Movies

ఈ పిల్ల వెరీ బిజీ

ఈ పిల్ల వెరీ బిజీ

అరడజను చిత్రాలతో బిజీబిజీగా గడుపుతున్నది ‘పెళ్ళిసందడి’ పిల్ల శ్రీలీల. ఒకే ఒక్క సినిమాతో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల జాబితాలో చేరింది. ప్రస్తుం ఈ అమ్మాయికి బ్రహ్మాండమైన క్రేజీ వుంది. ‘ధమాకా’, ‘అనగనగా ఒక రోజు’లో నటిస్తున్నది. వారాహి బ్యానర్లో తీస్తున్న చిత్రం లోనూ ఈ బ్యూటీయే హీరోయిన్. నితిన్ సరసన ఒక సినిమాలో ఎంపికైంది. ఆశిష్ రెండో సినిమా ‘సెల్ఫిష్’లోనూ అవకాశం కొట్టేసింది. ఇంకొన్ని సినిమాలు చర్చల దశలో వున్నాయి.