DailyDose

గంజి ప్రసాద్ హత్య కేసులో కీలక పరిణామం – TNI నేర వార్తలు

గంజి ప్రసాద్ హత్య కేసులో కీలక పరిణామం  – TNI  నేర వార్తలు

* ఏలూరు జిల్లాలో జరిగిన గంజి నాగప్రసాద్‌ హత్య కేసులో ప్రధాన నిందితుడైన బజారయ్య పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆదివారం సాయంత్రం కేసులో ఏ-1 నిందితుడైన బజారయ్య ద్వారకా తిరుమల ఎస్సై ముందు లొంగిపోయారు. దీంతో పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. హత్య కేసుకు సంబంధించి 10 మంది నిందితులపై 120బి, 302 ఐపీసీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.ఇదిలా ఉంటే, గంజి నాగప్రసాద్‌కు, గ్రామానికి చెందిన ఎంపీటీసీ సభ్యుడు బిరుదుగడ్డ బజారియ్యకు పాతకక్షలు ఉన్నాయి. వీరు పార్టీలో రెండు వర్గాలుగా ఉంటున్నారు. ఇటీవల బజారియ్య వర్గంలోని మండవల్లి సురేష్‌కు చెందిన మిఠాయి బండిపై కొందరు దాడిచేశారు. ఇది గంజి ప్రసాదే చేయించాడని సురేష్, అతని స్నేహితులు ఉండ్రాజవరపు మోహన్, శానం హేమంత్, మరికొందరు భావించారు. ప్రతి విషయంలోనూ తమకు అడ్డుపడుతున్న నాగప్రసాద్‌ను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని సురేష్, మోహన్, హేమంత్‌ నిర్ణయించుకున్నారు.ఈ నేపథ్యంలో.. శనివారం ఉ.7.30కు నాగప్రసాద్‌ పాల కోసం తన ఇంటి నుంచి వెళ్తున్నాడు. ఈ విషయాన్ని జి.నాగరాజు అనే వ్యక్తి నిందితులకు సమాచారం అందించాడు. దీంతో సురేష్, మోహన్, హేమంత్‌లు బైక్‌పై నాగప్రసాద్‌కు ఎదురెళ్లి, పాఠశాల వద్ద అతడి వాహనాన్ని ఆపారు. అనంతరం ముగ్గురూ ఒక్కసారిగా నాగప్రసాద్‌పై కత్తులతో దాడిచేశారు. ముందుగా అతడి చేతిని నరికేశారు. ఆ తరువాత మెడపై, కాలిపై నరికారు. అతడు చనిపోయినట్లు నిర్ధారించుకున్నాక వారు ద్వారకా తిరుమల పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయారు.

*రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పలు ప్రమాదాలు, ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కాటంవారిపల్లెలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని తల్లీ, బిడ్డ ఇద్దరు మృతి చెందారు.

*గుంటూరు జిల్లా మేడికొండూరు మండలంయలవర్తిపాడులో అప్పుల బాధ తట్టుకోలేక కౌలు రైతు బలవన్మరణం చేసుకున్నాడు.
*ప్రకాశం జిల్లా: కురిచేడు మండలం కాటంవారిపల్లెలో తల్లీ, బిడ్డ మృతి చెందారు. బిడ్డతో కలిసి పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

*పల్నాడు జిల్లా: నకరికల్లు మండలం త్రిపురారంలో ట్రాక్టర్‌లో గడ్డివాము తరలిస్తుండగా విద్యుత్‌ తీగలు తగిలి మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో గడ్డివాముపై కూర్చున్న ఆత్మకూరి వెంకటేశ్వర్లు(37) అక్కడికక్కడే మృతి చెందాడు.*పిడుగురాళ్లలోని తుమ్మలచెరువు టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తెలంగాణ నుంచి వినుకొండకు తరలిస్తున్న తెలంగాణ మద్యాన్ని భారీ మొత్తంలో పట్టుకున్నారు. రెండు వేల మద్యం సీసాలను పట్టుకున్నట్లు సీఐ మధుసూదన్రావు వెల్లడించారు.

*గుంటూరు జిల్లా: మేడికొండూరు మండలం యలవర్తిపాడులో అప్పులబాధ తట్టుకోలేక కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. యారసాని షట్రక్ అనే రైతు పంట సాగులో నష్టం రావడంతో మనోవేదన గురై ఆత్మహత్య చేసుకున్నాడు.విశాఖ జిల్లా: అగనంపూడి వద్ద బైకును కంటెయినర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీహరిపురం వాసులు అడ్ల అప్పలస్వామి దంపతులు అక్కడికక్కడే మృతి చెందారు. అనకాపల్లిలోని నూకాలమ్మను దర్శించుకుని వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

*చిత్తూరు జిల్లా: కుప్పం మండలం లక్ష్మీపురంలో తాగడానికి డబ్బులు ఇవ్వలేదని తల్లిపై కత్తితో ఓ కుమారుడు దాడిచేశాడు. తల్లి పరిస్థితి విషమంగా ఉంది.*శ్రీకాళహస్తిలోని తేదేపా నేతలపై రాళ్ల దాడి చేయడంతో తిరుపతి పార్లమెంటరీ తేదేపా అధ్యక్షులు నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయం పాలక మండలి సభ్యులు జయశ్యామ్ అతని అనుచరులు రాళ్లు, కత్తులతో దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

*బాపట్ల జిల్లా: వేటపాలెం మండలం రామాపురంలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు ట్రాక్టర్లు, జేసీబీ స్వాధీనం చేసుకున్నారు.*రేపల్లెలో ట్యూషన్ టీచర్ లైంగికంగా వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ట్యూషన్ టీచర్పై పోక్సో కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ సూర్యనారాయణ తెలిపారు.

*ఏలూరు జిల్లా: పెదపాడు మండలం కలపర్రు టోల్‌గేట్ వద్ద విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అక్రమంగా తరలిస్తున్న 200 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో బియ్యం తరలిస్తోన్న లారీని సీజ్ చేసి, అధికారులు కేసు నమోదు చేశారు.పార్వతీపురం మన్యం జిల్లా: సాలూరు పట్టణం బంగారమ్మకాలనీలోని ఓ వ్యక్తి ఇంట్లోని ఫ్రిడ్జ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు సంభవించాయి. ఈ ఘటనలో ఆస్తి మొత్తం అగ్నికి ఆహుతయ్యింది. సుమారు 4 లక్షల రూపాయల మేర ఆస్తినష్టం వాటిల్లిందని వారు వాపోతున్నారు.

*కృష్ణా జిల్లా: పామర్రులో అనుమానాస్పద స్థితిలో ఇటుకల అమూల్య అనే వివాహిత మృతి చెందింది. అధిక కట్నం కోసం అల్లుడు ప్రసంగి బాబు తమ కుమార్తెను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని యువతి తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పామర్రు పోలీసులు దర్యాప్తు చేపట్టామని, పరారీలో ఉన్న భర్త ప్రసంగి బాబును పట్టుకుంటామని తెలిపారు.*నోట్లు మార్పిడి చేస్తున్న ఘటన కృష్ణా జిల్లా విస్సన్నపేటలో చోటుచేసుకుంది. నకిలీ నోట్ల వ్యవహారాలకు పాల్పడిన ఒకరిని అరెస్ట్ చేశామని , మరొకరిని అరెస్టు చేయాల్సి ఉందని మైలవరం ఏసీపీ ప్రసాద్ వెల్లడించారు.

* బందరు సబ్ డివిజన్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కృష్ణా జిల్లా పోలీస్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. పెడన మండలం ఈదుమూడి గ్రామంలో నాటు సారా స్థావరంపై దాడులు నిర్వహించి 250 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, 40 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకొన్నారు.గుంటూరు జిల్లా: ప్రశాంతి(03) అనే మూడు సంవత్సరాల చిన్నారి సీమ చింతకాయలు తిని మృతి చెందిన ఘటన గుంటూరు జిల్లా ఫిరంగీపురం మండలంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*బంగారం అపహరించిన కేసులో ముద్దాయిని శనివారం ఫిరంగిపురం పోలీసులు అరెస్ట్ చేశారు. ముద్దాయి నుంచి ఎనిమిది లక్షలు విలువ చేసే సొమ్మును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ పోతురాజు తెలిపారు. నిందితుడిని రిమాండ్కు పంపంచినట్లు తెలిపారు.నంద్యాల: జిల్లాలోని వార్డు సచివాలయ అడ్మిన్ సెక్రటరీ వెంకట సుధాకర్ పై ఓ వైకాపా కౌన్సిలర్ కుమారుడు చేయి చేసుకున్నాడు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ మనిజీర్ జిలాని సామున్ దృష్టికి తీసుకువచ్చారు. న్యాయం చేయాలని విన్నవించారు.

*డోన్లో జరిగిన వివిధ చోరీకేసులో భాగంగా ఆరుగురిని అరెస్టు చేసినట్లు డోన్ పట్టణ సీఐ మల్లికార్జున తెలిపారు. వీరి నుంచి 10 తులాల బంగారు, 35 కిలోల వెండి, 20 వేల రూపాయల నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని, కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ పేర్కొన్నారు.ప్రకాశం జిల్లా: పిడుగు పాటుకు ఒక వ్యక్తి మృతి చెందగా, సుమారు 13 మేకలు మృతి చెందిన సంఘటన ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామంలో చోటుచేసుకుంది.

*నెల్లూరు జిల్లా: అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామంలో ఇటీవల కాలంలో భారీగా దొరికిన గోవా మద్యం కేసులో అన్వర్, వెంకటేశ్వర్లు అనే ఇద్దరిని సెబ్ అధికారులు అరెస్ట్ చేశారు. విచారణలో భాగంగా ఇంకా పలువురికి సంబంధాలు ఉన్నాయని, వారికోసం గాలిస్తున్నట్లు సెబ్ అధికారులు తెలిపారుఅనకాపల్లి జిల్లా: నర్సీపట్నం సమీపంలోని సుబ్బారాయుడు పాలెం జీడి తోటల్లో వంటాకుల రమణ అనే యువకుడి హత్యా సంచలనం కలిగించింది. ఈ ఘటనపై నర్సీపట్నం గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

* నక్కపల్లి మండలం గుల్లిపాడు రైల్వే స్టేషన్ పట్టాలపై అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు హత్యకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు.అనంతపురం జిల్లా: కళ్యాణదుర్గం మండలం మల్లాపురం గ్రామానికి చెందిన ఉపాధి కూలి మల్లికార్జున్ పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. గమనించిన స్థానికులు కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

*పామిడి పట్టణం పెన్నానది రెండోకాలువ సమీపంలో మూడు ఎద్దుల బండ్లను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు త్రీవంగా గాయపడ్డారు. మృతి చెందిన వ్యక్తి పామిడి పట్టణానికి చెందిన అతనిగా గుర్తించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.వైఎస్ఆర్ జిల్లా: ఎస్పీ ఆదేశాల మేరకు చక్రాయపేట పోలీసులు నాటుసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. కుప్పం తాండా సమీపంలో గల మద్దెలకోన అటవీ ప్రాంతంలో నాటుసారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి, 1000 లీటర్ల బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేసినట్లు సీఐ బాలమద్దిలేటి తెలిపారు.

*రాజేంద్రనగర్‌లో ఓ వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తుండగా ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు. నైజీరియాకు చెందిన నేడకా డానియల్ అనే వ్యక్తి సన్‌సిటీలో కొకైన్‌ సప్లై చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్టూడెంట్ వీసాపై నైజీరియా నుంచి ఢిల్లీకి వచ్చిన డానియల్… నెల రోజుల క్రితం డ్రగ్స్‌తో హైదరాబాద్‌ వచ్చాడు. కొకైన్‌, ఎండీఎంఏ డ్రగ్స్‌ను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నాడు. రిసీవర్స్ ఎవరనేదానిపై పోలీసులు విచారిస్తున్నారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

*ఒంటరిగా ఉన్న ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరిగిన ఘటన దుండిగల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కలకలం రేపింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన మానసిక స్థితి సరిగా లేని 30 ఏళ్ల రెండ్రోజుల క్రితం నగరానికి వచ్చింది. శక్రవారం రాత్రి గండిమైసమ్మ నుంచి దుండిగల్‌కు వెళ్లే రోడ్డులోని ఉజ్వల బార్‌ అండ్‌ రెస్టారెంట్‌ పక్కన సదరు మహిళ ఒంటరిగా నిలుచుని ఉంది. ఈ క్రమంలో ఐదుగురు యువకులు ఆమెను ఉజ్వల బార్‌ వెనుక ఉన్న నిర్జన ప్రదేశానికి తీసుకువెళ్లి సామూహిక ఆత్యాచారానికి పాల్పడ్డారు.బాధితురాలు వారి నుంచి తప్పించుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుల్లో ఇమ్రాన్‌(20)ను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఆత్యాచారానికి పాల్పడినట్లు అంగీకరించాడు. మరికొందరు నిందితులు నర్సింహ, ఖుద్దూస్, ఉమిద్దీన్, ఇమామ్‌లు పరారీలో ఉన్నారు. కాగా నిందితులంతా డి.పోచంపల్లి ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్లుగా తేలింది. వారిపై 377డీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

*ఒంగోలు పీటీసీలో ఎస్సైగా పనిచేస్తున్న వినోద్‌ కుమార్‌ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని అతని భార్య మంగళగిరి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రేమించి, పెళ్లి చేసుకుని రెండేళ్ల తర్వాత నడిరోడ్డుపై వదిలేశాడంటూ రోజారాణి ఇచ్చిన ఫిర్యాదుతో ఎస్సై వినోద్‌కుమార్‌పై మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. వినోద్‌‌ కుమార్‌కు వేరే మహిళతో సంబంధం ఉన్న విషయం తెలుసుకుని ప్రశ్నించినందుకే తనను వదిలేశాడని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలీసులు కౌన్సిలింగ్‌కు పిలిచినా రాకుండా, తన జీవితాన్ని నాశనం చేశాడంటూ బాధితురాలు కన్నీటి పర్యంతమవుతోంది.

*ఎన్టీఆర్ జిల్లాలో నకిలీ నోట్ల దందా జోరుగా సాగుతున్నది. గత కొన్నాళ్లుగా నకిలీ నోట్లు ఎక్కడ పడితే అక్కడ వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు, దుకాణదారులు బెంబేలెత్తుతున్నారు. తాజాగా విసన్నపేట మండలం పుట్రేల వద్ద నకిలీ నోట్ల ముఠా పట్టుబట్టింది. వారి వాహనాలను తనిఖీ చేయగా 47 లక్షలకు పైగా విలువచేసే నకిలీ నోట్లు బయటపడ్డాయి. ఏసీపీ ప్రసాద్‌ మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి..పుట్రేల వైపునకు వెళ్తున్న ఓ కారును పోలీసులు ఆపి తనిఖీ చేయగా.. రెండు బ్యాగులు బయటపడ్డాయి. వీటిని ఓపెన్‌ చేయగా కళ్లు బైర్లు కమ్మేలా డబ్బు కట్టలు బయటపడ్డాయి. తొలుత వాటిని చూస్తే అవి నకిలీవి అని ఎవరికీ అనుమానం రాలేదు. అయితే, పరిశీలించి చూడగా నకిలీవని తేలాయి. నిందితుల నుంచి 47.50 లక్షల విలువ చేసే నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. నిందితుల రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో మేకతోటి శశికిరణ్, గాలి రత్నం బాబు, పగిడిపల్లి గణేష్‌, తోట నరసింహారావులపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ ప్రసాద్‌ వెల్లడించారు. అలాగే, ఈ కేసుపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు

*గుంటూరు: జిల్లాలోని రేపల్లెలో మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. రైల్వే స్టేషన్‌లో ఓ మహిళాపై ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నుంచి కృష్ణ జిల్లా నాగాయలంకకు ఆ కుటుంబం పనులు నిమిత్తం వెళ్తుంది. గత రాత్రి రైలు దిగి 1వ నెంబర్ ప్లాట్ ఫాంపై వారు నిద్రిస్తున్నారు. మహిళను ఫ్లాట్ ఫాం చివరకు ముగ్గురు వ్యక్తులు లాక్కెళ్లారు. ఆ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

*ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డాడరు. ఇంటికి తాళం వేసి కుటుంబంతో హైదరాబాదు వెళ్లిన రాము అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో 6 కాసుల బంగారు ఆభరణాలు, రూ. 30 వేల నగదు అపహరించారు.దొంగతనం అనంతరం ముగ్గురు దొంగలు కారులో పరారైయ్యారు. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు

*ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లి గ్రామ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంజి ప్రసాద్‌ హత్య తీవ్ర కలకలం రేపుతోంది. రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు వల్లే ఈ హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో చనిపోయిన గంజి ప్రసాద్ కుటుంబాన్ని పరామర్శించేదుకు వెళ్లిన గోపాలపురం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై గ్రామస్తులు దాడికి దిగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఆయనపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీసులు రక్షణ వలయంగా ఏర్పడి ఆయన్ను సురక్షితంగా తరలించిన విషయం తెలిసిందే

*పామర్రులో వరకట్న వేధింపులకు నవ వధువు బలైంది. పామర్రు, కార్పెంటర్ కాలనీలో అనుమానాస్పద స్థితిలో ఇటుకల అమూల్య (19) మృతి చెందింది. అయితే అధిక కట్నం కోసం అల్లుడు ప్రసంగి బాబు తమ కుమార్తెను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని అమూల్య తల్లిదండ్రులు ఆరోపించారు. భార్య, భర్తల మధ్య గొడవల కారణంగా అమూల్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని భర్త తరఫు బంధువులు చెబుతున్నారు. పెళ్లి అయిన పది నెలలకే తమ కుమార్తె మరణించడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఏలూరు: జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో ఓ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డాడరు. ఇంటికి తాళం వేసి కుటుంబంతో హైదరాబాదు వెళ్లిన రాము అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి బీరువాలో 6 కాసుల బంగారు ఆభరణాలు, రూ. 30 వేల నగదు అపహరించారు.దొంగతనం అనంతరం ముగ్గురు దొంగలు కారులో పరారైయ్యారు. కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

* బాపట్ల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రేపల్లె రైల్వేస్టేషన్‌లో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. దుండగులు భర్తను కొట్టి వలస కూలీపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ముగ్గురు కలిసి అత్యాచారం చేసినట్లు బాధితులు చెబుతున్నారు. ఘటనాస్థలిలో బాధితుల నుంచి పోలీసులు వివరాలు సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

* భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందులో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇల్లందు పట్టణంలోని కరెంటు ఆఫీస్‌ సమీపంలో ఆటో ట్రాలీ, బైక్‌ ఢీకొన్నాయి. దీంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రుడిని ఖమ్మం దవాఖానకు తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడిని డీఎస్‌పీ గన్‌మెన్‌ (Gunman) భద్రం గా గుర్తించారు. ఈ ఘనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

* ఆత్మకూరు దోర్నాల మధ్య నల్లమల్ల అటవీ ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది. రోళ్ల పెంట ఘాట్ సమీపంలో మినీ లారీ ప్రమాదవశాత్తు వంద అడుగుల లోతు గల లోయలో పడింది. ఈ ఘటనలో డ్రైవర్ మురళి కృష్ణ అక్కడికక్కడే మృతి చెందారు. అతి కష్టం మీద తాళ్ల సహాయంతో లోయలోకి దిగి డ్రైవర్ మృతదేహాన్ని పోలీసులు పైకి తీసుకు వచ్చారు. నరసరావుపేట నుంచి గుంతకల్ వెళుతున్న AP39TG 9344 మినీ లారీగా గుర్తించారు.

*నిర్మల్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వీటి కారణంగా భైంసాలో వడదెబ్బతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. వడదెబ్బతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితులు మరణించారు. మృతులను సంతోష్(38), దిలీప్ యాదవ్ బచ్చువార్ (41)గా గుర్తించారు.

*ఎన్టీఆర్: జిల్లాలోని విసన్నపేట మండలం పుట్రేల వద్ద జరిగిన ఘటనలో నకిలీ నోట్ల ముఠాను విస్సన్నపేట పేట పోలీసులు అరెస్టు చేసినట్లు ఏసీపీ ప్రసాద్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు ఆయన వెల్లడించారు. వారి వద్ద నుంచి రూ. 47 లక్షల 50 వేల నకిలీ నోట్లను, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో మేకతోటి శశికిరణ్, గాలి రత్నం బాబు, పగిడిపల్లి గణేశ్ష్, తోట నరసింహారావులపై కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు. కేసు నమోదు చేసుకుని పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.

*వరంగల్: జిల్లాలోని సంగెం మండలంలోని నార్లవాయి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. భర్త చనిపోయాడని తెలుసుకున్న 10 నిమిషాలకే భార్య కూడా మరణించింది. అనారోగ్యంతో భర్త బూర కట్టయ్య (75 )మృతి విషయం తెలుసుకున్న కమలమ్మ (65) గుండెపోటుతో మరణించింది. మృతి చెందిన వృద్ద దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తలు దాదాపుగా ఒకేసారి మరణించడంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి

*దుండిగల్‌ : నగర శివారులో దారుణం జరిగింది. ఓ యాచకురాలిపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. ఈ ఘోరాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారి చెర నుంచి ఆ మహిళ తప్పించుకుంది. ఆ ఐదుగురు కామాంఽధుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకోగా నలుగురు పరారీలో ఉన్నారు.

*తల్లిని వేధిస్తుండటంతో కన్న తండ్రి గొంతుకు చైన్‌తో బిగించి చంపేశాడో కుమారుడు. ఈ సంఘటన శనివారం కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించి ఇన్‌స్పెక్టర్‌ అశోక్‌ కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన నారాయణ రావు (54) ఆటో డ్రైవర్‌. కొన్నేళ్ల క్రితం వలసవచ్చి కుల్సుంపురా పరిధిలో స్థిరపడ్డాడు. అతనికి ఇద్దరు భార్యలు. పెద్ద భార్య చంద్రకళ. ఈమెకు నామ్‌దేవ్‌(33), మహదేవ్‌ (30) కుమారులు. వీరు నవోదయనగర్‌లో ఉంటున్నారు. రెండో భార్య విశ్వకాంత. ఈమెకు శ్రీకాంత్‌, మరో కుమారుడు ఉన్నారు. వీరు కుల్సుంపురా బస్తీలో ఉంటున్నారు. మొదటి భార్య చంద్రకళకు, నారాయణరావు మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో భార్యను వేధించడం, కొట్టడం చేస్తుండేవాడు.

*బీజేపీ పార్టీ మజ్దూర్‌సంఘ్‌ జిల్లా కన్వీనర్‌ సాయిగణేశ్‌ మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన ప్రియురాలు, బీజేపీ మహిళా మోర్చా కార్యకర్త విజయ ఆత్మహత్యాయత్నం చేశారు. సాయిగణేశ్‌, ఖమ్మంలోని కాల్వొడ్డు సమీపంలో ఆ పార్టీ దిమ్మె కట్టించే ప్రయత్నం చేసిన చోటే శనివారం ఆమె నిద్రమాత్రలు మింగారు. అపస్మారక స్థితికి చేరుకున్న ఆమెను 108లో ఖమ్మం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. విజయ, సాయిగణేశ్‌ పరస్పరం ఇష్టపడ్డారు. వీరి వివాహం మే4న జరగాల్సి ఉండగా ఏప్రిల్‌ 14న సాయి గణేశ్‌ ఆత్మహత్యాయత్నం చేశారు. తనపై పోలీసులు 16కేసుల తోపాటు రౌడీషీట్‌ పెట్టారని, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఒత్తిడితోనే పోలీసులు తనను వేధింపులకకు గురిచేస్తున్నారని పోలీస్‌స్టేషన్‌ సాక్షిగా ఆరోపిస్తూ పురుగుల మందు తాగారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొదుతూ మృతిచెందారు. సాయిగణేశ్‌ మృతితో విజయ తీవ్ర మనోవైదనకు గురయ్యారు.

*అప్పుల బాధ తాళలేక నంద్యాల జిల్లాలో ఒక కౌలురైతు, అనంతపురం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం పెద్దకంబలూరుకు చెందిన బాల మద్దిలేటి (35) తనకున్న రెండు ఎకరాలతోపాటు 18 ఎకరాల్లో వరి, మినుము సాగు చేశాడు. దిగుబడులు రాకపోవడంతో తీవ్రంగా నష్టపోయాడు. రూ.18 లక్షల అప్పు మిగిలింది. మనోవేదనతో శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి నంద్యాల ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కొర్రకోడు గ్రామానికి చెందిన రామాంజినేయులు (58) పది ఎకరాల్లో మూడేళ్లుగా వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయాడు. అప్పులు రూ.12 లక్షలకుపైగా పేరుకుపోయాయి. వాటిని ఎలా తీర్చాలో తెలియక మధనపడేవాడు. తన పొలంలోనే శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగి ఆపస్మారక స్థితిలో ఉన్న రామాంజినేయులును అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందాడు.

*వడగాలులు ఆరుగురి ప్రాణాలు తీశాయి. కూలీ పనికి వెళ్లి కొందరు, జీవనోపాధి కోసం బయటికి వెళ్లి మరికొందరు వడదెబ్బకు బలయ్యారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వడదెబ్బతో ఇద్దరు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా కందుకూరుకు చెందిన కోడిగంటి జంగయ్య(56) శనివారం ఉదయం జాతీయ ఉపాధి హామీ పనికి వెళ్లాడు. ఈ క్రమంలో కూలి పని చేస్తూ సొమ్మసిల్లి కింద పడిపోయాడు. తోటి కూలీలు వెళ్లి చూసేసరికే మృతిచెందాడు. నిర్మల్‌ జిల్లా భైంసాలో వడదెబ్బతో శనివారం ఇద్దరు మృతి చెందారు. స్థానికంగా వ్యాపారం చేసే సంతోష్‌ యాదవ్‌(38) ఎండదెబ్బతో తీవ్ర అస్వస్థతకు గురై శనివారం చనిపోయాడు. పట్టణానికి చెందిన దిలీప్‌ బచ్చువార్‌(41) వడదెబ్బతో శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. శనివారం అతడిని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. నిజామాబాద్‌ జిల్లాలో భానుడు భగభగ మండిపోతున్నాడు. శనివారం రెంజల్‌లో రికార్డు స్థాయిలో 45.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మాక్లూర్‌, ఎడపల్లిలో 45.4.. నిజామాబాద్‌ రూరల్‌ మండలంలో 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

*గుంటూరు:జిల్లాలోని రేపల్లెలో మహిళపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. రైల్వే స్టేషన్‌లో ఓ మహిళాపై ఈ ఘటనకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా నుంచి కృష్ణ జిల్లా నాగాయలంకకు ఆ కుటుంబం పనులు నిమిత్తం వెళ్తుంది. గత రాత్రి రైలు దిగి వ నెంబర్ ప్లాట్ ఫాంపై వారు నిద్రిస్తున్నారు. మహిళను ఫ్లాట్ ఫాం చివరకు ముగ్గురు వ్యక్తులు లాక్కెళ్లారు. ఆ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

* అఫ్గానిస్థాన్‌లో మరోసారి బాంబు పేలుళ్లు విధ్వంసం సృష్టించాయి. రాజధాని కాబుల్‌లోని ఓ మసీదు వద్ద ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 50 మందికి పైగా మృతిచెందినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. అనేక మంది గాయపడ్డారు.కాబుల్‌లోని స్థానిక ఖలీఫా సాహిబ్‌ మసీదు వద్ద శుక్రవారం మధ్యాహ్నం రంజాన్‌ ప్రార్థనలు ముగించుకుని వెళ్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తి తనను తాను పేల్చుకుని ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తొలుత 10 మంది గాయపడినట్లు తాలిబన్‌ ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. అయితే సాయంత్రం నాటికి మృతుల సంఖ్య 50కి పైగా పెరిగినట్లు మసీదు నేతలు వెల్లడించారు. మరో 100 మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. ఘటన తర్వాత ఎటు చూసినా చెల్లాచెదురుగా మృతదేహాలే కన్పిస్తున్నాయని ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు. ఈ పేలుడు వెనుక ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థ హస్తం ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

*నకిరేకల్ మేడే వేడుకల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ నేతల మధ్య వివాదం తలెత్తింది. వీరేశం వర్గీయులను ఎమ్మెల్యే లింగయ్య వర్గీయులు అడ్డుకున్నారు. ఈ ఘటనతో ఆందోళనకారులను పోలీసులు చెదరగొట్టారు.