Business

కొత్త మోడల్ Poco M4 5G ఫోన్ విడుదల – TNI వాణిజ్య వార్తలు

కొత్త మోడల్ Poco M4 5G ఫోన్ విడుదల  – TNI వాణిజ్య వార్తలు

*చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ పోకో తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లతో కొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత మార్కెట్‌లో పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. భారత మార్కెట్‌లో పోకో ఎం4 5జీ స్మార్ట్‌ఫోన్ ధరలు ఇలా ఉన్నాయి. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ. 12,999, 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ రూ.14,999 ఉంటుంది. ఫోన్లను కొనుగోలు చేసిన ఎస్‌బీఐ కస్టమర్లకు తక్షణ డిస్కౌంట్ రూ. 2000 వరకు లభిస్తోందని కంపెనీ తెలిపింది. మే 5 నుంచి ఫోన్ల అమ్మకాలు ప్రారంభమవుతాయని సంస్థ తెలిపింది. ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఫోన్లను కొనుగోలు చేయవచ్చు.
* రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి రెండు మెగా ఐపీఓలు రాబోతున్నాయి. ఐపీఓ ద్వారా రిలయన్స్‌ జియో రూ.50,000 కోట్లు, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ రూ.75,000 కోట్ల సమీకరణకు రిలయన్స్‌ అధినేత ముకేవ్‌ అంబానీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆర్‌ఐఎల్‌ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం)అంబానీ ఈ రెండు మెగా ఐపీఓల వివరాలు ప్రకటిస్తారని మార్కెట్‌ వర్గాల అంచనా.
*కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవే టు రంగానికి అమ్మేసింది. హెలికాప్టర్‌ సేవల సంస్థ పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌ (పీహెచ్‌ఎల్‌) ఈక్విటీలో 51 శాతం వాటాను స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విక్రయించింది. మొత్తం మూడు కంపెనీల నుంచి బిడ్స్‌ వస్తే అందులో స్టార్‌9 మొబిలిటీ కంపెనీ అత్యధికంగా రూ.211.14 కోట్లతో పవన్‌ హన్స్‌ను దక్కించుకుంది. కంపెనీ ఈక్విటీలో ఓఎన్‌జీసీకి ఉన్న 49 శాతం వాటానూ స్టార్‌ మొబిలిటీ ఇదే ధరతో కొనుగోలు చేయనుంది. ఓఎన్‌జీసీతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు పవన్‌ హన్స్‌ హెలికాప్టర్‌ సేవలు అందిస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ కంపెనీ నష్టాల్లో ఉండడంతో ప్రభుత్వం దీన్ని అమ్మకానికి పెట్టింది.
*రెయిన్‌బో హాస్పిటల్స్‌ బ్రాండ్‌తో మల్టీ స్పెషాలిటీ పిల్లల ఆసుపత్రులను నిర్వహిస్తున్న రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకు మంచి స్పందన లభించింది. ఇష్యూ శుక్రవారంతో ముగిసింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 2,05,14,617 షేర్లను విక్రయించాలని నిర్ణయించగా.. 25,49,03,787 (25.49 కోట్లు) షేర్లకు బిడ్లు దాఖలైనట్లు రెయిన్‌బో హాస్పిటల్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ కంచర్ల తెలిపారు. అంటే 12.43 రెట్లు అధికంగా ఇష్యూకు స్పందన లభించింది. అర్హులైన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) విభాగంలో 38.9 రెట్ల షేర్లకు దరఖాస్తు చేశారు. ఈ విభాగంలో 57,75,605 షేర్లుండగా.. 22,46,97,591 షేర్లకు దరఖా స్తు చేశారు. కార్పొరేట్‌ కంపెనీల వంటి సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 3.73 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది.
*కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవే టు రంగానికి అమ్మేసింది. హెలికాప్టర్‌ సేవల సంస్థ పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌ (పీహెచ్‌ఎల్‌) ఈక్విటీలో 51 శాతం వాటాను స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విక్రయించింది. మొత్తం మూడు కంపెనీల నుంచి బిడ్స్‌ వస్తే అందులో స్టార్‌9 మొబిలిటీ కంపెనీ అత్యధికంగా రూ.211.14 కోట్లతో పవన్‌ హన్స్‌ను దక్కించుకుంది. కంపెనీ ఈక్విటీలో ఓఎన్‌జీసీకి ఉన్న 49 శాతం వాటానూ స్టార్‌ మొబిలిటీ ఇదే ధరతో కొనుగోలు చేయనుంది. ఓఎన్‌జీసీతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు పవన్‌ హన్స్‌ హెలికాప్టర్‌ సేవలు అందిస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ కంపెనీ నష్టాల్లో ఉండడంతో ప్రభుత్వం దీన్ని అమ్మకానికి పెట్టింది.
*పారిశ్రామికోత్పత్తికి కీలకమైన ఎనిమిది రంగాలకు ప్రాతినిథ్యం గల ఇన్‌ఫ్రా వృద్ధిరేటు మార్చి 31వ తేదీతో ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరంలో 10.4 శాతంగా నమోదయింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో ఈ రంగం మైనస్‌ 6.4 శాతం ప్రతికూల వృద్ధిని సాధించింది. కాగా మార్చి నెలలో మాత్రం ఈ రంగం వృద్ధి 4.3 శాతానికి మందగించింది. గత ఏడాది మార్చిలో నమోదైన వృద్ధి 12.6 శాతం.
*కొవిడ్ మహమ్మారి మిగిల్చిన నష్టాలను అధిగమించేందుకు భారత ఆర్థిక వ్యవస్థకు 12 ఏళ్ల సమయం పడుతుందని కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ అంచనా వేసింది. కరెన్సీ అండ్ ఫైనాన్స్ ఫర్ ది ఇయర్ 2021-22 పేరిట శుక్రవారం ఒక రిపోర్ట్‌ను విడుదల చేసింది. కరోనా సంక్షోభం ఆర్థిక వ్యవస్థలో చరిత్రాత్మక మార్పులు తీసుకొచ్చిందని వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ప్రవేశపెడుతున్న సంస్కరణలకు కొవిడ్ సంక్షోభం ఒక ఉత్ప్రేరకంగా పనిచేసిందని పేర్కొంది. కరోనా కాలంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు మధ్యకాలికంలో వృద్ధి మెరుగుదలకు తోడ్పడతాయని ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే కొవిడ్ కారణంగా ఆర్థిక సంవత్సరం 2020-21లో రూ.19.1 లక్షల కోట్లు, 2021-22లో రూ.17.1 లక్షల కోట్లు, 2022-23లో రూ.16.4 లక్షల కోట్ల చొప్పున ఉత్పత్తి నష్టం జరుగుతుందని లెక్కగట్టింది.
*భారతదేశంలోని అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారులలో ఒకటైన టాటా స్టీల్, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం మే 3 జరగనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఒక్కొక్కటి రూ. 10/- ముఖవిలువ కలిగిన స్టాక్ స్ప్లిట్‌ విషయమై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. మార్చి 31, 2022 ముగిసిన 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫలితాలను ఈ సమావేశంలో వెల్లడించనున్నారు. ఇదిలా ఉంటే… షేర్ల స్ల్పిట్టింగ్ విషయమై వాటాదారుల్లో గత కొద్దిరోజులుగా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. షేర్ల స్ల్పిట్టింగ్ సహా ఇతరత్రా ముఖ్యమైన అంశాలకు సంబంధించి అదే రోజు ప్రకటన వెలువడనున్నట్లు భావిస్తున్నారు.
*అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాల నేపథ్యంలో దలాల్‌స్ట్రీట్‌ వర్గాలు ఎఫ్‌ఎంసీజీ, ఇంధనం, ఐటీ, బ్యాంక్‌ రంగ షేర్లలో కొనుగోళ్లు పెంచారు. దాంతో సెన్సెక్స్‌ 701.67 పాయింట్ల లాభంతో 57,521.06 వద్ద ముగిసింది. నిఫ్టీ 206.65 పాయింట్లు బలపడి 17,245.05 వద్దకు చేరుకుంది. సెన్సెక్స్‌లోని 30 కంపెనీల్లో 26 లాభపడ్డాయి. హిందుస్తాన్‌ యూనిలీవర్‌ షేరు 4.55 శాతం లాభంతో సూచీ టాప్‌ గెయినర్‌గా నిలిచింది. సూచీలో అత్యధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు 1.49 శాతం పెరగడంతో కంపెనీ మార్కెట్‌ విలువ తొలిసారిగా రూ.19 లక్షల కోట్ల ఎగువకు చేరుకుంది.
*భారత్‌లో మార్చి త్త్రైమాసికంలో GOLD DEMAND భారీగా తగ్గింది. రేట్లు ఎక్కువగా ఉండడం, బంగారం కొనుగోలుకు సంబంధించిన శుభప్రదమైన రోజులు పెద్దగా లేకపోవడంతో కూడా డిమాండ్ తగ్గుదలకు కారణమైందని WORLD GOLD COUNCIL రిపోర్ట్ పేర్కొంది. 2022 FIRST QUARTERలో బంగారం డిమాండ్ 18 శాతం మేర తగ్గి 135.5 టన్నులకు పడిపోయింది. ఇక దేశంలో నగల డిమాండ్‌దీ అదే పరిస్థితి. 26 శాతం మేర క్షీణించి 94.2 టన్నులకు తగ్గిపోయిందని రిపోర్ట్ ప్రస్తావించింది. ఏడాది ప్రాతిపదికన ఈ తగ్గుదల నమోదయినట్టు రిపోర్ట్ విశ్లేషించింది
*గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి రూ.232 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.297 కోట్లతో పోలిస్తే 22 శాతం క్షీణించింది. సమీక్ష త్రైమాసికానికి మొత్తం ఆదాయం స్వల్పంగా పెరిగి రూ.1,416.45 కోట్ల నుంచి రూ.1,426.12 కోట్లకు చేరిందని కంపెనీ వెల్లడించింది. 2021.22 ఏడాదికి రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.1.2 (60ు) మధ్యంతర డివిడెండ్‌ను కంపెనీ బోర్డు సిఫారసు చేసింది. గత ఏడాది మొత్తానికి రూ.4,950.87 కోట్ల ఆదాయంపై రూ.832.23 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్లు లారస్‌ ల్యాబ్స్‌ ఈడీ, సీఎ్‌ఫఓ వీవీ రవి కుమార్‌ వెల్లడించారు.