Movies

సినిమాగా ట్వింకిల్‌ ఖన్నా పుస్తకం

సినిమాగా ట్వింకిల్‌ ఖన్నా పుస్తకం

అక్షయ్‌ కుమార్‌ సతీమణి, ఒకప్పటి నాయిక ట్వింకిల్‌ ఖన్నా రాసిన పుస్తకం ‘సలామ్‌ నోని అప్ప’ ఆధారంగా ఓ సినిమా రూపొందుతున్నది. సోనాల్‌ దర్బల్‌ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు. అప్లాజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎల్లిప్సిస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఫ్యానీ బోన్‌ మూవీస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఈ సినిమాను ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా ట్వింకిల్‌ ఖన్నా ప్రకటించారు. ఈ సినిమా ప్రకటన సందర్భంగా అక్షయ్‌ కుమార్‌ స్పందిస్తూ…‘ట్వింకిల్‌ ఈ కథ నాకు చెప్పినప్పుడు నవ్వుతూనే ఉద్వేగానికి లోనయ్యాను. ఇలాంటి మంచి పుస్తకం సినిమాగా రావడం సంతోషంగా ఉంది. ప్రతిభావంతులైన టీమ్‌ ఈ సినిమాకు పనిచేస్తున్నారు. వాళ్లందరికీ ఆల్‌ ద బెస్ట్‌’ అన్నారు. తన నానమ్మ, ఆమె సోదరి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబిస్తూ ‘సలామ్‌ నోని అప్ప’ పుస్తకాన్ని రాశారు ట్వింకిల్‌.