DailyDose

మంగళగిరిలో ఎస్సైపై వేధింపుల కేసు నమోదు – TNI నేర వార్తలు

మంగళగిరిలో ఎస్సైపై వేధింపుల కేసు నమోదు – TNI  నేర వార్తలు

* వరకట్నం వేధింపుల కేసులో జిల్లాలోని మంగళగిరి రూరల్ పోలీస్స్టేషన్లో ఎస్సై వినోద్కుమార్పై కేసు నమోదయింది. వరకట్నం వేధింపులపై పోలీసులకు ఎస్సై భార్య రోజారాణి ఫిర్యాదు చేసింది. ఎస్సైకి కట్నంగా రూ.20 లక్షలు, 12 లక్షల బంగారు నగలు కట్నం ఇచ్చిన రోజారాణి కుటుంబం ఇచ్చింది. అయినా అదనపు కట్నం కోసం రోజారాణికి అత్తింటివారి వేధింపులు ఎక్కువయ్యాయి. భర్త, అత్తమామలు తనపై హత్యాయత్నం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. రోజారాణి తాడేపల్లిలో వైద్యురాలిగా విధులు నిర్వహిస్తున్నది. రోజారాణి ఫిర్యాదుతో ఎస్సైపై మంగళగిరి పీఎస్లో కేసు నమోదయింది.

*గుంటూరు: జిల్లాలోని తాడేపల్లిలో ఓ పత్రికా విలేఖరి నాగిరెడ్డి రెచ్చిపోయాడు. పోలకంపాడులో స్థలం ఖాళీ చేసే విషయంలో జోక్యం చేసుకుని వృద్ధుడు కోటేశ్వరావు‌పై నాగిరెడ్డి దాడికి పాల్పడ్డాడు. కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడిన వృద్ధుడిపైనాకుటుంబ సభ్యులపై విలేఖరి కనికరం చూపలేదు. అడ్డకున్న మహిళలను కర్కశంగా కాళ్లతో తన్నాడు. నాగిరెడ్డి దందాలు స్థానికంగా తీవ్ర వివాదాస్పదంగా మారాయి. ప్రస్తుతం నాగిరెడ్డి దాడి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

*విజయనగరం: జిల్లాలో దారుణం జరిగింది. మెంటాడ మండలంలో యువకుడిని కొందరు హత్య చేశారు. యువకుడు గేదెలు గణేష్‌ని ప్రత్యర్ధులు కత్తులతో పొడిచి చంపారు. ఈ ఘటనలో మరో ఆరుగురికి కత్తిపోట్లు అయ్యాయి. రెండ్రోజుల క్రితం జ్యోతి అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. యువతి ఆత్మహత్యతో మృతురాలి కుటుంబం ప్రతీకారంతో రగిలిపోయింది. మృతురాలి బంధువులు కత్తులతో వచ్చి వీరంగం సృష్టించారు. ఈ ఘటనలో మృతురాలి మరిది గణేష్ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో డ్ర‌గ్స్ స్మ‌గ్లింగ్ చేస్తూ ఉగాండ మ‌హిళ ప‌ట్టుబ‌డింది. ఏప్రిల్ 14న దోహ నుంచి న‌గ‌రానికి చేరుకున్న మ‌హిళా ప్ర‌యాణీకురాలి క‌ద‌లిక‌లు అనుమానాస్ప‌దంగా ఉండ‌టంతో అధికారులు ఆమెను త‌నిఖీ చేశారు.887 గ్రాముల హెరాయిన్‌తో కూడిన 126 క్యాప్సుల్స్‌ను మింగేసి స్మ‌గ్లింగ్ చేసేందుకు ప్ర‌య‌త్నిస్తూ ఉగాండ మ‌హిళ దొరికిపోయింది. తొలుత ఆమె బ్యాగేజ్‌ను త‌నిఖీ చేయ‌గా ఎలాంటి అనుమానిత వ‌స్తువులు ల‌భించ‌లేదు. ఆపై వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా ఆమె శ‌రీరం లోప‌ల నిర్ధిష్ట మెటీరియ‌ల్ ఉన్న‌ట్టు వెల్ల‌డైంది.
ఆపై ఆమె శ‌రీరంలోప‌ల 126 క్యాప్సుల్స్ హెరాయిన్ ఉన్న‌ట్టు బ‌య‌ట‌ప‌డింది. అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ఈ హెరాయిన్ విలువ 6.65 కోట్లు ఉంటుంద‌ని క‌స్ట‌మ్స్ అధికారులు తెలిపారు. నిందితురాలిని అరెస్ట్ చేసి కేసు ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

*అనకాపల్లి: జిల్లాలోని కశింకోట మండలం నర్సింగ్‌పల్లి ఏపీజీవీబీ బ్యాంకులో చోరీ జరిగింది. ఇద్దరు దుండగులు బ్యాంకులోకి చొరబడి తుపాకీతో బెదిరించారు. అనంతరం బ్యాంకు సిబ్బందిని బెదిరించి రూ.3 లక్షలతో పరారయ్యారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*అనకాపల్లి: జిల్లాలోని కశింకోట మండలం నర్సింగ్‌పల్లి ఏపీజీవీబీ బ్యాంకులో చోరీ జరిగింది. ఇద్దరు దుండగులు బ్యాంకులోకి చొరబడి తుపాకీతో బెదిరించారు. అనంతరం బ్యాంకు సిబ్బందిని బెదిరించి రూ.3 లక్షలతో పరారయ్యారు. నిందితులను పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

*విజయనగరం: జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం లభించింది. పెట్రోల్‌ పోసి తగలబెట్టినట్లుగా కనిపిస్తున్నది. డెంకాడ మండలం దయాల్‌నగర్‌-బేతనపల్లి మధ్య మృతదేహం పడిఉన్నది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆమె శరీరం మొత్తం గుర్తుపట్టలేనతంగా కలిపోయింది. ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి కాల్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

*విజయనగరం: జిల్లాలో దారుణం చోటుచేసుకున్నది. ఓ గుర్తు తెలియని యువతి మృతదేహం లభించింది. పెట్రోల్‌ పోసి తగలబెట్టినట్లుగా కనిపిస్తున్నది. డెంకాడ మండలం దయాల్‌నగర్‌-బేతనపల్లి మధ్య మృతదేహం పడిఉన్నది. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దాంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. ఆమె శరీరం మొత్తం గుర్తుపట్టలేనతంగా కలిపోయింది. ఎక్కడో చంపి ఇక్కడికి తీసుకొచ్చి కాల్చినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

*హైదరాబాద్‌: నగరంలో మరోసారి పెద్దమొత్తం డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద 70 గ్రాముల డ్రగ్‌, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న కారును సీజ్‌ చేశారు. మత్తుమందు విలువ రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

*చిత్తూరు: జిల్లాలోని బంగారుపాలెం మండలం చిల్లగుండ్లపల్లి ప్రాథమిక పాఠశాలలో కీచక టీచర్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆరు నెలలుగా చిన్నారులపై టీచర్ అబు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఇంట్లో చెబితే చంపేస్తామంటూ బెదిరింపులకు గురిచేశాడు. హెచ్ఎం చొరవతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. సెల్ ఫోన్‌లో నీలి చిత్రాలు చూడమని చిన్నారులను టీచర్ అబు ఒత్తిడి చేశాడు. విద్యార్థులు మరుగుదొడ్లకు వెళితే అతను లోపలికి వెళ్లి గడియపెట్టి లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. విషయం బయటకు చెబితే చంపేస్తామని పిల్లలను బెదిరిస్తూ అరాచకంగా ప్రవర్తించాడు. దీంతో ఈ విషయాన్ని పిల్లలు దాచి పెడుతూ రాగా… చివరకు ఉపాధ్యాయుడి వికృత చేష్టలను గమనించిన పాఠశాల హెచ్ఎంతో దారుణం వెలుగుచూసింది. దీంతో అసలు విషయం తల్లిదండ్రుల వరకు చేరింది. ఆగ్రహంతో పాఠశాల వద్దకు చేరిన తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. జరిగిన సంఘటనపై తల్లిదండ్రులతో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారులు చర్చించారు. కాగా… అసలు విషయం తెలుసుకున్న అబు పాఠశాలకు గైర్హాజరయ్యాడు. చివరకు ఉపాధ్యాయునిపై విద్యాశాఖ సస్పెండ్ వేటు వేసింది.

*తిరుపతి: జిల్లాలో భారీగా ఎర్రచందనం దుంగలు పట్టబడ్డాయి. ఏర్పేడు మండలం పల్లం అటవీ ప్రాంతంలో టాస్క్ ఫోర్స్ పోలీసులు కూంబింగ్ నిర్వహించగా… 257 కేజీల బరువు ఉన్న 23 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వెంకటేష్, రమణయ్య, పెంచులయ్య అనే ముగ్గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేసినట్లు ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఎస్పీ సుందరరావు తెలిపారు.

*ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా జీ కొత్తపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావ్‌పై (Talari Venkatrao) కొత్తపల్లి గ్రామస్తులు దాడి చేశారు. దీంతో ఆయనకు గాయాలయ్యాయి. అతికష్టంమీద పోలీసుల సహకారంతో ఆయన బయటపడ్డారు. జీ కొత్తపల్లికి చెందిన వైసీపీ కార్యకర్త గంజి ప్రసాద్‌ శనివారం ఉదయం హత్యకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో ప్రసాద్‌ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి ఎమ్మెల్యే తలారి వెంకట్రాప్‌ ఘటనా స్థలానికి వెళ్లారు

*విడాకుల కోసం కోర్టుకు వచ్చిన భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచాడు ఓ భర్త. ఈ సంఘటన తమిళనాడులోని పెరంబలూరు జిల్లా కోర్టు వద్ద చోటు చేసుకుంది. సుధ, కామరాజు దంపతులు కొద్ది రోజులుగా విడివిడిగా ఉంటున్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా, దీనిపై విచారణ జరుగుతున్నది. ఒకే బస్సులో వీరిద్దరూ వచ్చారు. కోర్టు బస్టాండ్‌ వద్దకు రాగానే కామరాజు తనతో తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలైన మహిళను దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు

*అనంతపురం: జిల్లాలోని పామిడి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మూడు ఎద్దుల బండ్లను లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో చితంబరి(50)అనే కూలీ మృతి చెందాడు. రెండు ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం జి కొత్తపల్లి వైసీపీ నేత దారుణ హత్యకు గురయ్యాడు. వైసీపీ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గంజి ప్రసాద్‌ను దుండగులు కత్తితో నరికి చంపారు. వైసీపీలోని మరో వర్గానికి చెందిన వారు హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*కృష్ణా జిల్లా మచిలీపట్నంలో దారుణం జరిగింది. తండ్రి స్థానంలో ఉన్న వ్యక్తి మానవ మృగంగా మారాడు. తల్లితో సహజీవనం‌ చేస్తూనే… ఆమె కూతురిపై ఘాతుకానికి పాల్పడ్డాడు. బెదిరించి పది నెలలుగా బాలికపై అత్యాచారం చేశాడు. దీంతో బాలిక గర్భం దాల్చింది. నిన్న బాలికను బంధువులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా… మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధిత బాలిక వయసు 17 సంవత్సరాలు. విషయం తెలిసిన పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు కోమటి‌ సురేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

*మహబూబాబాద్: జిల్లాలోని కొత్తగూడ మండలంలోని వెలుబెల్లిలో దారుణం జరిగింది. కుటుంబ కలహలతో అల్లుడిపై అత్తా, మామ కలిసి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అల్లుడు యాదగిరి ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందాడు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమెదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఆన్‌లైన్ గేమ్స్ ఆడవద్దన్నందుకు డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో చోటు చేసుకుంది. ముదిగుబ్బ మండలం గుట్టకిందపల్లికి చెందిన విద్యార్థి సంతోష్ కుమార్(20) పురుగుమందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మొబైల్లో ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసగా మారిన సంతోష్ కుమార్ డిగ్రీ ద్వితీయ సంవత్సరం మధ్యలో మానేసి ఇంటి వద్దే ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుకుంటున్నాడు. దీంతో సంతోష్ కుమార్‌ను తల్లిదండ్రులు మందలించారు. మనస్తాపం చెందిన విద్యార్థి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు బత్తలపల్లిలోని ఆర్డీటీ ఆస్పత్రికి తీసుకెళ్లాగా… పరిస్థితి విషమించడంతో సంతోషకుమార్ మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు

* శిరివెళ్ల మండలం గుండం పాడు గ్రామంలో శనివారం ఉదయం భర్తను భార్య గొడ్డలితో నరికి హత్య చేసిన సంఘటన సంచలనంగా మారింది. గుండంపాడు గ్రామానికి చెందిన మెట్ల సత్య రాజు వయస్సు సుమారు 67అను వ్యక్తిని భార్య సరోజమ్మ వయసు సుమారు 64 శనివారం ఉదయం గొడ్డలితో నరకడం వల్ల అక్కడికక్కడే ప్రాణాలు వదిలినట్లు తెలిపారు.మృతుడు సత్య రాజు దైవ సేవకునిగా ఉంటూ ప్రార్థనలు చేసుకుంటూ పేన్షన్ ద్వారా జీవనం సాగిస్తున్న కుటుంబంలో తరుచూ చిన్న చిన్న మనస్పర్ధలు కొద్దిపాటి గొడవలు జరిగేవని గ్రామస్తులు తెలిపారు. నిందితురాలు సరోజమ్మను శిరివెళ్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రస్తుతం మృతదేహం గుండం పాడు గ్రామం లోని సంఘటనా స్థలం వద్దనే ఉన్నది. మధ్యాహ్నం రెండు గంటలకు అంత పంచనామా నిమిత్తం మృతదేహాన్ని నంద్యాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించనున్నట్లు సమాచారం.

* గుజరాత్‌లోని పిపావావ్‌ పోర్టులో రూ.2080 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. ఇందులో పాకిస్థాన్‌-దుబాయ్‌-అఫ్ఘానిస్థాన్‌ ముఠాల భాగస్వామ్యం ఉందని గుజరాత్‌ డీజీపీ ఆశిష్‌ భాటియా తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన పడవలో డ్రగ్స్‌తో పట్టుబడిన నిం దితుల్లో కీలక వ్యక్తి అఫ్ఘాన్‌కు చెందినవాడన్నారు. 81 కిలోల హెరాయిన్‌ను నీటిలో కలిపి, ప్యాకింగ్‌ చేసిన అనంతరం గోనెసంచుల్లో దేశంలోకి తరలించేందుకు యత్నించారని వివరించారు.

*అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌ నగరంలోని మసీదులో తాజాగా శక్తివంతమైన మరో బాంబు పేలుడు సంభవించింది. కాబూల్ మసీదులో సంభవించిన పేలుడులో 66 మంది భక్తులు మరణించారు.ఈ పేలుడులో ఇప్పటివరకు 66 మృతదేహాలు పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి వచ్చాయని అప్ఘాన్ అధికారులు చెప్పారు. మరో 78 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారని ఆరోగ్యశాఖ అధికారులు చెప్పారు. ముస్లింల పవిత్ర మాసం రమజాన్ చివరి శుక్రవారం ప్రార్థనల కోసం వందలాది మంది భక్తులు గుమిగూడటంతో ఖలీఫా అగా గుల్ జాన్ మసీదు కిక్కిరిసిపోయింది. అప్పుడే మసీదులో పేలుడు సంభవించడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానికులు తెలిపారు.పేలుడుతో తాలిబన్ భద్రతా సిబ్బంది ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పేలుడుకు మూలం వెంటనే తెలియరాలేదు. ఈ పేలుడుకు బాధ్యులమని ఎవరూ ప్రకటించలేదు.

*గుజరాత్‌లోని పిపావావ్‌ పోర్టులో రూ.2080 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. ఇందులో పాకిస్థాన్‌-దుబాయ్‌-అఫ్ఘానిస్థాన్‌ ముఠాల భాగస్వామ్యం ఉందని గుజరాత్‌ డీజీపీ ఆశిష్‌ భాటియా తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన పడవలో డ్రగ్స్‌తో పట్టుబడిన నిం దితుల్లో కీలక వ్యక్తి అఫ్ఘాన్‌కు చెందినవాడన్నారు. 81 కిలోల హెరాయిన్‌ను నీటిలో కలిపి, ప్యాకింగ్‌ చేసిన అనంతరం గోనెసంచుల్లో దేశంలోకి తరలించేందుకు యత్నించారని వివరించారు.

*చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలంలోని చిల్లగుండ్లపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థినులపై ఉపాధ్యాయుడు ఆబు ఆరు నెలలుగా వికృత చేష్టలకు పాల్పడుతున్న వ్యవహారం శుక్రవారం వెలుగు చూసింది. హెచ్‌ఎం పార్వతి చొరవతో పిల్లలు.. ఈ లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులుకు చెప్పడంతో వారు ఉదయాన్నే పెద్దఎత్తున పాఠశాలకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసి ఆబు ముందుగానే పాఠశాలకు గైర్హాజరయ్యాడు. ఆందోళన సమాచారంతో మధ్యాహ్నం తర్వాత డీఈవో పురుషోత్తం, తహసీల్దార్‌ సుశీల, ఎంపీడీవో విద్యారమ, ఎంఈవో నాగేశ్వరరావు, సీడీపీవో వాణి శ్రీదేవి పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు.

*ఆ బాలికకు తల్లి లేదు.. తల్లి కూడా తానే అయి తండ్రి, ఆమెను కంటికి రెప్పలా సాకుతున్నాడు! ఆమెనేమో ఆస్తి కోసం తన ప్రియుడితో కలిసి కన్నతండ్రిని దారుణంగా హత్యచేసింది. మహబూబాబాద్‌ జిల్లా వేంనూరు గ్రామంలో ఈ ఘటన జరిగింది. మహబూబాబాద్‌ రూరల్‌ సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన మల్లం వెంకన్న (45), ఐలమ్మ దంపతులకు 17 ఏళ్ల కుమార్తె ఉంది. ఏడాది క్రితం ఐలమ్మ కరోనాతో చనిపోయింది. వెంకన్న కుమార్తె అదే గ్రామానికి చెందిన వెంకటేశ్‌ అనే యువకుడిని ప్రేమిస్తోంది.

*గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల హాస్టల్‌లో జరిగిన చిన్న వాగ్వాదం ఓ విద్యార్థి గొంతు కోసేవరకు వెళ్లింది. సుమారు 18 కుట్లు వేసి చికిత్స అందించిన వైద్యులు బాలుడు క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల హాస్టల్‌లో ఈనెల 25న కొందరు సీనియర్‌ విద్యార్థులు అల్పాహారం వడ్డించారు. ఈ క్రమంలో లైన్‌లో నిలుచున్న ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థి సాత్విక్‌ చేయిపై వడ్డిస్తున్న సేమియా పడింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

*మీర్‌పేట్‌ విజయపురి కాలనీలో ఉంటున్న ఓ ఏఎస్‌ఐ ఇంట్లో గురువారం భారీ చోరీ జరిగింది. కుమార్తె పెళ్లికోసం తెచ్చిన 35 తులాల బంగారు ఆభరణాలు, రూ.17 లక్షలు దోచుకున్నారు. వీటి విలువ సుమారు రూ.35 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్‌లోని కలకొండకు చెందిన ముదావత్‌ శంకర్‌, లక్ష్మి కుటుంబం విజయపురి కాలనీలో నివసిస్తోంది. శంకర్‌ నగరంలోని ఓ పోలీసు స్టేషన్‌లో ఏఎస్సైగా పని చేస్తున్నారు. వచ్చే నెలలో వారి కుమార్తె వివాహం ఉండడంతో ఇటీవల బంగారు ఆభరణాలు కొనుగోలు చేశారు. వివాహ ఖర్చుల నిమిత్తం నగదు సైతం ఇంట్లో దాచుకున్నారు.

*వేంపల్లె మండలం నందిపల్లె గ్రామ సమీపంలో శుక్రవారంజరిగిన రోడ్డు ప్రమాదంలో ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీ ఫిజిక్స్‌ లెక్చరర్‌ భవాని మృతిచెందారు. ఈమె పులివెందుల నుంచి ఇడుపులపాయకు కారులో ఉదయం గంటల ప్రాంతంలో బయలుదేరారు. మార్గమధ్యంలోని వేంపల్లె మండలం నందిపల్లె సమీపంలో మలుపు వద్ద ఉన్నట్లుండి కారు టైరు పేలిపోయింది. దీంతో ఈమె ప్రయాణిస్తున్న కారు డివైడర్‌ను దాటుకొని ఎదురుగా వస్తున్న మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో భవానికి తీవ్ర గాయాలవ్వగా తొలుత వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికిఅక్కడి నుంచి కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమించి మృతిచెందారు. భవాని భర్త మనోహర్‌రెడ్డి పంచాయతీరాజ్‌ శాఖలో లింగాల మండల జేఈగా పనిచేస్తున్నారు. వీరికి ఒక కుమారుడుకుమార్తె ఉన్నారు.పోలీసులు కేసు నమోదు చేశారు.

* కొత్తగూండెం (Kothagudem) పట్టణంలో కారు బీభత్సం సృష్టించింది. శనివారం తెల్లవారుజామున వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి విధుల్లో ఉన్న కార్మికులపైకి దూసుకెళ్లింది. దీంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులను సర్వేష్‌, సరోజగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

* నమ్మి వచ్చిన ఎనిమిదో తరగతి బాలికపై ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో ఓ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ దారుణం హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని ఓ గ్రామంలో గురువారం రాత్రి జరిగింది. గ్రామస్థులు, కమలాపూర్‌ సీఐ మహేందర్‌రెడ్డి శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం.. బాలికకు ఫోన్‌ చేసి మాయమాటలు చెప్పిన ఇదే గ్రామానికి చెందిన పస్తం శ్రీకాంత్‌(22) అనే యువకుడు, రాత్రి సమయంలో ఆమెను పాఠశాల ఆవరణలోకి రమ్మని పిలిచాడు. నమ్మి వెళ్లిన ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి సమయంలో బాధితురాలి తండ్రి కమలాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందిత యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందంటూ శుక్రవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావటంపై సీఐ మాట్లాడుతూ.. అత్యాచారానికి పాల్పడింది ఒక్కడేనని తేలిందన్నారు. ఇదే ఘటనలో లోతుగా విచారణ చేపట్టేందుకు మరో నలుగురు యువకులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బాధిత బాలికను, నిందితుడిని హనుమకొండలోని భరోసా కేంద్రానికి తరలించారు. బాలిక తండ్రి ఫిర్యాదు ప్రకారం నిందితుడిపై పోక్సో చట్టం, అత్యాచార కేసులు నమోదు చేసినట్లు సీఐ వివరించారు.