DailyDose

పెరుగుతున్న గృహ హింస!

పెరుగుతున్న గృహ హింస!

మహిళలపై వేధింపులు పెరుగుతున్నట్టు పోలీసులకు అందుతున్న ఫిర్యాదుల గణాంకాలు చెబుతున్నాయి. కుటుంబంలో ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఇతరాలేవైనా అవి వారిపై వేధింపులకు, దాడులకు దారితీస్తున్నాయి. గతనెలలో (మార్చిలో) గృహహింస, మహిళలపై వేధింపులకు సంబంధించి డయల్‌ 100, ఇతర మార్గాల ద్వారా పోలీసులకు అందిన ఫిర్యాదులే ఇందుకు నిదర్శనం. డయల్‌ 100, ఎమర్జెన్సీ టెలిఫోన్‌ నంబర్‌ 112కు వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే మొత్తం ఫిర్యాదుల్లో 50.24 శాతం గృహహింసకు సంబంధించినవి కాగా, 28.62 శాతం మహిళలపై దాడులకు సంబంధించినవి.

మార్చి 1 నుంచి మార్చి 31 వరకు మహిళలపై నేరాలకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా 25,756 ఫిర్యాదులు అందినట్టు పోలీస్‌ అధికారులు తెలిపారు. డయల్‌ 100, 112 నంబర్లకు వచ్చిన ఫిర్యాదులను ఆయా పోలీస్‌ స్టేషన్ల వారీగా విభజిస్తున్నారు. అదేవిధంగా ఫిర్యాదు చేసిన మహిళలతో పోలీస్‌శాఖ తరఫున పనిచేసే కౌన్సిలర్లు ఆన్‌లైన్‌లో మాట్లాడి కౌన్సిలింగ్‌ ఇస్తున్నారు. సమస్య తీవ్రతను బట్టి మహిళా పోలీస్‌ స్టేషన్లు, స్థానిక పోలీస్‌ స్టేషన్లకు పిలిపిస్తున్నారు.

విద్యావంతులు, ఉద్యోగస్థులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే మహిళలపై ఎక్కువగా వేధింపులు జరుగుతుండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న ఫిర్యాదులలో ఎక్కువశాతం కేసులు హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ పోలీస్‌ కమిషనరేట్ల పరిధిలో ఉన్నాయి. ఇందుకు నగర, పట్టణ ప్రాంతాల్లో మహిళలు చైతన్యవంతంగా ఉండడంతో వారు ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడం కూడా ఈ సంఖ్య పెరుగుదలకు కారణమని పోలీసు అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌ నగరంలో అత్యంత సంపన్నులు ఉండే ప్రాంతమైన వెస్ట్‌జోన్‌ నుంచి 1331 ఫిర్యాదులు అందాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ మొత్తం కలిపి 3931 ఫిర్యాదులు అందాయి. ఇక సాఫ్ట్‌వేర్‌ కంపెనీ లు, ఇతర ఎంఎన్‌సీ కంపెనీలు ఉన్న ప్రాంతమైన సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో ఒక్క మార్చిలోనే 4158 ఫిర్యాదులు అందాయి. వీటిలో గృహహింసకు సంబంధించినవి 2052 కాగా, ఇతర దాడులకు సం బంధించినవి 1123 ఉన్నాయి. ఇవి కాకుండా అదనపు కట్నం కోసం వేధింపులు, వరకట్న మరణాలు, లైంగికదాడులు, మహిళల అక్రమ రవాణా, లైంగిక వేధింపులు, ఈవ్‌ టీజింగ్‌ కేసులు ఉంటున్నాయి.

చిన్నారులకు సంబంధించిన కేసులు
చిన్నారుల కిడ్నాప్‌, మిస్సింగ్‌కు సంబంధించిన కాల్స్‌ 39.3%
పిల్లలపై క్రూరత్వానికి సంబంధించిన కేసులు 33.5%
బాల్య వివాహాలకు సంబంధించినకేసులు 13.4%
618 చిన్నారులపై వేధింపులు, హింస, వారిపై క్రూరత్వం చూపడం వంటి కారణాలపై డయల్‌ 100, డయల్‌ 112 నంబర్లకు
మార్చి నెలలో వచ్చిన మొత్తం పోలీసు అధికారులకు అందిన ఫిర్యాదులు