Politics

యూరోప్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది – TNI రాజకీయ వార్తలు

యూరోప్ అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది – TNI రాజకీయ వార్తలు

* యూరోపు దేశాలు అనేక సవాళ్లతో సతమతమవుతున్న సమయంలో తాను డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్ పర్యటనకు వెళ్తున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. మే 2న ఆయన ఈ పర్యటనకు బయల్దేరుతారు. ఈ ఏడాది ఆయన తొలి విదేశీ పర్యటన ఇదే. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో యూరోపులో రాజకీయ పరిస్థితులు మారుతున్న సంగతి తెలిసిందే. మోదీ విడుదల చేసిన ప్రకటనలో, ఐరోపాకు ప్రస్తుతం అనేక సవాళ్ళు, చాయిస్‌‌లు ఉన్నాయని, అటువంటి సమయంలో తాను ఆ ప్రాంతంలో పర్యటించబోతున్నానని తెలిపారు. శాంతి, సౌభాగ్యాల కోసం భారత దేశం అన్వేషిస్తోందని, దీనిలో యూరోపియన్ భాగస్వాములు చాలా ముఖ్యమైన సహచరులని తెలిపారు. అటువంటి యూరోప్ దేశాలతో సహకార స్ఫూర్తిని బలోపేతం చేసుకోవడానికి తాను డెన్మార్క్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల్లో పర్యటిస్తున్నానని తెలిపారు. మోదీ పర్యటనలో ముందుగా మే 2న జర్మనీ వెళ్తారు. German Chancellor Olaf Scholzతో బెర్లిన్‌లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇరువురు కలిసి ఇండియా-జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్‌ (ఐజీసీ)కి సహాధ్యక్షత వహిస్తారు. జర్మనీలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే ఈ ఐజీసీ జరుగుతుండటం పట్ల మోదీ హర్షం ప్రకటించారు. మధ్యకాలిక, దీర్ఘకాలిక ప్రాధాన్యాలను గుర్తించేందుకు ఇది దోహదపడుతుందన్నారు. India, Germany మంత్రులు కూడా చర్చలు జరుపుతారు. మే 3న Denmarkలోని కోపెన్‌హాగన్‌లో మోదీ పర్యటిస్తారు. ఆ దేశ ప్రధాని మెట్టె ఫ్రెడెరిక్సెన్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇండియా-నోర్డిక్ రెండో సదస్సులో ఆయన పాల్గొంటారు. ఐస్‌లాండ్ ప్రధాన మంత్రి కట్రిన్ జాకబ్స్‌డొట్టిర్, నార్వే పీఎం జోనాస్ గహ్ర్ స్టోర్, స్వీడర్ పీఎం మగ్ధలీనా ఆండర్సన్, ఫిన్లాండ్ ప్రధాని సన్న మారిన్‌లతో కూడా చర్చలు జరుపుతారు. ఈ దేశాలనే నోర్డిక్ దేశాలు అంటారు. ఇండియా-డెన్మార్క్ బిజినెస్ రౌండ్ టేబుల్‌లో పాల్గొంటారు. డెన్మార్క్‌లోని భారత సంతతి ప్రజలను కూడా కలుస్తారు

*జగన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం లేదు:
సీఎం జగన్‌రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం లేదని కాంగ్రెస్ నేత శైలజానాథ్ ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో పోలీస్ రాజ్యం నడుస్తోందన్నారు. దివ్యాంగురాలికి పెన్షన్ రాలేదని అడిగితే.. వారిపైనే కేసులు నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. వైసీపీ నేతపై కేసు పెట్టేందుకు వచ్చిన వ్యక్తిని ఎస్ఐ కొట్టడమే కాకుండా బూతులు తిడతారా అని నిలదీశారు. పీఎస్‌లకు వెళ్లాలంటేనే సామాన్యులు భయపడుతున్నారని, ఏపీలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా? అని శైలజానాథ్ ప్రశ్నించారు.

*ఉమ్మడి పౌరస్మృతి కాదు, ఉపాధి అవకాశాలు సృష్టించండి: ఒవైసీ
బీజేపీ నేతలు తరచు మాట్లాడుతున్న ఉమ్మడి పౌరస్మృతి అవసరం ఇప్పుడు ఎంతమాత్రం లేదని, ఆర్థిక వృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనపై ముందు దృష్టి సారించాలని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఏఐఎంఐఎం ఔరంగాబాద్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి హాజరైన ఒవైసీ మీడియాతో మాట్లాడుతూ, ఉమ్మడి పౌర స్మృతి (యూనిఫాం సివిల్ కోడ్) తెస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, పలువురు బీజేపీ నేతలు చెబుతున్నారని, ఇప్పటికిప్పుడు దేశానికి యూసీసీ అవసరం ఎంతమాత్రం లేదని అన్నారు

*తెలుగు సినీ రంగానికి ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు- కిషన్ రెడ్డి
తెలుగు సినీ రంగానికి ప్రపంచంలో అద్భుతమైన గుర్తింపు వచ్చిందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు వెనుక దర్శక నిర్మాతలు, నటీనటులతోపాటు కార్మికుల కృషి ఎంతో వుందన్నారు. ప్రధాని మోదీ కూడా తెలుగు సినిమా ప్రాధాన్యతను ప్రశంసించారని గుర్తు చేశారు. ఇప్పుడు మన నటీనటులను పొరుగు రాష్ట్రాల వాళ్లు అనుసరిస్తున్నారని పేర్కొన్నారు. సినీ రంగంలోని 24 విభాగాలు కరోనా వల్ల చాలా ఇబ్బందిపడ్డారు. కరోనా వల్ల పర్యాటక, సినీ రంగాలు చాలా నష్టపోయాయని మంత్రి పేర్కొన్నారు. వ్యాక్సిన్ రావడం వల్ల మళ్లీ పర్యాటక, సినీ రంగాలు నిలదొక్కుకున్నాయని చెప్పారు.కార్మికుల సంక్షేమం కోసం రాజకీయాలకు అతీతంగా ఆలోచన చేయాలని మంత్రి తెలిపారు.తెలుగు సినీపరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపు వెనక దర్శక, నిర్మాతలతో పాటు కార్మికుల కృషి ఎంతో ఉందని కిషన్‌రెడ్డి అన్నారు

*జగన్ అన్న వస్తున్నాడు.. కార్లు జాగ్రత్త: జనసేన
తిరుపతి నగరంలో జనసేన వినూత్న నిరసన వ్యక్తం చేస్తోంది. ఒక బ్యానర్ ఏర్పాటు చేసుకుని ‘జగన్ అన్న వస్తున్నాడు.. కార్లు జాగ్రత్త’ అంటూ ఫ్లెక్సీ పెట్టి నాయకులు నిరసన వ్యక్తం చేస్తూ..దండోరా వేస్తున్నారు. ఈ సందర్భంగా జనసేన నేతలు ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ రెండు, మూడు రోజుల్లో సీఎం జగన్ తిరుపతి పర్యటనకు వస్తున్నారని, కాన్వాయ్‌లకు సంబంధించి ట్రాన్స్‌ పోర్టుకు ఇప్పటికే దాదాపు రూ. 2 కోట్లు బకాయి ఉన్నారని, దీంతో ట్రాన్స్ పోర్టు వాహనాలు పెట్టే పరిస్థితి లేదని అన్నారు. మొన్న ఒంగోలులో చేసినట్లు తిరుపతిలో ఉన్న స్థానికుల వాహనాలు తీసుకుని, కాన్వాయ్‌లుగా వాడుకునే అవకాశముందని, అందుకే ముందు జాగ్రత్తగా హెచ్చరికలు చేస్తున్నామని అన్నారు. మోటారు ఫీల్డుకు చెందినవారు తమ తమ కార్లకు తాళాలు వేసుకోవాలని చెబుతున్నామని, అలాగే 4, 5 తేదీల్లో తిరుపతికి వచ్చే భక్తులు కూడా కార్లలో రావద్దని జనసేన నేతలు సూచించారు

*చట్టానికి ఎవరూ అతీతులు కారు: వనిత
చట్టానికి ఎవరూ అతీతులు కారని హోం మంత్రి వనిత తెలిపారు. ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ హత్యకి ఎవరైతే ప్రేరేపించారో వారికి తప్పకుండా శిక్ష ఉంటుందని చెప్పారు. హత్య ఘటన చాలా దారుణమన్నారు. తల్లి, ఆడబిడ్డలకు రక్షణ ఇవ్వాలన్నారు. బిడ్డలపై ఎలాంటి అఘాయిత్యాలు జరగకుండా చూసుకోవాలని వనిత పేర్కొన్నారు. తల్లి పాత్ర సరిగా పోషించకుండా పోలీసులదే బాధ్యతంటూ తోసివేయడం సరికాదని వనిత అన్నారు

*పాలకుర్తి సుందరీకరణకు సహకరించాలి: మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా పాలకుర్తి కేంద్రంలో ప్రధాన కూడలి, రోడ్డు వెడల్పు, సుందరీకరణ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం వివిధ పార్టీలు, వ్యాపార వర్గాలు, ప్రజలతో కలిపి పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పాలకుర్తి సుందరీకరణకు అందరూ సహకరించాలని కోరారు. అత్యంత వెడల్పైన రోడ్లు అభివృద్ధికి నిదర్శనంగా పాలకుర్తి నిలుస్తుందన్నారు. సువిశాలమైన రోడ్లు సుందరీకరణ కు అస్కారమిస్తాయని అన్నారు.సిద్దిపేట తర్వాత అంత విశాలమైన రోడ్లు పాలకుర్తి నియోజకవర్గంలోనే ఉన్నాయి.పాలకుర్తి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని అన్నారు. మొదట్లో కొంత ప్రతిఘతన వచ్చినప్పటికీ ప్రజలు అన్నీ అర్థం చేసుకున్నారని, విగ్రహాలను తొలగించాలని మాకు లేదు.ప్రముఖుల విగ్రహాలు మనకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు. అయితే, పాలకుర్తి ప్రధాన కూడలిలోని విగ్రహాలను శాశ్వతంగా తొలగించడం లేదని,తాత్కాలికంగా జరిపామని చెప్పారు. త్వరలోనే వాటిని సముచిత స్థానం లో ఏర్పాటు చేస్తామని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. రాజీవ్ గాంధీ మాజీ ప్రధాన మంత్రి అని ఆయనంటే అందరికీ గౌరవమేనని చెప్పారు.రాజీవ్ విగ్రహం తో పాటు అదే స్థానంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి అర్ అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ప్రధాన కూడలిలో ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. రోడ్ల వెడల్పు సుందరీకరణ కు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవివిధ పార్టీ ల ప్రతినిధులు తమ అభిప్రాయాలు తెలిపారు. వాళ్లకు మంత్రి సమాధానమిచ్చారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, స్థానికంగా వివిధ పార్టీల నేతలు, వ్యాపారులు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు

*పాలకుర్తి సుందరీకరణకు సహకరించాలి: మంత్రి ఎర్రబెల్లి
జనగామ జిల్లా పాలకుర్తి కేంద్రంలో ప్రధాన కూడలి, రోడ్డు వెడల్పు, సుందరీకరణ కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం వివిధ పార్టీలు, వ్యాపార వర్గాలు, ప్రజలతో కలిపి పంచాయితీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. పాలకుర్తి సుందరీకరణకు అందరూ సహకరించాలని కోరారు. అత్యంత వెడల్పైన రోడ్లు అభివృద్ధికి నిదర్శనంగా పాలకుర్తి నిలుస్తుందన్నారు. సువిశాలమైన రోడ్లు సుందరీకరణ కు అస్కారమిస్తాయని అన్నారు.సిద్దిపేట తర్వాత అంత విశాలమైన రోడ్లు పాలకుర్తి నియోజకవర్గంలోనే ఉన్నాయి.పాలకుర్తి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమని అన్నారు. మొదట్లో కొంత ప్రతిఘతన వచ్చినప్పటికీ ప్రజలు అన్నీ అర్థం చేసుకున్నారని,విగ్రహాలను తొలగించాలని మాకు లేదు.ప్రముఖుల విగ్రహాలు మనకు స్ఫూర్తి దాయకంగా నిలుస్తాయని మంత్రి పేర్కొన్నారు.

*వరి వేస్తే ఉరే అని చెప్పిన సీఎం లాంటి వ్యక్తి దేశంలోనే లేరు: ఈటల
కోటి ఎకరాల మాగాణికి నీళ్లు రావట్లేదని, వరి వేస్తే ఉరే అని చెప్పిన సీఎం కేసీఆర్ లాంటి వ్యక్తి దేశంలోనే లేరని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన హుజురాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ 40 కిలోల బస్తాకి 43 కిలోల తూకం వేస్తున్నారని, ఓ చేత్తో రైతుబంధు ఇచ్చి.. మరో చేత్తో దోచుకుంటున్నారని ఆరోపించారు. యాదగిరిగుట్టపై పార్కింగ్ పేరుతో దోపిడీ చేస్తున్నారని విమర్శించారు. ప్రగతిభవన్‌లో కూర్చుని ఇతర రాష్ట్రాలను విమర్శిస్తున్నారని ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

*దేశద్రోహం చట్టం మార్చాలి: సీపీఐ నారాయణ
దేశద్రోహం చట్టం మార్చాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోర్టు ధిక్కరణకు పాల్పడేవారిలో సీఎం జగన్‌, తెలంగాణ సీఎస్ ఉన్నారన్నారు. ఎయిర్ పోర్టు, పోర్టుల ద్వారా స్మగ్లింగ్ కోసం అదానీకి కట్టబెఢుతున్నారని విమర్శించారు. నరేంద్ర మోదీ వల్ల ప్రజాస్వామ్యానికి ప్రమాదం వచ్చిందన్నారు. తెలుగు రాష్ట్రాల సీఎంలు అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. ప్రధానికి సీఎం కేసీఆర్ భయపడుతున్నారని, జగన్‌ కట్టుబానిసయ్యారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు పిసినారి అని, ఆయన్ను తానెలా నమ్ముతానని నారాయణ వ్యాఖ్యానించారు.

* బాలినేని తగ్గడం వల్లే మళ్లీ పదవి: ఆదిమూలపు
తనకు కేటాయించిన శాఖ తన నియోజకవర్గానికి ఎంత ఉపయోగపడుతుందో తెలియదని, ఇదే విషయాన్ని ముఖ్యమంత్రితోనూ తాను అన్నానని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో అయిదుసార్లు ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి రెండడుగులు వెనక్కి తగ్గడం వల్లే తనకు రెండోసారి మంత్రి పదవి దక్కిందన్నారు.

*కార్మిక కోడ్‌లను మార్చే కుట్ర: భట్టి
దేశంలో నాలుగు కార్మిక కోడ్‌లను మార్చేందుకు మోదీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను మేడే స్ఫూర్తితో తిప్పి కొట్టాలని కార్మిక వర్గానికి సీఎల్పీ నేత భట్టివిక్రమార్క పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతున్న కాంగ్రెస్‌ పార్టీతో కలిసి రావాలని ఆయన కోరారు. ఉపాధి హామీ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్న బీజేపీ సర్కారుకు బుద్థి చెప్పడానికి వ్యవసాయ కూలీలు ఉద్యమాలకు సిద్ధం కావాలని శనివారం ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని ముస్లిం వర్గాలకు ఇచ్చిన హామీలను కప్పి పుచ్చడం కోసం సీఎం కేసీఆర్‌ ఈ వర్గాల్లో భయాందోళనలను సృష్టిస్తున్నారని కాంగ్రెస్‌ నేత షబ్బీర్‌ అలీ అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్‌ విందులో మైనార్టీ యువతకు రుణాలు, ఉద్యోగాల కల్పన, 12 శాతం రిజర్వేషన్‌ సహా ఎన్నికల హామీలను ఎందుకు ప్రస్తావించలేదని ఓ ప్రకటనలో ప్రశ్నించారు..

*ఉద్యోగార్థులకు పుస్తకాలూ అందట్లేదు: రేవంత్‌
రాష్ట్రంలో ఉద్యోగార్థులకు అవసరమైన ప్రాథమిక పుస్తకాలనూ ప్రభుత్వం అందించలేకపోతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. వాటి కోసం రోజూ తెలుగు అకాడమీ వెలుపల అభ్యర్థులు క్యూ కట్టాల్సి వస్తోందని వెల్లడించారు. ఇది తెలుగు మీడియం స్టడీ మెటీరియల్‌ కొరతను, ప్రభుత్వ అసమర్థతను తెలియజేస్తోందని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఉద్యోగార్థులకు కొలువులు ఇవ్వట్లేదని, పోటీ పరీక్షలకు సిద్ధమూ చేయించలేకపోతున్నారని అన్నారు. ఈ సంక్షోభాన్ని వెంటనే పరిష్కరించాలని రేవంత్‌ ట్వీట్‌ చేశారు.

*కేసీఆర్‌ కబంధహస్తాల్లో తెలంగాణ: ఠాగూర్‌
సీఎం కేసీఆర్‌ కుటుంబ కబంధ హస్తాల్లో తెలంగాణ చిక్కుకుందని రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ అన్నారు. ఆ కుటుంబం నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పిస్తామని చెప్పారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ముఖ్యఅతిథిగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఈ నెల 6న రైతు సంఘర్షణ సభ నిర్వహించనున్న మైదానాన్ని పరిశీలించేందుకు ఠాగూర్‌ శనివారం హనుమకొండకు వచ్చారు. సెయింట్‌ గాబ్రియేల్‌ మైదానంలోని హెలిప్యాడ్‌స్థలాన్ని, ఆర్ట్స్‌ కళాశాల మైదానాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఠాగూర్‌ మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని కేసీఆర్‌ ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచాయన్నారు.

*సొంతవారినే కడతేర్చి.. టీడీపీపైకి నెట్టేస్తారు : పితాని
‘‘స్వలాభం కోసం సొంత పార్టీవారినే కడతేర్చి, టీడీపీపైకి నెట్టేయడం వైసీపీ ముందునుంచీ అనుసరిస్తున్న రాజకీయం. వైసీపీ ఎమ్మెల్యే తలారి పెంచి పోషించిన రెండువర్గాల మధ్య ఘర్షణే హత్యకు దారితీసింది. హత్యతో టీడీపీకి ఏ సంబంధం లేదు’’ అని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. హత్యకు కారణం ఎమ్మెల్యేనే అని మృతుడి భార్య చెబుతున్నా, కళ్లకు గంతలు కట్టాలని చూడటం అధికార నాయకుల నైజాన్ని తెలుపుతోందని న్నారు. ‘‘పోలీసులకు అధికారాలివ్వండి. నిజాలు నిగ్గుతేల్చండి… మహాప్రభో’’ అని చేతులు జోడించి ప్రభుత్వాన్ని పితాని వేడుకున్నారు.

*నాపై దాడి టీడీపీ కుట్రే: తలారి
‘‘నాపై దాడికి కుట్రపన్నింది టీడీపీ నాయకులే. దాడికి తెగబడిన వారు మా పార్టీ వారు కాదు. నేనెప్పుడూ వాళ్లను చూడలేదు. టీడీపీ నాయకుల ప్రోద్భలంతోనే నాపై దాడి జరిగింది. పోలీసులు పక్కనున్న స్కూల్‌కి నన్ను సురక్షితంగా తీసుకెళ్లారు’’ అని ఎమ్మెల్యే తలారి వెంకట్రావు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో ఎమ్మెల్యే ఇంటివద్ద శనివారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘ద్వారకాతిరుమల మండలం జీ.కొత్తపల్లి గ్రామానికి చెందిన వైసీపీ గ్రామ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ హత్యకు గురవడం బాధాకరం. ఘటన గురించి తెలియగానే హుటాహుటిన జీ.కొత్తపల్లి వెళ్లా. గుర్తు తెలియని వ్యక్తులు నాపై మూకుమ్మడిగా దాడి చేశారు. కొన్నాళ్లుగా గంజి ప్రసాద్‌, ఎంపీటీసీ బజారియ్య గొడవలు పడుతున్నారు.

*కేటీఆర్‌ నిజమే మాట్లాడారు: డీఎల్‌
‘‘ప్రస్తుతం రాష్ట్రంలోని పరిస్థితులను చూసే తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలు చేశారు. అందులో తప్పులేదు. వివేకానందరెడ్డి హత్య కేసు ఏమీ ఆగిపోలేదు. సీబీఐ విచారణ జరుగుతోంది. మరో రెండు నెలల్లో తేలిపోతుంది. వారందరూ జైలుకు పోతారు’’ అని మాజీ మంత్రి డీఎల్‌ రవీంద్రారెడ్డి అన్నారు. కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన స్వగృహంలో శనివారం విలేకరులతో మాట్లాడారు.

*మాట తప్పడం జగన్‌ దినచర్య: తులసిరెడ్డిt
పదే పదే మాట తప్పే జగన్‌ లాంటి నాయకుడు రాష్ట్రానికి అవసరమా అని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో సూటిగా ప్రశ్నించారు. మాట తప్పడం జగన్‌ దినచర్య అని, మాట తప్పే నాయకుడు నాయకుడే కాదన్నారు. గద్దెనెక్కాక వారం రోజుల్లోపు సీపీఎస్‌ రద్దు చేసి ఓపీఎస్‌ పునరుద్ధరిస్తామని ప్రతిపక్ష నేతగా చెప్పారని, ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని హృదయ పూర్వకంగా ఆహ్వానిస్తున్నానని చెప్పి మాట తప్పారన్నారు. నిరుద్యోగులకు సంబంధించి జాబ్‌ క్యాలెండర్‌ విషయంలో మాట తప్పారన్నారు.

*పవన్‌పై బురద జల్లడం సహించరానిది: జోగయ్య
‘‘జగన్‌ మంత్రివర్గంలో పదవులు పొందిన నలుగురు కాపు మంత్రులు పవన్‌ కల్యాణ్‌పై బురద చల్లడానికి ప్రయత్నించడం సహించరాని విషయం. కాపులకు పుట్టిన వారు ఎవరూ ఇలాంటి దౌర్భాగ్య స్థితికి దిగజారరు. పవన్‌ కల్యాణ్‌ను, చంద్రబాబు దత్తపుత్రుడు అనడంతోపాటు లేనిపోని అభాండాలు వేయడానికి కాపు మంత్రులు పోటీ పడుతున్నారు’’ అని మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు చేగొండి హరిరామజోగయ్య విమర్శించారు. శనివారం ఆయన ఈమేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.

*చంద్రబాబు బీజేపీతో కలిసి రావాలి: ఆదినారాయణ రెడ్డి
‘‘రాష్ట్రంలో అరాచకపాలన, దోపిడీ పాలన సాగుతోంది. జగన్‌ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీతో కలిసి రావాలి. చంద్రబాబే కాదు.. ఏ పార్టీ అయినా బీజేపీతో కలిసి రావాల్సిందే’’ అని బీజేపీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. అనంతలో నిర్వహించిన బీజేపీ రాయలసీమ జోనల్‌ పదాధికారుల సమావేశానికి ఆదినారాయణరెడ్డి హాజరైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

*సొంతవారినే కడతేర్చి.. టీడీపీపైకి నెట్టేస్తారు : పితాని
‘‘స్వలాభం కోసం సొంత పార్టీవారినే కడతేర్చి, టీడీపీపైకి నెట్టేయడం వైసీపీ ముందునుంచీ అనుసరిస్తున్న రాజకీయం. వైసీపీ ఎమ్మెల్యే తలారి పెంచి పోషించిన రెండువర్గాల మధ్య ఘర్షణే హత్యకు దారితీసింది. హత్యతో టీడీపీకి ఏ సంబంధం లేదు’’ అని మాజీ మంత్రి పితాని సత్యనారాయణ స్పష్టం చేశారు. హత్యకు కారణం ఎమ్మెల్యేనే అని మృతుడి భార్య చెబుతున్నా, కళ్లకు గంతలు కట్టాలని చూడటం అధికార నాయకుల నైజాన్ని తెలుపుతోందని న్నారు. ‘‘పోలీసులకు అధికారాలివ్వండి. నిజాలు నిగ్గుతేల్చండి… మహాప్రభో’’ అని చేతులు జోడించి ప్రభుత్వాన్ని పితాని వేడుకున్నారు.

*తప్పుడు ప్రచారాలతో పార్టీకే నష్టం : టీడీపీ నేత
సోషల్‌ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఆపకపోతే పార్టీ నష్టపోక తప్పదని దీనిపై తాను టీడీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని నూజివీడు ఏఎంసీ మాజీ చైర్మన్‌, రావిచర్ల సర్పంచ్‌ కాపా శ్రీనివాసరావు అన్నారు. తన కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ కొందరు టీడీపీ నాయకులు తనపై, తన గ్రామానికి సంబంధించిన వ్యక్తులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అలా చేస్తున్న వారు ముద్దరబోయిన ఎమ్మెల్యేగా గెలిచేందుకు ఎంత వరకు కృషి చేశారో తెలుసుకోవాలన్నారు. 2005లో పార్టీ మండల అధ్యక్షుడిగా నియమితులై సుమారు 10 ఏళ్లు మండలంలో పార్టీని అధికారంలో నిలిపానన్నారు.

*కేటీఆర్‌ ఏం తప్పు మాట్లాడారని: అయ్యన్న
ఏపీ దుస్థితిపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఏం తప్పు మాట్లాడారని రాష్ట్ర మంత్రులు ఆంబోతుల్లా రంకెలేస్తున్నారని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. ‘రాష్ట్రంలో విద్యుత్‌, నీరు, రహదారులు బ్రహ్మాండంగా ఉన్నాయి అంటే సరిపోతుందా? జనాల ను అడిగితే పరిస్థితి చెబుతారు’ అని ఆయన పేర్కొన్నారు. 70శాతం మంది వైసీపీ నాయకులు గంజాయి వ్యాపారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పుడు సాగేది వైఎస్‌ భారతి పాలన అని అయ్యన్న విమర్శించారు. కాగా, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఏపీకి వస్తే ఏం చూపిస్తారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు వైసీపీ మంత్రులను ప్రశ్నించారు.

*అభివృద్ధిపై మంత్రుల జోకులు: సోమిరెడ్డిt
‘తెలంగాణ మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై ఏపీ మంత్రుల ప్రతిస్పందన చూసి ప్రజలు నవ్వుకొంటున్నారు. రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందిందని మంత్రులు చెబుతుంటే ప్రజలకు నవ్వాగడం లేదు. ఇక్కడ అభివృద్ధిని తట్టుకోలేక పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకు పారిపోతున్నాయి’ అని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ఎద్దేవా చేశారు. మంత్రులకు, వైసీపీ నాయకులకు అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని సోమిరెడ్డి దుయ్యబట్టారు.

*ఏపీలో దరిద్రపు రాజకీయాలు: ఆదినారాయణరెడ్డి
ఏపీలో దరిద్రపు రాజకీయాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ప్రతి పథకంలోనూ దోపిడీ చేస్తుందన్నారు. 30 నెలల్లో 8 లక్షల కోట్ల అప్పు చేశాడు.. అప్పు చేయడమే తన పని అన్నట్లుగా జగన్ పాలన సాగుతోందన్నారు. ఆర్థిక మంత్రి నియోజకవర్గంలోనే రోడ్లు బాగా లేవని చెప్పారు. కోడి కత్తి కేసు.. పొడవ లేదు ఎవడో పొడిచినట్లు తనపై దొంగ కేసు పెట్టారు. వివేకానంద రెడ్డిది హత్య అని వాళ్లకు తెలుసు.. హత్యను గుండెపోటు అని ఉన్నది లేనట్లు లేనిది ఉన్నట్లు అంత మయసభ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఉందన్నారు. జగన్‌ని గద్దె దింపేందుకు చంద్రబాబునాయుడు బీజేపీతో కలిసి రావాలని సూచించారు. ఏ పార్టీ అయినా బీజేపీతో కలిసి రావాల్సిందేనని ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు.

*ప్రధాని వ్యాఖ్యలపై జగన్ ఏం సమాధానం చెబుతారు: ఆనంద్ సాగర్
ఏపీలోనే పెట్రోల్, డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్నాయన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని టీడీపీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ ప్రశ్నించారు. రోడ్ల సెస్సు, వాహనాల సెస్సు పేరుతో ఏపీ ప్రభుత్వమే చమురు ధరలు పెంచిందని చెప్పిన మోదీ మాటలు నిజమా కాదా అని ఆయన నిలదీశారు. ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు, విద్యుత్ ఛార్జీలు, పన్నుల బాదుళ్లతో ప్రజలను సీఎం చావ బాదుతున్నాడని ఆయన మండిపడ్డారు. పాండిచ్చేరి, కర్ణాటకతో పోలిస్తే ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.15 అధికంగా ఉందని ఆయన తెలిపారు.