DailyDose

మహానాడులోగా సభ్యత్వం పూర్తిచేయాలి – TNI తాజా వార్తలు

Auto Draft

* మహానాడులోగా సభ్యత్వం పూర్తిచేయాలని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. శనివారం టీ.టీడీపీ నేతలతో చంద్రబాబు సమావేశం అయ్యారు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఖమ్మం, హైదరాబాద్ మినహా మందకొడిగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతోంది. సభ్యత్వ నమోదు నూతన విధానంపై అవగాహన లేక.. ఇబ్బంది పడుతున్నామన్న పలువురు నేతలు చంద్రబాబుకు తెలిపారు.సభ్యత్వ నమోదుపై నేతలకు చంద్రబాబు సూచనలు చేశారు.సభ్యత్వ నమోదుపై నియోజకవర్గ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశారు.రంజాన్ దృష్ట్యా పేద ముస్లిం మహిళలకు చంద్రబాబు చీరలు పంపిణీ చేశారు.

*కాంగ్రెస్‌ కీలక నేత రాహుల్‌ గాంధీ సభకు అనుమతి నిరాకరించింది ఉస్మానియా యూనివర్సిటీ. రాహుల్‌ సభకు అనుమతి ఇవ్వకూడదని ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్‌ గాంధీ సభకే కాదు.. అసలు ఉస్మానియా యూనివర్సిటీలో ఏ బహిరంగ సభలకు కూడా అనుమతి ఇవ్వకూడదని నిర్ణయించింది కౌన్సిల్‌. అంతేకాదు.. క్యాంపస్‌లోకి కెమెరాలను నిషేధిస్తూ శనివారం ఉదయం కీలక ప్రకటన చేసింది. కేసీఆర్ సర్కారుపై పోరులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మే 6వ తేదీన వరంగల్ వేదికగా ‘రైతు సంఘర్షణ సభ’ నిర్వహిస్తోంది. ఈ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్నారు. ఆ మరుసటి రోజు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్స్‌ కాలేజీ వద్ద రాహుల్‌గాంధీ.. విద్యార్థులతో మమేకం అవుతారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ఇదివరకే తెలిపారు. అయితే ఇప్పుడు సభకు అనుమతి నిరాకరిస్తూ ఓయూ ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకుంది.

* మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వైస్‌చైర్మన్ ప్రభాకర్ దురుసుగా ప్రవర్తించాడు. టౌన్ ప్లానింగ్ అధికారి మూర్తిపై దుర్భాషలాడుతూ దాడికి యత్నించాడు. అక్రమ కట్టడాలపై ఫిర్యాదు చేస్తే తననే ఇరికిస్తావా అంటూ ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వైస్‌చైర్మన్‌ను కమిషనర్ రాంభూపాల్ రెడ్డి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ రాంబాబు అడ్డుకున్నారు. టీపీఎస్‌ను బదిలీ చేసేంతవరకు కౌన్సిల్‌ మీటింగ్‌కు రానంటూ శపథం చేసి వైస్ చైర్మన్ వాకౌట్ చేశారు. కౌన్సిల్లో అలా మాట్లాడకూడదన్నందుకు చైర్మన్ రాఘవేంద్రపైన ప్రభాకర్ అసహనం వ్యక్తం చేశారు. టీపీఎస్‌కు మద్దతిస్తారా అంటూ ఆగ్రహంగా ఆయన బయటికెళ్ళి పోయారు. ఫర్వాలేదులే అంటూ చైర్మన్ రాఘవేంద్ర ముక్తాయింపు ఇచ్చారు. వైస్‌చైర్మన్ తీరుపై మున్సిపల్ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు

*సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొమరాడ మండలం దళాయిపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోకూడదని హితవు పలికారు. వేల రూపాయిలతో ఓటు కొనుగోలు చేయటానికి కొందరు సిద్ధంగా ఉన్నారన్నారు. అంబేద్కర్ కల్పించిన ఓటనే ఆయుధంతో ప్రజలు రాజులు కావాలని జేడీ లక్ష్మీనారాయణ సూచించారు.

*వైఎస్సార్‌ సీపీ అరకు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పరీక్షిత్‌రాజు తండ్రి, మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి మామ, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖరరాజు శుక్రవారం కన్నుమూశారు. కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మూడురోజుల నుంచి విశాఖపట్నంలో ఉంటూ వైద్యసేవలు పొందుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోనే ప్రాణాలు విడిచారు

*కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మే 3న కర్ణాటకలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని బెంగళూరులో ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై ప్రకటించారు. శుక్రవారం ఢిల్లీకి బయల్దేరిన సీఎం విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడారు. ‘ఖేలో ఇండియా’ ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న అమిత్‌షాతో రాష్ట్ర రాజకీయ స్థితిగతులు, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై చర్చిస్తానన్నారు. తన ఢిల్లీ పర్యటనకు రాజకీయాలతో సంబంధం లేదని సీఎం స్పష్టం చేస్తూ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రధాన న్యాయమూర్తుల సమావేశంలో తాను కూడా పాల్గొంటానన్నారు. తగిన సమయంలో మంత్రివర్గ విస్తరణపై చర్చలకు తనను ఢిల్లీకి ఆహ్వానిస్తామని అధిష్టానం పెద్దలు స్పష్టం చేశారన్నారు.

* ఇంటర్‌ విద్యార్థులకు ఏ కళాశాల ప్రిన్సిపాల్‌ అయినా సహేతుక కారణం లేకుండా హాల్‌ టికెట్లు ఇవ్వం అంటే ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్లు 18002749868, 18005997689 అందుబాటులో ఉంచామని తెలిపారు. అలాగే, ల్యాండ్‌లైన్‌ నంబరు 08645-277705కు కూడా ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయొచ్చని పేర్కొన్నారు.

*గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల హాస్టల్‌లో జరిగిన చిన్న వాగ్వాదం ఓ విద్యార్థి గొంతు కోసేవరకు వెళ్లింది. సుమారు 18 కుట్లు వేసి చికిత్స అందించిన వైద్యులు బాలుడు క్షేమంగా ఉన్నట్లు ప్రకటించారు. గౌలిదొడ్డిలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల హాస్టల్‌లో ఈనెల 25న కొందరు సీనియర్‌ విద్యార్థులు అల్పాహారం వడ్డించారు. ఈ క్రమంలో లైన్‌లో నిలుచున్న ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థి సాత్విక్‌ చేయిపై వడ్డిస్తున్న సేమియా పడింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

*క్షేత్ర తనిఖీ (ఫిజికల్‌ వెరిఫికేషన్‌)కు తగిన విధంగా ధాన్యం నిల్వ పెట్టేవరకు ఆయా మిల్లుల బియ్యాన్ని సేకరించేది లేదని ఎఫ్‌సీఐ స్పష్టం చేసింది. మే 2 నుంచి తనిఖీ నిర్వహించాలని ఎఫ్‌సీఐ నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం సంస్థ రీజనల్‌ జనరల్‌ మేనేజర్‌ దీపక్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 2,320 మిల్లుల్లో పరిశీలనకు 62 మంది అధికారులు స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు. మే 1 సాయంత్రంలోగా వీరు జిల్లాల డీఎంలకు రిపోర్ట్‌ చేయాలని ఎఫ్‌సీఐ ఆదేశించింది. ఇప్పటికే సిద్ధమైన ప్రణాళిక ప్రకారం పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి వీరు మిల్లుల్లో ధాన్యం, బియ్యం నిల్వల వివరాలు ేసకరించనున్నారు.

* ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబమంతా హైదరాబాద్‌లోనే ఉంటోందని, ఏపీకి, తెలంగాణకి తేడా వారికి తెలుసునని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో పరిస్థితులపై కేటీఆర్‌ వ్యాఖ్యల్లో నిజముందన్నారు. విజయవాడ నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులంతా హైదరాబాద్‌ వస్తున్న విషయం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

*హైదరాబాద్‌ నగరాన్ని చూసి రాష్ట్రమంతా బాగుందని అనుకోవడం పొరపాటని, హైదరాబాద్‌ను చూసి మిడిసిపడొద్దని మంత్రి కేటీఆర్‌కు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సూచించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘కేటీఆర్‌ వ్యాఖ్యలు ఏపీని ఉద్దేశించి చేశారని అనుకుంటున్నా. ఒకవేళ ఏపీ గురించే అయితే కేటీఆర్‌ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఏపీలో పరిస్థితులను చూడడానికి నాలుగు కాదు 400 బస్సుల్లో రండి. హైదరాబాద్‌ను నిర్మించింది మీరు కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌ అభివృద్ధిలో ఆంధ్రుల పాత్ర ఎంతో ఉంది’’ అని అన్నారు. ఏపీలో విద్యుత్తు కోతలు తాత్కాలిక సమస్యనేనని, తెలంగాణలో కోతలు లేవా అని ప్రశ్నించారు

*రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు జరగకుండా నిలిచిపోయిన పలు మండల పరిషత్‌ల అధ్యక్షఉపాధ్యక్షకోఆప్షన్‌ సభ్యులతో పాటు గ్రామ పంచాయతీల ఉపసర్పంచ్‌ల ఎన్నికలను మే 5న నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మండల పరిషత్‌ ఎన్నికలకు గెజిటెడ్‌ స్థాయి అధికారిని, గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఆర్‌ఐ స్థాయి అధికారిని ఎన్నికల అధికారిగా నియమించాలని ఆదేశించారు. మే 1 లోపు ఆయా స్థానిక సంస్థలకు నోటీసులు జారీ చేయాలని, మే 5న ఎన్నికలు నిర్వహించాలని, ఆరోజు నిర్వహించలేకపోతే ఆ మరుసటి రోజు(మే6) ఉదయం 11గంటలకు ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం, కృష్ణా జిల్లా ఉంగుటూరు, పల్నాడు జిల్లా పెదకూరపాడు, నెల్లూరుజిల్లా పొదలకూరు మండలపరిషత్‌లకు అధ్యక్షులు, కోనసీమ జిల్లా రాయవరం మండలపరిషత్‌ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహించాలని ఆయా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాజమహేంద్రవరం జిల్లాలోని దేవరపల్లి, పశ్చిమగోదావరి జిల్లాలోని పోడూరు మండలాలకు మండల కోఆప్షన్‌ సభ్యులను నియమించాలని సూచించారు. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 26 గ్రామ పంచాయతీల్లో ఉప సర్పంచ్‌ల ఎన్నికలు నిర్వహించాలని మరో నోటిఫికేషన్‌ జారీచేశారు.

* ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం యూనియన్‌ బ్యాంక్‌ (ఆంధ్రాబ్యాంక్‌)లో పంట రుణాలు తీసుకున్నామని, వాటిని సకాలంలో చెల్లించినా తమ ఖాతాలో జమ కాలేదని ఖాతాదారులు శుక్రవారం బ్యాంక్‌ వద్ద ఆందోళన చేపట్టారు. రుణాలు చెల్లించినట్టు తమ వద్ద రశీదులు కూడా ఉన్నాయని బాధితులు చెబుతున్నారు. రూ.5 లక్షల చెక్కు ఇస్తే అది రిటర్న్‌ అయ్యిందని చెప్పి దానిని వేరే అకౌంట్‌కు పంపారని దేవులపల్లికి చెందిన మరో వ్యక్తి ఆరోపిస్తున్నాడు. విషయం తెలుసుకున్న యూనియన్‌ బ్యాంక్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ వెంకటేశ్వరరావు లక్కవరం బ్యాంక్‌ వద్దకు వచ్చి పరిశీలించారు. పలువురు బాధితుల నుంచి వివరాలు సేకరించారు. సోమవారానికి కల్లా పూర్తి విచారణ చేస్తామని ఆయన మీడియాకు తెలిపారు.

*తన అన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా విక్రమ్‌రెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా తన తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డితో శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వచ్చిన ఆయన సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు.

* ‘‘బతకలేక చస్తున్నాం… కారుణ్య మరణాలకు అనుమతించండి’’ అని యు-1 రిజర్వు జోన్‌ బాధిత రైతులు రాష్ట్రపతికి, ఉప రాష్ట్రపతికి శుక్రవారం లేఖలు రాశారు. రిజర్వు జోన్‌ ప్రకటించినప్పటి నుంచి పొలాలు, అమ్ముడుపోక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నామని రైతులు లేఖలో పేర్కొన్నారు. ఇంట్లో ఆడపిల్లల వివాహం, స్కూల్‌, కాలేజి ఫీజుల కోసం వైద్యానికీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులతో సహా తామందరికీ కారుణ్య మరణాలకు అనుమతి మంజూరు చేయాలని ఆ లేఖలో తాడేపల్లి, కొలనుకొండ, కుంచనపల్లి పరిధిలోని రిజర్వు జోన్‌ రైతులు పేర్కొన్నారు. గతంలో కారుణ్య మరణాలకు అనుమతి ఇవ్వాలని వారు గవర్నర్‌కు లేఖ రాసిన విషయం విదితమే. తాడేపల్లి, కుంచనపల్లి, కొలనుకొండ గ్రామాలలో సుమారు 178 ఎకరాల్లో యు-1 జోన్‌ పేరిట బ్యాన్‌ విధించడం అన్యాయమని ఆ లేఖలో పేర్కొన్నారు. దాదాపు 320 మంది సన్న, చిన్నకారు రైతు కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు

*తన అన్న మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆశయాలను కొనసాగిస్తానని ఆత్మకూరు వైసీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థిగా విక్రమ్‌రెడ్డిని పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా తన తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డితో శుక్రవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వచ్చిన ఆయన సీఎంను కలసి కృతజ్ఞతలు తెలిపారు.

*ఉపాధి కూలీపై మూడు ఎలుగుబంట్ల దాడి చేశాయి. జిల్లాలోని డిచ్‌పల్లి మండలం మాక్లూర్ తండ అటవీ ప్రాంతంలో సిర్ణపల్లి నడిపి సాయిలుపై మూడు ఎలుగుబంట్లు ఒకేసారి దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకొన్న సాయిలు గ్రామానికి చేరుకున్నాడు. ఉపాధి హామీ పథకంలో భాగంగా తునికాకు సేకరణకు అటవీ ప్రాంతానికి వెళ్లగా ఎలుగుబంట్లు దాడికి పాల్పడ్డాయి.

*తెలంగాణ సీఎస్‌పై సీజేఐ ఎన్వీ రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణలో న్యాయవ్యవస్థ సమస్యలను సీఎం, హైకోర్టు సీజే పరిష్కరించాలన్నారు. నిర్ణయాలను అమలు చేయకుండా సీఎస్‌ పెండింగ్‌లో ఉంచడంపై మండిపడ్డారు. ఈ అంశాలను న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పరిశీలిస్తామన్నారు. తమ వ్యక్తిగత పనుల కోసం అడగడం లేదని న్యాయవ్యవస్థ బలోపేతానికే నిర్ణయాలు తీసుకుంటున్నామని సీజేఐ తెలిపపారు. కోర్టుల్లో దయనీయమైన పరిస్థితులున్నాయని సీజేఐ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టుల్లో ఒక న్యాయవాది కోర్టు హాల్‌లోకి వెళ్లి..వెనక్కి వస్తే తప్ప మరొకరు వచ్చే పరిస్థితి లేదేని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు

*విద్యార్థులను చదువుతో పాటు క్రీడలలోను ప్రోత్సహించాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శనివారం వెస్ట్ మారేడ్ పల్లి లోని గ్రౌండ్ లో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్ధులు క్రీడలలో పాల్గొనడం వలన మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం పొందడమే కాకుండా ఆరోగ్యపరంగా ఎంతో దృడంగా తయారు అవుతారని లభిస్తుందచెప్పారు. తమ పిల్లలను ఈ ఉచిత శిభిరానికి పంపించడం ద్వారా ఉచిత శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

*బీజేపీ, కాంగ్రెస్ నేతల తీరుపై ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రంలో ఎమ్మెల్యేలను గెలిపించుకోలేని వ్యక్తి రాహుల్ అని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పోశమ్మ గుడిలో పొట్టేలును కట్టేసినట్టు ఉంటాడని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు ఉత్తరాది సంస్కృతిని తీసుకువస్తున్నారని బాల్క సుమన్ విమర్శించారు. మంత్రి ప్రశాంత్రెడ్డి మాట్లాడుతుంటే అడ్డుకున్నారన్నారు. జబర్దస్త్లో కమెడియన్లా బండి సంజయ్ మారాడని ఎద్దేవా చేశారు. మేము తలచుకుంటే మీ కిషన్ రెడ్డి బయట తిరగలేడని హెచ్చరించారు. బీజేపీది ప్రజా సంగ్రామ యాత్ర కాదని.. పాపాల యాత్ర అని బాల్క సుమన్ విమర్శించారు.

*నెల్లూరు జిల్లాలో హైఎండ్‌ అల్యూమినియం అల్లాయ్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు సత్వరమే కృషి చేస్తామని ఏపీఐఐసీ ఎండీ సుబ్రమణ్యం జవ్వాది తెలిపారు. కొడవలూరు మండలం బొడ్డువారిపాలెంలో ఏర్పాటు చేయనున్నట్టు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అక్కడ ఉత్కర్ష పరిశ్రమ 5,500 కోట్ల రూపాయల వ్యయంతో ఏడాదికి 60 వేల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేసే ప్రాజెక్టుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్నారు.

*ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) 2021-22 నివేదికను హక్కుల కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ మంథాత సీతారామమూర్తి అందజేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కమిషన్‌ సభ్యుడు దండే సుబ్రహ్మణ్యం, గోచిపాత శ్రీనివాసరావులతో పాటు జస్టిస్‌ మంథాత సీతారామమూర్తి.. సీఎంను కలిశారు. ఈ సందర్భంగా గోచిపాత శ్రీనివాసరావు రచించిన యాంటీ కరపక్షన్‌ ఏజెన్సీస్‌ పుస్తకాన్ని సీఎం జగన్‌ ఆవిష్కరించారు. కమిషన్‌ చైర్మన్‌తో పాటు .. హెచ్‌ఆర్‌సీఈ సీఈవో, సెక్రటరీ ఎస్‌వి రమణమూర్తి, కమిషన్‌ అధికారులు బొగ్గరం తారక నరసింహకుమార్‌, కె.రవికుమార్‌ ఉన్నారు.

*మే 27, 28 తేదీల్లో ఒంగోలు సమీపంలోని త్రోవగుంటలో జాతీయ రహదారి పక్కన 80 ఎకరాల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. టీడీపీ పసుపు పండుగకు రాష్ట్రం నలుమూలల నుంచి లక్ష మంది హాజరవుతారని చెప్పారు. అందుకు తగ్గట్లుగా ఏర్పాటు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. శుక్రవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో పార్టీ సీనియర్‌ నేతలతో మహానాడు ఏర్పాట్లపై సమీక్షించారు. మహానాడు నిర్వహణ కోసం మొత్తం 15 కమిటీలు వేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మే 27న తొలి రోజు నిర్వహించే ప్రతినిధుల సభకు 10 వేల మంది హాజరవుతారు. 28న మధ్యాహ్నం 3 గంటలకు మహానాడు ప్రారంభమౌతుంది. ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాలు, పార్టీ 40వ ఆవిర్భావ వేడుకలు ఒకేసారి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్‌ జీవిత విశేషాలతో కూడిన ఫోటో ఎగ్జిబిషన్‌ను మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

*హైదరాబాద్‌ నగరాన్ని చూసి రాష్ట్రమంతా బాగుందని అనుకోవడం పొరపాటనిహైదరాబాద్‌ను చూసి మిడిసిపడొద్దని మంత్రి కేటీఆర్‌కు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ సూచించారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ వ్యాఖ్యలు ఏపీని ఉద్దేశించి చేశారని అనుకుంటున్నా. ఒకవేళ ఏపీ గురించే అయితే కేటీఆర్‌ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి. ఏపీలో పరిస్థితులను చూడడానికి నాలుగు కాదు బస్సుల్లో రండి. హైదరాబాద్‌ను నిర్మించింది మీరు కాదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌ అభివృద్ధి చెందింది. హైదరాబాద్‌ అభివృద్ధిలో ఆంధ్రుల పాత్ర ఎంతో ఉందిఅని అన్నారు. ఏపీలో విద్యుత్తు కోతలు తాత్కాలిక సమస్యనేననితెలంగాణలో కోతలు లేవా అని ప్రశ్నించారు.

*తన జీవిత చరమాంకాన్ని ఆరోగ్య రంగానికి అం కితమిస్తున్నానని ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా ప్రకటించారు. గురువారం అసోంలో ప్రధాని మోదీతో కలిసి ఆయన 7 క్యాన్సర్‌ ఆస్పత్రుల ను ప్రారంభించారు. మరో 7 ఆస్పత్రులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రతన్‌ టాటా మాట్లాడారు. గతంలో అసోంలో క్యాన్సర్‌ చికిత్స కోసం అత్యాధునిక వైద్య సదుపాయాలు లేవని, ప్రస్తుతం ఆ వసతులు అందుబాదులోకి వచ్చాయని తెలిపారు.