Movies

పదే పదే అడగొద్దు

Auto Draft

పొడగరి రకూల్ ప్రీత్ సింగ్ తాను జాకీ భగ్నానీ ప్రేమలో ఉన్నట్లు కొన్నాళ్ళ క్రితం ప్రకటించి ఉంది. అప్పటినుంచి ఎప్పుడు మీడియా ముందుకు వచ్చినా ఇదే విషయమై ఏదోక ప్రశ్న వేస్తూనే ఉన్నారు. ఈ ప్రశ్నల పరం పరతో రకుల్కు విసుగు వచ్చిందేమో, ” నేనేమీ చెప్పను ” అంటూ ఓ వివరణనూ విసిరింది. ” ఇదంతా సర్వసాధారణమైన వ్యవహారం. ప్రతి ఒక్కరి జీవితంలోనూ జరిగేదే. అమ్మా, నాన్న, తమ్ముడు ఎలా వుంటారో అదే మాదిరి జీవిత భాగస్వామి కూడా ఉంటాడు. దయచేసి ప్రతిసారీ అడక్కండి. మా బంధం గురించి ఏదైనా చెప్పాల్సిన అవసరంవస్తే నేను స్వయంగా మాట్లాడతా ” అంటూ విసుగును వ్యక్తం చేసింది.