Movies

మీ అందరినీ ప్రేమిస్తున్నా

మీ అందరినీ ప్రేమిస్తున్నా

వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సమంత గురువారం 35వ వసంతంలో అడుగుపెట్టారు. అదే రోజు ఆమె నటించిన తమిళ చిత్రం ‘కాతు వక్కుల రెందు కాదల్‌’ చిత్రం విడుదలైంది. చక్కని స్పందన సొంతం చేసుకుందీ చిత్రం. ఇందులో సమంత నటనకు మంచి గుర్తింపు లభించింది. పుట్టినరోజు, సినిమా సక్సెస్‌ రెండూ కలిసిరావడంతో అభిమానులు, స్నేహితులు, తోటి తారలు సామ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెకు విషెస్‌ చెప్పిన అందరికీ శుక్రవారం సామ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఆ పోస్ట్‌లను సమంత ఇన్‌స్టాగ్రామ్‌ స్టాటస్‌లో షేర్‌ చేశారు. ‘‘నా పుట్టినరోజున నాపై చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. మీ అందరి ప్రోత్సాహం, ప్రేరణ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా. ఇంతగా అభిమానిస్తున్న అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటా. మనస్ఫూర్తిగా మీ అందరినీ ప్రేమిస్తున్నా. ఈ ఏడాదిని మరింత ధైర్యంగా ఎదుర్కొనేందుకు ఎంకరేజ్‌మెంట్‌ నాకు ఇచ్చారు’’ అని అన్నారు. ప్రస్తుతం తెలుగులో ‘శాకుంతలం’, ‘యశోద’ చిత్రాలతో బిజీగా ఉన్నారు సమంత. హాలీవుడ్‌లోనూ ఓ సినిమాకు సంతకం చేశారు.