DailyDose

ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న కనిమొళి

ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్న కనిమొళి

ఇకపై శివకళై గ్రామ ప్రజలకు కనీస సదుపాయాలన్నింటినీ కల్పించి, అభివృద్ధి పనులను విరివిగా చేపడతానని డీఎంకే మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎంపీ కనిమొళి పేర్కొన్నారు. ఆదివారం ఉదయం తూత్తుకుడి జిల్లా శివకళై గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఆమె ఈ గ్రామాన్ని దత్తత తీసు కుంటున్నట్టు ప్రకటించారు. గ్రామసభలో మహిళా స్వయం సహాయక సంఘాలు తయారు చేసిన ఉత్పత్తుల ప్రదర్శనను ఆమె సందర్శించారు. అనంతరం గ్రామసభలో ఆమె మాట్లాడుతూ శ్రామికుల దినం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామసభలు నిర్వహిస్తున్నారని, ఈ సభల వల్ల గ్రామాల్లో ప్రజల సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి స్టాలిన్‌ కూడా రాష్ట్రంలో యేడాదికి ఆరు గ్రామసభలను నిర్వహించాలని ఆదేశించి నట్టు తెలిపారు. శివకళై గ్రామంలో నిర్వహించిన పురావస్తు తవ్వకాల్లో తమిళుల ప్రాచీన నాగరికతకు సంబంధించి వస్తువులు బయల్పడ్డాయని ఆమె చెప్పారు. శివకళైలో పురావస్తు తవ్వకాలు చేపట్టేందుకు డీఎంకే ప్రభు త్వం ఎన్ని అడ్డంకులు ఎదురైనా సమర్థవంతంగా ఎదుర్కొని తవ్వకాలు కొనసాగిస్తోందని వెల్లడించారు. శాసనసభ ఎన్నికల సందర్భంగా డీఎంకే ప్రకటించిన హామీలను ప్రభుత్వం వరుసగా నెరవేరుస్తున్నదని, రాష్ట్ర ఆర్థిక పరిసితి ఆశాజనకంగా లేకపోయినా కీలకమైన హామీలన్నింటిని పదినెలల్లోగా నెరవేర్చిందన్నారు.