Movies

చేయాల్సింది చాలా ఉంది

చేయాల్సింది చాలా ఉంది

చిత్రసీమలో సీనియర్‌ హీరోయిన్ల హవా కొనసాగుతోంది. కొత్త కథానాయికలు వచ్చినా.. తమ సీనియారిటీని కాపాడుకుంటూనే ఉన్నారు. తమన్నా కూడా అంతే. తన ఇమేజ్‌కి తగిన కథల్ని ఎంచుకుంటున్నారు. ‘‘సీనియారిటీ పెరిగింది అంటే.. బాధ్యత పెరిగినట్టే. వచ్చిన కొత్తలో.. నిలబడడం కోసం ఎలాంటి సినిమా అయినా ఒప్పుకొని ఉండొచ్చు. అందులో తప్పేమీ లేదు. కానీ ఓ పొజీషన్‌ వచ్చాక.. తప్పకుండా జాగ్రత్త పడాలి. ‘తమన్నా ఏమిటి.. ఇలాంటి సినిమా చేసింది’ అనిపించుకోకూడదు. అలాగని.. మేం చేయాల్సినవన్నీ చేసేసినట్టు కూడా కాదు. ఇంకా చాలా ప్రయాణం ఉంది. చేయాల్సిన పాత్రలు చాలానే మిగిలి ఉన్నాయి. చిత్రసీమలో ఎప్పుడు ఎలాంటి అవకాశం తలుపు తడుతుందో చెప్పలేం. నన్ను నేను పూర్తిగా ఆవిష్కరించుకొనే పాత్ర అయితే ఇంకా రాలేదు. ఒకవేళ అలాంటి పాత్ర నేను చేసినా, మరో అద్భుతమైన పాత్ర కోసం ఎదురు చూస్తూనే ఉంటా..’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ‘భోళా శంకర్‌’, ‘ఎఫ్‌ 3’ చిత్రాల్లో నటిస్తున్నారు తమన్నా