DailyDose

విజయవాడకు గంజాయి తరలిస్తున్న ఆరుగురు పట్టివేత – TNI నేర వార్తలు

విజయవాడకు గంజాయి తరలిస్తున్న ఆరుగురు పట్టివేత – TNI  నేర వార్తలు

*డ్ర‌గ్ మాఫియాకు యూపీ అడ్డాగా మారింది. ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌లో రూ 1300 కోట్ల విలువైన 210 కిలోల హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీలోని షహీన్‌బాగ్‌లో బ‌య‌ట‌ప‌డిన నార్కోటిక్స్ రాకెట్‌తో యూపీలో వెలుగుచూసిన తాజా డ్ర‌గ్ దందాకు సంబంధం ఉన్న‌ట్టు అనుమానిస్తున్నారు. గుజ‌రాత్ ఏటీఎస్‌, ఎన్‌సీబీ, డిల్లీ పోలీస్ స్పెష‌ల్ సెల్‌తో కూడిన సంయుక్త ఆప‌రేష‌న్‌లో భారీగా డ్ర‌గ్స్ పట్టుబ‌డ్డాయి.

*కోయంబత్తూరు విమానాశ్రయంలో సింగపూర్‌ నుంచి అక్రమంగా తరలించిన రూ. కోట్ల విలువైన  కిలోల బంగారాన్ని కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మలేసియాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేశారు. సింగపూర్‌ నుంచి కోయంబత్తూరుకు బయల్దేరిన ఓ విమానంలో బంగా రాన్ని తరలిస్తున్నారనే సమాచారంతో కస్టమ్స్‌ అధికారులు అప్రమత్తమయ్యారు.. సింగపూర్‌ విమానం నుంచి దిగిన ప్రయాణికుల్లో ఇద్దరి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో వారిని ప్రత్యేక గదిలోకి తీసుకెళ్లి తనిఖీలు చేపట్టారు. ఆ తనిఖీల్లో వారి హ్యాండ్‌ బ్యాగులలో దాచి వుంచిన బంగారం పట్టుబడింది. దీనితో మలేసియాకు చెందిన తంగేశ్వరన్‌నందిని అనే ఆ ఇద్దరిని అరెస్టు చేశారు.

*భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేటలో (Aswaraopeta) అగ్నిప్రమాదం జరిగింది. అశ్వరావుపేటలోని వడ్డెర బజారులో ఉన్న ఓ గుడిసెలో ఆదివారం రాత్రి ప్రమాదవశాత్తు కొవ్వొత్తి అంటుకున్నది. మంటలు చెలరేగడంతో అందులో ఉన్న వృద్ధుడు సజీవదహనం అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని పెద్దభిక్షం (80)గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

*రాజేంద్రనగర్‌ పరిధిలోని మైలార్‌దేవ్‌పల్లిలో (Mailardevpally) ఏటీఎం చోరీ యత్నం విఫలమయింది. మైలార్‌దేవ్‌పల్లిలోని శ్రీరామ్‌నగర్‌ కాలనీలో ఉన్న యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో ఓ దొంగ చొరబడ్డాడు. ఏటీఎం మెషిన్‌ను ఇనుప రాడ్డుతో ధ్వంసం చేశాడు. అయితే అలారం మోగడంతో దుండగుడు పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏటీఎం కేంద్రం పరిసరాలను, సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

*విజయవాడకు 40 కిలోల గంజాయి తరలిస్తున్న ఆరుగురు నిందితులు పోలీసులకు పట్టుబడ్డారు. ఎస్‌ఐ దాసరి నాగేంద్ర తన సిబ్బందితో కలిసి చీడిపాలెం రహదారిలో వాహనాల తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో బూదరాళ్ల– చాపరాతిపాలెం రహదారి నుంచి కాకరపాడు వైపు వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను తనిఖీ చేయగా, గంజాయి బయట పడింది. ఆరుగురు యువకులను అరెస్టు చేసి వాటిని స్వాధీనం చేసుకున్నారు. విజయవాడకు చెందిన కొండా యహోవ, తుమ్మల మనోజ్, మేరుగు చందు, షేక్‌ జానీ, జి. సాయిజగదీశ్వరరావుతోపాటు వారికి గంజాయి అమ్మిన పాడేరు మండలం ఇడ్డుపల్లికి చెందిన వంతల సుమన్‌లను అరెస్టు చేశారు. వీరిని రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు. రెండు రోజుల క్రితం గుడ్లపల్లి సమీపంలో 120 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

*విజయవాడలో ఓ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. నూజివీడు మండలానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. బాలిక‌ అరవడంతో నిందితుడు పరారయ్యాడు. నూజివీడు మండలంలో ఇంటర్ చదువుతున్న బాలికకు, బెంగుళూరుకు చెందిన అంజనేయులు అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆంజనేయులును కలిసేందుకు బాలిక విజయవాడ వచ్చింది. హోటల్ అడ్రస్ చూపిస్తానంటూ బాలికను ఆటో ఎక్కించుకున్న డ్రైవర్ నేరుగా నున్న ప్రాంతంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సహకారంతో చుట్టు పక్కల వారు గమనించి ఆమెను కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు సింగ్‌నగర్‌కి చెందిన ఆటో డ్రైవర్‌గా గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు

*బొండపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై విశాఖ డైరీకి చెందిన లారీ, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ బోల్తా పడింది. కారు నుజ్జు నుజ్జు అయ్యి.. చెరువులో పడిపోయింది. పరిస్థితి విషమంగా ఉన్న వ్యక్తి.. బొండపల్లి మండలం గిట్టుపల్లి గ్రామానాకి చెందిన లగుడు దేవళ్లు (42) గా గుర్తించారు.

*బాపట్ల: జిల్లాలోని వేటపాలెం మండలం పందిళ్ళపల్లి బైపాస్‌లో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతులు వేటపాలెం మండలం కొత్తపేటకు చెందిన ధర్మరాజు(20), కనకారావు(41)గా గుర్తించారు.

*అనంతపురం: జిల్లాలోని రాయదుర్గంలో అర్ధరాత్రి దొంగలు హాల్‌చల్ చేశారు. స్థానికులను భయభ్రాంతులకు గురిచేసి దొంగతనం చేసేందుకు యత్నించారు. దబ్బడి కాంప్లెక్స్ వద్ద ముసుగులు ధరించి బొలెరోలో వచ్చిన దుండగులను ఓ యువకుడు ప్రశ్నించాడు. దీంతో రెచ్చిపోయిన దొంగలు మద్యం సీసాలతో యువకుడిపై దాడికి పాల్పడ్డారు. అక్కడి నుంచి తప్పించుకున్న యువకుడు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దొంగలు వచ్చిన వాహనాన్ని వెంబడించారు. బళ్లారి రోడ్డు కుంటిమారెమ్మ గుడి సమీపాన బొలెరోను వదిలేసి దొంగలు పరారైయ్యారు. పందుల దొంగతనానికి కర్ణాటక ప్రాంతం నుంచి వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

*దామినేడుకు చెందిన గోవర్ధన్ అనే బాలుడిని ఓ మహిళ కిడ్నాప్ చేసింది. నిన్న సాయంత్రం 5.45 గంటలకు గోవర్థన్ తిరుమలలో తప్పిపోయాడు. 7:11 నిముషాలకు బాలుడిని తీసుకొని తిరుమల నుంచి నిందితురాలు తిరుపతికి వెళ్ళిపోయింది. సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. బాలుడిని కిడ్నాప్ చేసిన మహిళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. బాలుడి జాడ తెలిస్తే 9440796769, 9440796772 నంబర్లకు తెలియజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

*శ్రీకాకుళం: జిల్లాలోని నందిగామ మండలం కణితూరు – గోవిందపురం మధ్యలో ఓ ట్రాక్టర్ అదుపుతప్పి పొలంలోకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు లఖిదాసుపురం గ్రామానికి చెందిన డ్రైవర్ బొంగి వంశీకృష్ణ , గున్న అజయ్ కుమార్‌గా గుర్తించారు. ఆదివారం రాత్రి పూండిలో ఇటుకల లోడు తీసుకువెళ్ళి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది.
విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

*తిరుపత్తూర్‌ జిల్లా వాణియంబాడి తాలూకా మదనంచేరికి చెందిన పెయింటర్‌ రవి కుమారుడు దినకరన్‌ (21) కాంటాక్ట్‌ పనులకు వెళ్తుంటాడు. దినకరన్‌ గత నెల 29వ తేది సాయంత్రం ద్విచక్రవాహనంపై వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడి, వేలూరు సీఎంసీలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం మెదడు నిర్జీవం కావడంతో వైద్యుల సూచన మేరకు అతని అవయవాలు దానం చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. ఆ ప్రకారం శస్త్రచికిత్స ద్వారా గుండె, లివర్‌, కిడ్నీలను తొలగించి, వివిధ ఆస్పత్రులకు వాటిని పంపినట్లు వైద్యులు తెలిపారు.

*రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధి పీడీపీ చౌరస్తా సమీపంలో కుటుంబ కలహాలతో మామా అల్లుళ్ల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మామ ఖదీర్‌పై అల్లుడు కత్తితో దాడి చేశాడు. మామ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

*ధర్మపురి జిల్లా సరిహద్దుల్లో రూ.3 కోట్ల విలువైన హెరాయిన్‌ను ఇంటెలిజెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్‌ నుంచి మదురైకు భారీ మొత్తంలో హెరాయిన్‌ అక్రమంగా తరలిస్తున్నట్టు నిఘా అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో ఆదివారం వేకువజామున ధర్మపురి జిల్లా తొప్పూరు టోల్‌గేట్‌లో వాహనాల తనిఖీ చేపట్టారు. ఆ సమయంలో వచ్చిన ఒక కారును ఆపి తనిఖీ చేసి, రూ.3 కోట్ల విలువైన హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మదురై ఇందిరా నగర్‌కు చెందిన బాలకృష్ణన్‌ (47), మధ్యప్రదేశ్‌కు చెందిన రాధేశ్యామ్‌ (54)లను అరెస్టు చేశారు. వీరిని ఎక్సైజ్‌ ఇంటెలిజెన్స్‌ అధికారులు విచారణ జరుపుతున్నారు.

*తిరువాన్మియూరులో ఇద్దరు జాలర్లు దారుణ హత్యకు గురయ్యారు. మృతులను సతీష్‌ కుమార్‌ (27), అరుణ్‌ (22)గా గుర్తించారు. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు.. తిరువాన్మియూరు కుప్పం వేంబులియమ్మన్‌ ఆలయ వీధికి చెందిన సతీష్‌ కుమార్‌, అరుణ్‌ మంచి స్నేహితులు. మత్స్యకారులైన వీరిద్దరు మరికొంతమంది స్నేహితు లతో కలిసి తిరువాన్మియూరు బీచ్‌లో ప్రతి రోజూ మద్యం సేవించేవారు. శనివారం కూడా ఇదే విధంగా మరికొందరితో కలిసి పీకల వరకు మద్యం సేవించారు. మద్యం మత్తులో అరుణ్‌ మరో వ్యక్తి దినే్‌ష మధ్య గొడవ ప్రారంభమైంది. అప్పటికే వీరిద్దరి మధ్య పాత గొడవలుండడంతో దినేష్‌ తన స్నేహితులతో కలిసి అరుణ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించగా, సతీష్‌ కుమార్‌ అడ్డుపడటమేకాకుండా దినే్‌షపై దాడికి దిగాడు. దీంతో అక్కడ నుంచి వెళ్ళిపోయిన దినేష్‌ కొంతసమయం తర్వాత కత్తితో రావడాన్ని చూసి సతీష్‌, అరుణ్‌ అక్కడ నుంచి పరుగులు తీసారు. అయినప్పటికీ దినేష్‌ వారిని వెంబడించి కత్తితో పొడిచాడు. స్థానికులు వారిద్దరినీ ఆస్పత్రులకు తరలించగా వారిద్దరూ అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేయగా, దినేష్‌ స్టేషన్‌లో లొంగిపోయాడు.

*శ్రీ సత్య సాయి: జిల్లాలోని కనగానపల్లి మండలం మామిళ్ళపల్లి సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో రామగిరి మండలం కుంటీమద్ధి గ్రామానికి చెందిన అమర్నాథ్(28) అక్కడికక్కడే మృతి చెందాడు. అమర్నాథ్ భార్యతో పాటు ఇద్దరు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికు చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు

*విజయవాడనగరంలో ఓ బాలికపై అత్యాచారయత్నం…నూజివీడు మండలానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం…
బాలిక‌ అరవడంతో నిందితుడు పరారనూజివీడు మండలంలో ఇంటర్ చదువుతున్న బాలికకు, బెంగుళూరుకు చెందిన అంజనేయులు అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం..ఆంజనేయులును కలిసేందుకు విజయవాడ వచ్చిన బాలికహోటల్ అడ్రస్ చూపిస్తానంటూ బాలికను ఆటో ఎక్కించుకున్న డ్రైవర్ బాలికను నేరుగా నున్న ప్రాంతంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేసిన డ్రైవర్బాలిక పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యన డ్రైవర్ స్థానికుల సహకారంతో చుట్టు పక్కల వారు గమనించి కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు నిందితుడు సింగ్‌నగర్‌కి చెందిన ఆటో డ్రైవర్‌ నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు.

*విజయవాడలో ఓ బాలికపై అత్యాచారయత్నం జరిగింది. నూజివీడు మండలానికి చెందిన ఓ ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం చేశాడు. బాలిక‌ అరవడంతో నిందితుడు పరారయ్యాడు. నూజివీడు మండలంలో ఇంటర్ చదువుతున్న బాలికకు, బెంగుళూరుకు చెందిన అంజనేయులు అనే వ్యక్తితో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆంజనేయులును కలిసేందుకు బాలిక విజయవాడ వచ్చింది. హోటల్ అడ్రస్ చూపిస్తానంటూ బాలికను ఆటో ఎక్కించుకున్న డ్రైవర్ నేరుగా నున్న ప్రాంతంలోని పొలాల్లోకి తీసుకువెళ్లి అత్యాచారయత్నం చేశాడు. బాలిక పెద్దగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సహకారంతో చుట్టు పక్కల వారు గమనించి ఆమెను కృష్ణలంక పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు సింగ్‌నగర్‌కి చెందిన ఆటో డ్రైవర్‌గా గుర్తించారు. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

*బొండపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో జాతీయ రహదారిపై విశాఖ డైరీకి చెందిన లారీ, కారు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. లారీ బోల్తా పడింది. కారు నుజ్జు నుజ్జు అయ్యి.. చెరువులో పడిపోయింది. పరిస్థితి విషమంగా ఉన్న వ్యక్తి.. బొండపల్లి మండలం గిట్టుపల్లి గ్రామానాకి చెందిన లగుడు దేవళ్లు (42) గా గుర్తించారు.

*ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మ హిళ తన రెండేళ్ల కొడుకుతో పాటు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కాటంవారిపల్లె వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం బెల్లంకొండ గ్రామానికి చెందిన నాగలక్ష్మి(25)కు కురిచేడు మండలం కాటంవారిపల్లెకు చెందిన హనుమంతరావుతో ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి నిరేష్‌(2), శ్రీహరి(5) పిల్లలున్నారు. భార్యాభర్తలిద్దరూ కూలి పనులు చేసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో హనుమంతరావు రూ.70వేలు అప్పు చేశాడు. దాన్ని తీర్చే విషయమై భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. శనివారం రాత్రి కూడా ఇద్దరూ గొడవపడ్డారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నాగలక్ష్మి తన ఇద్దరు పిల్లలను తీసుకొని ఇంటి సమీపంలోని రైల్వే ట్రాక్‌పైకి వెళ్లింది. రైలు వచ్చే సమయంలో పెద్దకుమారుడు శ్రీహరి ట్రాక్‌పై నుంచి భయంతో పరుగులు తీశాడు. విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు వచ్చి చూసే సరికి నాగలక్ష్మి, చిన్నకుమారుడు నిరేష్‌ మృతదేహాలు ట్రాక్‌పై పడి ఉన్నాయి.

*ఓ పాఠశాల బాలిక షావర్మా తిని ఫుడ్ పాయిజన్‌తో మృతి చెందిన ఘటన కేరళ రాష్ట్రంలోని కన్హంగాడ్ జిల్లాలో వెలుగుచూసింది. కన్హంగాడ్ జిల్లాకు చెందిన 19 మంది పాఠశాల విద్యార్థులు షావర్మా తిని ఫుడ్ పాయిజనింగ్ అవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. షావర్మా తిన్న 16 ఏళ్ల బాలిక ఫుడ్ పాయిజన్ కావడంతో చికిత్స పొందుతూ మరణించింది.మరో 18 మంది అస్వస్థతతో కరివల్లూర్‌కు చెందిన దేవానంద కన్హన్‌గాడ్ జిల్లా ఆసుపత్రిలో చేరారు.షావర్మా విక్రయించిన దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేసి దాన్ని సీజ్ చేశారు. 18మంది విద్యార్థులు కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు.ఈ ఘటనపై కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ విచారణకు ఆదేశించారు.

*న్యూఢిల్లీ నుంచి బెంగాల్‌లోని దుర్గాపూర్‌ బయల్దేరిన స్పైస్‌జెట్‌ విమానం(ఎ్‌సజీ 945) గగనతలంలో తీవ్ర కుదుపులకు లోనైంది. ప్రతికూల వాతావరణంతో తీవ్రమైన టర్బ్యులెన్స్‌ను ఎదుర్కొంది. కుదుపులు భారీగా ఉండడంతో కేబిన్‌ లగేజ్‌ తలుపులు తెరుచుకుని ప్రయాణికులపై బ్యాగేజీ పడింది. ప్రయాణికుల మధ్య తొక్కిసలాట జరిగి 40 మంది ప్రయాణికులకు గాయాలైనట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

* హిందూ మహాసభలో విద్వేష ప్రసంగం చేసిన కేరళ మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జిని అరెస్టు చేయడం ఉద్రిక్తతకు దారి తీసిం ది. శుక్రవారం తిరువనంతపురంలో నిర్వహించిన అనంతపురి హిందూమహా సమ్మేళన్‌లో జార్జి మాట్లాడుతూ ముస్లింల వ్యాపారాలను బహిష్కరించాలని ముస్లిమేతరులకు పిలుపునిచ్చారు.

*పామర్రులో వరకట్న వేధింపులకు నవ వధువు బలైంది. పామర్రుకార్పెంటర్ కాలనీలో అనుమానాస్పద స్థితిలో ఇటుకల అమూల్య (మృతి చెందింది. అయితే అధిక కట్నం కోసం అల్లుడు ప్రసంగి బాబు తమ కుమార్తెను చంపిఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని అమూల్య తల్లిదండ్రులు ఆరోపించారు. భార్యభర్తల మధ్య గొడవల కారణంగా అమూల్య ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని భర్త తరఫు బంధువులు చెబుతున్నారు. పెళ్లి అయిన పది నెలలకే తమ కుమార్తె మరణించడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*ఆదివారం కైకలూరు పట్టణంలో ఓ సైకో హల్‌చల్‌ చేశాడు. రహదారిపై వెళ్తున్న పలువురిపై దాడి చేసేందుకు యత్నించి వారిని భయభ్రాంతులకు గురిచేశాడు. స్థానిక బస్టాండు సమీపంలో ఆటో ఎక్కేందుకు వెళ్తున్న ప్రయాణికులపై దాడికి ప్రయత్నించి, అక్కడ ఆగి ఉన్న కారులోకి ప్రవేశించి దాన్ని తీసుకేళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. స్ధానికులు ధైర్యం చేసి అతనిని తాళ్లతో కట్టి ఆటోలో పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.అతన్ని కట్టడి చేసేందుకు పోలీసులు సైతం శ్రమించారు. పట్టణ పోలీసులు అతని వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో…సైకో ఒడిశా ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించి, అతనితో ఒరియాలో మాట్లాడి తల్లిదండ్రుల వివరాలను సేకరించి ఫోన్‌ ద్వారా వారికి సమాచారం అందజేశారు. ప్రథమ చికిత్స అనంతరం అతన్ని తల్లిదండ్రులకు అప్పగించనున్నట్లు పోలీసులు తెలిపారు.

*కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో పట్టపగలు.. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే ఓ యువకుడ్ని పుట్టిన రోజు నాడే.. అతని స్నేహితుడు కత్తితో నరికి దారుణంగా హత్య చేశాడు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనను చూసిన స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. స్థానిక విఘ్నేశ్వర థియేటర్‌ సమీపంలో జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. భాస్కర్‌నగర్‌లో నివాసముంటున్న తలాటి శివ(28) తాపీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గతంలో రాజీవ్‌ గృహకల్పలో నివాసం ఉన్న సమయంలో అతనికి నరాల మణికంఠతో స్నేహం ఏర్పడింది. వీరి మధ్య వివాదం రావడంతో అక్కడి నుంచి వచ్చి సోదరుడితో కలిసి భాస్కర్‌నగర్‌లో ఉంటున్నాడు. పుట్టినరోజు కావడంతో బిర్యానీ కొంటుండగా.. అప్పటికే అక్కడ కాపుకాసి ఉన్న మణికంఠ వేటకత్తితో ఒక్కసారిగా దాడి చేయడంతో అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. దారుణానికి పాల్పడిన మణికంఠ నేరుగా పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు

*హైదరాబాద్న గరంలోని బాలానగర్‌లో భారీగా గంజాయి పట్టుబడింది. సఫారీ కారులో కిలోల గంజాయి తరలిస్తుండగాఎస్.ఓ.టి బాలానగర్ పోలీసులు పట్టుకున్నారు. మెదక్ జిల్లా రాయికోడ్ నుంచి మేడ్చల్‌కు తరలిస్తుండగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మొగులయ్యసిద్ధులు అనే వ్యక్తులు వారి స్నేహితులు ప్రదీప్చంటిల ద్వారా గంజాయిని మేడ్చల్‌కు తరలిస్తుండగా పక్కా సమాచారంతో పోలీసులు పట్టుకున్నారు. సఫారీ కారు ఫోన్లు స్వాధీనం చేసుకున్న ఎస్వోటీ పోలీసులు ప్రదీప్(చంటిఅను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.