Movies

శిక్షణే శిక్షణ..

శిక్షణే శిక్షణ..

నొక్కుల జుట్టు , పొట్టబుగ్గల బ్యూటీ సీరత్ కపూర్ దిల్ రాజు ప్రొడక్షన్లో తాజా సీక్వెల్ కోసం భారీగా సిద్ధం అవుతున్నది. నటనలో డెడికేషన్లో తిరుగులేని పిల్లే అయినప్పటికీ ఎందుకోగాని సీరత్ కెరీర్లో పెద్దగా స్పీడు అందుకోలేదు. ప్రస్తుతం ఈ సీక్వెల్ తొలి షెడ్యూల్ పూర్తిచేసి, సెకండ్ షెడ్యూల్ శిక్షణలో వుంది. విభిన్న మూవ్ మెంట్లు, రిథమ్స్ కోసం, కొత్తదనం, ఫ్లెక్సిబిలిటీల కోసం శిక్షణలు తీసుకుంటున్నది. పిలేట్స్ సెషన్పై ఫోకస్ చేసింది. “ నా పాత్ర గురించి ఇప్పుడే వివరించాను. పూర్తి ఫిల్మింగ్ అనుభవం బావుంది. సహనమే ధర్మం అన్న విషయం బాగా అర్థమయింది ” అంటూ మెరిసి పోయేలా నవ్వులు జిమ్మింది.