Politics

రాహుల్ గాంధీది ఐర‌న్ లెగ్.. ఆయ‌న వ‌ల్లే కాంగ్రెస్ ఓడింది – TNI రాజకీయ వార్తలు

రాహుల్ గాంధీది ఐర‌న్ లెగ్.. ఆయ‌న వ‌ల్లే కాంగ్రెస్ ఓడింది – TNI రాజకీయ వార్తలు

* కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీది ఐర‌న్ లెగ్గు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు విమ‌ర్శించారు. రాహుల్ ఎక్క‌డ కాలు పెట్టిన అక్క‌డ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింద‌ని తెలిపారు. అలాంటి రాహుల్ తెలంగాణ‌ను ఉద్ద‌రిస్తాడా? అని ప్ర‌శ్నించారు. 94 శాతం ఓట‌మిలో ఉన్న పార్టీ కాంగ్రెస్ అని హ‌రీశ్‌రావు పేర్కొన్నారు.నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలంలోని జకోర ఎత్తిపోతల పథకానికి స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో క‌లిసి మంత్రి హ‌రీశ్‌రావు శంకుస్థాప‌న చేశారు.ఈ సంద‌ర్భంగా మంత్రి హ‌రీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాల‌న‌లో రైతులు అన్ని ర‌కాలుగా ఇబ్బందులు ప‌డ్డార‌ని పేర్కొన్నారు. రాష్ట్రంలో పెరిగిన దిగుబ‌డితో కాంగ్రెస్, బీజేపీల‌కు క‌ళ్ల మంట‌గా మారింద‌ని విమ‌ర్శించారు. కాంగ్రెస్ హ‌యాంలో ట్రాన్స్‌ఫార్మ‌ర్స్ కాలిపోవ‌డం, ఎరువులు, విత్త‌నాల కోసం క్యూ క‌ట్ట‌డం లాంటి ఘ‌ట‌న‌లు చూశామ‌న్నారు. ధాన్యం కొనుగోలు చేయ‌క‌పోవ‌డం, కోల్డ్ స్టోరేజ్ లేక‌పోవ‌డంతో రైతులు ఇబ్బందులు ప‌డ్డార‌ని గుర్తు చేశారు. కానీ తెలంగాణ‌లో అలాంటి ప‌రిస్థితి లేద‌ని హ‌రీశ్‌రావు స్ప‌ష్టం చేశారు. దేశానికి అన్నం పెట్టే స్థాయికి తెలంగాణ రాష్ట్రం చేరింద‌న్నారు. అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ రైతుల ఖర్చులను మాత్రం రెట్టింపు చేయగలిగింద‌ని ధ్వ‌జ‌మెత్తారు. బీజేపీ రైతులకు ఏం చేసిందో చెప్పాల‌ని హ‌రీశ్‌రావు డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కేంద్రానికి, ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేస్తాయి, టీఆర్ఎస్ మాత్ర‌మే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పని చేస్తుంద‌ని హ‌రీశ్‌రావు తేల్చిచెప్పారు.

*హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదు: మంత్రి కేటీఆర్‌
రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందున్నదని చెప్పారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదన్నారు. మరో 10 నుంచి 15 ఏండ్లు హైదరాబాద్‌కు ఢోకాలేదని స్పష్టం చేశారు. కొన్ని కంపెనీల కుమ్మక్కు వల్లే స్టీల్‌, సిమెంటు ధరలు పెరిగాయని, ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. త్వరలో ఫార్మా సిటీని ప్రారంభిస్తామన్నారు

*సీఎంతో తప్పుడు స్టేట్ మెంట్లు ఇప్పిస్తున్నారు: వైకాపా ఎమ్మెల్యే ఆనం
సీఎం జగన్‌కు అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి ఆయనతో తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు.నెల్లూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సాగునీటి సలహామండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో వెనుకబడ్డామని.. సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. సోమశిల కాలువలు సరిగా లేవని.. చివరి వరకు నీరు పోవడం లేదని చెప్పారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు.కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రిగా వచ్చారని.. ఆయన అయినా మాట వింటారని అనుకుంటున్నామని ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మాటలను ఇక్కడి పాలకులు అబద్దాలు చేస్తున్నారని.. నెల్లూరు, సంగం వంతెనలు ప్రారంభిస్తామంటూ అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. నీటిపారుదలశాఖ అధికారులు సీఎంవోకి వాస్తవాలు చెప్పాలన్నారు. మూడేళ్లుగా 20 శాతం కూడా చేయలేకపోతున్నారని.. పరువుపోతోందని ఆనం వ్యాఖ్యానించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలని కోరారు.

*కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కాదు: Sharmila
సీఎం కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కాదని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. శుక్రవారం అశ్వారావుపేట నియోజక వర్గం మామిళ్లగూడెం గ్రామంలో రైతు గోస ధర్నాలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ ఒక దొంగ.. భూములు గుంజుకుంటున్న దొంగ అని వ్యాఖ్యానించారు. మొక్కలు నాటేందుకు పేదలు సాగు చేసుకున్న భూములే కావాలా అని ప్రశ్నించారు. ఎస్సీలు, ఎస్టీలు మనుషులు కారా… పురుగుల్లా చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కోటలు కట్టుకోవాలని కాని…సామాన్యుడు ఆత్మహత్యలు చేసుకోవాలని అన్నారు. కేసీఆర్ కాళ్ళమీద పడి బాంచన్ దొర అని అడుక్కోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు… కేసీఆర్ మాటలు మారుస్తూ ఉంటారని అన్నారు. కేసీఆర్ వి అన్ని తాగుబోతు మాటలే అని మండిపడ్డారు

*ఇది చాలా సున్నితమైన అంశం: బొత్స
ఏపీలో పదోతరగతి ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో బయటకు వస్తుండడంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. ఇది చాలా సున్నితమైన అంశమన్నారు. నంద్యాలలోను పేపర్ బయటకు రావడం అనేది ఒట్టి పుకారు మాత్రమేనన్నారు. సత్యసాయిలో 12.15కి పేపర్ బయటకు వచ్చిందన్నారు. ఇందులో ఏం జరిగిందనే దానిపై అరగంటలో అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇంకా బొత్స మాట్లాడుతూ.. ‘‘మీడియాలో 10 గంటలకే బయటకు వచ్చింది అంటున్నారు. వాస్తవాలు ఏంటో ఎంక్వైరీ చేస్తాం. టెక్నాలజీ పెరిగిపోయిన తరువాత ఒకరి కోసమో ఇద్దరి కోసమో, ఒక రూంలోని వారి కోసమో కుట్రతో చేస్తున్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనిని ప్రైవేటు కాలేజీలకు ఆపాదించలేము. ఎక్కడ ఏ చిన్న అంశం జరిగినా సరే వారిని అదుపులోకి తీసుకుంటాం. ఇది చాలా సున్నితమైన అంశం’’ అని పేర్కొన్నారు

*వైసీపీని జగన్‌ వైఎస్సార్ కార్పొరేట్ పార్టీగా మారుస్తున్నారు: రామకృష్ణ
వైసీపీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కార్పొరేట్ పార్టీగా మారుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గౌతమ్ ఆదానీ భార్య ప్రీతి ఆదానీకి.. వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఖాయం చేసినట్లు తెలుస్తోందన్నారు. ఇప్పటికే వేల కోట్ల విలువైన గంగవరం పోర్టును.. ఆదానీ కంపెనీకి జగన్ సర్కార్ అప్పనంగా అప్పగించిందని ఆరోపించారు. ప్రధాని మోదీకి సన్నిహితులుగా ఉన్న ఆదానీ, అంబానీలకు.. సీఎం జగన్ మోకరిల్లడం తగదని రామకృష్ణ హితవుపలికారు

*సంపద సృష్టిస్తున్నాం.. ప్రజలకు పంచుతున్నాం: మంత్రి కేటీఆర్‌
రాష్ట్రంలో సంపద సృష్టిస్తున్నాం, దానిని ప్రజలకు పంచుతున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలో ఏ మూలకెళ్లినా ఎకరం భూమి విలువ రూ.15 లక్షలకు తక్కువగా లేదని చెప్పారు. రాష్ట్రం సిద్ధించినప్పుడు మన తలసరి ఆదాయం రూ.లక్షా 24 వేలు అని, ఏడేండ్ల తర్వాత అది రూ.2.78 లక్షలకు చేరిందన్నారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయం తరువాత అత్యధిక ఉపాధి కల్పిస్తున్నది నిర్మాణరంగమేనని చెప్పారు. దేశంలో 70 శాతం మంది గ్రామాల్లో నివసిస్తున్నారని, నిర్మాణ రంగం వల్ల సంపద సృష్టి జరుగుతున్నదని తెలిపారు.హైదరాబాద్‌ లాంటి నగరాలే దేశానికి ఆర్థిక శక్తిగా ఉన్నాయని వెల్లడించారు. నగరాల విస్తరణకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పించాలన్నారు. దేశంలో సంపద సృష్టించే నగరాల అభివృద్ధి కోసం ఏటా రూ.10 వేల కోట్లు కేటాయించాలని ప్రధాని మోదీని సీఎం కేసీఆర్‌ కోరారని, అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

*వైసీపీని జగన్‌ వైఎస్సార్ కార్పొరేట్ పార్టీగా మారుస్తున్నారు: రామకృష్ణ
వైసీపీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కార్పొరేట్ పార్టీగా మారుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గౌతమ్ ఆదానీ భార్య ప్రీతి ఆదానీకి.. వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఖాయం చేసినట్లు తెలుస్తోందన్నారు. ఇప్పటికే వేల కోట్ల విలువైన గంగవరం పోర్టును.. ఆదానీ కంపెనీకి జగన్ సర్కార్ అప్పనంగా అప్పగించిందని ఆరోపించారు. ప్రధాని మోదీకి సన్నిహితులుగా ఉన్న ఆదానీ, అంబానీలకు.. సీఎం జగన్ మోకరిల్లడం తగదని రామకృష్ణ హితవుపలికారు

*ఇది చాలా సున్నితమైన అంశం: బొత్స
ఏపీలో పదోతరగతి ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో బయటకు వస్తుండడంపై మంత్రి బొత్స సత్యనారాయణ మరోసారి స్పందించారు. ఇది చాలా సున్నితమైన అంశమన్నారు. నంద్యాలలోను పేపర్ బయటకు రావడం అనేది ఒట్టి పుకారు మాత్రమేనన్నారు. సత్యసాయిలో 12.15కి పేపర్ బయటకు వచ్చిందన్నారు. ఇందులో ఏం జరిగిందనే దానిపై అరగంటలో అన్ని వివరాలు వెల్లడిస్తామన్నారు. ఇంకా బొత్స మాట్లాడుతూ.. ‘‘మీడియాలో 10 గంటలకే బయటకు వచ్చింది అంటున్నారు. వాస్తవాలు ఏంటో ఎంక్వైరీ చేస్తాం. టెక్నాలజీ పెరిగిపోయిన తరువాత ఒకరి కోసమో ఇద్దరి కోసమో, ఒక రూంలోని వారి కోసమో కుట్రతో చేస్తున్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. దీనిని ప్రైవేటు కాలేజీలకు ఆపాదించలేము. ఎక్కడ ఏ చిన్న అంశం జరిగినా సరే వారిని అదుపులోకి తీసుకుంటాం. ఇది చాలా సున్నితమైన అంశం’’ అని పేర్కొన్నారు

*కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కాదు: Sharmila
సీఎం కేసీఆర్ మాట మీద నిలబడే మనిషి కాదని వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల విమర్శలు గుప్పించారు. శుక్రవారం అశ్వారావుపేట నియోజక వర్గం మామిళ్లగూడెం గ్రామంలో రైతు గోస ధర్నాలో షర్మిల పాల్గొని ప్రసంగించారు. కేసీఆర్ ఒక దొంగ.. భూములు గుంజుకుంటున్న దొంగ అని వ్యాఖ్యానించారు. మొక్కలు నాటేందుకు పేదలు సాగు చేసుకున్న భూములే కావాలా అని ప్రశ్నించారు. ఎస్సీలు, ఎస్టీలు మనుషులు కారా… పురుగుల్లా చూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కోటలు కట్టుకోవాలని కాని…సామాన్యుడు ఆత్మహత్యలు చేసుకోవాలని అన్నారు. కేసీఆర్ కాళ్ళమీద పడి బాంచన్ దొర అని అడుక్కోవాలా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఊసరవెల్లి రంగులు మార్చినట్లు… కేసీఆర్ మాటలు మారుస్తూ ఉంటారని అన్నారు. కేసీఆర్ వి అన్ని తాగుబోతు మాటలే అని మండిపడ్డారు

*హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదు: మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదు: మంత్రి కేటీఆర్‌
హైదరాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని మిగతా మెట్రో నగరాల కంటే ఎంతో ముందున్నదని చెప్పారు. మాదాపూర్‌ హైటెక్స్‌లో జరుగుతున్న క్రెడాయ్‌ ప్రాపర్టీ షోను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో నిర్మాణ రంగానికి ఎలాంటి ఢోకాలేదన్నారు. మరో 10 నుంచి 15 ఏండ్లు హైదరాబాద్‌కు ఢోకాలేదని స్పష్టం చేశారు. కొన్ని కంపెనీల కుమ్మక్కు వల్లే స్టీల్‌, సిమెంటు ధరలు పెరిగాయని, ధరల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. త్వరలో ఫార్మా సిటీని ప్రారంభిస్తామన్నారు

*సీఎంతో తప్పుడు స్టేట్ మెంట్లు ఇప్పిస్తున్నారు: వైకాపా ఎమ్మెల్యే ఆనం
సీఎం జగన్‌కు అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి ఆయనతో తప్పుడు స్టేట్‌మెంట్లు ఇప్పిస్తున్నారని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ఆరోపించారు.నెల్లూరు జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జరిగిన సాగునీటి సలహామండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యం కొనుగోలులో వెనుకబడ్డామని.. సమస్యలు అలాగే ఉన్నాయన్నారు. సోమశిల కాలువలు సరిగా లేవని.. చివరి వరకు నీరు పోవడం లేదని చెప్పారు. మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని చెప్పారు.కాకాణి గోవర్ధన్‌రెడ్డి మంత్రిగా వచ్చారని.. ఆయన అయినా మాట వింటారని అనుకుంటున్నామని ఆనం రామనారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి మాటలను ఇక్కడి పాలకులు అబద్దాలు చేస్తున్నారని.. నెల్లూరు, సంగం వంతెనలు ప్రారంభిస్తామంటూ అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని ఆరోపించారు. నీటిపారుదలశాఖ అధికారులు సీఎంవోకి వాస్తవాలు చెప్పాలన్నారు. మూడేళ్లుగా 20 శాతం కూడా చేయలేకపోతున్నారని.. పరువుపోతోందని ఆనం వ్యాఖ్యానించారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలని కోరారు.

*వైసీపీని జగన్‌ వైఎస్సార్ కార్పొరేట్ పార్టీగా మారుస్తున్నారు: రామకృష్ణ
వైసీపీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్సార్ కార్పొరేట్ పార్టీగా మారుస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గౌతమ్ ఆదానీ భార్య ప్రీతి ఆదానీకి.. వైసీపీ తరపున రాజ్యసభ సీటు ఖాయం చేసినట్లు తెలుస్తోందన్నారు. ఇప్పటికే వేల కోట్ల విలువైన గంగవరం పోర్టును.. ఆదానీ కంపెనీకి జగన్ సర్కార్ అప్పనంగా అప్పగించిందని ఆరోపించారు. ప్రధాని మోదీకి సన్నిహితులుగా ఉన్న ఆదానీ, అంబానీలకు.. సీఎం జగన్ మోకరిల్లడం తగదని రామకృష్ణ హితవుపలికారు.

*రోజా చెప్పిన జగన్ గన్ను కాదు.. అట్ట తుపాకీ: అనురాధ
ష్ట్రంలో ఆడబిడ్డల రక్షణను గాలికొదిలేసి వైసీపీ మహిళా మంత్రులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ చీరలు, నగలు గురించి తప్ప ఇంకేం మాట్లాడ్డం రాదా గుడ్డి రోజాకు? అంటూ దుయ్యబట్టారు. కిరాతకుల చేతిలో బలైపోయిన బాధితులకు చీర కప్పి అండగా నిలుస్తామని చెప్పాల్సింది పోయి వారికి న్యాయం చేయమని అడిగిన చంద్రబాబుకు చీరలు పంపిస్తానంటారా? రోజా చెప్పిన జగన్ గన్ను కాదు.. అట్ట తుపాకీ అంటూ ఎద్దేవా చేశారు. మహిళలకు రక్షణ కల్పించడం చేతకాని వైసీపీ నేతలు సిగ్గులేకుండా తమపై విమర్శలు చేస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. లోకేష్ పర్యటనను అడ్డుకోవడం వైసీపీ ప్రభుత్వ పిరికిపంద చర్యగా అనురాధ అభివర్ణించారు.

*ఏం చేశారని వైసీపీకి ప్రజలు ఓట్లు వేయాలి: GVL
రాష్ట్ర ప్రజలకు ఏం చేశారని వైసీపీకి ప్రజలు ఓట్లు వేయాలని రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహరావు ప్రశ్నించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ఇంటింటికి వెళ్లి వైసీపీ పంచే కరపత్రాల్లో చెప్పినవన్నీ కేంద్రం ఇచ్చిన పథకాలే అని అన్నారు. గత ఎన్నికల సమయంలో టీడీపీ పసుపు కుంకుమ ఇచ్చినా జనం పక్కన పెట్టారని తెలిపారు. వైసీపీని కూడా ఈసారి ప్రజలు తిరస్కరిస్తారని స్పష్టం చేశారు. రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు ఓ అవగాహనతో ఉన్నాయని అన్నారు. మూడో పార్టీని రాష్ట్రంలో రానీయకుండా చేస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు ఒక్కరే ఉండటం రాష్ట్రంలో మనం చూస్తున్నామని తెలిపారు. బీజేపీలో అలా ఉండదని, కుటుంబ పార్టీలను వ్యతిరేకించాల్సిన అవసరం ఉందని చెప్పారు. తమిళనాడు తరహా రాజకీయాలు ఇప్పుడు ఏపీలో చూస్తున్నామన్నారు. మంత్రులు కూడా ముఖ్యమంత్రి కాళ్లపై పడటం ఏంటని ప్రశ్నించారు. పెద్ద వయసులో ఉన్న వారు కూడా ఆత్మాభిమానం పక్కన పెట్టారని జీవీఎల్ వ్యాఖ్యానించారు.

*ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలకు టీఆర్ఎస్‌ నేతల కౌంటర్
ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు టీఆర్ఎస్‌ నేతలు కౌంటర్ ఇచ్చారు. బొత్స కుటుంబం అంతా హైదరాబాద్‌లోనే ఉంటుందని, కేటీఆర్ ఏపీ గురించి ఉన్న నిజమే మాట్లాడారని మంత్రి వేముల అన్నారు. ఏపీని అభివృద్ధి చేసుకుంటే మేమేమైనా అడ్డుపడుతామా? అంటూ వేముల ప్రశ్నించారు. బొత్స బిల్లు కట్టలేదు కావొచ్చు అందుకే కరెంట్‌ కట్‌చేసి ఉంటారని ఎంపీ రంజిత్‌రెడ్డి అన్నారు. వైసీపీ నేతల కుటుంబీకులు హైదరాబాద్‌లోనే ఉంటున్నారని, విద్యుత్‌ విషయంపై వారిని అడిగితే చెబుతారని ఎంపీ రంజిత్‌రెడ్డి తెలిపారు.

*చంద్రబాబు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారు: మంత్రి ఉషాశ్రీచరణ్
ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్‌పై మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ విమర్శలు గుప్పించారు. మహిళలకు అండగా జగన్ ప్రభుత్వం పనిచేస్తోందని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ అన్నారు. దిశ యాప్ ద్వారా మహిళలకు క్షణాల్లో రక్షణ లభిస్తోందని మంత్రి తెలిపారు. చంద్రబాబు, లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. లేనిది ఉన్నట్లు సృష్టించి టీడీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని మంత్రి ఉషాశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*నల్గొండకు వేరే నాయకుల అవసరం లేదు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ఉమ్మడి నల్గొండ జిల్లాకు వేరే నాయకుల అవసరం లేదని ఎంపీ, కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. జిల్లాలో కాంగ్రెస్‌ పటిష్ఠంగా ఉందని పేర్కొన్నారు. గురువారం ఆయన ఇక్కడ తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ వరంగల్‌ బహిరంగ సభకు సంబంధించి జనసమీకరణ, ఏర్పాట్లపై పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉమ్మడి నల్గొండలో పార్టీ శ్రేణులతో తలపెట్టిన సన్నాహక సమావేశం నేపథ్యంలో కోమటిరెడ్డి పై విధంగా స్పందించారు. సొంత నియోజకవర్గంలో కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ అభివృద్ధి కార్యక్రమాలు ఉండటం వల్ల రేవంత్‌ కార్యక్రమానికి వెళ్లడం లేదన్నారు. కాంగ్రెస్‌తో పొత్తుకు కేసీఆర్‌ అడిగారని కోమటిరెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌ అధిష్ఠానం అంగీకరించలేదని చెప్పారు. తన నియోజకవర్గంలో ప్రాజెక్టుల పూర్తికి తక్షణమే నిధులు మంజూరు చేసి వాటిని పూర్తి చేయాలని డిమాండ్‌ చేశారు.

*దేవుడు చల్లగా చూస్తే టిడ్కో ఇళ్లు పూర్తి: సురేశ్‌
దేవుడు చల్లగా చూస్తే ముఖ్యమంత్రి జగన్‌ టిడ్కో ఇళ్లను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు అందిస్తారని పురపాలన, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ వెల్లడించారు. విశాఖ మహా నగర ప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) కార్యాలయంలో ఆయన గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. టిడ్కో ఇళ్లను పూర్తిచేయడానికి తాము చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే… పట్టించుకోవడం లేదని, జాప్యం చేస్తున్నామని ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. టిడ్కోలో 63 వేల ఇళ్ల నిర్మాణానికి రివర్స్‌ టెండరింగ్‌కు వెళితే రూ.392 కోట్ల ప్రజాధనం మిగిలిందన్నారు. టిడ్కో ఇళ్లు నిర్మించిన కాంట్రాక్టర్లకు వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.1,000 కోట్ల బిల్లులు చెల్లించిందన్నారు. లబ్ధిదారులకు అందించే ఇళ్ల రిజిస్ట్రేషన్లు గ్రామ సచివాలయాల ద్వారానే జరుగుతాయన్నారు.

*సంక్షేమమంతా అప్పులు, అవినీతిమయం: సోము
రాష్ట్రంలో జగన్‌ సంక్షేమం అంతా అప్పులు, అవినీతిమయం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో జనంతోను, జనసేనతో మాత్రమే పొత్తులు ఉంటాయన్నారు. కుటుంబ వారసత్వ పార్టీలతో పొత్తుల ప్రసక్తిలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో శూన్యత ఉందన్నారు. కుటుంబ, వారసత్వ పార్టీలు ప్రజల్లో విశ్వాసం కోల్పోయాయన్నారు. పెట్రో ధరలు తగ్గించమని ప్రధాని మోదీ కోరితే తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఎందుకు గావుకేక పెడుతున్నారని ప్రశ్నించారు.

*జగన్‌కు మరో చాన్స్‌ లేదు: కన్నా
‘‘ఒక్క చాన్స్‌ అని జగన్‌ అడుక్కుం టే ప్రజలు చాన్స్‌ ఇచ్చారు. మరో చాన్స్‌ ఇచ్చే పరిస్థితి లేదు’’ అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో గురువారం గుంటూరులో పలు చలివేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మూడేళ్లుగా రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందన్నారు. ఏడుసార్లు విద్యుత్‌ చార్జీలు పెంచారన్నారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడం తప్ప ఈ మూడేళ్లలో ప్రగతి లేదని కన్నా విమర్శించారు.

*సక్రమంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ: కాకాణి
పంట నష్టాలకు సంబంధించి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ కొందరు రైతులకు జమ కాలేదనే విమర్శలు వస్తున్నాయని, అలాంటి రైతుల డేటాలో తప్పొప్పులను సరిదిద్ది, వారి ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి ఆదేశించారు. ఇలాంటి సమస్యలు మరోసారి తలెత్తకుండా ఈ-క్రాప్‌ డేటా నమోదు సమయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. గురువారం సచివాలయంలో శాఖ పనితీరుపై సమీక్షించారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సూక్ష్మపోషకాలు, పచ్చిరొట్ట ఎరువుల అవసరాలపై ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. రైతులకు విత్తనాలన్నీ ఆర్బీకేల ద్వారా అందించాలని, ఖరీ్‌ఫకు 3.25లక్షల టన్ను ల వేరుశనగ విత్తనాలను తక్షణం అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

*అప్పుల మాటున ఆర్థిక విస్ఫోటం: లంకా దినకర్‌
‘‘రాష్ట్రంలో అప్పుల మాటున జరుగుతున్న ఆర్థికవిస్ఫోటం దేశానికే అత్యంత ప్రమాదకరం. వైసీపీ ప్రభుత్వం చేసిన రుణాలు, ఆర్థిక నిర్వహణకు సంబంధించి కచ్చితమైన సమాచారాన్ని కేంద్రం సేకరించింది. ఏపీ నుంచి పంపే పొంతనలేని సమాధానాన్ని పరిగణలోకి తీసుకోవడం సాధ్యంకాదు’’ అని బీజేపీ ఫీడ్‌బ్యాక్‌ ప్రముఖ్‌ లంకా దినకర్‌ అన్నారు. ప్రస్తుతం 35శాతం ఉన్న జీఎ్‌సడీపీ, అప్పుల నిష్పత్తి 70శాతానికి పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

*సక్రమంగా ఇన్‌పుట్‌ సబ్సిడీ పంపిణీ: కాకాణి
పంట నష్టాలకు సంబంధించి కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ కొందరు రైతులకు జమ కాలేదనే విమర్శలు వస్తున్నాయని, అలాంటి రైతుల డేటాలో తప్పొప్పులను సరిదిద్ది, వారి ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమ చేసేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి ఆదేశించారు. ఇలాంటి సమస్యలు మరోసారి తలెత్తకుండా ఈ-క్రాప్‌ డేటా నమోదు సమయంలోనే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు. గురువారం సచివాలయంలో శాఖ పనితీరుపై సమీక్షించారు. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌కు అవసరమైన విత్తనాలు, ఎరువులు, సూక్ష్మపోషకాలు, పచ్చిరొట్ట ఎరువుల అవసరాలపై ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. రైతులకు విత్తనాలన్నీ ఆర్బీకేల ద్వారా అందించాలని, ఖరీ్‌ఫకు 3.25లక్షల టన్ను ల వేరుశనగ విత్తనాలను తక్షణం అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

*టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదు: మహేశ్వర్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీఆర్‌ఎస్‌తో పొత్తు ఉండదని ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన కేసీఆర్ దేశ రాజకీయాల గురించి మాట్లాడటం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. పుట్టెడు సమస్యలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతుంటే జాతీయ రాజకీయాలంటూ డ్రామాలు మొదలెట్టాడని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రజలను, ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కేసీఆర్‌కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో రాహుల్ గాంధీ సభతో కాంగ్రెస్ సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన తెలిపారు.

*కాంగ్రెస్‌ పార్టీకి నా అవసరం లేదు: పీకే
కాంగ్రెస్‌ పార్టీకి తన అవసరం లేదని, ఆ పార్టీ తనకు తానుగానే పునర్‌వైభవం పొందగలదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ అన్నారు. ఆ పార్టీలో తాను ఎలాంటి పాత్రను పోషించాలని అనుకోలేదని, భవిష్యత్‌ ప్రణాళికకు సంబంధించిన బ్లూప్రింట్‌ను రూపొందించి కచ్చితంగా అమలు చేయాలని మాత్రమే కోరుకున్నానని చెప్పారు. 2014 తర్వాత భవిష్యత్‌ ప్రణాళికలకోసం నిర్మాణాత్మక విధానంలో కాంగ్రెస్‌ పార్టీ కసరత్తు చేయడం ఇదే మొదటిసారని ప్రశాంత్‌ కిషోర్‌ తెలిపారు. అధ్యక్ష బాధ్యతలకు సంబంధించి రాహుల్‌ పేరు గానీ, ప్రియాంక పేరుగానీ సూచించలేదన్నారు.

*కాంగ్రెస్‌కు, నాకూ ఓ అవ‌గాహ‌న వ‌చ్చింది.. అయితే… : ప్ర‌శాంత్ కిశోర్‌
కాంగ్రెస్‌కు ఎలాంటి పీకేలూ అవ‌స‌రం లేద‌ని ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ మరోమారు వ్యాఖ్యానించారు. సొంతంగా త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డ‌గ‌ల‌ద‌ని పేర్కొన్నారు. ప్ర‌శాంత్ కిశోర్ గురువారం ఓ జాతీయ ఛాన‌ల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగానే ఆయ‌న పై వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్‌కు త‌న అవ‌స‌రం లేద‌ని, సొంతంగానే తిరిగి నిల‌బ‌డ‌గ‌ల‌ద‌ని పేర్కొన్నారు.భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌లపై త‌న‌కూ, కాంగ్రెస్‌కు మ‌ధ్య ఓ అవ‌గాహ‌న వ‌చ్చింద‌న్నారు. ఆ ప్ర‌ణాళిక‌ల‌న్నింటినీ కాంగ్రెస్సే సొంతంగా చేసుకోగ‌ల‌ద‌ని, అందులో కూడా చాలా స‌మ‌ర్థ‌వంత‌మైన‌, పెద్ద నేత‌లే వున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. త‌న‌ను కాంగ్రెస్‌లో చేరాల‌ని అడిగార‌ని, అందుకు తాను తిర‌స్క‌రించాన‌ని పీకే స్ప‌ష్టం చేశారు.2014 త‌ర్వాత ఓ ప‌ద్ధ‌తి ప్ర‌కారం త‌న భ‌విష్య‌త్ ప్ర‌ణాళిక‌ల గురించి కాంగ్రెస్ చ‌ర్చించడం తాను మొదటి సారిగా చూస్తున్నానని, తానేం చెప్పాల‌నుకున్నానో, అన్నీ కాంగ్రెస్ అధినేత్రి ముందు ఉంచాన‌ని పీకే వెల్ల‌డించారు. 2024 సార్వ‌త్రిక ఎన్నిక‌ల దృష్ట్యా సోనియా ఏర్పాటు చేసిన సాధికార‌త క‌మిటీలో త‌న‌ను చేర‌మ‌ని అన్నార‌ని, కానీ ఆ క‌మిటీపై త‌న‌కు కొన్ని సందేహాలున్నాయ‌ని ఆయ‌న అన్నారు