Business

బ్రిటన్‌ కంపెనీపై ముఖేష్‌ అంబానీ కన్ను – TNI వాణిజ్య వార్తలు

బ్రిటన్‌ కంపెనీపై ముఖేష్‌ అంబానీ కన్ను  – TNI వాణిజ్య వార్తలు

* కొన్నాళ్ల క్రితం ఆటబొమ్మల రిటైల్‌ సంస్థ హామ్లీస్‌ను కొనుగోలు చేసిన దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (ఆర్‌ఐఎల్‌) తాజాగా మరో బ్రిటన్‌ కంపెనీపై కన్నేసింది. ఫార్మసీ చెయిన్‌ ’బూట్స్‌’ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది.అమెరికన్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌తో కలిసి సంయుక్తంగా బిడ్‌ వేయాలని ఆర్‌ఐఎల్‌ భావిస్తున్నట్లు బ్రిటన్‌ వార్తాపత్రిక ది ఫైనాన్షియల్‌ టైమ్స్‌ ఒక కథనం ప్రచురించింది. ఈ డీల్‌ సాకారమైతే.. బూట్స్‌ కొత్తగా భారత్, మధ్య ప్రాచ్య, ఆగ్నేయాసియా మార్కెట్లలోకి కూడా కార్యకలాపాలు విస్తరించేందుకు వీలుంటుందని పేర్కొంది. బ్రిటన్‌లో పేరొందిన ఫార్మసీ చెయిన్‌ అయిన బూట్స్‌కు అమెరికాకు చెందిన వాల్‌గ్రీన్స్‌ బూట్స్‌ అలయన్స్‌ మాతృ సంస్థ. తమ దేశంలో హెల్త్‌కేర్‌ వ్యాపారంపైనే పూర్తిగా దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో బూట్‌్ీను వాల్‌గ్రీన్‌ బూట్స్‌ గతేడాది డిసెంబర్‌లో అమ్మకానికి పెట్టింది. బిడ్ల దాఖలుకు మే 16 ఆఖరు రోజు. బూట్స్‌ కు బ్రిటన్‌లో 2,000 పైచిలుకు స్టోర్స్‌ ఉన్నాయి
* ప్రైవేటు బీమా కంపెనీల నుంచి పోటీ ఉన్నా భారతీయ జీవిత బీమా కార్పొరేషన్‌ (ఎల్‌ఐసీ) మార్కెట్లో దూసుకుపోతోంది. మార్చితో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిమిషానికి 41 పాలసీల చొప్పున మొత్తం 2,17,18,695 పాలసీలను విక్రయించింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో విక్రయించిన 2,09,75,439 పాలసీలతో పోలిస్తే ఇది 3.54 శాతం ఎక్కువ. కాగా 2021 -22లో ఎల్‌ఐసీ స్థూల ప్రీమియం ఆదాయం 12.66 శాతం పెరిగి రూ.1,43,938.59 కోట్లకు చేరింది.
* మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌నకు చెందిన స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ హార్టికల్చర్‌లో యంత్రీకరణను పెంచడానికి ‘కోడ్‌’ పేరుతో ట్రాక్టర్‌ తరహా కొత్త ఉత్పత్తిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. హార్టికల్చర్‌ రంగంలో వివిధ రకాల పనులకు ఉపయోగపడే విధంగా దీన్ని డిజైన్‌ చేశామని స్వరాజ్‌ ట్రాక్టర్స్‌ సీఈఓ హరీష్‌ చవాన్‌ తెలిపారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ ఉత్పత్తిలో హార్టికల్చర్‌ ఉత్పత్తి 30 శాతం ఉంటే సాగు చేసే భూమిలో 17 శాతమే హార్టికల్చర్‌ ఉత్పత్తులను పండిస్తున్నారు. దేశం మొత్తంలో ఉత్పత్తి అవుతున్న కాయలు, పళ్లలో 12 శాతం ఉత్పత్తి ఆంధ్రప్రదేశ్‌లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఏపీ, తెలంగాణాల్లో హార్టికల్చర్‌ యంత్రీకరణపై స్వరాజ్‌ దృష్టి కేంద్రీకరిస్తోందని చెప్పారు. వచ్చే మూడేళ్లలో హార్టికల్చర్‌ కోసమే అభివృద్ధి చేసిన మరో రెండు, మూడు ఉత్పత్తులను మార్కెట్లోకి స్వరాజ్‌ విడుదల చేయనుందని చవాన్‌ చెప్పారు. ఏపీ, తెలంగాణల్లో కంపెనీకి మొత్తం 80 మంది డీలర్లు ఉండగా.. ముందుగా 10 మంది డీలర్ల వద్ద కోడ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చామని.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 500 కోడ్‌లు బుక్‌ అయ్యాయని చెప్పారు. దీని ధర రూ.2-2.5 లక్షలు ఉంటుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్‌, కర్ణాటక రాష్ట్రాల్లో కోడ్‌ను విడుదల చేశారు.
*రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తన రిటైల్‌ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించేందుకూ ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా బ్రిటన్‌కు చెందిన ప్రము ఖ రిటైల్‌ సంస్థ ‘బూట్స్‌’పై కన్నేశారు. అమెరికా పీఈ సంస్థ అపోలో గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌తో కలిసి బూట్స్‌ ఆస్తుల కోసం బిడ్‌ వేసే విషయాన్ని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పరిశీలిస్తున్నట్టు ఫైనాన్సియల్‌ టైమ్స్‌ పత్రిక పేర్కొంది. ఈ విషయంలో విజయవంతమైతే ముకేశ్‌ అంబానీ, బూట్స్‌ వ్యాపారాన్ని భారత్‌, ఆగ్నేయాసియా, పశ్చిమాసియా దేశాలకూ విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేసే బూట్స్‌ మాతృ సంస్థ వాల్‌గ్రీన్స్‌ బూట్స్‌ అలయెన్స్‌ గత ఏడాది డిసెంబరులో బూట్స్‌ యూకే వ్యాపారాన్ని అమ్మకానికి పెట్టింది.
*అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు ఎఫ్‌ఎంసీజీ, ఇంధనం, ఐటీ, బ్యాంక్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు పెంచారు. దాంతో సెన్సెక్స్‌ 701.67 పాయింట్ల లాభంతో 57,521.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 206.65 పాయింట్లు బలపడి 17,245.05 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 26 లాభపడ్డాయి. హిందుస్తాన్‌ యూనిలీవర్‌ షేరు 4.55 శాతం లాభంతో సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. సూచీలో అత్యధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 1.49 శాతం పెరగడంతో కంపెనీ మార్కెట్‌ విలువ తొలిసారిగా రూ.19 లక్షల కోట్ల ఎగువకు చేరుకుంది.
* అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు ఎఫ్‌ఎంసీజీ, ఇంధనం, ఐటీ, బ్యాంక్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు పెంచారు. దాంతో సెన్సెక్స్‌ 701.67 పాయింట్ల లాభంతో 57,521.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 206.65 పాయింట్లు బలపడి 17,245.05 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 26 లాభపడ్డాయి. హిందుస్తాన్‌ యూనిలీవర్‌ షేరు 4.55 శాతం లాభంతో సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. సూచీలో అత్యధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 1.49 శాతం పెరగడంతో కంపెనీ మార్కెట్‌ విలువ తొలిసారిగా రూ.19 లక్షల కోట్ల ఎగువకు చేరుకుంది.
*ఆంధ్రా సిమెంట్స్‌ పై దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. పృథ్వీ అసెట్‌ రీ కనస్ట్రక్షన్‌ అండ్‌ సెక్యూరిటైజేషన్‌ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు ఎన్‌సీఎల్‌టీ, అమరావతి బెంచ్‌ కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రెసొల్యూషన్‌ ప్రాసె్‌సకు (సీఐఆర్‌పీ) ఆదేశాలు జారీ చేసింది. ముంబైకి చెందిన నిరవ్‌కే పుజరాను ఐఆర్‌పీగా నియమించింది. ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధికారాలు రద్దవుతాయి. ఆ అధికారాలు ఐఆర్‌పీకి లభిస్తాయి. ఆస్తుల విక్రయం తదితర దివాలా ప్రక్రియను రిసొల్యూషన్‌ ప్రొఫెషనల్‌ ఆదేశాలు జారీ చేసిన నాటి నుంచి 180 రోజుల లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్లు ఐఆర్‌పీకి సహకరించాలి. దాదాపు రూ.804 కోట్ల రుణ ఆస్తుల వసూలుకు సంబంధించి పృథ్వీ అసెట్‌ రికనస్ట్రక్షన్‌ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ, కరూర్‌ వైశ్యా బ్యాంకుల నుంచి ఆంధ్రా సిమెంట్స్‌ రుణాలు తీసుకుని చెల్లించలేకపోయింది.
*గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి రూ.232 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.297 కోట్లతో పోలిస్తే 22 శాతం క్షీణించింది. సమీక్ష త్రైమాసికానికి మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.1,416.45 కోట్ల నుంచి రూ.1,426.12 కోట్లకు చేరిందని కంపెనీ వెల్లడించింది. 2021.22 ఏడాదికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.2 (60ు) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. గత ఏడాది మొత్తానికి రూ.4,950.87 కోట్ల ఆదాయంపై రూ.832.23 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు లారస్‌ ల్యాబ్స్‌ ఈడీ, సీఎ్‌ఫఓ వీవీ రవి కుమార్‌ వెల్లడించారు.
*పాలసీదారు ల నుంచీ ఎల్‌ఐసీ ఐపీఓపై ఆసక్తి వ్యక్తం అవుతోంది. ఈ ఐపీఓలో పాల్గొనేందుకు వీలుగా 6.48 కోట్ల మంది పాలసీదారులు తమ పాలసీల వివరాలను తమ పాన్‌ నంబర్‌తో అనుసంధానం చేసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిర్వహణలోని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ శాఖ (దీపం) డైరెక్టర్‌ రాహుల్‌ జైన్‌ ఈ విషయం వెల్లడించారు. వీరిలో ఇప్పటికే 1.21 కోట్ల మంది డిమ్యాట్‌ ఖాతాలు కూడా తెరిచినట్టు చెప్పారు.
*జమ్ము కశ్మీర్‌లో 370వ అధికరణం రద్దయిన తర్వాత అక్కడ మొట్టమొదట ప్రాజెక్టు కోసం భూమిని సేకరించిన కంపెనీల్లో ఒకటిగా అపోలో హాస్పిటల్‌ నిలిచింది. జమ్ము జిల్లాలో 250 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. అపోలో హాస్పిటల్స్‌ గ్రూప్‌నకు జమ్ము పాలనా యంత్రాంగం ఇప్పటికే జమ్ములోని మిరాన్‌ సాహిబ్‌ మెడి సిటీలో 12.5 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 46 ఎకరాల స్థలంలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఈ మెడిసిటీ ఏర్పాటవుతున్నట్టు వారు చెప్పారు. అపోలో హాస్పిటల్‌తో పాటు జేఎ్‌సడబ్ల్యూ స్టీల్‌ కూడా రూ.150 కోట్లతో ఒక స్టీల్‌ ప్లాంట్‌ నిర్మించేందుకు ముందుకు వచ్చిందని, ఆ సంస్థకు ఇప్పటికే 8.75 ఎకరాల స్థలం కేటాయించామని వారు తెలిపారు.
*ఎస్‌ఏఎస్‌ ఇన్‌ఫ్రాతో కలిసి బెంగళూరుకు చెందిన ఎంబసీ గ్రూప్‌ హైదరాబాద్‌లో మూడు గ్రేడ్‌-ఏ ఆఫీస్‌ స్పేస్‌ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఈ ప్రాజెక్టులను నిర్మిస్తున్నట్లు ఎంబసీ గ్రూప్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఆదిత్య విర్వాణీ తెలిపారు. హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ మార్కెట్‌ నుంచి దాదాపు మూడేళ్ల క్రితం ఎంబసీ గ్రూప్‌ నిష్క్రమించింది. సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు రికార్డు స్థాయిలో నియామకాలు చేపట్టడం, బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, బీమా (బీఎ్‌సఎ్‌ఫఐ) రంగం హైదరాబాద్‌లో విస్తరిస్తుండడంతో కార్యాలయ స్థలానికి గిరాకీ పెరగగలదని ఎంబసీ గ్రూప్‌ భావిస్తోంది. మొదటి ప్రాజెక్టు ఎంబసీ ఎస్‌ఏఎస్‌ 1 టవర్‌ నిర్మాణంలో ఉంది.ఎంబసీ డైమండ్‌ టవర్‌లో 30 లక్షల చ.అ కార్యాలయ స్థలాన్ని అభివృద్ధి చేస్తారు. మూడో ప్రాజెక్ట్‌ క్రౌన్‌లో కూడా 30 లక్షల చ.అ ఆఫీస్‌ స్పేస్‌ అందుబాటులోకి రానుంది.
*టెస్లా కంపెనీ భారత్‌లో తయారీ యూనిట్‌ పెడితే తప్పకుండా స్వాగతిస్తామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. చైనాలో తయారు చేసే టెస్లా కార్ల దిగుమతిని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ స్వాగతించేది లేదని కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. భారత్‌ ముందు తమ ఈవీ కార్ల దిగుమతులను అనుమతిస్తే, ఉత్పత్తి యూనిట్‌ ఏర్పాటు విషయం తర్వాత పరిశీలిస్తామని టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ గతంలో ప్రకటించారు. ఇందుకోసం 110 శాతం వరకు ఉన్న దిగుమతి సుంకా న్ని 40 శాతానికి తగ్గించాలని కోరారు. దీంతో భారత్‌లో టెస్లా కార్ల ప్రవేశం సందిగ్ధంలో పడింది.