Politics

సజ్జల డైరెక్షన్లో.. “అనంత” పోలీసులు పనిచేస్తున్నారు – TNI రాజకీయ వార్తలు

సజ్జల డైరెక్షన్లో.. “అనంత” పోలీసులు పనిచేస్తున్నారు – TNI రాజకీయ వార్తలు

*జిల్లా పోలీసులు ఆత్మసాక్షిగా పనిచేయాల్సిందిపోయి.. ప్రభుత్వసలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినట్లుగా నడుచుకుంటున్నారని అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. సజ్జల డైరెక్షన్లో పనిచేస్తూ.. 2018 నాటి ప్రభోదానంద కేసులో అమాయకులను ఇరికిస్తున్నారన్నారు.సజ్జల డైరెక్షన్లో.. “అనంత” పోలీసులు పనిచేస్తున్నారు: జేసీఅనంతపురం జిల్లా పోలీసులు.. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్లో పనిచేస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. 2018 నాటి ప్రభోదానంద కేసులో ఇప్పటికీ అమాయకులను ఇరికిస్తున్నారన్నారు. తెదేపా కార్యకర్తలను ప్రభోదానంద కేసులో ఇరికిస్తానంటూ.. పెద్దవడుగూరు ఎస్సై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పోలీసులు ఆత్మసాక్షిగా పనిచేయాల్సిందిపోయి.. సజ్జల చెప్పినట్లుగా నడుచుకుంటున్నారన్నారు.కేటీఆర్ వాస్తవాలే చెప్పారు: ఏపీలో సమస్యలపై చక్కగా చెప్పిన తెలంగాణ మంత్రి కేటీఆర్.. ఆ వెంటనే మాటను ఎందుకు వెనక్కి తీసుకున్నారో అర్థం కావట్లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో అక్షరాల కేటీఆర్ చెప్పినట్లుగా పరిస్థితులు ఉన్నాయన్నారు. మాట జారానని కేటీఆర్ చెబుతున్నా.. వాస్తవాలే మాట్లాడరని అన్నారు. ఏపీలో రోడ్లు, తాగునీరు, విద్యుత్ సమస్యలపై ఫోటోలు తీసి పంపటానికి తాను సిద్ధంగా ఉన్నానని.. కేటీఆర్ మాత్రం తన మాటను వెనక్కి తీసుకోవద్దని కోరారు.

*దిశ పేరుతో ప్రచారమే తప్పా.. మహిళల రక్షణేది: జవహర్
వైసీపీ ప్రభుత్వం సీఎం జగన్‌రెడ్డి దిశ పేరుతో ప్రచారమే చేస్తున్నారు కాని మహిళల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మాజీమంత్రి జవహర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల వివరాల గోప్యత గురించి కాదు మా ఆందోళన.. రాష్ట్రంలో మహిళల రక్షణ గాలిలో దీపాలెందుకు అయ్యాయో సీఎం జగన్‌రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. దిశ పేరుతో ప్రచారానికి పరిమితమయ్యారు తప్పా నిందితులపై తీసుకున్న చర్యలు శున్యమన్నారు. ఫోక్సో చట్టం ద్వారా ఈ రోజు వరకు ఏ ఒక్కరికి పరిహారమెందుకు అందివ్వలేదో చెప్పాలని నిలదీశారు. అత్యాచారాలు, హత్యలకు మూలమైన మద్యం, గంజాయి నాటుసార, డ్రగ్స్ పై చర్యలెందుకు తీసుకోవడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మద్య నిషేధం అటకెక్కించి శాంతి భద్రతలు ఎలా కాపాడతారో చెప్పాలని జవహర్ అన్నారు.

*ఏపీలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయి: లంకా దినకర్రా
ష్ట్రంలో వికేంద్రీకరణ అభివృద్ధి దేవుడెరుగు, వికేంద్రీకరణ అత్యాచార అరాచకాలకు నిలయం అవడం భాధాకరమని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, ఒక నెలలో మహిళలపై డజన్ల కొద్ది దుర్ఘటనలు నమోదు కావడం రాష్ట్రానికి అశుభం అన్నారు. ఒక కేసులో వేగవంతంగా పురోభివృద్ధి చూపి శిక్ష పడిందంటే ఉపయోగం లేదన్నారు. సామాజిక పరివర్తన కోసం ప్రయత్నం అవసరమని లంకా దినకర్ అన్నారు

*ప్రతి నియోజకవర్గంలో ఒక కోచింగ్ సెంటర్: మంత్రి తలసాని
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ లకు అదనంగా హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల పరిధిలో నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఎంఎల్ఏ ల ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం తన కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించే పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్ధులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ల ఏర్పాటు, నిర్వహణ పై హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ లు ఎంఎస్ ప్రభాకర్, స్టీఫెన్ సన్, సురభి వాణిదేవి, ఎంఎల్ఏ లు మాగంటి గోపీనాథ్, దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సాయన్న, రాజాసింగ్, జాఫర్ హుస్సేన్, జిల్లా కలెక్టర్ శర్మన్, బిసి వెల్ఫేర్ జాయింట్ డైరెక్టర్ అలోక్, డిప్యూటీ డైరెక్టర్ ఆశన్న, ఎస్సీ కార్పోరేషన్ డీడీ రామారావు, మైనారిటీ వెల్ఫేర్ డీడీ ఖాసీం, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ రామేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

*ఓయూని గల్లీ స్థాయికి తీసుకొచ్చారు: ఉత్తమ్
అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీని ఓయూకి రావడానికి అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఓయూ వీసీలుగా గొప్ప గొప్ప వారు పనిచేశారన్నారు. ఇప్పుడున్న వీసీ విజ్ఞతతో ఆలోచించాలన్నారు. రాహుల్ గాంధీది రాజకీయ విజిట్ కాదన్నారు. రాహుల్ లాంటి నేతలు ఓయూకి వెళ్తే మంచి గుర్తింపు వస్తుందన్నారు. టీఆర్ఎస్ పాలనలో కనీసం స్టాఫ్ నియామకం కూడా జరగడం లేదని చెప్పారు. రాహుల్ తెలంగాణలో పర్యటించడంపై టీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణ రావడానికి కారణం సోనియా గాంధీనేనని చెప్పారు. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే పదేళ్లు కేసీఆర్ తపస్సు చేసినా రాష్ట్రం వచ్చేది కాదన్నారు. గులాబీ నేతలు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని.. వారు వెంటనే క్షమాపణ చెప్పాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.

*తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి: రేవంత్‌
తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పంటను కొనే దిక్కులేక రైతు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రైతులకు అండగా నిలవడానికి కాంగ్రెస్ నేత రాహుల్‌ రాష్ట్రంలో పర్యటిస్తున్నారని తెలిపారు. ఓయూలో రాహుల్‌సభకు అనుమతి కోసం వినతిపత్రం ఇస్తే.. ప్రభుత్వ ఒత్తిడితో తిరస్కరించారని విమర్శించారు. మే 7న ఎన్‌ఎస్‌యూఐ నేతలను రాహుల్‌ పరామర్శిస్తారని రేవంత్ తెలిపారు.

*పీకే రాజకీయ పార్టీ ప్రకటన వెనుక కేసీఆర్: కోదండరాం
ప్రశాంత్ కిషోర్ రాజకీయ ఆరంగేట్రంపై టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం స్పందించారు. సోమవారం కోదండరాం ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. పీకే రాజకీయ పార్టీ ప్రకటన వెనుక సీఎం కేసీఆర్ ఉన్నారన్నారు.కేసీఆర్ జాతీయ పార్టీ.. ప్రశాంత్ కిషోర్ పార్టీ ఒక్కటేననే అనుమానం కలుగుతుందని చెప్పారు.కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడం కోసం పీకేను వాడుకుంటున్నారన్నారు.ఉస్మానియా యూనివర్సిటీలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి అనుమతి ఇవ్వాలనేది ప్రొఫెసర్‌గా తన అభిప్రాయమన్నారు.రాహుల్ గాంధీ రావాలని విద్యార్థులు కోరుకుంటున్నారని చెప్పారు. వివిధ పార్టీల నాయకుల రాకతో యూనివర్సిటీ విద్యార్థులకే మేలు జరుగుతుందని తెలిపారు.యూనివర్సిటీలో సభలకు అనుమతి అనేది పూర్తిగా వర్సిటీ అధికారులదే బాధ్యతని అన్నారు.రానున్న ఎన్నికల కోసం 25నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.బావ సారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పోటీచేస్తామని కోదండరాం వ్యాఖ్యానించారు.

*జగన్ పాలనతో ఏపీ నరకాంధ్రప్రదేశ్‌గా మారిపోయింది: చంద్రబాబు
జగన్ పాలనతో ఏపీ నరకాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందని తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సోమవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కీలక అంశాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ… అత్యాచారాలు, దాడులు, రైతు ఆత్మహత్యలు, వలసలతో రాష్ట్రం తల్లడిల్లుతోందన్నారు. ఒక్క ఏప్రిల్‌లోనే 31 అత్యాచార, దాడుల ఘటనలు జరిగాయన్నారు. గత నెలలో 26 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

*తమ్ముడూ కేటీఆర్.. నువ్వు చెప్పిందే కరెక్ట్.. కట్టుబడి ఉండు : జేసీ ప్రభాకర్తె
లంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఇటీవల ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై సంచలన కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు ఒక్క ఆంధ్రాలోనే కాదు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఇందుకు ఏపీకి చెందిన పలువురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు స్పందిస్తూ కౌంటర్‌లు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. సోమవారం నాడు తాడిపత్రిలో మీడియా మీట్ నిర్వహించిన ఆయన.. ‘తమ్ముడూ కేటీఆర్.. నువ్వు చెప్పింది కరెక్ట్.. ఆ కామెంట్స్‌కు కట్టుబడి ఉండు. ఎందుకనీ.. మళ్లీ స్లిప్ ఆప్ ద టంగ్ అంటావ్..?.. కేటీఆర్‌ చెప్పింది అక్షర సత్యమే. కేటీఆర్‌లో లోపల ఆవేశం ఉంది.. ఉన్నమాట అంటే ఏమీ కాదు.. రోడ్లు, కరెంటు లేదు. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అయిపోయింది. రోడ్లు బాగలేకపోవడంతో ఖరీదైన వాహనాల్లో కాకుండా జీపుల్లో తిరగాల్సి వస్తోంది. బహుశా కేటీఆర్.. బయపడి కాదు బాగుండదని మాట మార్చాడు అంతే. తెలంగాణలో ఉండే షర్మిల విమర్శిస్తే ఈయనకు కుతకుత అనదా..?’ అని జేసీ వ్యాఖ్యానించారు.పార్టీ మార్పుపై క్లారిటీ..అంతటితో ఆగని ఆయన.. గతంలో జరిగిన బస్సుల వ్యవహారంపై కూడా మాట్లాడారు. ‘ఊత పదం నీ అమ్మా అన్నానని .. ఈ రోజుకు నన్ను ఇప్పటికీ వదిలిపెట్టలేదు.. మాకు సంబంధించిన బస్సులు, లారీలు కూడా తిరగనివ్వలేదు’ అని ప్రభాకర్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా.. గత కొన్ని రోజులుగా జేసీ ఫ్యామిలీ పార్టీ మారుతున్నారని పెద్ద ఎత్తునే పుకార్లు షికార్లు చేశాయి. ఈ ప్రెస్‌మీట్ వేదికగా దీనిపైనా కూడా క్లారిటీ ఇచ్చేశారాయన. ‘ అవును.. బీజేపీ వాళ్లు మా ఇంటికొచ్చారు.. నేను వాళ్లింటికి వెళ్లలేదు. ఐదు పార్టీల పెద్దలు నాకు టిక్కెట్ ఇస్తారు.. అయినా సరే నాకేమీ వద్దు..’ అని జేసీ చెప్పుకొచ్చారు.

*ఏపీలో మహిళలకు రక్షణ లేదు: లోకేష్‌
జగన్ ప్రభుత్వంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన కర్నూలులో పర్యటించారు. ఈ సందర్బంగా మాజీ ఎంపీపీ రాజవర్ధన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. రాజవర్ధన్‌రెడ్డి మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో మహిళలకు రక్షణ లేదని, 800 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగితే చర్యలు లేవని మండిపడ్డారు. సీఎం జగన్ కనీసం బాధితులను పరామర్శించలేదని విమర్శించారు. డాక్టర్ సుధాకర్ లాంటి ఘటనలు అనేకం జరిగాయని, వీటికి జగన్‌రెడ్డి ఏం సమాధానం చెబుతారని లోకేష్ ప్రశ్నించారు

*ఉపాధి కేంద్రంగా తెలంగాణ: మల్లారెడ్డి
తెలంగాణ రాష్ట్రం ఉపాధి కేంద్రంగా మారిందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ కృషి వలన రాష్ట్రంలో కార్మికులు కష్టానికి తగ్గ ప్రతిఫలం పొందుతూ సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్ర కార్మికశాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్రభారతిలో మే డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 45 మందికి శ్రమశక్తి అవార్డులు, 12 సంస్థలకు బెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ అవార్డులను మంత్రులు మహమూద్‌ అలీ, తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, శ్రీనివా్‌సగౌడ్‌తో కలిసి మంత్రి మల్లారెడ్డి ప్రదానం చేశారు. ఇతర రాష్ర్టాల నుంచి వస్తున్న వలస కార్మికులకు తెలంగాణ, హైదరాబాద్‌ అడ్డాగా మారిందని ఈ సందర్భంగా మల్లారెడ్డి అన్నారు. 40 ఏళ్ల క్రితం తాను పూలు, పాలు అమ్మానని, ఇప్పుడు తన కళాశాలలు దేశంలోనే టాప్‌టెన్‌లో ఉన్నాయని, మనం ఎంత కష్టపడితే అంత గొప్ప వాళ్లమవుతామనే దానికి తానే ఉదాహరణ అన్నారు. పరిశ్రమల్లో గతంలో ఎప్పుడూ సమ్మెలు జరిగేవని.. తెలంగాణ వచ్చాక 24 గంటల కరెంట్‌తో కార్మికులు ఓవర్‌టైం పనిచేస్తూ ఆదాయం పొందుతున్నారని పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కరోనా సమయంలో కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు ఆదర్శంగా నిలిచాయని హోం మంత్రి మహమూద్‌ అలీ అన్నారు. కార్మికులను ఆర్థికంగా, సామాజికంగా పైకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ చెప్పారు.

*జగన్‌ జైలుకు వెళ్లడానికి తల్లి పెంపకమే కారణమా?
‘‘తల్లుల పెంపకంలో లోపం వల్లే ఆడబిడ్డలపై అత్యాచారాలు జరుగుతున్నాయని హోం మంత్రి తానేటి వనిత సెలవిచ్చారు. తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తల్లులపై నింద వేసే స్థితికి దిగజారారు. జగన్‌రెడ్డి 16 నెలలు జైల్లో ఉండి రావడానికి తల్లి పెంపకంలో లోపమే కారణమా? హోం మంత్రి సమాధానం చెప్పాలి’’ అని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్‌ చేశారు. హోం మంత్రి వ్యాఖ్యలపై ఆదివారం ఆమె ఇక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘విజయవాడ ఆస్పత్రిలో మానసిక దివ్యాంగురాలిపై, గుంటూరు జిల్లా తుమ్మపూడిలో ముగ్గురు బిడ్డల తల్లిపై, రేపల్లెలో భర్త కళ్ల ముందే రైల్వే స్టేషన్‌లో ఒక మహిళపై గ్యాంగ్‌ రేప్‌ జరిగితే..ఆఖరికి పసిబిడ్డలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి.. ఇందులో లోపం ఆ బాధతుల తల్లులదా?.. అది ఏ తల్లి పెంపకం తప్పో హోం మంత్రి చెప్పాలన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వనిత హోం మంత్రి పదవికి అనర్హురాలని, తక్షణం ఆ పదవి నుంచి దిగపోవాలని అనిత డిమాండ్‌ చేశారు.

*జగన్ ఉపేక్షించరు.. వాళ్లను కఠినంగా శిక్షిస్తాం: మంత్రి విడదల రజిని
రేపల్లె ఘటన అత్యంత బాధాకరమని మంత్రి విడదల రజిని ఓ ప్రకటనలో అన్నారు. పొట్టకూటి కోసం వెళ్లిన కుటుంబానికి ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఘటన గురించి తెలిసిన వెంటనే సీఎం జగన్ స్పందించారని తెలిపారు. పూర్తి వివరాలు తీసుకుని పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని రజిని చెప్పారు. బాధ్యులపై చర్యల విషయంతో పాటు బాధితురాలి ఆరోగ్యంపై కూడా సీఎం మాట్లాడారని ఆమె తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామన్నారు. సీఎం జగన్ ఇలాంటి ఘటనలను ఉపేక్షించరని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా అందించామని మంత్రి విడదల రజిని పేర్కొన్నారు.

*హోంమంత్రిగా తానేటి వనిత అనర్హురాలు: అచ్చెన్నాయుడు
హోంమంత్రిగా తానేటి వనిత అనర్హురాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. గంజి ప్రసాద్ హత్య, రేపల్లె ఘటనపై స్పందించిన ఆయన రాష్ట్రంలో రోజు రోజుకు హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయన్నారు. ఎప్పుడైనా అధికార పార్టీ ఎమ్మెల్యే‌ను కొట్టడం చూశారా అని ప్రశ్నించారు. ఒక్క అవకాశం అని.. రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని మండిపడ్డారు.

*ఫిర్యాదు చేయడానికి వస్తే కొడతారా: సాకే
‘‘వైసీపీ నేతపై ఫిర్యాదు చేయడానికి పోలీస్‌ స్టేషన్‌కు వస్తే దారుణంగా కొడతారా? బండబూతులు తిడతారా? ప్రజలతో పోలీస్‌ భాష ఇంత దారుణంగా ఉంటుందా? ఇదేనా ఫ్రెండ్లీ పోలిసింగ్‌ అంటే?’’ అని ఏపీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ ప్రశ్నించారు. ఎస్‌ఐ ఓ యువకుడిని కొడుతున్న వీడియోను, ఓ ప్రకటనను ఆదివారం ఆయన విడుదల చేశారు. ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసు వ్యవస్థ… కొంతమంది పోలీసు అధికారుల తీరుతో సిగ్గుపడాల్సి వస్తోందన్నారు. ఎస్‌ఐతోపాటు, దివ్యాంగురాలైన తన తల్లి పింఛను అడగడం కోసం వెళితే కొట్టిన వైసీపీ నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని శైలజానాథ్‌ డిమాండ్‌ చేశారు

*వచ్చే ఎన్నికల్లో 175 సీట్లు మావే: కాకాణి, పెద్దిరెడ్డి
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో విజయదుందుభి మోగిస్తుందని అన్నమయ్య జిల్లా ఇన్‌చార్జి మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అన్నమ య్య జిల్లా రామాపురం మండలంలోని సుద్దమళ్ల పంచాయతీ ఎర్రంరెడ్డిగారిపల్లెలో అన్నమయ్య జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు, స్థానిక శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్వగృహంలో జిల్లా వైసీపీ నాయకుల సమన్వయ సమావేశం ఆదివారం నిర్వహించారు. మంత్రులు మాట్లాడుతూ.. ప్రజాదరణ ఉన్నంతవరకు ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు ఎన్ని కుట్రలు పన్నినా జగన్మోహన్‌రెడ్డిని ఏమీ చేయలేరన్నారు. పశ్చిమగోదావరి జిల్లా శాసనసభ్యుడు తలారి వెంకట్రావుపై జరిగిన దాడి విషయం విలేకరులు ప్రస్తావించగా.. అది గ్రామ స్థాయిలో వారి మధ్య ఉన్న విభేదాలుగా కొట్టి పారేశారు

*తొలి రోజే 79.49@ పెన్షన్లు పంపిణీ: బూడి
సామాజిక పింఛన్‌దారులకు ప్రతి నెలా మొదటి రోజే డబ్బులు పంపిణీ చేసేలా చర్యలు చేపట్టామని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు అన్నారు. విశాఖలోని ప్రభుత్వ అతిథిగృహంలో ఆదివారం మాట్లాడుతూ.. ఈ నెల 1 ఆదివారం అయినప్పటికీ వలంటీర్లు ఉదయం 5 నుంచే ఫింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి సాయంత్రానికి 79.49 శాతం మందికి పింఛన్లు పంపిణీ చేశారని తెలిపారు.