Business

విప్రోకు 10 బిలియన్‌ డాలర్ల ఆదాయం – TNI వాణిజ్య వార్తలు

విప్రోకు 10 బిలియన్‌ డాలర్ల ఆదాయం  – TNI వాణిజ్య వార్తలు

*దిగ్గజం విప్రో 2021-22 ఏడాదిలో తాము తొలిసారిగా 10.4 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించినట్టు విప్రో సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ థియర్రీ డెలాపోర్టే వెల్లడించారు. ఆదాయంలో 27శాతం వృద్ధి సాధించిందని తెలిపారు. ఈ మార్చితో ముగిసిన త్రైమాసికంలో విప్రో నికరలాభం గతేడాది ఇదేకాలంకంటే 4 శాతం వృద్ధి చెంది రూ.3,047.3 కోట్లకు చేరింది. ఆదాయం 0.3 శాతం స్వల్పవృద్ధితో రూ.20,860.7 కోట్లకు పెరిగింది. త్రైమాసిక ఫలితాలు దాదాపు విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. ఫలితాల నేపథ్యంలో విప్రో షేరు ఎన్‌ఎస్‌ఈలో రూ. 508 వద్ద ముగిసింది. ఈ ఏప్రిల్‌ – జూన్‌ త్రైమాసికంలో 2.742.80 బిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించవచ్చని కంపెనీ గైడెన్స్‌ ఇచ్చింది. ఇది 2022 మార్చి క్వార్టర్‌తో పోలిస్తే 13శాతం అధికం. సమీక్షా త్రైమాసికంలో డాలర్ల ప్రాతిపదికన ఆదాయం డిసెంబర్‌ క్వార్టర్‌కంటే 3.1 శాతం వృద్ధితో 2.7 బిలియన్‌ డాలర్లకు పెరిగినట్టు విప్రో తెలిపింది. అన్ని మార్కెట్లలోనూ, రంగాల్లోనూ, వ్యాపార విభాగాల్లోనూ ముగిసిన ఏడాది రెండంకెల వృద్ధి సాధిచామని కంపెనీ సీఈవో వివరించారు.కాగా ముగిసిన ఆర్థిక సంవత్సరంలో కొత్తగా 45,416 మంది ఫ్రెషర్లను రిక్రూట్‌ చేసుకున్నట్టు విప్రో ప్రకటించింది. దీంతో కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2.43 లక్షలకు చేరింది. ముగిసిన మార్చి త్రైమాసికంలో కంపెనీ వలసల రేటు 23.8 శాతానికి పెరిగింది. డిసెంబర్‌ క్వార్టర్లో ఇది 22.7 శాతం ఉంది. అలాగే ఉద్యోగుల్ని సంస్థలో అట్టిపెట్టుకునేందుకు వ్యయాలు అధికంకావడంతో ఆపరేటింగ్‌ లాభం 1.2 శాతం తగ్గినట్టు విప్రో తెలిపింది. ఆపరేటింగ్‌ మార్జిన్లు కూడా 17.6 శాతం నుంచి 17 శాతానికి తగ్గాయి. ఉద్యోగుల్లో అధికంగా ప్రెషర్స్‌ ఉన్నందున, సిబ్బంది నికర వినియోగం రేటు 85.8 శాతం నుంచి 85.2 శాతానికి తగ్గింది.

*అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు భారీ షాక్‌!
అమెజాన్‌ అధినేత జెఫ్‌ బెజోస్‌కు భారీ షాక్‌ తగిలింది. గురువారం ప్రకటించిన అమెజాన్‌ క్యూ1 ఫలితాలతో గంటల వ్యవధిలో బెజోస్‌ బిలియన్‌ డాలర్లు నష్టపోయినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గురువారం అమెజాన్‌ క్యూ1 ఫలితాల్ని ప్రకటించింది. ఈ ఫలితాల్లో 2015 తర్వాత ఈ ఏడాదిలో అత్యధికంగా 3.84 బిలియన్‌ డాలర్ల నష్టాల్ని చవిచూసింది. దీంతో అప్రిమత్తమైన షేర్‌ హోల్డర్లు అమ్మకాలు జరిపారు. ఫలితంగా గంటల వ్యవధిలో ఆ సంస్థ బిలియన్‌ డాలర్లు నష్ట్పోగా.. ఒక్క మార్చి నెలలోనే అత్యంత దారుణంగా ట్రేడింగ్‌ జరిగిన టెక్నాలజీ షేర్ల విభాగంగా అమెజాన్‌ షేర్లు ఉన్నాయని వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. బ్లూం బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌అమెజాన్‌ క్యూ1 ఫలితాలు ఆ సంస్థ అధినేత జెఫ్‌ బెజోస్‌ సంపదపై ప్రభావం చూపాయి. గురువారం రోజు అమెజాన్‌ 14.05 శాతం నష్టపోవడంతో జెఫ్‌ బెజోస్‌ గంటల వ్యవధిలో 20.5 బిలియన్‌ డాలర్లు (మన కరెన్సీలో రూ.1.56లక్షల కోట్లు) నష్టపోయారు. కాగా, బ్లూం బెర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ జాబితాలో బెజోస్‌ సంపద తగ్గి 148.4 బిలియన్‌ డాలర్లతో సరిపెట్టుకున్నారు

*రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి రెండు మెగా ఐపీఓలు రాబోతున్నాయి. ఐపీఓ ద్వారా రిలయన్స్‌ జియో రూ.50,000 కోట్లు, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ రూ.75,000 కోట్ల సమీకరణకు రిలయన్స్‌ అధినేత ముకేవ్‌ అంబానీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆర్‌ఐఎల్‌ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం)అంబానీ ఈ రెండు మెగా ఐపీఓల వివరాలు ప్రకటిస్తారని మార్కెట్‌ వర్గాల అంచనా.

*కేంద్ర ప్రభుత్వం మరో ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవే టు రంగానికి అమ్మేసింది. హెలికాప్టర్‌ సేవల సంస్థ పవన్‌ హన్స్‌ లిమిటెడ్‌ (పీహెచ్‌ఎల్‌) ఈక్విటీలో 51 శాతం వాటాను స్టార్‌9 మొబిలిటీ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విక్రయించింది. మొత్తం మూడు కంపెనీల నుంచి బిడ్స్‌ వస్తే అందులో స్టార్‌9 మొబిలిటీ కంపెనీ అత్యధికంగా రూ.211.14 కోట్లతో పవన్‌ హన్స్‌ను దక్కించుకుంది. కంపెనీ ఈక్విటీలో ఓఎన్‌జీసీకి ఉన్న 49 శాతం వాటానూ స్టార్‌ మొబిలిటీ ఇదే ధరతో కొనుగోలు చేయనుంది. ఓఎన్‌జీసీతో పాటు అనేక ప్రభుత్వ రంగ సంస్థలకు పవన్‌ హన్స్‌ హెలికాప్టర్‌ సేవలు అందిస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ కంపెనీ నష్టాల్లో ఉండడంతో ప్రభుత్వం దీన్ని అమ్మకానికి పెట్టింది.

* రెయిన్‌బో హాస్పిటల్స్‌ బ్రాండ్‌తో మల్టీ స్పెషాలిటీ పిల్లల ఆసుపత్రులను నిర్వహిస్తున్న రెయిన్‌బో చిల్డ్రన్స్‌ మెడికేర్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకు మంచి స్పందన లభించింది. ఇష్యూ శుక్రవారంతో ముగిసింది. పబ్లిక్‌ ఇష్యూ ద్వారా 2,05,14,617 షేర్లను విక్రయించాలని నిర్ణయించగా.. 25,49,03,787 (25.49 కోట్లు) షేర్లకు బిడ్లు దాఖలైనట్లు రెయిన్‌బో హాస్పిటల్స్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రమేశ్‌ కంచర్ల తెలిపారు. అంటే 12.43 రెట్లు అధికంగా ఇష్యూకు స్పందన లభించింది. అర్హులైన సంస్థాగత కొనుగోలుదారుల (క్యూఐబీ) విభాగంలో 38.9 రెట్ల షేర్లకు దరఖాస్తు చేశారు. ఈ విభాగంలో 57,75,605 షేర్లుండగా.. 22,46,97,591 షేర్లకు దరఖా స్తు చేశారు. కార్పొరేట్‌ కంపెనీల వంటి సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగంలో 3.73 రెట్లు సబ్‌స్ర్కైబ్‌ అయింది.

*స్టాక్‌ మార్కెట్‌ ప్రతిఫలాలను ఆశిస్తూ.. పన్ను ప్రయోజనాలు పొందాలనుకునే మదుపర్లకు మ్యూచువల్‌ ఫండ్‌లలో ఈక్విటీ-లింక్డ్‌ సేవింగ్‌ స్కీమ్‌లు (ఈఎల్‌ఎ్‌సఎ్‌స) ఉత్తమ పెట్టుబడి సాధనం. మూడేళ్ల లాకిన్‌ కాలపరిమితి ప్రకారం పెట్టుబడులను వెనక్కి తీసుకోకుండా వేచి ఉండే వారికి ఈఎల్‌ఎ్‌సఎ్‌సల వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి.. ఇది చక్కడి పెట్టుబడి వ్యూహమని క్వాంటమ్‌ అడ్వైజర్స్‌ ఎండీ ఐవీ సుబ్రమణియమ్‌ తెలిపారు. సాధారణంగా ఆర్థిక సంవత్సరం చివర్లో మదుపర్లు పన్ను మినహాయింపు కోసం ఈఎల్‌ఎ్‌సఎ్‌సలను ఎంచుకుంటారు. అలా కాకుండా ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే సిస్టమ్యాటిక్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ప్రణాళిక (సిప్‌) ద్వారా ఈఎల్‌ఎ్‌సఎస్‌ల్లో పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది. ఈఎల్‌ఎ్‌సఎ్‌సలో మదుపు చేసే రూ.1.5 లక్షల వరకూ పన్ను మినహాయింపు లభిస్తుందని సుబ్రమణియమ్‌ అన్నారు. ఈ స్కీముల్లో మదుపు చేసిన మొత్తంలో 65 శాతాన్ని షేర్లలో, మిగిలిన మొత్తాన్ని రుణ సాధనాల్లో మదుపు చేస్తారు. అందువల్ల షేర్లలో నేరుగా మదుపు చేయడం వల్ల కలిగే రిస్క్‌ కంటే తక్కువ రిస్క్‌ ఉంటుంది. ఈక్విటీలలో లభించే ప్రయోజనాలనూ పొందవచ్చని చెప్పారు. దీర్ఘకాలికంగా ఈఎల్‌ఎ్‌సఎస్‌ ఇస్తున్న ప్రతిఫలాలను పరిశీలించి ఈఎల్‌ఎ్‌సఎ్‌సను ఎంచుకోవాలి. అలానే దాన్ని నిర్వహిస్తున్న ఫండ్‌ మేనేజర్‌ పనితీరును కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు.

*పీవీసీ పైపులు, ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఆస్ట్రాల్‌.. తాజాగా పెయింట్ల వ్యాపారంలోకి ప్రవేశించింది. జెమ్‌ పెయింట్స్‌లో మెజారిటీ (51 శాతం) వాటాను రూ.194 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఆస్ట్రాల్‌ శనివారం ప్రకటించింది. మిగతా 49 శాతం వాటాను కూడా వచ్చే ఐదేళ్లలో విడతల వారీగా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చున్నట్లు తెలిపింది.

*పీవీసీ పైపులు, ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ సంస్థ ఆస్ట్రాల్‌.. తాజాగా పెయింట్ల వ్యాపారంలోకి ప్రవేశించింది. జెమ్‌ పెయింట్స్‌లో మెజారిటీ (51 శాతం) వాటాను రూ.194 కోట్లకు కొనుగోలు చేస్తున్నట్లు ఆస్ట్రాల్‌ శనివారం ప్రకటించింది. మిగతా 49 శాతం వాటాను కూడా వచ్చే ఐదేళ్లలో విడతల వారీగా కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చున్నట్లు తెలిపింది.

*భారత్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ స్ర్పింగ్‌ ఎనర్జీ గ్రూప్‌ కంపెనీలను కొనుగోలు చేస్తున్నట్లు బ్రిటిష్‌ ఇంధన దిగ్గజం షెల్‌ పీఎల్‌సీ ప్రకటించింది. ఈ డీల్‌ విలువ 155 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో సుమారు రూ.11,858 కోట్లు. సోల్‌ఎనర్జీ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 100 శాతం వాటా కొనుగోలుకు షెల్‌ పీఎల్‌సీ తన అనుబంధ విభాగమైన షెల్‌ ఓవర్సీస్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బీవీ ద్వారా యాక్టిస్‌ సోల్‌ఎనర్జీ లిమిటెడ్‌తో (యాక్టి్‌స) ఒప్పందం కుదుర్చుకుంది. మారిషస్‌ కేంద్రంగా ఏర్పాటైన సోల్‌ఎనర్జీ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. స్ర్పింగ్‌ ఎనర్జీ గ్రూప్‌ కంపెనీల ప్రత్య క్ష వాటాదారు. మహారాష్ట్రలోని పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్ర్పింగ్‌ ఎనర్జీ.. దేశంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కంపెనీల్లో ఒకటి. డీల్‌ పూర్తయిన తర్వాత ప్రస్తుత బ్రాండ్‌నేమ్‌తోనే షెల్‌ అనుబంధ కంపెనీగా కొనసాగనుంది.

*భారత్‌కు చెందిన పునరుత్పాదక ఇంధన సంస్థ స్ర్పింగ్‌ ఎనర్జీ గ్రూప్‌ కంపెనీలను కొనుగోలు చేస్తున్నట్లు బ్రిటిష్‌ ఇంధన దిగ్గజం షెల్‌ పీఎల్‌సీ ప్రకటించింది. ఈ డీల్‌ విలువ 155 కోట్ల డాలర్లు. మన కరెన్సీలో సుమారు రూ.11,858 కోట్లు. సోల్‌ఎనర్జీ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో 100 శాతం వాటా కొనుగోలుకు షెల్‌ పీఎల్‌సీ తన అనుబంధ విభాగమైన షెల్‌ ఓవర్సీస్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బీవీ ద్వారా యాక్టిస్‌ సోల్‌ఎనర్జీ లిమిటెడ్‌తో (యాక్టి్‌స) ఒప్పందం కుదుర్చుకుంది. మారిషస్‌ కేంద్రంగా ఏర్పాటైన సోల్‌ఎనర్జీ పవర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. స్ర్పింగ్‌ ఎనర్జీ గ్రూప్‌ కంపెనీల ప్రత్య క్ష వాటాదారు. మహారాష్ట్రలోని పుణె కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న స్ర్పింగ్‌ ఎనర్జీ.. దేశంలోని అతిపెద్ద పునరుత్పాదక ఇంధన కంపెనీల్లో ఒకటి. డీల్‌ పూర్తయిన తర్వాత ప్రస్తుత బ్రాండ్‌నేమ్‌తోనే షెల్‌ అనుబంధ కంపెనీగా కొనసాగనుంది.

*రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నుంచి రెండు మెగా ఐపీఓలు రాబోతున్నాయి. ఐపీఓ ద్వారా రిలయన్స్‌ జియో రూ.50,000 కోట్లు, రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ రూ.75,000 కోట్ల సమీకరణకు రిలయన్స్‌ అధినేత ముకేవ్‌ అంబానీ సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఆర్‌ఐఎల్‌ వాటాదారుల వార్షిక సర్వసభ్య సమావేశంలో (ఏజీఎం)అంబానీ ఈ రెండు మెగా ఐపీఓల వివరాలు ప్రకటిస్తారని మార్కెట్‌ వర్గాల అంచనా.

*కరోనా వైరస్ నాలుగో దశ విజృంభణ మొదలు కాబోతోందన్న వార్తల నేపథ్యంలో ఇది ఊరటనిచ్చే వార్తే. 12-17 ఏళ్లలోపు వయసు వారికి కోసం సరికొత్త టీకా ఒకటి అందుబాటులోకి వచ్చింది. సీరమ్ ఇనిస్టిట్యూట్ నుంచి వచ్చిన ‘కోవావ్యాక్స్’కు తాజాగా నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ (ఎన్‌టాగి) అనుమతులు మంజూరు చేసింది. ఈ టీకాను ఇమ్యునైజేషన్ డ్రైవ్‌లో భాగం చేయాలని ప్రభుత్వ ప్యానెల్ నిర్ణయించింది. కోవావ్యాక్స్ రాకతో 12-17 ఏళ్ల వయసు వారికి మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్టు అయింది.

*ఆంధ్రా సిమెంట్స్‌ పై దివాలా ప్రక్రియ ప్రారంభమైంది. పృథ్వీ అసెట్‌ రీ కనస్ట్రక్షన్‌ అండ్‌ సెక్యూరిటైజేషన్‌ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ మేరకు ఎన్‌సీఎల్‌టీ, అమరావతి బెంచ్‌ కార్పొరేట్‌ ఇన్‌సాల్వెన్సీ రెసొల్యూషన్‌ ప్రాసె్‌సకు (సీఐఆర్‌పీ) ఆదేశాలు జారీ చేసింది. ముంబైకి చెందిన నిరవ్‌కే పుజరాను ఐఆర్‌పీగా నియమించింది. ఎన్‌సీఎల్‌టీ ఆదేశాల మేరకు కంపెనీ డైరెక్టర్ల బోర్డు అధికారాలు రద్దవుతాయి. ఆ అధికారాలు ఐఆర్‌పీకి లభిస్తాయి. ఆస్తుల విక్రయం తదితర దివాలా ప్రక్రియను రిసొల్యూషన్‌ ప్రొఫెషనల్‌ ఆదేశాలు జారీ చేసిన నాటి నుంచి 180 రోజుల లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్లు ఐఆర్‌పీకి సహకరించాలి. దాదాపు రూ.804 కోట్ల రుణ ఆస్తుల వసూలుకు సంబంధించి పృథ్వీ అసెట్‌ రికనస్ట్రక్షన్‌ ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎ్‌ఫసీ, కరూర్‌ వైశ్యా బ్యాంకుల నుంచి ఆంధ్రా సిమెంట్స్‌ రుణాలు తీసుకుని చెల్లించలేకపోయింది.

*గతేడాది మార్చి-మే నెలలతో పోలిస్తే… ఈ ఏడాది అదే కాలంలో… సామాజిక మాధ్యయం ట్విట్టర్ ఆదాయం గణనీయంగా పెరిగింది. దాదాపు 16% పెరిగి, $ 1.2 బిలియన్లకు చేరుకుందని సోషల్ మీడియా కంపెనీ గురువారం తెలిపింది. ట్విట్టర్… ఈ త్రైమాసికంలో సగటున 229 మిలియన్ల రోజువారీ క్రియాశీల వినియోగదారులతో ఉన్నట్లు నివేదించింది, గతేడాదితో పోలిస్తే ఇది 16 % పెరుగుదలను నమోదు చేసింది. ట్విట్టర్‌ను కొనుగోలు చేయడానికి మస్క్ ప్రతిపాదిత $ 44 బిలియన్ల ఒప్పందానికి సంబంధించి ఈ వారం ప్రారంభంలో ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. కాగా… ఈ కొనుగోలు ప్రక్రియ మొత్తం ఈ ఏడాది చివరలో ముగియనుంది. కాగా… ట్విట్టర్… దాని ఫలితాల ప్రకటనతో పాటు ఎగ్జిక్యూటివ్‌లు, పరిశ్రమ విశ్లేషకులతో కాన్ఫరెన్స్ కాల్‌ను రద్దు చేసిన నేపథ్యంలో… కంపెనీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై మరింత ఆసక్తి నెలకొంది.