Politics

ఏపీలో పరిస్థితులు అధ్వాన్నం

ఏపీలో పరిస్థితులు అధ్వాన్నం

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఏపీ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్‌, మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో కరెంట్‌, నీటి సౌకర్యం లేదని, రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. ఈ విషయం ఏపీకి వెళ్లొచ్చిన తన స్నేహితులు చెబుతున్నారన్నారని, ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉందని చెప్పారన్నారు. అనుమానం ఉంటే.. ఎవరైనా ఏపీకి వెళ్లిరండని మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. ఏపీతో పోలిస్తే..తెలంగాణలో రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని చెప్పారు.తెలంగాణలో 111 జీవో ఎత్తివేస్తామని 2014లోనే సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చారని మంత్రి కేటీఆర్ అన్నారు. జంట జలాశయాలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం చూస్తుందని, రాబోయే పదేళ్ల వరకు హైదరాబాద్ అభివృద్ధికి డోకా లేదని అన్నారు. హైదరాబాద్‌లో మత కల్లోలం లేదని, రాష్ట్రానికి ఏం తేవాలో ప్రతిపక్షానికి అవసరం లేదని.. సీఎం కేసీఆర్‌ను తిట్టడంలోనే ప్రతిపక్షం పీజీ చేసిందన్నారు. పనికిమాలిన విమర్శలు చేయడంలో వాళ్లను మించినవారు లేరన్నారు. ముఖ్యమంత్రిని తిట్టడం తప్ప..వాళ్లకు ఏమీ తెలియదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు.