Movies

‘ఎఫ్ 3’ ట్రైలర్ వచ్చేస్తోంది !

‘ఎఫ్ 3’ ట్రైలర్ వచ్చేస్తోంది !

విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్ టైనర్ ‘ఎఫ్ 3’. సూపర్ హిట్ చిత్రం ‘ఎఫ్ 2’ కు ఇది సీక్వెల్ అన్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా.. మొదటి భాగంలోని పాత్రలతోనే .. వేరే కథతో రూపొందుతోంది. డబ్బు చుట్టూ తిరిగే కథతో ఈ భాగం నవ్వులు పూయించనుంది. తమన్నా, మెహ్రిన్ కథానాయికలుగా కంటిన్యూ అవుతుండగా.. సునీల్ పాత్ర అదనంగా చేరుతోంది. మొదటి భాగాన్ని మించిన స్థాయిలో ఇందులోని కామెడీని వర్కవుట్ చేశాడట దర్శకుడు. ఇటీవలే టాకీ పార్ట్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఈ నెల 27న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో ‘ఎఫ్ 3’ ట్రైలర్ ను ఈ నెల 9న విడుదల చేస్తున్నట్టు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు మేకర్స్.
‘సమ్మర్ సోగ్గాళ్లు’ అనే ట్యాగ్ లైన్ తో ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా వెంకీ, వరుణ్ ఖాతాలో ష్యూర్ షాట్ హిట్‌గా నమోదవుతుందని చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఓ ప్రత్యేకగీతంలో నర్తిస్తోంది. త్వరలోనే ఈ పాట లిరికల్ సాంగ్ ను విడుదల చేయబోతున్నారు. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఎఫ్ 3 చిత్రం ఏ స్థాయి సక్సెస్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.