Movies

ఇంత కామెడీ ఎప్పుడూ చేయలేదు

ఇంత కామెడీ ఎప్పుడూ చేయలేదు

‘ఎఫ్‌ 2’లో హనీగా ఆకట్టుకొంది మెహరీన్‌. ‘హనీ ఈజ్‌ ద బెస్ట్‌’ అంటూ వెరైటీ మేనరిజంతో నవ్వించింది. ‘ఎఫ్‌ 3’లో అంతకు మించిన కామెడీ చేస్తానంటోంది మెహరీన్‌. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా నటించారు. దిల్‌ రాజు నిర్మాత. మే 27న విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మెహరీన్‌ మాట్లాడుతూ ‘‘ఎఫ్‌ 2లో ప్రతి పాత్ర నవ్వించేదే. నేను కూడా తొలిసారి కామెడీ చేశాను. ‘ఎఫ్‌ 3’లో అంతకు మించిన వినోదం ఉంటుంది. నేనింత కామెడీ ఎప్పుడూ చేయలేదు. పాటలకు మంచి స్పందన వస్తోంది. ‘ఊ.. ఆ.. ఆహా..’ పాట మంచి జోష్‌తో సాగుతుంది. థియేటర్లో ఈ పాటకు ప్రేక్షకులు ఊగిపోతారు. దేవిశ్రీ ప్రసాద్‌ ట్యూన్‌ అంత హుషారు అందిస్తుంది. నా కెరీర్‌లో గుర్తుండిపోయే మరో సినిమా అవుతుంద’’న్నారు.