లాంటి వాళ్ళపై దాడులు జరిగితే కడుపుమంట అనుకోవడంలో తప్పులేదు. మహిళలకు అండగా నిలుస్తున్న లోకేష్‌ను చూసి అక్కసుతో గ్యాస్ ఎక్కువై జగన్ రెడ్డి పంపిన రౌడీలు రాళ్ళు విసిరితే కడుపుమండి ఎవరో చేసారని కవరింగ్ ఎందుకు బొత్సా?’’ అంటూ అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.

*శ్రీ చైతన్య స్కూల్స్ ఎండీ శ్రీధర్ ఇంట్లో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లో శ్రీధర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేశవ రెడ్డి స్కూల్స్ , శ్రీ చైతన్య స్కూల్స్ మధ్య వివాదంలో విచారణకు తీసుకెళ్లినట్లు ఏపీ సీఐడీ అధికారులు చెపుతున్నారు. విజయవాడలోని సీఐడీ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది

*టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఏపీ పరిస్థితులపై చేసిన వ్యాఖ్యాలపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో విద్యుత్ కోతలు లేవన్నారు. బొగ్గు అధికంగా కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రోడ్లు బాగుపడ్డాయన్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందునే కేటీఆర్ అలా మాట్లాడి ఉండొచ్చునని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో బాగాలేదు.. తెలంగాణలో బాగుందంటే ఓట్లు పడొచ్చని కేటీఆర్ భావించి ఉండవచ్చునని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు.

*అంత‌ర్జాతీయ మార్కెట్‌లో రూ కోటిన్న‌ర విలువైన జింక కొమ్ముల‌తో ప‌ట్టుబ‌డిన మ‌హిళ (23)ను ఢిల్లీలోని తిమార్పూర్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు. మ‌హిళ నుంచి జింక కొమ్ముల‌ను స్వాధీనం చేసుకున్నారు.నిందితురాలిని అరుణా న‌గ‌ర్‌, మజ్నూకా టిల్లాకు చెందిన చోటీ అలియాస్ ఫాతిమాగా గుర్తించారు. తిమార్పూర్ ప్రాంతంలో మ‌హిళ జింక కొమ్ముల‌ను విక్ర‌యిస్తోంద‌నే స‌మాచారంతో అట‌వీ వన్య‌ప్రాణుల శాఖ అధికారుల‌తో క‌లిసి పోలీసులు దాడులు చేప‌ట్టి నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.ఢిల్లీలో జింక కొమ్ముల‌ను విక్ర‌యించేందుకు తాను యూపీలొని బ‌హ్రీక్‌కు చెందిన గోపాల్ ఠాకూర్ వ‌ద్ద వీటిని కొనుగోలు చేశానని విచార‌ణ‌లో మ‌హిళ వెల్ల‌డించింద‌ని పోలీసులు తెలిపారు. వ‌న్య‌ప్రాణి సంర‌క్‌ ణ చ‌ట్టంలోని ప‌లు సెక్ష‌న్ల కింద తిమార్పూర్ పోలీస్ స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేశామ‌ని డీసీపీ సాగ‌ర్ సింగ్ వెల్ల‌డించారు. త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశామ‌ని చెప్పారు.

*ప్రస్తుత సంవత్సరం 19.5 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ తెలిపారు. హరిత హారం కార్యక్రమాన్ని విజయ వంతంగా అమలు చేయడం వల్ల రాష్ట్రంలో పచ్చదనం, అటవీ విస్తీర్ణం 7 .70శాతం పెరిగిందని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు సీఎస్ సోమేశ్ కుమార్ శుక్రవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం, దళిత బంధు, యాసంగి వరి ధాన్యం సేకరణ అమలుపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అటవీ విస్తీర్ణం 10 శాతం కంటే తక్కువ ఉన్న జిల్లాల్లో పెద్ద ఎత్తున గ్రీనరీ పెంపొందించేందుకై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 19,400 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటుచేశామని, ఇప్పటి వరకు ఏర్పాటుచేయని గ్రామాల్లో పల్లెప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. దీనితోపాటు ప్రతి మండలంలో కనీసం నాలుగు బృహత్ పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాలన్నారు.

*తెలంగాణ రాష్ట్ర న్యాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శుక్ర‌వారం ఢిల్లీకి వెళ్లారు. ఈ నెల 30న ఢిల్లీలోని విజ్ఞాన భ‌వ‌న్ లో జ‌ర‌గ‌నున్న న్యాయ స‌ద‌స్సులో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన‌నున్నారు. సీజేఐ జస్టీస్ ఎన్వీ రమణ నేతృత్వం వహిస్తున్న ఈ సమావేశానికి ప‌లు రాష్ట్రాల‌ ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరుకానున్నారు. నేషనల్ జ్యూడిషీయల్ ఇన్ఫ్రాస్టక్టర్ అథారిటీ ఏర్పాటు ప్రధాన ఎజెండాగా ఈ సదస్సు నిర్వహించనున్నారు. దేశంలో న్యాయ, మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారం తదితర అంశాలపై ఈ సదస్సులో చర్చించ‌నున్నారు.

*పెంచిన విద్యుత్ చార్జీలు, అప్రకటిత కరెంట్ కోతలకు నిరసిస్తూ… జనసేన వినూత్న నిరసన చేపట్టింది. గురుద్వార జంక్షన్ నుంచి ఏపీ ఇపిడిసిఎల్ కార్యాలయం వరకు చీపుర్లతో రోడ్డు ఊడుస్తూ నిరసన తెలిపారు. విద్యుత్ చార్జీలు, కరెంట్ కోతలు విధించ వద్దని సీఎండికి వినతి పత్రం సమర్పించారు. ఈ నిరసన కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం ఇంఛార్జ్ ఉషాకిరణ్, జనసేన నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

*నపై అత్యాచార యత్నం చేసిన ఆటో డ్రైవర్‌ని ఓ యువతి చితకబాదిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో రాత్రి 12 గంటల సమయంలో ఓ ఆటో డ్రైవర్‌ యువతిని వెంబడించి అత్యాచార యత్నం చేశాడు. దీంతో ఆటో డ్రైవర్‌ను సదరు యువతి కర్రతో జాతీయ రహదారిపై చితకబాదింది. విశాఖ నుంచి విజయవాడ వెళ్తున్న కొంతమంది యువకులు యువతికి అండగా నిలిచారు.

*విద్యుత్ కొనుగోలు చేద్దామంటే పవర్ ఎక్సేంజ్‌లో విద్యుత్ అందుబాటులో లేకపోవడంతో తీవ్ర ఆందోళన ప్రారంభమైంది. ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురైంది. ముందు చూపు లేకపోవడం వంటి కారణాలతో ఏపీలో ప్రజలకు మండు వేసవిలో నరకం కనిపిస్తోంది. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి, డిమాండ్ మధ్య అంతరాయం పెరుగుతోంది. రోజు రోజుకు కోతలు పెరుగుతున్నాయి. విద్యుత్ ఉత్పాదనకు ప్రధానమైన ధర్మల్ విద్యుత్ స్టేషన్లకు బొగ్గు కొరత వెంటాడుతోంది. దీంతో థర్మల్ స్టేషన్లలో ఉత్పాదన తగ్గించివేస్తున్నారు. దీనికి తోడు సోలార్ విద్యుత్ ఉత్పాదన కూడా సగటున 6 వందల మెగావాట్లకు మించి రావడంలేదు. హైడల్, గ్యాస్, విద్యుత్ ఉత్పాదన పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా రాష్ట్రంలో చీకట్లు కమ్ముకుంటున్నాయి.*ఏలూరు: జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం యూనియన్(ఆంధ్రా బ్యాంక్) బ్యాంకులో భారీ గోల్ మాల్ జరిగింది. రైతులకు చెందిన సుమారు రూ.50 లక్షల నగదును బ్యాంక్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఉండవల్లి రవి గోల్ మాల్ చేశాడు. రవి గత 20 సంవత్సరాలుగా బ్యాంక్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రైతులకు చెందిన నగదు వారి అకౌంట్‌లలో జమ కాకపోవడంతో బాగోతం బయటపడింది. దీనిపై బ్యాంక్ ఉద్యోగులను రైతులు, స్థానికులు నిలదీశారు. అయితే రవితో తమకు సంబంధం లేదని బ్యాంక్ ఉద్యోగులు తెలిపారు. కాగా బ్యాంక్ మేనేజర్ పింటు కుమార్ వారం రోజులుగా సెలవులో ఉన్నారు. ఈ వ్యవహారం బయటపడటంతో బ్యాంక్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఉండవల్లి రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గోల్‌మాల్‌కు సంబంధించి బ్యాంక్ అధికారులు ఇంత వరకు రవిపై ఫిర్యాదు చేయని పరిస్థితి. దీంతో రైతులు బ్యాంక్ వద్ద ఆందోళనకు దిగారు.

*నర్సీపట్నం అర్బన్ బక్కన్నపాలెంలో చిరుత సంచారం కలకలం రేపింది. నిన్న రాత్రి రెండు ఆవులను చంపి తినేసింది. మృతి చెందిన ఆవుల శరీరాలపై పులి వేటాడిన ఆనవాళ్లు కనిపించాయి. సంఘటనా స్థలంలో చిరుత పులి కాలి ముద్రలను సైతం ఫారెస్ట్ అధికారులు సేకరించారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలవాసులు భయాందోళనకు గురవుతున్నారు.

*ఏలూరు: జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం యూనియన్(ఆంధ్రా బ్యాంక్) బ్యాంకులో భారీ గోల్ మాల్ జరిగింది. రైతులకు చెందిన సుమారు రూ.50 లక్షల నగదును బ్యాంక్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఉండవల్లి రవి గోల్ మాల్ చేశాడు. రవి గత 20 సంవత్సరాలుగా బ్యాంక్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. రైతులకు చెందిన నగదు వారి అకౌంట్‌లలో జమ కాకపోవడంతో బాగోతం బయటపడింది. దీనిపై బ్యాంక్ ఉద్యోగులను రైతులు, స్థానికులు నిలదీశారు. అయితే రవితో తమకు సంబంధం లేదని బ్యాంక్ ఉద్యోగులు తెలిపారు. కాగా బ్యాంక్ మేనేజర్ పింటు కుమార్ వారం రోజులుగా సెలవులో ఉన్నారు. ఈ వ్యవహారం బయటపడటంతో బ్యాంక్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఉండవల్లి రవి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. గోల్‌మాల్‌కు సంబంధించి బ్యాంక్ అధికారులు ఇంత వరకు రవిపై ఫిర్యాదు చేయని పరిస్థితి. దీంతో రైతులు బ్యాంక్ వద్ద ఆందోళనకు దిగారు.

*నారీ సంకల్ప దీక్షకు ముఖ్య అతిథిగా తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత హాజరయ్యారు. అలాగే రాయలసీమ జిల్లాల తెలుగు మహిళా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి.. జ్యోతి ప్రజ్వలన గావించి నారీ సంకల్ప దీక్షను వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ దీక్షా కార్యక్రమంలో మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర చౌదరి కళ్యాణదుర్గం నియోజకవర్గ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు తదితరులు పాల్గొన్నారు.

*విద్యుత్‌ సరఫరా చేయడంలో విఫలమవుతున్న పంపిణీ సంస్థలు విద్యుత్‌నియోగంపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక అవసరాలకు ఆంక్షలు పెట్టగా.. ఇప్పుడు వినియోగదారులపై పడ్డాయి. గృహాల్లో ఏసీలుగీజర్లు వాడొద్దని సూచించాయి. అవసరమైనప్పుడే లైట్లు వేయాలనిపొదుపు చర్యలు పాటించాలని గురువారం ఓ ప్రకటనలో తెలిపాయి. పరిశ్రమలకు పవర్‌ హాలిడే వర్తింపజేస్తున్న పంపిణీ సంస్థలు వ్యవసాయానికి కూడా పగటి పూట నిరంతరాయంగా గంటల విద్యుత్‌ ఇవ్వడం లేదు.

*ఢిల్లీ పర్యటన ముగించుకుని తిరిగివచ్చిన గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో.. శుక్రవారం హస్తిన వెళ్తున్న సీఎం జగన్మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. గవర్నర్‌ ఢిల్లీ పర్యటనకు సంబంధించిన అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. తన ఢిల్లీ యాత్రలో ప్రధాని మోదీహోం మంత్రి అమిత్‌ షాలతో హరిచందన్‌ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరిస్తూ కేంద్రానికి ఆయన నివేదిక ఇచ్చారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలో విశాఖ నుంచి రాగానే జగన్‌ గవర్నర్‌ను కలవడం రాజకీయంగా ఆసక్తి రేపింది. గవర్నర్‌ దంపతులను మర్యాదపూర్వకంగానే సీఎం దంపతులు కలిశారని చెబుతున్నా.. గవర్నర్‌ ఢిల్లీ యాత్ర విశేషాలు తెలుసుకునేందుకే జగన్‌ రాజ్‌భవన్‌కు హుటాహుటిన వెళ్లారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

*ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి బంధువు కావడంతోనే నన్ను మంత్రి పదవి నుంచి తొలగించారని మాజీ మంత్రిఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యానించారు. దీనిని అడ్డం పెట్టుకొని చాలామందిని తప్పించానని ముఖ్యమంత్రే స్వయంగా చెప్తున్నారని బాలినేని అన్నారు. మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారని చాలామంది అడుగుతున్నారనితనకు సీఎం బంధువైనందునే అదంతా జరిగిందని పేర్కొన్నారు. ఒంగోలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వలంటీర్ల సన్మాన కార్యక్రమం గురువారం ఏ కన్వెన్షన్‌ హాలులో జరిగింది. ఈ సభలో బాలినేని మాట్లాడారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం వలంటీర్ల వ్యవస్థను తెచ్చారని తెలిపారు. వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే ముఖ్య కారకులు వలంటీర్లే అని స్పష్టం చేశారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని బాలినేని సవాల్‌ చేశారు.

*మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డిఆయన తనయుడు మేకపాటి విక్రమ్‌రెడ్డి సీఎం జగన్‌ను కలిశారు. గురువారం సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. రాజమోహన్‌రెడ్డి పెద్ద కుమారుడైన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరు అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో వైసీపీ టికెట్‌ను గౌతమ్‌రెడ్డి భార్యకు ఇవ్వాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అయితే తన రెండో కొడుకు విక్రమ్‌రెడ్డికి ఇవ్వాలని రాజమోహన్‌రెడ్డి ఆయన్ను కోరినట్లు వైసీపీ వర్గాలు వెల్లడించాయి

*విద్యుత్‌ కోతలతో ప్రజలుముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అల్లాడిపోతున్నారని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ అన్నారు. గురువారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ అత్యాచారం జరిగినా ప్రభుత్వం ఒక రేటును నిర్ణయించిందనిఎల్టీ పాలిమర్స్‌ బాధితులకు కోటి రూపాయలుఅత్యాచార బాధితులకు రూ. లక్షలు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జికల్స్‌ రోగులే మందులు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితిలో పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

*కరెంటు కోతలతో ఎండుతున్న పంటలను చూసి గుండె మండిన రైతన్నలు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. అక్కడే వంటావార్పు చేపట్టి నిరసన తెలిపారు. కడప జిల్లా కలసపాడు మండలం ఎగువరామాపురం సబ్‌స్టేషన్‌ వద్ద గురువారం ఈ ఘటన జరిగింది. ఈ సబ్‌స్టేషన్‌ పరిధిలో నిరంతరాయంగా మూడు గంటలు కూడా విద్యుత్‌ సరఫరా కావడం లేదు. ఈ గ్రామాల పరిధిలో సుమా 4500 ఎకరాల్లో పత్తి, 300 ఎకరాల్లో వరి, 400 ఎకరాల్లో మిరప సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పత్తి పూత, పిందె దశలో ఉంది. పంటకు నీరు సమృద్ధిగా అందిస్తే పూత రాలకుండా ఉంటుంది.నీరు సక్రమంగా రాకపోవడంతో పూత రాలిపోతోందని రైతులు తెలిపారు. గతేడాది వర్షాలతో అప్పులపాలయ్యామని ఈ ఏడాది పంట బాగా ఉన్నా విద్యుత్‌ సరఫరా లేక నష్టపోతున్నామని వాపోతున్నారు. దీంతో కడుపు మండిన రైతులు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్దకు చేరుకుని రోడ్డుపైనే వంటావార్పు చేసి నిరసన తెలిపారు.

*చిత్తూరు జిల్లాలో టెన్త్‌ ప్రశ్నపత్రం బయటకు వచ్చిన ఘటనలో నారాయణ విద్యాసంస్థల వైస్‌ ప్రిన్సిపాల్‌ గిరిధర్‌, ఎన్‌ఆర్‌ఐ స్కూల్‌ ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ను అరెస్టు చేశామని విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. నంద్యాల ఘటనలో 9మంది ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేశామని తెలిపారు. విజయవాడలో గురువారం రాత్రి మంత్రి మీడియాతో మాట్లాడారు. పదో తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీ, మాల్‌ప్రాక్టీస్‌ ఎక్కడా జరగలేదని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి మండలంలో హిందీ ప్రశ్నపత్రం లీకైందన్న వార్తలను మంత్రి కొట్టిపారేశారు. ట్విటర్‌లో కన్నీళ్లు పెట్టుకుంటున్న చంద్రబాబు, లోకేశ్‌లు నారాయణ సంస్థల నుంచి పేపర్‌ లీకైన విషయంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పైకప్పు ఊడిపడడంతో పరీక్ష రాస్తున్న విద్యార్థికి గాయమైతే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించామన్నారు. చంద్రబాబు హయాంలో స్కూళ్లను పట్టించుకోకపోవడమే దీనికి కారణమన్నారు.

*పీఆర్‌సీ జీవోలను త్వరగా ఇప్పించాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రజారవాణా సంస్థ ఎన్‌ఎంయూఏ నాయకులు కోరారు. యూనియన్‌ అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, కార్యదర్శి వై.శ్రీనివాసరావు, ఏపీఎన్‌జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి శివారెడ్డి తదితరులు గురువారం సజ్జలను కలిసి ఈమేరకు వినతి పత్రాన్ని అందచేశారు. దీనిపై సజ్జల వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్‌ చేసి.. పెండింగ్‌ పీఆర్సీ జీవోలను విడుదల చేయాలని ఆదేశించారు.

* పెట్రో ధరలపై ప్రధాని ప్రకటనపై అధికార వైసీపీ స్పందించకపోవడం హాస్యాస్పదమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో ఆయన మాట్లాడుతూ మోదీ చెప్పిన విధంగా రాష్ట్రంలో పెట్రో ధరలు అధికంగా ఉంటే వెంటనే తగ్గించాలని, లేదంటే ప్రధాని ప్రకటనను ఖండించాలని డిమాండ్‌ చేశారు.

*పెరిగిన ధరలతో ఏడాది నుంచి ప్రజలు ఇబ్బంది పడుతుంటే.. దొంగలు పడ్డ ఆర్నెల్లకు అన్నట్లు ఇప్పుడు ప్రధాని మోదీ స్పందించడం హాస్యాస్పదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. రాష్ట్రాలు వ్యాట్‌ తగ్గించకపోవడంతో సామాన్యులపై భారం పడిందని ప్రధాని వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ధరలు పెంచడంలో జగన్‌ ఆంధ్రా మోదీలా తయ్యారని మండిపడ్డారు. పెరిగిన ధరలపై మే 9న రాష్ట్ర సచివాలయం వద్ద పెద్దఎత్తున నిరసన చేపడుతున్నట్టు పేర్కొన్నారు.

*‘ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తన గ్రాఫ్‌ తానే గీసుకొంటున్నారు. తన పేపర్‌ను తానే దిద్దుకొని తానే మార్కులు వేసుకొంటున్నారు. ఆయన తన వీపు తానే చరుచుకొని ధైర్యం చెప్పుకొంటున్నారు’’ అని తెలుగుదేశం పార్టీ నేతలు ఎద్దేవా చేశారు. ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డి, అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్య ప్రకాశ్‌ గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. ‘‘మండు వేసవిలో కరెంటు కోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
దీనికి తోడు కరెంటు చార్జీలు విపరీతంగా పెంచి సామాన్యులను పీక్కు తింటున్నారు. 300 యూనిట్లు దాటితే ఏ పథకం వర్తించదని నిబంధనలు పెట్టారు. దీనికి ముఖ్యమంత్రి బాధ్యుడా లేక ఎమ్మెల్యేలా? సీఎం బాగా చేస్తున్నాడని ప్రజలు ఆయనకు జిందాబాదులు కొడుతున్నారా? చెప్పుకోవడానికి జగన్‌రెడ్డి సిగ్గుపడాలి’’ అని శ్రీనివాసులరెడ్డి వ్యాఖ్యానించారు. జగన్‌రెడ్డి సినిమాల్లో నటిస్తే ఆస్కార్‌ పరిగెత్తుకొస్తుందని మద్దిపట్ల వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌ గొడ్డలి పోటుకు బ్రాండ్‌ అంబాసిడర్‌ అని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు.

*‘‘ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కాళ్ల కింద నేల కదులుతోంది. దానిని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ఈసారి తనకు 175 సీట్లు ఎందుకు రావని మాట్లాడుతున్నారు. ఆయనకు ఒక అంకె సీట్లు వస్తే గొప్పే. నెత్తిన పెట్టుకొన్న ఈ కుంపటిని ఎప్పుడు దించుదామా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు’’ అని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. తమ పార్టీ నేతల సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి బుధవారం చేసిన వ్యాఖ్యలపై గురువారం బాబు స్పందించారు. అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జులు, మండల పార్టీ అధ్యక్షులతో గురువారం నిర్వహించిన ఆన్‌లైన్‌ సమావేశంలో ఆయన ఎదురు దాడి చేశారు.

*విద్యుత్‌ కోతలతో ప్రజలు, ముఖ్యంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అల్లాడిపోతున్నారని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ అన్నారు. గురువారం కర్నూలులో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కడ అత్యాచారం జరిగినా ప్రభుత్వం ఒక రేటును నిర్ణయించిందని, ఎల్టీ పాలిమర్స్‌ బాధితులకు కోటి రూపాయలు, అత్యాచార బాధితులకు రూ.5 లక్షలు ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జికల్స్‌ రోగులే మందులు కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితిలో పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. తక్షణమే ప్రభుత్వ ఆసుపత్రిలో మందుల కొరత లేకుండా చూడాలని డిమాండ్‌ చేశారు.

*ఆసియా పురుషుల క్లబ్‌ లీగ్‌ హ్యాండ్‌బాల్‌ చాంపియన్‌షి్‌ప ఆతిథ్య హక్కులను హైదరాబాద్‌ దక్కించుకుంది. జూన్‌ 23 నుంచి జూలై 4వ తేదీ వరకు గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో ఈ పోటీలు జరగనున్నాయని హ్యాండ్‌బాల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (హెచ్‌ఎ్‌ఫఐ) అధ్యక్షుడు జగన్‌మోహన్‌ రావు చెప్పారు. ‘ఖతార్‌, జపాన్‌, చైనాతో పాటు మొత్తం 12 నుంచి 15 ఆసియా దేశాలు ఈ టోర్నీలో పాల్గొననున్నాయి. డీడీ స్పోర్ట్స్‌లో పోటీలు ప్రత్యక్ష ప్రసారమవనున్నాయి’ అని జగన్‌ మోహన్‌ రావు తెలిపారు.

*ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఎలా పీకాలన్నదే తమ టార్గెట్‌ అని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏం అభివృద్ధి చేశారని దేశం గురించి కేసీఆర్‌ మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కోమటిరెడ్డి గురువారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని కోమటిరెడ్డి చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని ఎత్తివేస్తామన్నారు. బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్టు పూర్తి చేయకుండా ఏడేళ్లుగా జాప్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.50 కోట్లు నిధులిస్తే ఉదయ సముద్రం పూర్తవుతుందన్నారు. తనపై కక్షతో ప్రాజెక్టును పూర్తి చేయడం లేదని విమర్శించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పాదయాత్రను కష్టమైనా, నష్టమైనా కొనసాగించాలని కోరారు.

*వేసవి సెలవులు ఉండే మే, జూన్‌లోనూ డిగ్రీ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సాంకేతిక, ఉన్నత విద్యా శాఖ కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కాలేజీలను మే, జూన్‌లోనూ నిర్వహించనున్నారు. గత రెండేళ్ల నుంచి కరోనాతో డిగ్రీ తరగతులు సరిగ్గా జరగకపోవడం, విద్యా సంవత్సర షెడ్యూల్‌లో జాప్యం జరగడం వంటివి చోటుచేసుకున్నాయి. వాటిని సరిచేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది. జూలై, ఆగస్టులో వివిధ వర్సిటీల్లో పీజీ ప్రవేశ పరీక్షల నిర్వహణ, అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టనున్నారు. దీంతో మే, జూన్‌లో డిగ్రీ సిలబ్‌స పూర్తిచేసి, జూన్‌ నెలాఖరునే వార్షిక పరీక్షలు నిర్వహించి, జూలైలో ఫలితాలు ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు.

*ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద ప్రత్యేక వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మేలో జరగనున్న ఇంటర్మీడియట్‌, పదవ తరగతి పరీక్షల నిర్వహణకు సంబంధించి గురువారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఎండల తీవ్రత దృష్ట్యా పరీక్షా కేంద్రాల వద్ద వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని సబిత ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద మంచినీటి సౌకర్యం, విద్యుత్‌ సరఫరా వంటి అంశాలపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని,కొవిడ్‌ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. పరీక్షల వేళ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ విధించాలని చెప్పారు. ఇంటర్మీడియట్‌ పరీక్షలకు 9,07,396 మంది, పదవ తరగతి పరీక్షలకు 5,09,275 మంది విద్యార్థులు హాజరవుతున్నారని మంత్రి తెలిపారు.

*కుప్పం నియోజకవర్గంలో గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై సీఎస్‌కు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం ముద్దనపల్లిలో సర్వే నెంబర్ 104, 213లలో అక్రమ మైనింగ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను జతచేసి ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ ఇచ్చిన అదేశాలను తక్షణమే అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు. ముద్దనపల్లిలో అక్రమ మైనింగ్‌ను ఎన్జీటీ నిర్థారించిదని తెలిపారు. అక్రమ మైనింగ్ పాల్పడిన వారి పేర్లు, వివరాలు తెలపాలన్న ఎన్జీటి ఆదేశాలను లేఖలో ప్రస్తావించారు. ప్రధాన కార్యదర్శి సహా ఇతర అధికారులు స్వయంగా పరిశీలించి మైనింగ్‌పై శాస్త్రీయ నివేదిక ఇవ్వాలన్న ఆదేశాలను అమలు చేయాలని కోరారు. పటిష్టమైన చర్యలతో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలని ప్రధాన కార్యదర్శికి టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు.

*తంజావూరు జిల్లా కలిమేడు గ్రామంలో అప్పర్‌ స్వామి మఠం రథోత్సవ సమయంలో విద్యుదాఘాతం కారణంగా అలముకున్న విషాదం ఆ గ్రామాన్ని వీడలేదు. ఈ ప్రమాదంలో 11 మంది గ్రామస్థులు ప్రాణాలు కోల్పోగా, మరో 17 మంది గాయపడిన విషయం తెలిసిందే. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వీరందరినీ తంజావూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు 25 మందితో కూడిన వైద్యుల బృందాన్ని ఏర్పాటుచేయగా, ఈ బృందం నిరంతరం అందుబాటులో ఉంటూ వారికి చికిత్స అందిస్తోంది.

*ఆంధ్రప్రదేశ్‌లో మాజీ ఎమ్మెల్యే అనారోగ్యంతో కన్నుమూశారు. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు(72) పాత నాగూరు నియోజకవర్గం నుంచి 1989-94 కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా పనిచేశారు. కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో ఆయన బాధ పడుతున్నారు. మాజీ మంత్రి, కరుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి మామ శత్రుచర్ల చంద్రశేఖర్‌రాజు వైసీపీలో కొంతకాలం పాటు పనిచేసిన ఆయన ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు నచ్చక తిరిగి టీడీపీలో చేరారు. శత్రుచర్ల మృతి పట్ల పలు పార్టీకి చెందిన నాయకులు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషిని కొనియాడారు

*మద్యం మత్తులో కన్న తండ్రినే కత్తితో నరికి చంపిన కుమారునికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తిరుపతి థర్డ్‌ ఏడీజే కోర్టు జడ్జి గురువారం తీర్పునిచ్చారు. వివరాల్లోకి వెళితే మండలంలోని కన్నికాపురం ఎస్టీకాలనీకి చెందిన సుబ్రమణ్యం(57) కుమారుడు సురేష్‌ (25) జులాయిగా తిరుగుతూ మద్యానికి బానిసయ్యాడు. గత ఏడాది మే నెల 10వ తేదీన కేజీ కుప్పం గ్రామ శివారుల్లోని వెంకటేశ్‌ చౌదరి పొలంలో మేకలు మేపుతున్న సుబ్రమణ్యం వద్దకు వచ్చిన సురేష్‌ మద్యంకు డబ్బులు ఇవ్వమని గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వకపోవడంతో మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కత్తితో తండ్రి తలపై నరికి చంపి పరారయ్యాడు. సుబ్రమణ్యం భార్య కన్నెమ్మ (54) పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ మద్దయ్య ఆచారి నేతృత్వంలో పోలీసులు నాగరాజు, భాస్కరయ్య, భాస్కర్, ఏలుమలైరెడ్డి, గవాస్కర్‌ గాలింపు చేపట్టి చాకచక్యంగా అతన్ని పట్టుకొని రిమాండ్‌కు తరలించారు. తిరుపతి థర్డ్‌ ఏడీజే కోర్టులో ఈ కేసు విచారణకు వచ్చింది. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ వెంకటనారాయణ కోర్టులో ఈ కేసును వాదించారు. కేసును పూర్తిస్థాయిలో పరిశీలించిన జడ్జి ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ గురువారం తీర్పునిచ్చారు.

* ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంక్షేమం దేశానికే ఆదర్శమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు.శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాల మంత్రులే ఏపీకి వచ్చి ఇక్కడి పరిస్థితులను చూసి వెళ్తుతున్నారన్నారు. మహాత్మా గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మిస్తున్నారన్నారు.ఏపీలో జగనన్న కాలనీల పేరుతో భారీ ఎత్తున ఊళ్లే నిర్మాణమవుతున్నాయి. రైతు భరోసా కేంద్రాల పనితీరు పై దేశమే ఏపీ వైపు చూస్తోంది. వాళ్ల రాష్ట్రాల్లో కూడా ఆర్బీకేలను ప్రవేశపెట్టాలని అనేక రాష్ట్రాలు చూస్తున్నాయి. చీఫ్ మినిస్టర్ టు కామన్ మ్యాన్ విధానం ఏ రాష్ట్రంలోనైనా ఉందా? ఏపీలో మాత్రమే సాధ్యమవుతోంది. ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని కనులారా చూడాలని కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నా. ఏపీపై ఎవరూ బురద చల్లలేరు … అలాంటి ఆలోచనలు ఉన్నా విరమించుకోవాలని కోరుతున్నా. దేశంలో ఏ రాష్ట్రమైనా సామాజిక న్యాయం చేయగలిగిందా?. బహు జనులు , ఎస్సీ, ఎస్టీలు గొంతెత్తి అరిచినా ఎవరూ ఇవ్వలేకపోయారు. ఏపీలో వైఎస్‌ జగన్‌ వల్లే సామాజిక న్యాయం సాధ్యమైంది. ఇంటి వద్దకే పాలన అందిస్తున్న మనసున్న సీఎం వైఎస్ జగన్” అని మంత్రి జోగి రమేష్‌ అన్నారు.

* సీఎం జగన్‌కు అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి ఆయనతో తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు.నెల్లూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సాగునీటి సలహామండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో వెనుకబడ్డామని.. సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. సోమశిల కాలువలు సరిగా లేవని.. చివరి వరకు నీరు పోవడం లేదని చెప్పారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు.కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రిగా వచ్చారని.. ఆయన అయినా మాట వింటారని అనుకుంటున్నామని ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మాటలను ఇక్కడి పాలకులు అబద్దాలు చేస్తున్నారని.. నెల్లూరు, సంగం వంతెనలు ప్రారంభిస్తామంటూ అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. నీటిపారుదలశాఖ అధికారులు సీఎంవోకి వాస్తవాలు చెప్పాలన్నారు. మూడేళ్లుగా 20 శాతం కూడా చేయలేకపోతున్నారని.. పరువుపోతోందని ఆనం వ్యాఖ్యానించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలని కోరారు.