Movies

ఏంటి తమన్నా.. ఇంత కాస్ట్‌లీనా?

Auto Draft

మిల్కీబ్యూటీ తమన్నా స్టైలింగ్‌ ఎప్పుడూ ట్రెండీగానే ఉంటుంది. వేదికకు తగ్గట్టు రెడీ కావడం ఆమె ప్రత్యేకత. తాజాగా తమన్నా ధరించిన ఓ డ్రెస్‌ అభిమానులను, నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. అమెజాన్‌ ప్రైమ్‌ నిర్మిస్తున్న వెబ్‌ సిరీస్‌ ‘జీ కర్దా’ ప్రారంభ వేదికపై పొట్టి దుస్తుల్లో కనిపించారు తమన్నా. ఆ వేడుకలో అందరి చూపు తమన్నా వైపే! కళ్లు తిప్పుకోలేని అందం ఒక వైపు అయితే.. ఆమె ధరించిన దుస్తుల ఆకర్షణ మరోవైపు. అంతే.. స్కై బ్లూ కలర్‌లో పొట్టిగా ఉన్న ఆ డ్రెస్‌ ఖరీదు ఎంతోనని ఆరా తీయడం మొదలుపెట్టారు అభిమానులు. సింపుల్‌గా, కురచగా ఉన్న ఆ డ్రెస్‌ ఖరీదు రూ. 2,69,121 అని తెలుసుకుని అవాక్కయ్యారు. అదీ కాకుండా మ్యాచింగ్‌ చెప్పుల ఖరీదు రూ.90,800 అని తెలిసింది. డ్రెస్సు, చెప్పుల కోసం ఇంత ఖర్చా అంటూ ఆశ్చర్యపోతున్నారు. ఏంటి తమన్నా డ్రెస్‌ ఇంత కాస్ట్‌లీనా అంటూ పోస్టులు చేస్తున్నారు. తాజాగా ఆమె నటించిన ‘ఎఫ్‌3’ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘గుర్తుందా శీతాకాలం’ చిత్రం కూడా చిత్రీకరణ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే చిరంజీవితో ‘భోళా శంకర్‌’ చిత్రంలో తమన్నా నటిస్తున్నారు.